హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరానీ గ్యాంగ్ ప్రధాన నిందితుడు బాకర్ అలీని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మూడున్నర కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే బాకర్ అలీ నుంచి బంగారం కొనుగోలు చేస్తున్న కర్ణాటక వ్యాపారి రాంప్రసాద్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఇరానీ గ్యాంగ్కు హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ పరిధిలో 102 కేసుల్లో సంబంధం ఉందని, మరో ఐదుగుర్ని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సీపీ తెలిపారు. వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 103 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. పీడీ యాక్ట్ మంచి సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు. 2014లో 220 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, గత 4 నెలల్లో 120 కేసులు నమోదయ్యాయన్నారు. కాగా చోరీ సొత్తుతో బాకర్ వివిధ ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడని సీపీ వెల్లడించారు.
మోస్ట్ వాంటెడ్ బాకర్ అలీ అరెస్ట్
Published Mon, May 11 2015 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement