
నిత్యానందరెడ్డిపై కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఆగంతకుడు కాల్పులు జరిపిన ఏకే 47 ...గత ఏడాది చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుండగుడు ఏకే 47 ఉపయోగించాడని... ఆ గన్... ఏడాది క్రితం గ్రేహౌండ్స్ పోలీసుల వద్ద చోరీకి గురైనట్లు తెలిపారు. సాయంత్రంలోగా కేసును ఛేదిస్తామని సీపీ వెల్లడించారు. కాగా ఏకె 47 చోరీకి గురైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్ను ఆగంతకుడు కాల్పులకు ఉపయోగించినట్లు తెలుస్తోంది.