cp mahendar reddy
-
ప్రతి గణేష్ మండపానికి QR కోడ్‌తో నిఘా
-
12వేలమంది పోలీసులు, 500 సీసీ కెమెరాలతో నిఘా
హైదరాబాద్ : శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 12వేల మంది పోలీస్ సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలో 200లకు పైగా శోభాయాత్రలు కొనసాగుతున్నాయని, వందల సంఖ్యలో సీసీ కెమెరాలను అడుగడుగునా ఏర్పాటు చేశామన్నారు. టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, షీ టీమ్స్, టీఎస్పీఎస్ బలగాలు, అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నామని సీపీ పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల లోపు శోభాయాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు. మరోవైపు భాగ్యనగర్ శ్రీరామనవమి సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. బోయిగూడ కమాన్, పురానాపూల్, బేగంబజార్ మీదగా హనుమాన్ టెకిడీకి చేరుకుంటుంది. రాత్రి హనుమాన్ టెకిడీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
బోనాలకు 3వేలమంది పోలీసులతో భద్రత
హైదరాబాద్ : నగరంలో బోనాల సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బోనాలు సందర్భంగా 3వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. బోనాలకు షీ టీమ్స్‌తో పాటు, యాంటీ చైన్ స్నాచింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే వంద అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, దేవాలయానికి ఒక ఎస్ఐ చొప్పున ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కాగా ఈ నెల 24,25న సికింద్రాబాద్, 31, ఆగస్టు 1న లాల్ దర్వాజా బోనాలు జరగనున్న విషయం తెలిసిందే. -
10వేలమంది పోలీసులతో బందోబస్తు: సీపీ
హైదరాబాద్ : రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మీర్ ఆలం దర్గాలో లక్షమందిపైగా ప్రార్థనలకు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. నగరంలో దాదాపు 20చోట్ల పెద్దసంఖ్యలో ప్రార్థనలు జరుగుతున్నాయన్నారు. బందోబస్తుకు 10వేలమంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. అలాగే ప్రత్యేకంగా సీసీ టీవీలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక రంజాన్ సందర్భంగా ఈద్గాలకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలోనే బోనాలు కూడా జరుగుతున్న నేపథ్యంలోను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. -
ఆ పుకార్లను నమ్మొద్దు: మహేందర్ రెడ్డి
హైదరాబాద్ : పేలుళ్లపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సూచించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రజా భద్రతకు ముప్పు ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయని, అవన్నీ అవాస్తలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పుకార్లు వ్యాపింపచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతిపరుల నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సిరియా తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఆయుధాల కోసం హబీబ్, ఇబ్రహీం గత జూన్‌లో అజ్మీర్ వెళ్లినట్లు సమాచారం. రూ.60 వేలు నుంచి రూ.65 వేలు వరకూ ఖర్చు చేసిన ఆయుధాలు దొరకలేదని, ఇటీవలే నందన్ వెళ్లి రెండు ఆయుధాలు సేకరించినట్లు ఐసిస్ సానుభూతిపరులు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. -
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
హైదరాబాద్: బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాల వద్ద శాంతియుత వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ కసరసత్తుచేస్తోంది. ఆ మేరకు జంట నగరాల అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బుధవారం నుంచి సీఆర్పీసీ 144 సెక్షన్ ను విధించనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 500 అడుగుల పరిధిలో వ్యక్తులు గుంపులుగా సంచరించడం నిషేధమని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు సహకరించాలని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీపీ పేర్కొన్నారు. పోలీస్, మిలటరీ, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బందికి ఈ నిబంధన వర్తించదని, పరీక్ష కేంద్రాలకు సమీపంగా వెళ్లే అంతిమయాత్రలకు కొన్ని మినహాయింపులున్నాయని తెలిపారు. 20 తేదిన పరీక్షలు ముగిసేంత వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
వాళ్లు వచ్చింది దోపిడీ కోసమే
జూబ్లీహిల్స్‌లో కాల్పులు జరిగిన ఘటనా స్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్‌లో దోపిడీ చేయడానికే రెండు రోజుల క్రితం ఫహీం, ఖాదిర్ గుల్బర్గా నుంచి వచ్చారని ఆయన తెలిపారు. గుల్బర్గా నుంచి వచ్చిన ఇద్దరికీ హైదరాబాద్ వాసి ఒకరు షెల్టర్ ఇచ్చారన్నారు. దోపిడీ ముఠా కదలికలను టాస్క్‌ఫోర్స్ ఎప్పటికప్పుడు గమనిస్తోందని, అందులో భాగంగానే జూబ్లీహిల్స్ నీరూస్ వద్ద వారిని పట్టుకోడానికి టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రయత్నించారని మహేందర్ రెడ్డి చెప్పారు. అప్పుడే ఆ ఇద్దరిలో ఒకరు నాటు తుపాకితో ఫైరింగ్ చేశారని, ఆ కాల్పుల్లో మెట్రో కార్మికుడు ధర్మేందర్ సింగ్‌కు గాయాలయ్యాయని తెలిపారు. ఇద్దరినీ తాము పట్టుకున్నామని, వారి నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. పెద్ద ఎత్తున దోపిడీ చేసేందుకే వాళ్లు హైదరాబాద్ వచ్చినట్లు తమకు చిన్న క్లూ లభించిందని తెలిపారు. దాని ఆధారంగానే టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజుల నుంచి ఆపరేషన్ నిర్వహించారని, అత్యంత ధైర్య సాహసాలతో తమ సిబ్బంది వాళ్లను పట్టుకున్నారని చెప్పారు. వీళ్లు దోపిడీ కోసమే వచ్చినట్లు తెలుస్తున్నా.. ఉగ్రవాద కోణం కూడా ఏమైనా ఉందేమోనని విచారిస్తున్నట్లు చెప్పారు. -
మోస్ట్ వాంటెడ్ బాకర్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరానీ గ్యాంగ్ ప్రధాన నిందితుడు బాకర్ అలీని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మూడున్నర కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే బాకర్ అలీ నుంచి బంగారం కొనుగోలు చేస్తున్న కర్ణాటక వ్యాపారి రాంప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇరానీ గ్యాంగ్‌కు హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ పరిధిలో 102 కేసుల్లో సంబంధం ఉందని, మరో ఐదుగుర్ని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సీపీ తెలిపారు. వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 103 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. పీడీ యాక్ట్ మంచి సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు. 2014లో 220 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, గత 4 నెలల్లో 120 కేసులు నమోదయ్యాయన్నారు. కాగా చోరీ సొత్తుతో బాకర్ వివిధ ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడని సీపీ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో పెరిగిన నేరాలు
హైదరాబాద్ : భాగ్యనగరంలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం 2014లో జరిగిన నేరాలపై మాట్లాడుతూ.. 40 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. నేరాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. నేరాలను నిరోధించడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 2,564 టాస్క్‌ఫోర్స్ కేసులు ఛేదించామని తెలిపారు. ఇక రాజధాని పరిధిలో 10 శాతం చోరీలు, 5 శాతం అత్యాచారం కేసులు పెరిగినట్లు సీపీ వెల్లడించారు. రూ.46 కోట్ల సొమ్ము చోరీ కాగా, అందులో రూ. 26.72 కోట్లు రికవరీ చేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే ట్రాఫిక్ చలానాల ద్వారా రూ.34 కోట్లు వసూలు అయినట్లు వెల్లడించారు. పోలీస్ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేశామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో పెరిగిన నేరాలు
-
'కాల్పులు జరిపింది ఎవరో గుర్తించాం'
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన కేసులో నిందితుడి అరెస్ట్‌ను పోలీసులు ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, కాల్పులకు తెగబడింది ఎవరో గుర్తించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై నిన్న ఉదయం ఓ ఆగంతకుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఫొటోలు నిందితుడివి కావని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కానిస్టేబుల్ ఓబులేసు కుటుంబ సభ్యులు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియాలో తప్పుడు ఫొటోలను ప్రసారం చేస్తున్నారంటూ ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన కొడుకుతో తనకు రెండేళ్లుగా సంబంధాలు లేవని ఓబులేసు తండ్రి మైఖేల్ ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. -
కానిస్టేబుల్ అరెస్ట్ వార్తను ఖండించిన సీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన కేసులో కానిస్టేబుల్ ఓబులేసు అరెస్ట్ వార్తను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఖండించారు. కాగా అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడింది ఓబులేసుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై పోలీసులు మాత్రం పెదవి విప్పటం లేదు. ఓబులేసును నిన్న సాయంత్రం అనంతపురం-కర్నూలు సరిహద్దు ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని హైదరాబాద్ తరలించి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. కాగా ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల. -
నిత్యానందరెడ్డిపై కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఆగంతకుడు కాల్పులు జరిపిన ఏకే 47 ...గత ఏడాది చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుండగుడు ఏకే 47 ఉపయోగించాడని... ఆ గన్... ఏడాది క్రితం గ్రేహౌండ్స్ పోలీసుల వద్ద చోరీకి గురైనట్లు తెలిపారు. సాయంత్రంలోగా కేసును ఛేదిస్తామని సీపీ వెల్లడించారు. కాగా ఏకె 47 చోరీకి గురైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్ను ఆగంతకుడు కాల్పులకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. -
కోటలో వీఐపీల కోసం ప్రత్యేక గాలరీలు
హైదరాబాద్ : గోల్కొండ కోటలో పంద్రాగష్టు వేడుకలకు హాజరయ్యే వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం వీఐపీలతో పాటు అయిదువేల మందికి పాసులు ఇస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు గోల్కొండ కోట వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోట చుట్టూ 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేడుకల భద్రతా ఏరాట్లను మహేందర్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న స్వాతంత్ర్య దిన వేడుకలు గతంలో కంటే భిన్నంగా జరుగనున్నాయి. యూనిఫాం సర్వీసుల కవాతు.. వివిధ శాఖల శకటాలు వంటివేమీ లేకుండా ప్రభుత్వం సాధారణంగా ఈ వేడుకలను నిర్వహించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలను పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించగా ....గోల్కొండ కోటలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. పంద్రాగస్టు వేడుకల్లో సీఎం గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) మాత్రమే స్వీకరిస్తారు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిసిన తరువాత సీఎం వేడుకలకు వచ్చిన అతిథులతో కరచాలనం చేస్తూ పలకరిస్తారు. -
వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం, సీపీకి ఫిర్యాదు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలను కించపరుస్తూ వెబ్ సైట్లలో దుష్ప్రచారంపై ఆపార్టీ నేతలు శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు ఈరోజు ఉదయం సీపీని కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరుగుతోందని, దానిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరామన్నారు. చెప్పుకోలేని రీతిలో ఈ ప్రచారం చేస్తున్నారని, అది చాలా బాధాకరమన్నారు. 20-25 వెబ్ సైట్లలో పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడి షర్మిల ప్రచారం చేస్తున్నారనే ఇటువంటి ప్రచారానికి ఒడిగడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరామన్నారు. సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి చెప్పారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టిన ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన వెబ్ డిజైనర్ శ్రీపతి నరేశ్, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కార్తీక్‌లు.. మరో ఇద్దరితో కలసి మూడు నెలల క్రితం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఉదంతంపై వైఎస్సార్ సీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు నెల క్రితమే ఒకర్ని పట్టుకోగా.. తాజాగా శ్రీపతి నరేశ్, కార్తీక్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సీపీఎస్ డీసీపీ పాలరాజు శుక్రవారం తెలిపారు. ఫిర్యాదు పూర్తి పాఠం ఈ దిగువన చూడండి.. ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ ఐదో పేజీ