AK 47
-
ఏకే 47, మోడల్స్‌తో రీల్స్ హంగామా
బనశంకరి: పేద్ద బంగళాలు, ఏకే 47 తుపాకులతో గార్డుల పహరా, అందమైన భామలు, కార్లు.. ఇవన్నీ హైఫై బాలీవుడ్ సినిమాలో కనిపించే సీన్లే కాదు. బెంగళూరులో కొందరు సోషల్ మీడియాప్రియులు ఎంతో ఖర్చు పెట్టి మరీ ఇటువంటివి సమకూర్చుకుని రీల్స్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చి ఏమిటని విమర్శలువచ్చినా పట్టించుకోరు. తుపాకులతో గార్డులు, మోడల్స్ మధ్య రీల్స్ చేసిన అరుణ్ కటారె అనే బెంగళూరువాసిని కొత్తనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Arun Kathare (@arun_kathare) కళ్లు చెదిరేలా పోజులుఅరుణ్ కటారె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. బడా సంపన్నుడిలా పోజులిస్తుంటాడు. కొత్త రీల్ చేయాలని చేతిలో ఏకే 47 ఉత్తుత్తి గన్లు పట్టుకుని రోడ్డులో షో చేస్తూ ఒంటిపై కేజీలకొద్దీ నకిలీ బంగారు ఆభరణాలు ధరించాడు. పైగా బాడీగార్డులు కూడా ఉన్నారు. ఈ హంగామాతో భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొత్తనూరు పోలీసులు వచ్చి అరుణ్‌ను అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. నకిలీ ఏకే 47 తుపాకులు, అనుచరులను వెంటేసుకుని స్థానికంగా హవా సృష్టించడానికి ఇలాంటి షో చేసినట్లు వెలుగుచూసింది. ఇతడు, గార్డులపై కేసు నమోదు చేసి పరప్పన జైలుకు పంపించారు. View this post on Instagram A post shared by Arun Kathare (@arun_kathare) -
ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం: వీడియో వైరల్
డ్యూటీలోని ఓ పోలీసు చేతిలో భారతీయ ఫైనాన్షియల్ బ్యాంకర్ హతమయ్యాడు. అతను తన రుణం విషయమై సదరు బ్యాంకర్‌తో వాదించి మరీ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాల నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మే 12న ఉత్తమ్ భండారీ అనే ఫైనాన్షియల్ బ్యాంకర్‌పై 30 ఏళ ఇవాన్ వాబ్‌వైర్ కాల్పులు జరిపాడు. నిజానికి భండారీ టీఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వాబ్‌వైర్ అతడి క్లయింట్. వాబ్‌వైర్ సంస్థ నుంచి మొత్తం రూ. 46 వేలు లోన్(రుణం) తీసుకున్నాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో వాబ్‌వైర్ ఏకే 47తో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో భండారీ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. దర్యాప్తులో పోలీసులు వాబ్‌వైర్ డ్యూటీలో లేని ఓ పోలీసుగా పేర్కొన్నారు. తన సహచర ఉద్యోగి నుంచి ఏకే 47ని దొంగలించి మరీ అతడిపై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలిందన్నారు. వాబ్‌వైర్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, అందుకోసం రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న చరిత్ర కూడా ఉందని చెప్పారు. అతను ఈ విషయమై ఐదేళ్ల వరకు తుపాకిని కలిగి ఉండకుండా నిషేధించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉగాండాలో ఈ విషయమై ఆందోళన చెందుతున్న భారతీయ కమ్యూనిటీలను కలుసుకుని వారి భద్రత విషయమై హామి ఇచ్చారు. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్ అవుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: మళ్లీ అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి) -
బుల్లెట్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏకే 47 రైఫిల్ బుల్లెట్లతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ జవాన్. మొత్తం 62 బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని టవల్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న ఫొటో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చెన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ ఫొటో పెట్టుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం తెలిసింది. చెన్నూరుకు చెందిన వంగాల సంతోష్ సీఆర్పీఎఫ్ జవాన్. ప్రస్తుతం బీజాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి, వాట్సాప్‌లో పంపించాడు. దీన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్‌గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు
రాంఛీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాంఛీలో బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఇంట్లో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సన్నిహితుడు కావడం చర్చనీయాంశమైంది. ప్రేమ్ ప్రకాశ్ ఈ ఆయుధాలు అక్రమంగా కలిగి ఉన్నారా? అనే విషయంపై మాత్రం ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. వీటిని సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రూ.100కోట్ల మైనింగ్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్లో 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సీఎం సన్నిహితుడు పంకజ్ మిశ్రా, బచ్చు యాదవ్‌లు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. పంకజ్ మిశ్రా, అతని సన్నిహితుల నివాసాల్లో ఈడీ అధికారులు జులై 8నే దాడులు చేశారు. మొత్తం 19 చోట్ల సోదాలు చేశారు. మార్చిలోనే వీరిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈమేరకు చర్యలు తీసుకున్నారు. మైనింగ్ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. సోదాల్లో కీలకమైన పత్రాలు, బ్యాంకు బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాలు లభించాయి. అయితే ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో లభించిన ఏకే 47 తుపాకుల విషయంపై ఆయన గానీ, సీఎం సోరెన్ గానీ స్పందించలేదు. చదవండి: టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు.. -
ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!
Ukrainian Grandmother Pick UP AK 47 Rifle: రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉక్రెయిన్ వాసులకు అమాంతం యుద్ధ భయాన్ని పెంచేసింది. ఓ పక్క అమెరికా రష్యాని హెచ్చరిస్తూ వస్తోంది. దీంతో ఉక్రెయిన్ తమ దేశంలోని పెద్దల నుంచి పిల్లల వరకు తమని తాము రక్షించుకోవడమే కాక దేశాన్ని కూడా రక్షించుకుకోనేలా శిక్షణ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అయితే అందుకు పిల్లలు, పెద్దలు కూడా ఏ మాత్రం భయందోళనలకు గురికాకుండా సైనిక శిక్షణ తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే వాలెంటైనా కాన్‌స్టాంటినోవ్‌స్కా అనే 79 ఏళ్ల ఉక్రెయిన్ బామ్మ ఏకే 47 గన్ని పట్టుకుని సైనిక శిక్షణ తీసుకుంటోంది. ఈ మేరకు ఆమె తూర్పు ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లో జాతీయ గార్డు సాయంతో 79 ఏళ్ల వృద్ధ మహిళ అసాల్ట్ రైఫిల్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చకుంటోంది. అయితే అక్కడ స్థానిక మీడియా ఈ విషయమై ప్రశ్నిస్తే.. "ఆమె ఈ పని నేను మాత్రమే కాదు మీ అమ్మ అందరూ కచ్చితంగా నేర్చుకునేందుకు సన్నద్దమవుతారు. ఎందుకంటే వారు తమ పిల్లలను, దేశాన్ని రక్షించే పనిలో నిమగ్నమై సమయం ఆసన్నమైంది" అని చెప్పింది. సరిహద్దుల వద్ద రష్యా దళాల ఉద్రిక్తలు కొనసాగుతున్నందున ప్రజలకు ప్రాథమిక సైనిక పద్ధతులను నేర్పడం ఈ శిక్షణ లక్ష్యం. రాగ్-ట్యాగ్ సైన్యాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక కసరత్తులలో ఇది ఒకటి. అందులో భాగంగానే ఈ బామ్మ సైనికి బెటాలియన్లోకి చేరి సైనిక కసరత్తులు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను హీరో అంటూ ప్రశంసంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. Ukrainian great grandmother, Valentina Constantinovska, on an Ak-47, training to defend against a possible Russian attack. “Your mother would do it too,” she told me. pic.twitter.com/PnojqRir4K — Richard Engel (@RichardEngel) February 13, 2022 -
గొంతులో ఏకే 47తో కాల్చుకుని జవాను ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై : ఎన్నికల విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ జవాను ఏకే47తో గొంతులో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సేలంలో ఎన్నికల విధుల నిమిత్తం వంద మంది పారా మిలిటరీ, సీఐఎస్ఎఫ్ జవానులు అన్నదాన పట్టిలో బస చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయాన్నే ఓ గది నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో అక్కడున్న జవాన్లలో ఆందోళన మొదలైంది. వెంటనే అటు వైపుగా కొందరు పరుగులు తీశారు. అక్కడ ఓ జవాను గొంతులో ఏకే 47తో కాల్చుకుని పడి ఉండటంతో తక్షణం ఆస్పత్రికి తరలించారు. ఆ జవాను ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. ఆ జవాను పేరు ఆశిష్ కుమార్(30) అని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగంలో ఆశిష్ విధులు నిర్వర్తిస్తున్నారు. పని భారంతో ఆత్మహత్యాయత్నం చేశాడా..? లేదా, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో అన్నదాన పట్టి పోలీసులు విచారిస్తున్నారు. -
రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు
-
రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పట్టపగలు, నడి రోడ్డుపై కాల్పులకు తెగ బడ్డారు. దుకాణం వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగ బడ్డాడు ఓ ఉగ్రవాది. శ్రీనగర్ భగత్ బర్జుల్లా ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్ బర్జుల్లాలోని ఓ టీ స్టాల్ వద్ద నిల్చుని ఉన్నారు. ఇంతలో నడుచుకుంటూ వచ్చిన ఓ ఉగ్రవాది తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులకు తెగ బడ్డాడు. ఊహించని ఈ ఘటనకు చుట్టు పక్కల ఉన్న స్థానికులు త్రీవ భయందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాది అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి తెలిసి ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్‌లు మరణించారు. అక్కడే ఉన్న సీసీకెమరాలో ఉగ్రవాది దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. శ్రీనగర్‌లో మూడు రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు ఇలా బరి తెగించడం ఇది రెండో సారి. నగరంలోని హై సెక్యూరిటీ దుర్గానాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని కొడుకుపై మూడు రోజుల క్రితం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. చదవండి: అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ -
పెళ్లి కానుకగా ఏకే 47 రైఫిల్
ఇస్లామాబాద్: సాధారణంగా పెళ్లిలో ఇచ్చే బహుమతలు అంటే విలువైన ఆభరణాలు, డబ్బులు, హనీమూన్ ట్రిప్ టికెట్లు, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులు, అలంకరణ సామాగ్రి వంటివి ఉంటాయి. వెరైటీ గిఫ్ట్‌లు ఇచ్చే వారు కూడా ఉంటారు. కానీ మరణాయుధాలను బహుమతులుగా ఇవ్వడం గురించి ఇంతరకు చూడలేదు.. వినలేదు కదా. అయితే ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోది. పెళ్లిలో ఓ మహిళ వరుడికి ఏకే 47 రైఫిల్‌ని బహుమతిగా ఇచ్చింది. దీనికే ఆశ్చర్యంగా ఉంటే.. అది చూసి అక్కడ ఉన్న వారంతా సంతోషంతో చప్పట్లు కొట్టడం కొసమెరుపు. ఇంతకు ఈ వింత సంఘటన ఎక్కడ జరిగింది అంటే దాయాది దేశం పాకిస్తాన్లో. (మా ఆయనకు వధువు కావాలి: భార్యలు ) వివరాలు.. వీడియోలో ఓ మహిళ నూతన వధువరూలను ఆశీర్వదించిన అనంతరం.. తాను తీసుకొచ్చిన బహుమతిని వరుడికి ఇవ్వాల్సిందిగా పక్కనున్న వారిని కోరుతుంది. దాంతో వారు ఆమె తెచ్చిన ఏకే 47 రైఫిల్‌ని అతడికి అందిస్తారు. అది చూసి అక్కడున్నవారంతా చప్పట్లతో వారిని అభినందిస్తారు. ఇక ఏఆర్వై న్యూస్ ప్రకారం పాకిస్తాన్లో ‘కలాష్నికోవ్’ అనే సంప్రాదాయం ప్రకారం అత్తగారు.. అల్లుడికి ఇలా ఏకే 47 రైఫిల్‌ని బహుకరిస్తుంది అని తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు తమకు పెళ్లి సమయంలో వచ్చిన బహుమతులను గుర్తు చేసుకుంటూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘రైఫిల్ చూసి పెళ్లి కొడుకు ఏ మాత్రం ఆశ్చర్యం పోలేదు. అంటే ఇది అక్కడ కామన్ ఏమో’.. ‘ఈ బహుమతిని అమ్మాయికి ఇస్తే బాగుండేది.. అలా అయినా అత్తింటి వారు ఆమెను జాగ్రత్తగా చూసుకునేవారు’.. ‘బహుమతి తీసుకున్నావ్ బాగానే ఉంది కానీ.. పరీక్షించాలని మాత్రం చూడకు నాయనా’ అంటూన్నారు నెటిజనులు. Kalashnikov rifle as a wedding present pic.twitter.com/BTTYng5cQL — Adeel Ahsan (@syedadeelahsan) November 25, 2020 -
ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టిన భారత బలగాలు
జమ్మ-కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కెరాన్ సెక్టార్ వద్ద అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల కుట్రను భారత బలగాలు శనివారం తిప్పికొట్టాయి. మిషన్ గంగానది ఒడ్డున కూడా అక్రమంగా ఆయుధాలను తరలించేందు ముష్కరులు ప్రయత్నించారు. పాక్ అక్రమిత కశ్మీర్(పీఓకే) నుంచి ఓ ట్యూబ్‌ను తాడుతో కట్టి దాని ద్వారా ఉగ్రవాదులు ఆయుధాలు తరలించాలని చుశారు. ఉగ్రవాదుల కుట్రకు భారత బలగాలు భంగం కలిగించి ఏకే 47 రైఫిల్స్‌తో పాటు భారీ స్థాయిలో ఆయుధాలను భారత్ స్వాధీనం చేసుకుంది. -
ఏకే–47 అంటే ఏమిటీ, ఆ పేరెలా వచ్చింది?
సాక్షి, న్యూఢిల్లీ : ఏకే–47. ఈ పేరు వినగానే ఎవరికైనా అత్యాధునిక తుపాకీ అని అర్థం అవుతుంది. దీన్ని దేశాల మధ్య జరిగే యుద్ధాల్లోనే కాకుండా విప్లవాల్లో, సామాజిక తిరుగుబాట్లలో ఉపయోగించగా, అటు టెర్రరిస్టులు, ఇటు మావోయిస్టులు కూడా ఇప్పుడు వినియోగిస్తున్నారు. ఇది ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణం సర్వకాల సర్వ పరిస్థితుల్లో, అంటే అత్యధిక వర్షం కురిసే రెయిన్ ఫారెస్టుల్లో, వడగాలులు వీచే ఎడారుల్లో, అతి శీతల మంచు కొండల్లో ఇది పని చేస్తుంది. అందుకే ప్రస్తుతం భారత్ వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్లు మంచు ప్రాంతంలో పనిచేయక పోతుండడంతో, వాటి స్థానంలో ఏకే–47 రైఫిళ్లును రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఆ దేశంతో బుధవారం ఒప్పందం చేసుకుంది. ఏకే–47 తుపాకీ మోడల్ ఇంతకు ఏకే–47 తుపాకులంటే ఏమిటీ? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది? ఏకే అంటే ఆటోమాట్ కలష్నికోవ అని, 47 అంటే 1947 సంత్సరం అని పూర్తి అర్థం. సోవియట్ యూనియన్‌కు చెందిన మిహాయిల్ కలష్నికోవ దీన్ని కనిపెట్టడంతో ఆయన పేరు మీదనే ఇది ప్రఖ్యాతిచెందింది. మొదట్లో సోవియెట్ సైన్యం కోసం వీటిని రహస్యంగా తయారు చేశారు. 1919, నవంబర్ 10వ తేదీన జన్మించిన కలష్నికోవ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియెట్ యుద్ధ ట్యాంక్ మెకానిక్‌గా పని చేశారు. 1941లో సోవియెట్‌పై జర్మనీ దురాక్రమణ జరిపినప్పుడు ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోవియెట్ సైనికుల వద్ద శక్తివంతమైన తుపాకులు లేకపోవడం వల్లనే వారితో పాటు తాను గాయపడాల్సి వచ్చిందని కలష్నికోవ భావించారు. అలాంటి తుపాకుల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆ పరంపరలో అనేక మోడళ్ల అనంతరం ఆయన ఏకే–47 తుపాకీ మోడల్‌ను తయారు చేయగలిగారు. 1947లో మొట్టమొదటి సారిగా సోవియెట్ వీటి ఉత్పత్తిని ప్రారంభించింది. 1949లో దీన్ని అసాల్ట్ రైఫిల్‌గా సోవియట్ ఆర్మీ స్వీకరించింది. వార్సా ఒప్పందం ద్వారా ఈ తుపాకులు వివిధ దేశాలకు చేరాయి. వియత్నాం, అఫ్గానిస్థాన్, కొలంబియా, మొజాంబిక్ విప్లవాల్లో ఏకే–47 తుపాకులను ప్రధానంగా ఉపయోగించారు. అందుకే వాటి జెండాల్లో ఏకే–47 తుపాకీ ఓ గుర్తుగా మిగిలిపోయింది. ఏకే–47 తుపాకుల ఉత్పత్తి దాదాపు దశాబ్దంపాటు కొనసాగింది. 1959లో ఏకేఎం పేరిట కొత్త వర్షన్ వచ్చింది. ఏకే–47 తుపాకుల బరువును తగ్గించి, కాస్త చౌక ధరకు ఈ కొత్త వర్షన్‌ను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత కలష్నికోవ ఆ వర్షన్‌ను కూడా మార్చి కార్టిడ్జ్ కలిగిన పీకే మషిన్ గన్ను తయారు చేశారు. ఇలా పలు రకాల వర్షన్లు వచ్చినప్పటికీ ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికీ ఆధునీకరించిన ఏకే–47 తుపాకులను ఉత్పత్తి చేస్తున్నాయి. కలష్నికోవ అప్పటికి అమెరికా సైన్యం ఉపయోగిస్తున్న ఎం–16 తుపాకులకన్నా శక్తివంతంగా ఏకే–47ను తయారు చేయాలన్నా సంకల్పంతోనే ఆయన అందులో పలు వర్షన్లు తీసుకొచ్చారు. ‘అమెరికా సైనికులు తమ ఎం–16 తుపాకులను విసిరిపారేస్తారు. ఏకే–47 తుపాకులను లాక్కుంటారు. వాటి బుల్లెట్ల కోసం చనిపోయిన సైనికుల మత దేహాల నుంచి తీసుకుంటారు’ అని కలష్నికోవ్ వియత్నాం యుద్ధం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ఓ పత్రికా ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. ఆ తర్వాత అమెరికా సైనికులు నిజంగా ఇరాక్ యుద్ధంలో ఏకే–47 తుపాకులు ఉపయోగించినట్లు తాను విన్నానని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏకే–47 తుపాకుల్లో తక్కువలో తక్కువగా 50 అమెరికా డాలర్లకు దొరికే వర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ప్రఖ్యాతి చెందిన తుపాకీ వర్షన్లను సష్టించిన మిహాయిల్ కలష్నికోవ్‌ను స్టాలిన్ ప్రైజ్, ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డులు వరించగా, ‘మా ప్రజల సజనాత్మక మోథోసంపత్తికి అసలైన చిహ్నం’ కలష్నికోవ్‌ను 2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అభివర్ణించారు. కలష్నికోవ్, 2013లో తన 94వ ఏట మరణించారు. తాను ఆత్మరక్షణ కోసం సష్టించిన ఏకే–47, ఎదురు దాడులకే కాకుండా టెర్రరిస్టుల చేతుల్లో సామాన్యుల ప్రాణాలు తీసుకుంటున్న విషయం తెల్సి కలష్నికోవ్ తన చివరి రోజుల్లో ఎంతో వ్యథ చెందారు. ‘భరించలేని బాధతో నా హదయం కొట్టుమిట్టాడుతోంది. నేను కనిపెట్టిన ఆయుధం ప్రజల ప్రాణాలను తీసినట్లయితే అందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని కలష్నికోవ్ తన చివరి రోజుల్లో రష్యన్ ఆర్థడాక్స్ చర్చి ఫాదర్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో అమెరికా వేసిన బాంబుల వల్ల దాదాపు రెండు లక్షల మంది మరణించగా, ప్రపంచవ్యాప్తంగా ఏకే–47 తుపాకుల వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు మరణించారన్నది ఓ అంచనా. -
భారత్‌లోనే ఏకే–47 తయారీ!
మాస్కో: భారత్‌లో ఏకే– 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి ఇండియా, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటనలో ఈ డీల్ కొలిక్కి వచ్చినట్లు రష్యా మీడియా పేర్కొంది. ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేవీలో భాగంగా వీటిని ఉత్పత్తి చేస్తారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, కల్నోషికోవ్ కన్సెర్న్, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌లు ఈ జాయింట్ వెంచర్(జేవీ)లో భాగస్వాములు. జేవీలో ఆర్డినెన్స్‌ఫ్యాక్టరీ బోర్డుకు మెజార్టీ(50.5 శాతం)వాటా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే– 47లను ఉత్పత్తి చేయనున్నారని మీడియా వర్గాలు వెల్లడించాయి. డీల్ విశేషాలు... ► ఏకే– 47 రైఫిల్స్‌లో 203 మోడల్ ఆధునికమైన వెర్షన్. ►ప్రస్తుతం ఆర్మీ వాడుతున్న ఇన్సాస్ 5.56 ్ఠ45 ఎంఎం అసాల్ట్ రైఫిల్ స్థానంలో ఈ ఏకే– 47 –203 7.62ణ39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు. ► భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే– 47 203లు అవసరం పడతాయని అంచనా. ► లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది. ► ఒక్కోరైఫిల్ ఖరీదు దాదాపు 1100 యూఎస్ డాలర్లు ఉండవచ్చు. ► ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు. ► ఇన్సాస్ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. ► అందుకే ఆర్మీకి ఏకే– 47 203 మోడల్ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు. రష్యా రక్షణమంత్రితో రాజ్నా«థ్ చర్చలు రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు, మందుగుండు, విడిభాగాలను భారత్‌కు సరఫరా చేసే అంశంపై రష్యాతో చర్చలు జరిపారు. ఎస్400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను సకాలంలో భారత్‌కు అందించాలని రాజ్‌నాథ్ కోరినట్లు అధికారులు తెలిపారు. 2021 చివరకు ఈ మిసైల్ వ్యవస్థ తొలిబ్యాచ్ భారత్‌కు చేరవచ్చని అంచనా. శుక్రవారం రాజ్‌నాథ్ ఎస్సీఓ సమావేశంలో పాల్గొంటారు. -
సర్వీస్ రివాల్వర్‌తో జవాను ఆత్మహత్య
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లో బిఎస్ఎఫ్ జవాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కంకెర్ జిల్లాలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 157 బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంకన్జోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. చనిపోయిన జవాన్‌ను సురేష్ కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. ( వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై.. ) బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ 157వ బెటిలియన్ బృందం శుక్రవారం సంగం గ్రామంలో నిర్వహించిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లోనూ సురేష్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శిబిరానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఘోడా , దోటమెటా గ్రామాల మధ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వగ్రామం ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి వచ్చిన సురేష్ కుమార్‌ను కొన్ని వారాల క్రితం క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అంతేకాకుండా శుక్రవారం ఇదే బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా వస్తుందేమో అన్న డిప్రెషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. (హిమాచల్ ప్రదేశ్‌లో కేరళ తరహా ఘటన ) -
ప్రతీకారంతోనే కాల్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపి న అక్కన్నపేట కాల్పుల ఘటనపై రిమాండ్ రిపో ర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితుడు గంగరాజు తనను అవమానించాడని, అతడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే అతని ఇంటిపై ఏకే–47 లక్ష్యంగా కాల్పులు జరిపాడని రిపోర్టులో పేర్కొన్నారు. గంగరాజు ఫి ర్యాదుతో నిందితుడిపై ఐపీసీ 307, ఆయుధాల చట్టం సెక్షన్ 25 (1), 27 ప్రకారం కేసులు న మోదు చేశారు. అయితే తుపాకుల అదృశ్యం పై రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశా లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రిపోర్టులో ఏముందంటే.. అక్కన్నపేట పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉండే గుంటి గంగరాజు, దేవుని సదానందంలు బంధువులు. ఈనెల 5న గంగరాజు తల్లి ఎల్లవ్వ, సదానందం భార్య కృష్ణవేణి.. సిమెంటు ఇటుకల విషయమై గొడవ పడ్డారు. ఇది తెలుసుకున్న గంగరాజు, అతని సో దరుడు అశోక్‌తో కలసి సదానందం ఇంటికి వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో సదానందం, అతని భార్య కృష్ణవేణి, ఆమె మేనమామ గుంటి వెంకట య్య.. గంగరాజు సోదరుల మధ్య వాగ్వాదం జరి గింది. ఈ క్రమంలో సదానందం ఫోన్ లాక్కున్న గంగరాజు..నీ భార్యని కూడా ఇలాగే లాక్కెళతా.. దిక్కున్నచోట చెప్పుకో! అని వెళ్లిపోయాడు. దీన్ని అవమానం గా భావించిన సదానం దం ఎలాగైనా గంగరాజు పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తాను గతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో దొంగిలించిన ఏకే–47తో అతనిని మట్టుబెట్టాలనుకున్నాడు. ఆయుధాన్ని ఇంటి స మీపంలోని బస్వాపూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి పనిచేస్తుందో లేదో సరిచూసుకున్నాడు. పనిచేయకపోవడంతో అక్కడే దానికి ఆయిల్ పోసి ఇంటికి తెచ్చాడు. అదేరోజు రాత్రి 9 గంటలకు తన ఇంటి వాకిట్లో కొన్ని రౌండ్లు కాల్చి పనిచేస్తుందని నిర్ధారించుకున్నాడు. ఈ శబ్దాలు విని బయటికి వచ్చిన పొరుగింటి వ్యక్తి కేశబోయిన దిలీప్‌కు గంగరాజు ఇంటివైపు తుపాకీ తీసుకుని వెళ్తున్న సదానందం కన్పించాడు. అతను వెంటనే అశోక్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన బాధిత కుటుంబ సభ్యులు ఇంటికి గడియపెట్టారు. ఇంటికి తలుపులు పెట్టి ఉండటంతో సదానందం తెరిచి ఉన్న కిటికీ నుంచి గంగరాజును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. అంతా నేలపై పడుకోవడంతో అవి గురితప్పాయి. ఈలోగా ఇరుగుపొరుగు రావడంతో సదానందం అక్కడ నుంచి గోడదూకి పారిపోయాడు. రాత్రంతా పక్కనే ఉన్న బొడిగేపల్లిలోని ఓ చింతచెట్టుకింద తలదాచుకున్నాడు. మర్నాడు ఉదయం కోహెడ్ బస్టాప్‌కు లిఫ్ట్ అడిగి వెళ్లాడు. అక్కడ చేతిలో సంచితో అనుమానాస్పదంగా ఉన్న సదానందంను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి ఏకే 47 రైఫిల్ బట్ నం కేఆర్ 85. ఆర్సెనెల్ నం. ఏఎన్ 0815.. 25 లై వ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుంచి స్టేషన్‌కు తరలించారు. అతడిచ్చిన సమాచారం తో ఇంట్లో ప్లాస్టిక్ పైపులో దాచిన కార్బన్ వెపన్ బట్ నం. కేఆర్ 122, ఆర్సెనల్ నం.16077508 గా గుర్తించారు. విచారణలో ఏం చెప్పాడంటే..: 2014లో మొదటి భార్యతో విడిపోయాక సదానందం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు కృష్ణవేణికి రూ.2 లక్షల క న్యాశుల్కం చెల్లించాడు. ఇందులో రూ.లక్ష నగ దును అధిక వడ్డీకి ఆశపడి కృష్ణవేణి బంధువైన గొట్టె కొమురవ్వకు అప్పుగా ఇచ్చారు. ఆమె బాకీని తిరిగి ఇవ్వకపోవటంతో 2016లో హుస్నాబాద్ ఠాణాలో ఆమెపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పు పత్రం అడిగారు. దీంతో సదానందం నకిలీ పత్రం సృష్టించి తీసుకొచ్చాడు. అసలు పత్రంతో కొమురవ్వ స్టేషన్‌కి వచ్చింది. ఇద్దరూ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన క్రమంలో కొమురవ్వ వద్ద అప్పు అసలు పత్రం, రూ.లక్ష నగదు ఉన్న సంచిని దొంగిలించాడని ఆరోపిస్తూ ఆమె తన బంధువులతో కలసి సదానందంను అతని ఇంటిలోనే చితకబాదింది. దీంతో వీరిపై ఫిర్యాదు చేసేందుకు హుస్నాబాద్ ఠాణాకు సదానందం వెళ్లాడు. అప్పుడే.. తనపై దాడి చేసిన వారిపై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఠాణా నుంచి తుపాకులను దొంగిలించాడు. కానీ, కృష్ణవేణి జోక్యంతో కొమురవ్వ డబ్బులివ్వడంతో వివాదం సమసిపోయింది. అయితే, అప్పటి నుంచి ఆ తుపాకులను తన వద్దే పెట్టుకున్నాడు. ఈ ప్రశ్నలకు బదులేది..? ఆయుధాల అదృశ్యం కేసులో పోలీసుల తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఏకే–47 వెపన్, 30 లైవ్‌రౌండ్లు మిస్సయినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. దాన్ని కనిపెట్టేందుకు సరిగా దర్యాప్తు చేయకపోవడం కూడా గమనార్హం. - రిమాండ్ రిపోర్టులో వెపన్ ఏ తేదీన మిస్సయిన సంగతి ఎందుకు వెల్లడించలేదు? - 9 ఎంఎం కార్బన్ కూడా తన వద్దే ఉందని నాలుగేళ్ల తరువాత సదానందం చెబితేగానీ పోలీసులు తెలుసుకోలేకపోయారు. - ఇంతకాలం కార్బన్ వెపన్ ఉందని రికార్డుల్లో ఎలా చూపారు? - సిద్ధిపేట కమిషనరేట్‌లో హుస్నాబాద్ ఠాణా విలీనం అవుతున్న సమయంలో ఆయుధాల లెక్కింపు జరిగింది. ఏకే–47 రైఫిల్ మిస్సయిన విషయాన్ని గుర్తించిన అధికారులు కార్బన్ పిస్టల్ విషయం ఎందుకు గుర్తించలేక పోయారు? అంటే హుస్నాబాద్ సిబ్బంది అందుబాటులో ఉన్న కార్బన్‌ను రెండుసార్లు లెక్క చూపించారా? - కార్బన్వెపన్ మిస్సింగ్‌పై పోలీసులు ఇప్పటికీ ఎఫ్.ఐ.ఆర్ ఎందుకు నమోదు చేయడం లేదు? - కార్బన్వెపన్ మిస్సింగ్ విషయాన్ని కమిషనరేట్ అధికారులకు తెలియనివ్వకుండా నాలుగేళ్లపాటు ఎలా కప్పిపుచ్చగలిగారు? - ఏకే–47 వెపన్ పోయినందుకు నరేందర్ అనే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్న అధికారులు కార్బన్ వెపన్ మాయం విషయంలో ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
అక్కన్నపేటలో ఏకే–47 కాల్పులు
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్/ అక్కన్నపేట : హుస్నాబాద్‌లో ఏకే–47 శబ్దం వినిపించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గొర్రెల కాపరిగా ఉంటున్న వ్యక్తి ఏకే–47 గన్ పట్టుకొని తిరగడం, చిన్న గొడవ పెద్దది కావడంతో ఎదుటి వారిపై కాల్పులు జరిపిన సంఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సిమెంట్ ఇటుకల చేబదులుపై తలెత్తిన ఓ గొడవ పెద్దదై ఏకే–47 గన్‌తో కాల్పుల వరకు వచ్చింది. కోహెడకు చెందిన దేవుని సదానందం అక్కన్నపేటలోని తన మేనమామ గుంటి వెంకటయ్య ఇంటికి 2010లో వచ్చి పదేళ్లుగా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. అక్కన్నపేటకు చెందిన గుంటి గంగరాజు వెంకటయ్య వద్ద సిమెంట్ ఇటుకలను చేబదులు తీసుకున్నాడు. తర్వాత ఇటుకల విషయంలో సదానందం, గంగరాజు మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో కోపంగా ఉన్న సదానందం బుధవారం గంగరాజు తల్లి ఎల్లవ్వ వద్దకు తల్వార్‌తో వెళ్లి చంపుతానని బెదిరించాడు. అలాగే గురువారం రాత్రి సదానందం నల్లటి దుస్తులు, తలకు నల్లటి క్యాప్ ధరించి, భుజానికి ఏకే–47 తుపాకీ వేసుకొని అది పని చేస్తుందా లేదా అని ఇంటి ముందు నేలకేసి కాల్చాడు. ఈ శబ్దానికి ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై గంగరాజుకు చెప్పారు. దీంతో గంగరాజు, కుటుంబ సభ్యులు భయంతో ఇంటి తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. గంగరాజు ఇంటికి వచ్చిన సదానందం తుపాకితో కిటికీ నుంచి ఇంట్లోకి కాల్పులు జరిపి పరారయ్యాడు. మాజీ మావోయిస్టుగా అనుమానం సదానందానికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే స్వస్థలం కోహెడలో ఉన్న సమయంలోనే సదానందం పదేళ్లు కన్పించకుండా పోయాడని తెలుస్తోంది. తర్వాత తిరిగి వచ్చి అక్కన్నపేటలో ఉంటున్నాడు. అయితే అతను గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాయమైన ఏకే–47 ఇదేనా.? గతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న తుపాకులను సిద్దిపేట జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు పం పించారు. ఈ సందర్భంగా ఒక ఏకే–47, మరో ఎస్ఎల్ఆర్ తుపాకీ మాయమైంది. గురువారం అక్కన్నపేటలో ఏకే– 47 గన్ కాల్పుల ఉదాంతం బయటకు రావడంతో కనిపించకుండా పోయిన గన్ ఇదేనా అనే చర్చ జరుగుతోంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎస్సై పాపయ్యనాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలిం చారు. అక్కడ 3 తుపాకీ గుండ్లతో పాటు తుపాకీ బెల్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదా నందం ఇంటిని సోదాచేశారు. ఇంటిలో తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సదానందంకోసం గాలిస్తున్నారు. సిద్దిపేట ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్వేత ఈ ఘటనపై ఆరా తీశారు. గంగ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడం కోసం 3 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. త్వరలో కేసును ఛేదిస్తామని ఇన్చార్జి సీపీ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల అదుపులో నిందితుడు సదానందం? ఇదిలా ఉండగా పరారైన నిందితుడు దేవుని సదానందంను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సదానందం ఇద్దరు భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా అదే సమయంలో గుర్తు తెలియని నంబర్ ద్వారా సదానందం ఇద్దరు భార్యల్లో ఒకరికి ఫోన్ చేసినట్లు తెలిసింది. అక్కడే ఉన్న పోలీసులు సదానందం చేసిన నంబర్‌ను ట్రేస్ చేసి అతడిని పట్టుకున్నట్లు సమాచారం. అతడిని కోహెడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపిన పోలీసులు అక్కడి నుంచి వేరే చోటుకు తరలించినట్లు సమాచారం. సదానందంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించలేదు. -
పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల అరెస్ట్
చంఢీఘర్ : పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లాలో ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను సోమవారం పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన ఆయుధాలు, పెద్ద ఎత్తున నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లో రిజిస్ట్రేషన్ అయిన మారుతీ స్విఫ్ట్ కారులో అమృత్‌సర్‌కు వెళుతున్న బల్వంత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్బజన్ సింగ్, బల్బీర్ సింగ్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరిలో ఆకాశ్‌దీప్ సింగ్, బల్వంత్ సింగ్‌లపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. కాగా, ఈ వాదనలకు బలం చేకూరుస్తూ.. జమ్మూ-కశ్మీర్లో మరోసారి భయాందోళనను సృష్టించేందుకు పాకిస్తాన్, భారత్ సరిహద్దులో ఉన్న అమృత్‌సర్‌లో డ్రోన్ల ద్వారా ఎకె-47, గ్రనైడ్లను వదిలివెళ్లినట్లు సమాచారం అందిందని పంజాబ్ పోలీసులు నిర్దారించారు. కేవలం నెల వ్యవధిలోనే 8 డ్రోన్ల ద్వారా ఆయుధాలతో పాటు సాటిలైట్ ఫోన్లను భారతగడ్డపై వదిలివెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. ఈ డ్రోన్లు అత్యంత వేగంగా ఎగురుతూ 5 కేజీల బరువును సలువుగా మోస్తాయని, సమాచారాన్నివేగంగా పసిగడతాయని వెల్లడించారు. అలాగే వారిని అదుపులోకి తీసుకున్న ప్రదేశంలో సగం కాలిపోయిన డ్రోన్ దొరికిందని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే సమయంలో డ్రోన్‌లో ఇబ్బంది తలెత్తడంతో ఉగ్రవాదులే దానిని కాల్చడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. గత ఆగస్టులో ఇదే తరహాలో పంజాబ్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం అమృత్‌సర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థను కోరినట్లు పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కల్పించుకొని వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. -
ఏకే–47 రెడీ ఫర్ సేల్!
అక్కడ అన్ని రకాల మారణాయుధాలు దొరుకుతాయి. నాటు తుపాకీ నుంచి ఏకే–47 వరకు ఏది కావాలన్నా అమ్మకానికి రెడీ! అంతేనా.. అమ్మకం తర్వాత అవసరమైన రిపేర్లు, సర్వీసింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇదేదో ఇంటర్నేషనల్ తుపాకుల దుకాణం అనుకుంటున్నారా? కాదు.. ఇవన్నీ దొరికేది బిహార్‌లోని సీతా కుంద్‌గా పేరుగాంచిన ప్రాంతంలో. ఈ ప్రాంతానికి చెందిన మీర్జాపూర్– బర్దా గ్రామం అక్రమాయుధ మార్కెట్‌కు ప్రసిద్ధి. విదేశాల నుంచి ఆయుధాలు.. రెండువేల కుటుంబాలకు పైగా నివసిస్తున్న మీర్జాపూర్లో అన్నిరకాల ఆయుధాలు అమ్ముతున్నారు. ఈ గ్రామానికి చెందిన పలువురు డిఫెన్స్ సర్వీసెస్‌తో పాటు టీచర్లుగానూ పనిచేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదనకు అవకాశం ఉండడంతో ఈ ఊర్లో ఎక్కువమంది అక్రమ ఆయుధాల వ్యాపారంలో భాగస్వాములవుతున్నారు. ఇక్కడి అక్రమాయుధ తయారీ పరిశ్రమలపై పోలీసులు తరచుగా దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారు. అయినప్పటికీ మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్లలోని అంతర్జాతీయ ఆయుధాల పంపిణీదారులతో స్థానిక ఆయుధాల వ్యాపారుల సంబంధాలకు మాత్రం బ్రేక్ వేయలేకపోయారు. పోలీసుల దాడులు పెరగడంతో కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న పశ్చిమబెంగాల్, యూపీ, జార్ఖండ్‌కు మకాం మార్చారు. నక్సల్స్‌కు అమ్ముతున్నారు.. గత ఆగస్టు 29న మీర్జాపూర్–బర్దా వాసి ఇమ్రాన్ ఆలం నుంచి మూడు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్న సందర్భంగా జబల్పూర్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో ఉద్యోగులతో స్థానిక ఆయుధాల వ్యాపారులకున్న సంబంధాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లో జరిపిన దాడుల్లో 20 ఏకే 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 22 అక్రమ ఆయుధవ్యాపారులను అరెస్ట్ చేసినపుడు తాము నిషేదిత ఆయుధాలను నక్సల్ చీలిక గ్రూపులు, నేరబృందాలు, చివరకు రాజకీయవేత్తలకు కూడా విక్రయించినట్లు తెలియజేశారు. యువకులకు పెళ్లిళ్లు కావట్లేదు.. ‘కొందరి వల్ల బర్దా పంచాయతీకి ఉన్న మంచిపేరు పోతోంది. కొన్ని కుటుంబాలు నిర్వహిస్తున్న అక్రమ ఆయుధాల వ్యాపారం వల్ల మాకు తీరని నష్టం జరుగుతోంది. ఈ గ్రామంలోని యువకులతో పెళ్లిళ్లు చేసేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లలో మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. నన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రెండ్రోజుల పాటు ప్రశ్నించారు’అని రాష్ట్రీయ జనతాదళ్ జిల్లా పరిషత్ సభ్యుడు మహ్మద్ పర్వేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఆలం జబల్పూర్ ఆయుధాల డిపో నుంచి పెద్దసంఖ్యలో ఏకే 47 ఆయుధాలు దొంగిలించాడు. ఈ ఊరిలోని ఒక బావి నుంచి 12 ఏకే 47 తుపాకులను ఆ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ ఆయుధాల కేసులో అతడి కుటుంబానికి చెందిన ఆరుగురిని అరెస్ట్‌చేశారు. సంప్రదాయంగా ఆయుధాల తయారీ.. 1760 నుంచి 1764 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన బెంగాల్‌కు చెందిన మీర్ ఖాసిం అలీ అనే నవాబ్ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ స్థాపించాడు. వందల కుటుంబాలు ఆయుధాల తయారీ పరిశ్రమలో నిమగ్నం కావడంతో తయారీ సంప్రదాయంగా కొనసాగింది. తుపాకీ మందులో ప్రధాన వనరు ‘పొటాషియం నైట్రేట్’ముంగేర్ ప్రాంతంలో అధికంగా లభ్యం కావడం కూడా ఈ పరిశ్రమ నిరాటంకంగా కొనసాగేందుకు ప్రధాన కారణంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. నేటికీ అక్కడ ‘తోప్ బజార్లు’, ‘బ్యారెల్ బజార్లు’అనే పేర్లతో మార్కెట్లు కొనసాగుతున్నాయంటే ఆయుధాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఏకే 47 లభ్యం..
విజయనగరం టౌన్: చోరీకి గురైన ఏకే 47 గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని హైదరాబాద్ నుంచి ఒడిశా తరలిస్తున్న వాహనంలో ఈవీఎంలకు రక్షణగా ఉన్న ఒడిశా కానిస్టేబుల్‌కు చెందిన ఏకే 47 గన్ అక్టోబర్ 12వ తేదీ రాత్రి పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విజయనగరం పోలీసులు నిందితులు సంజూరాం సిందూ, నగేష్ సిందూలను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఏకే 47 గన్, ఆరు తూటాలు, రాయికట్టిన ఒక జంగిల్ షూ, నాలుగు సెల్‌ఫోన్స్, కాల్చిన ఒక షెల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ జి.పాలరాజు శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది... హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ నుంచి ఎన్నికల మెటీరీయల్‌ను ఒడిశా తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్రంలోని డెంకనాల్ జిల్లా నుంచి అభిమన్యు సాహు అనే రిజర్వ్ కానిస్టేబుల్, తదితరులు వాహనాలకు బందోబస్తుగా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరందరూ ఏకే 47 గన్లతో సామగ్రికి రక్షణగా ఉన్నారు. ఆరు కంటైనర్లలో సరుకు తీసుకువస్తూ అక్టోబర్ 11న డెంకాడ మండలం నాతవలస జంక్షన్‌కు చేరుకున్నారు. రాత్రి 1.30 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్‌లో బ్యాగ్‌తో ఉన్న ఏకే 47 వాహనం దొంగిలించుకుపోయారు. దీంతో బాధితుడు అభిమన్యు సాహు ఫిర్యాదుతో మేరకు డెంకాడ పోలీసులు అక్టోబర్ 13న కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మిగతా బుల్లెట్లేవీ..? బ్యాగ్‌లో ఏకే 47 రైఫిల్ బట్ నంబర్ 2తో మ్యాగ్జైన్ విత్ 30 రౌండ్స్ బుల్లెట్స్, మొబైల్ ఫోన్, పెయిర్ జంగిల్ షూ, సివిల్ షూ, టీషర్ట్, ప్యాంట్స్, తదితర వస్తువులున్నాయి. అయితే ప్రస్తుతం ఏకే 47 గన్ బట్ నంబర్ 2 దొరికింది. మ్యాగజైన్ కనబడలేదు. 30 రౌండ్ల బుల్లెట్లకు గాను కేవలం 6 రౌండ్లు బుల్లెట్లు మాత్రమే దొరికాయి. ఒక జంగిల్ షూ రాయికి కట్టిఉంది. నాలుగు సెల్ఫోన్లు, కాలిపోయిన మరో సెల్‌ఫోన్ దొరికాయి. ఇలా ఛేదించారు.... ఏకె 47 కనిపించకుండా పోయిందన్న విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో అనేకమందిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో తమకు లభించిన కీలక సమాచారం మేరకు నాతవలస జంక్షన్ వద్ద ఇటీవల వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మహరాష్ట్ర, గుజరాత్‌కు చెందిన సంజురాం సిందూ, నగేష్ సిందూలుగా గుర్తించారు. తాము బతుకుదెరువు కోసం విజయనగరం వచ్చామని, ఎ.రావివలస వద్ద టెంట్లు వేసుకుని ఉంటున్నట్లు నిందితులు తెలిపారు. అక్టోబర్ 12న నాతవలస జంక్షన్ వద్ద ఆగిఉన్న కంటైనర్ లారీలో చోరీకి పాల్పడినట్లుగా అంగీకరించారు. దీంతో వారి నుంచి ఏకే 47 గన్, ఆరు తుటాలు, రాయి కట్టిన ఒక జంగిల్ షూ, నాలుగు సెల్ ఫోన్లతో పాటు కాల్చిన మరో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నేరస్తుల గత చరిత్ర... నేరస్తులలో ఏ1గా ఉన్న మహారాష్ట్రకు చెందిన సంజూరాం సిందూ, గుజరాత్‌కి చెందిన ఏ2గా ఎరంర నగేష్ సిందూ ఇద్దరూ పార్థీ కులానికి చెందిన వారు. వీరిద్దరూ బంధువులు. జాతీయ రహదారిపై ఆగిఉన్న వాహనాలలో బ్యాగులు, సామాగ్రి దొంగలిస్తుంటారు. సుమారు పదేళ్ల కిందట వీరి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చి శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడ, చిలకపాలెం, కోష్ట... విజయనగరం జిల్లాలో నాతవలస, ఎ.రావివలస వద్ద... విశాఖ జిల్లాలో తగరపువలస, ఆనందపురం వద్ద టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీస్తుంటారు. ఆగిఉన్న వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతూ, తరచూ తమ నివాసాలు మారుస్తుంటారు. నగదు రివార్డు ఈ కేసులో త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ పాలరాజు అభినందించారు. అలాగే 25 వేల రూపాయల నగదు రివార్డు కూడా ప్రకటించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు, విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రావణ్‌కుమార్, భోగాపురం సీఐ రఘువీర్‌విష్ణు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు వైవీ శేషు, జి.రామకృష్ణ, డెంకాడ ఎస్సై జీఏవీ రమణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈవీఎంలు తరలిస్తుండగా..ఏకే47 మిస్సింగ్
సాక్షి, విజయనగరం : ఈవీఎంలు తరలిస్తున్న భద్రతాసిబ్బందికి చెందిన ఏకే47 తుపాకిని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన విజయనగరంలో కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల నిమిత్తమై ఒడిశాకి ఈవీఎంలను లారీలో తరలిస్తున్నారు. శనివారం వేకువజామున నాతవలస టోల్గేట్ వద్దకి లారీ చేరుకుంది. భద్రతాసిబ్బంది విశ్రాంతి కోసమని టోల్గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్లి హైవే పక్కన లారిని ఆపారు. సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి ఏకే 47 తుపాకిని దొంగిలించారు. ఆ తుపాకి అభిమన్యు సహూ అనే భద్రతా సిబ్బందిదిగా గుర్తించారు. దీంతో భద్రతా దళాలు బోగాపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏఎస్సీ ఆధ్యర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
ప్రేయసి కోసం ఏకే-47 చేతపట్టి.. కాబోయే భర్తను..!
శ్రీనగర్, జమ్మూకశ్మీర్ : ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి రెడీ అంటారు నేటి యువత. ప్రేయసి కోసం ఎన్ని తప్పులు అయినా చేస్తారు. తాజాగా ప్రేయసి కోసం ఆర్మీ అధికారి అవతారమెత్తాడు ఓ వీర ప్రేమికుడు. చివరకు గ్రామస్తుల చేతిలో చిక్కి తన్నులు తిన్నాడు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌కి చెందిన అదిల్ అనే యువకుడు ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్య్యాడు. కానీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో వరుడిని బెదిరించేందుకు ప్రేమికుడు ఆర్మీ అధికారి అవతారమెత్తాడు. తానే కాకుండా మరో ముగ్గురి స్నేహితులను కూడా నకిలీ సైనికులుగా తయారు చేశారు. ఈ నలుగురు డమ్మీ ఏకే-47 గన్స్ తీసుకొని నిజమైన ఆర్మీ అధికారిలా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు. ఆ అమ్మాయికి కాబోయే భర్తను బెదిరించారు. అయితే, అతని కుటుంబీకులకు వీరిపై అనుమానం కలిగింది. వారి దగ్గర ఉన్నవి డమ్మీ తుపాకులు అని తెలిసి బంధించేందుకు ప్రయత్నించారు. అయితే అదిల్ ఒక్కడే వీరి చేతికి చిక్కాడు. మిగతా ముగ్గురు పారిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదిల్‌ను అరెస్ట్ చేశారు. తాను అమ్మాయి కోసమే ఆర్మీ అధికారిగా నటించానని, మిగతా ముగ్గురు కూడా తన కోసమే అలా నటించారని అదిల్ తెలిపాడు. ఈ విషయంపై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అదిల్ కేవలం ప్రేమ కోసమే నకిలీ ఆర్మీ అధికారిగా నటించాడని చెప్పారు. ఇతనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని వెల్లడించారు. సానుభూతితో అతన్ని వదిలిపెట్టినట్లు వివరించారు. అయితే ఈ చిలిపి ప్రేమికుడు చేసిన పనికి ఆ ఆమ్మాయి పెళ్లి చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. కాగా ఉగ్రవాదులను అంతమొందించాలనే దిశలో భద్రతా బలగాలను 'ఆపరేషన్ ఆల్ ఔట్-2' అనే పేరిట చర్యకు ఉపక్రమించిన సమయంలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. -
ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల మృతి
రాంచీ : జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెరెన్‌దాగ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూంబింగ్ కొనసాగుతున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. -
ఓకే.....47
-
డాన్ ఆయుధాలెక్కడ?
♦ 21 పిస్టళ్లను స్మగ్లింగ్ చేసిన అర్ఖాన్ భాయ్.. ఉత్తరప్రదేశ్ నుంచి తుపాకుల సరఫరా ♦ పోలీసులు సీజ్ చేసింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే.. మిగతా ఏకే–47లు, పిస్టళ్లు ఎక్కడ? ♦ నయీం అనుచరుల వద్దే ఉన్న మారణాయుధాలు ♦ ఏడాది తర్వాత బయటకు వచ్చిన సంచలన అంశాలు ♦ రెండు గ్రూపులుగా చీలిపోయిన అనుచరులు ♦ మళ్లీ గ్యాంగ్‌వార్ మొదలయ్యే అవకాశముందంటున్న నిఘా వర్గాలు (ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి) జేబులో పెన్ను పెట్టుకున్నంత సులభంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఏకే–47 వంటి మారణాయుధాలను వినియోగించాడు. నయీమ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు కూడా ఏకే–47లు, పిస్టళ్లు పట్టుకుని దందాలు చేశారు. అసలు నయీం 2003 నుంచి 2015 మధ్య ఏకంగా 11 ఏకే–47లు, 21 పిస్టళ్లు కొనుగోలు చేసినట్లు కుటుంబ సభ్యులు, అనుచరుల విచారణలో వెల్లడైంది. కానీ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు దొరికింది ఒకే ఒక ఏకే–47, ఆరు పిస్టళ్లు మాత్రమే. దీంతో మిగతా ఆయుధాలు ఏమయ్యాయనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు నయీంకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని ఆయుధాలను కొనుగోలు చేశాడు, వాటికోసం ఎంత ఖర్చుపెట్టాడన్న అంశాలపై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. అంతేకాదు ప్రస్తుతం నయీం అనుచరుల వద్ద ఉన్న ఆయుధాల పరిస్థితి ఏమిటి? మళ్లీ దందాలు, ముఠా కక్షలు మొదలవుతాయా అన్న ఆందోళన రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో నయీం ఆయుధాల అంశంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ముఖ్యులందరి వద్దా ఏకే–47లు నయీం దందాలు, సెటిల్మెంట్లు వంటివి చేసే ముందు తన భార్య హసీనా, అక్క సలీమా, తల్లి తాహేరా, అత్త సుల్తానా, బావమరిది సాదిక్‌లను ‘టార్గెట్’ప్రాంతానికి పంపుతాడు. వారు మూడు ఏకే–47లు, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో అక్కడికి చేరుకుంటారు. తర్వాత నయీం తన ఆంతరంగికురాలు అమీనా, అనుచరులు శ్రీధర్‌గౌడ్, శ్రీధర్‌రాజు, శేషన్న, పాశం శ్రీను, రాంబాబు, గోపన్న, ఈశ్వరయ్యతో కలసి వస్తాడు. వీరందరి వద్దా ఏకే–47లు ఉంటాయి. వాటితోపాటు ప్రతీ ఒక్కరి వద్ద అదనంగా పిస్టల్ కూడా ఉంటుంది. ఏకే–47లను కారులో కనబడకుండా పట్టుకునే వీరు.. పిస్టళ్లను లోదుస్తుల్లో దాచుకునేవారని సమాచారం. ఇలా 2014 నుంచి 2016 ఆగస్టు వరకు దందాలు చేసేందుకు షాద్‌నగర్‌లోని ఇందిరాపార్క్ నివాసానికి వచ్చేవాడు. యాంజాల్ శివారులోని ఇంజాపూర్‌లో ఉన్న నివాసంలోనూ సెటిల్మెంట్లు చేశాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలు ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో నయీంను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్ జైలుకు పంపించారు. అక్కడే నయీంకు ఐఎస్ఐ ఉగ్రవాది షాహీద్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం షాహీద్ ఉత్తరప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఆయుధాల డీలర్ అర్ఖాన్‌భాయ్ అలియాస్ యుజవార్ను నయీంకు పరిచయం చేశాడు. అలా అర్ఖాన్‌భాయ్ ద్వారా 2000 సంవత్సరంలో నయీంకు ఆయుధాలు అందాయి. నయీం వాటిని మావోయిస్టుల హత్యలకు, భూ దందాలకు వినియోగించుకున్నాడు. ఈ క్రమంలో 2003లో అర్ఖాన్‌కు రూ.10 లక్షలు చెల్లించి.. రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లను తెప్పించాడు. ఆ డబ్బును తన అక్క సలీమా అర్ఖాన్‌కు అందించింది. తర్వాత 2006లో రూ.15 లక్షలు ఇచ్చి మరో 2 ఏకే–47లు, నాలుగు పిస్టళ్లను గోవాలోని తన చర్చిహౌస్కు తెప్పించుకున్నాడు. 2008లో అర్ఖాన్ రూ.20 లక్షలు తీసుకుని మరో రెండు ఏకే–47లను ఇంజాపూర్‌లోని నయీం అడ్డాకు తెచ్చి ఇచ్చాడు. 2013లో శంషాబాద్‌లోని రైల్వేహౌజ్లో ఇంకో రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లు ఇచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లాడు. 2015లో రూ.20 లక్షలు తీసుకుని ఒక ఏకే–47, ఒక కార్బైన్, 4 పిస్టళ్లను తెచ్చి ఇచ్చాడు. ఇవన్నీ నయీం కుటుంబ సభ్యులకు తెలిసి జరిగినవి. ఇవిగాకుండా ఛత్తీస్‌గఢ్‌లో రెండు సందర్భాల్లో 2 ఏకే–47లను, నాలుగు పిస్టళ్లను, ప్రకాశంలో ఉన్నప్పుడు రెండు పిస్టళ్లను నయీం తెప్పించినట్లు అనుచరుల విచారణలో వెల్లడైంది. మొత్తంగా నయీం దాదాపు కోటిన్నర వరకు చెల్లించి.. పదకొండు ఏకే–47లు, 21 పిస్టళ్లను తెప్పించాడు. దొరికింది మాత్రం ఒక్కటే.. గతేడాది ఆగస్టు 8న షాద్‌నగర్ మిలినీయం టౌన్షిప్లో ఉన్న ఇందిరాపార్క్ హౌజ్ వద్ద నయీం ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం పోలీసులు అలకాపురి కాలనీ, శంషాబాద్, ఇంజాపూర్లలోని ఇళ్లు, తుక్కుగూడ ఫాంహౌస్.. ఇలా 12 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రూ.2.5 కోట్ల నగదుతోపాటు భారీగా బంగారు ఆభరణాలు, పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. నయీం ఎన్కౌంటరైన ప్రాంతంలో ఒక ఏకే–47ను.. అతడి అనుచరులు శ్రీధర్‌గౌడ్, పాశం శ్రీనుల వద్ద మూడు చొప్పున ఆరు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలకాపురి కాలనీలోని ఇంట్లో ఒక కార్బైన్, 169 రౌండ్ల బుల్లెట్లు, 10 జిలెటెన్ స్టిక్స్ దొరికాయి. అయితే నయీం వద్ద 11 ఏకే–47 తుపాకులు, 21 పిస్టళ్లు ఉన్నట్లు లెక్క. మరి పోలీసులకు దొరికింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే. మిగతా ఆయుధాల సంగతేంటి, అసలు అవి ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నయీం షాద్‌నగర్ డెన్‌కు వెళ్లే ముందు రోజు అతడి భార్య, అక్క, అనుచరుల వద్ద ఏకే–47లు ఉన్నాయి. కానీ సోదాల సమయంలో మాత్రం లభించలేదు. దీనిపై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పోలీసులు సీజ్ చేసినట్లుగా పేర్కొన్న ‘ప్రాపర్టీ’లో ఆయుధాల వివరాలను పూర్తిగా చూపకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ గ్యాంగ్‌వార్.. నయీం ముఠా యాక్షన్ కమిటీలో కీలకంగా ఉన్న శేషన్న, ఇతర అనుచరులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. వారు ఇటీవల పలు రాజకీయ పార్టీల కార్యాలయాలకు కూడా వెళ్లడం సంచలనంగా మారింది. నయీంకు సంబంధించిన ఆయుధాలు వారి వద్ద ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల నయీం కుటుంబీకులు, అనుచరులుగా ఉన్న వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయని నిఘా వర్గాలు గుర్తించాయి. నయీం ముఠాలో రెండు గ్రూపులు ఏర్పడి ఉంటాయని. వాటి మధ్య తిరిగి గ్యాంగ్‌వార్ మొదలయ్యే అవకాశముందని సమాచారం. -
ఫైరింగా.. మిస్ ఫైరా!
► ఏఎస్పీ కారు డ్రైవర్ రమేష్ మృతిపై అనుమానాలు ► ఏకే47 మిస్ ఫైర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ► రమేష్ ఫోన్ నుంచి కృష్ణసింగ్‌తో ఉన్నతాధికారి మాట్లాడినట్లు ఆరోపణలు ► కీలకంగా మారిన ఎస్పీ కార్యాలయం సీసీ కెమెరాల ఫుటేజ్ ► ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనన్న ఎస్పీ రామకృష్ణ ఏకే47 మిస్‌ఫైరింగ్ వ్యవహారం క్రికెట్ బెట్టింగ్ కేసుకు చుట్టుకుంది. ఏఎస్పీ గన్‌మన్ చేసిన మిస్‌ఫైర్‌లో కారు డ్రైవర్ మరణించాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన లేక ఇతర వ్యవహారాల నేపథ్యంలో చేశారా అనేది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏకే47 మిస్‌ఫైర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తుపాకి ఎప్పుడూ లాక్‌మోడ్‌లో ఉంటుంది. ఎందుకు మిస్‌ఫైర్ అయింది.. లేక కావాలనే ఫైర్ చేశారా అనే విషయంపై పోలీసు విచారణ మొదలైంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఏఎస్పీ శరత్‌బాబు గన్‌మన్ కె.నాగేంద్ర చేసిన మిస్‌ఫైర్‌లో కారు డ్రైవర్ రమేష్(32) మృతిచెందాడు. రెండు బుల్లెట్లు వేగంగా తగిలి నిమిషాల వ్యవధిలోనే రమేష్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. 2009 బ్యాచ్‌కు చెందిన రమేష్ ఐదేళ్లగా ఏఎస్పీ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి శరత్‌బాబు వద్ద డ్రైవర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఏఎస్పీ సినిమాకు వెళ్లి ఎస్పీ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో రాత్రి 9.30 గంటల సమయంలో అక్కడికి వెళ్లారు. గన్‌మన్ కారు దిగి డోర్ తీస్తున్న క్రమంలో గన్ మిస్‌ఫైర్ అయి డ్రైవర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కొద్ది నిమిషాలకే రమేష్ మరణించాడు. రమేష్ తండ్రి వెంకటేశ్వర్లు, స్నేహితురాలు అనసూయ ఆది వా రం మీడియాతో మా ట్లాడుతూ ఇది ప్రమాదవశాత్తు జరి గిన ఘటన కాదని, హత్యేనని ఆరోపించారు. రమేష్‌ను కొద్ది రోజు ల క్రితం బెట్టింగ్ వ్య వహారంలో ఫోన్ కాల్‌లిస్ట్ ఆధారంగా పోలీ సులు విచారించారని, ఈ పరిణామాల క్ర మంలోనే మృతిచెం దాడని ఆరోపించడంతో అనుమానాలు మ రింత బలపడ్డాయి. మిస్ ఫైర్ ఎలా అవుతుంది! సాధారణంగా గన్‌మె న్ల వద్ద ఉండే ఏకే 47లో 30 బుల్లెట్లు లోడ్ చేసి ఉంటాయి. అత్యవసర సందర్భాల్లో మినహా 24 గం టలు గన్ను ధరించే గన్మెన్లు లాక్‌మోడ్‌లో దాన్ని ఉంచుతారు. వీటితోపాటు ఏకే 47 మిస్‌ఫైర్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. శనివారం రాత్రి మిస్‌ఫైర్ అయ్యేందుకు ముందు గన్ అన్‌లాక్ మోడ్‌లో ఎందుకు ఉంది. అలాగే అత్యవసర సమయాల్లో మినహా ట్రిగ్గర్ మీద వేలు ఉంచరు. కానీ మిస్ ఫైర్ సమయంలో అన్‌లాక్ మోడ్‌తోపాటు ట్రిగ్గర్పైన వేలు ఎందుకు ఉంచా రు. అలాగే ఎక్కువ కాలం లాక్‌మోడ్‌లో ఉన్న గన్ను అన్‌లాక్ చేయడం కూడా కొంత కష్టంగా ఉంటుంది. ఏకే 47లో మూడు రకాల పార్టిషన్లు ఉంటాయి. సేఫ్ మోడ్‌లో ఎప్పుడూ గన్ ఉం టుంది. అలాగే ర్యాపిడ్ మోడ్‌లో ఉంచితే ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే ఒక్క బుల్లెట్ మాత్రమే వచ్చేలా డిజైన్ చేశారు. ఆటో మోడ్‌లో ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే రెండు బుల్లెట్లు, తర్వాత ట్రిగ్గర్ నొక్కితే 28 బుల్లెట్లు ఏకకాలంలో బయటకు వస్తాయి. కూంబింగ్ ఆపరేషన్, ప్రత్యర్థుల దాడి సమయంలో మాత్రమే ఆటోమోడ్ వినియోగిస్తుంటారు. శనివారం జరిగిన ప్రమాద సమయంలో గన్ ఆటోమోడ్లో ఉంది. రెండోసారి ట్రిగ్గర్ నొక్కి తే ఎస్పీ కార్యాలయంలో పెను ప్రమాదమే జరిగేది. వెనుక సీ ట్లో ఏఎస్పీ, సమీపంలో 10 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. బెట్టింగ్ కేసుతో ముడి ఇదిలా ఉంటే రమేష్ ఫోన్ నుంచి కృష్ణసింగ్‌తో ఓ ఉన్నతాధి కారి మాట్లాడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి కృష్ణసింగ్ సదరు ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్‌కు స్పందించని కారణంగా రమేష్ ఫోన్‌కు చేసినట్లు ఆరోపణ లున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో 20 కాల్స్ కృష్ణసింగ్ నంబర్ నుంచి రమేష్ మొబైల్‌కు వచ్చాయి. దీనిపై 15 రోజుల క్రితం రమేష్‌ను పోలీసు అధికారులు విచారించినట్లు ఆరోపణలు న్నాయి. దీన్ని రమేష్ కుటుంబ సభ్యులకు తెలిపి బాధపడినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలోనే రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉన్నతాధికారులు కేసు నుంచి బయటపడడానికి ఈ విధంగా వ్యవహరించారా లేక ప్రమాదవశాత్తే ఘటన జరిగిందా అనేది పోలీసుల్లో చర్చసాగుతోంది. పోలీసు అధికారులు ఏమంటున్నారంటే ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనని పోలీసు అధికారుల వాదన. ఒక వేళ గన్‌మన్‌కు వేరే ఉద్దేశం ఉంటే ఎస్పీ కార్యాలయంలో ఈ తరహా పని చేయడు. సంఘటన స్థలంలో సుమారు 15 మంది వరకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అలాగే ఎస్పీ కా ర్యాలయంలో సీసీ కెమెరాల నిఘా కూడా ఉంది. దీంతోపాటు ఉద్దేశపూర్వకంగా కాలిస్తే బుల్లెట్లు నేరుగా చొచ్చుకుపోతాయి. రమేష్ దేహంలో మాత్రం ఒక పక్క, చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఎస్పీ రామకృష్ణ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదుచేసి అన్ని కోణాల్లో విచారిస్తామని చెప్పారు. ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనని ఎస్పీ తెలిపారు. -
ఏకే 47 మిస్‌ఫైర్
నెల్లూరు: ఏఎస్పీ శరత్‌బాబు గన్‌మెన్ ఏకే-47 మిస్‌ఫైర్ అవడంతో డ్రైవర్ రమేష్ మృతిచెందారు. ఈ సంఘటన జిల్లా పోలీసు కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు ఏకే 47 మిస్‌ఫైరై రమేష్ ఛాతిలోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమేష్ చనిపోయారు. కాగా రమేష్‌ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. -
ఎయిర్‌పోర్టులో ఏకే-47 బుల్లెట్ల కలకలం
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టులో ఏకే-47 బుల్లెట్లతో ఓ వ్యక్తి సంచరించడం కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఏకే-47 బుల్లెట్లు తీసుకెళ్లేందుకు యత్నించిన ఓ వ్యక్తిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ముఖేశ్ ఆర్య అనే ప్రయాణికుడు తన బ్యాగులో అక్రమంగా ఏకే-47 బుల్లెట్లు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే తనిఖీలు చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఏకే-47లతో క్రికెట్ ఆడుకున్నఉగ్రవాదులు
జమ్ము-కశ్మీర్: క్రికెట్ అంటే భారత్‌లో జనాలకు అదో పిచ్చి. ఎక్కడ పడితే అక్కడే క్రికెట్ ఆడతారు. గల్లీల్లో, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు ఎక్కడైనా సందు దొరికితే ఆటాడేస్తారు. చిన్నా పెద్ద తేడా ఉండదు ఆటలో. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆట ఆడేటప్పుడు వికెట్లకోసం బండలు, ఇటుకలు, రాళ్లు, కర్రలు నిలపెట్టుకుంటాం. క్రికెట్‌కు ఉగ్రవాదులు మినహాయింపేం కాదు. వాళ్లు కూడా క్రికెట్ ఆడుకున్నారు. కశ్మీర్‌లోని తరచూ దాడులు జరుపుతూ తమ ఉనికిని చాటుకునే హిజ్బుల్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు క్రికెట్ ఆడుకున్నారు. కాకపోతే అందరూ ఏ రాయినో, ఇటుకలనో వికెట్లుగా పెట్టకొని ఆడుకుంటారు. కానీ వీళ్లు మాత్రం ఏకే-47 తుపాకులను వికెట్లుగా పెట్టుకొని ఆడుకున్నారు. ఇప్పుడు ఆవీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు చూడండి. -
ఏకే-47తో ఆర్మీ జవాను అదృశ్యం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఓ ఆర్మీ జవాను అదృశ్యమయ్యాడు. పుల్వామాకు చెందిన జవాను జహుర్ ఠాకూర్ ఏకే-47 తుపాకీతో సహా అదృశ్యమైన సంఘటన బారాముల్లా జిల్లా గాంట్ముల్లా క్యాంప్‌లో చోటుచేసుకుంది. జవాను మిస్సింగ్ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఆర్మీ అధికారి తెలిపారు. కాగా తీవ్రవాదుల కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకే అతడు ఆర్మీ క్యాంప్ నుంచి తప్పించుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటన ప్రాంతంలో నుంచి 3 ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం మాంచిల్ సెక్టార్లో చోటు చేసుకుంది. ఇటీవల నియంత్రణ రేఖ ద్వారా పలువురు ఉగ్రవాదులు పలు గ్రామాల్లోకి చొరబడి పోలీసుల, సైనికుల కుటుంబాలను లక్ష్యంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో వారిని ఏరివేసే చర్యల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం మాంచిల్ సెక్టార్‌లోకి ఉగ్రవాదుల అలికిడి ఉన్నట్లు వారికి సమాచారం అందడంతో వారిని వెతికే క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ప్రస్తుతం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఏకే47 తయారు చేసిన యువకుడు
పిఠాపురం : ఈ చిత్రంలో సైనిక దుస్తులు ధరించి, చేతిలో ఏకే 47 గన్ చేతపట్టి కనిపిస్తున్న ఈ యువకుడి పేరు పంపన నాగేంద్ర. ఊరు కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు వెంకటరాయపురం. తండ్రి వెంకటరమణ వడ్రంగి పని చేస్తుంటాడు. నాగేంద్ర పదోతరగతి పూర్తి చేసి ఐటీఐ చదువుతున్నాడు. ఇతడికి సైనికులన్నా.. పోలీసులన్నా చాలా ఇష్టం. ఎప్పటికైనా సైనికుడై దేశానికి సేవ చేయాలన్నది అతడి తపన. ఆయుధాలు ధరించి శత్రువులపై సైనికులు పోరాడే దృశ్యాలు కనిపిస్తే చాలు సోల్జర్‌గా ఊహించుకుంటాడు. ఆ పాత్రలో లీనమైపోతాడు. అయితే చదువు, ఎన్నో పరీక్షలు, పోటీలు ఎదుర్కొంటే తప్ప సైనికుడు కాలేమని గ్రహించిన ఆ యువకుడు ఆ యూనిఫాంను కుట్టించేసుకున్నాడు. అంతేకాదు సైనికులు వినియోగించే ఆయుధం(ఏకే 47)ను తయారు చేయాలని నిర్ణయించకున్నాడు. దానికోసం తన తండ్రి వండ్రంగి పనిలో ఉపయోగించే చెక్కను ఇంట్లో ఉన్న సైకిల్ పంపు బ్యాగ్ బెల్టు, కొంత ప్లాస్టిక్ సామాన్లను ఉపయోగించి కేవలం నాలుగు రోజుల్లో రూ.250 ఖర్చుతో ఏకే-47 గన్ను తయారు చేశాడు. బుల్లెట్లను సైతం చెక్కతో రూపొందించాడు. గన్‌లో బుల్లెట్ వేసి పేల్చగానే అవి సుమారు పది మీటర్ల దూరం దూసుకుపోతాయని నాగేంద్ర చెబుతున్నాడు. ఇటీవల కాకినాడలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్లగా పరుగు పందెంలో రాణించలేక ఆర్మీలోకి వెళ్లే అవకాశం పోయిందని, అయితే ఎప్పటికైనా తాను సైనికుడినై తీరతానని అంటున్నాడు. -
ఏకే 47 మిస్‌ఫైర్
► అనంత కానిస్టేబుల్ కర్నూల్లో మృతి ► సీఎం బందోబస్తు కోసం వచ్చిన అంపన్న కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఏకే 47 తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ బోయ అంపన్న (25) (పీసీ 3135) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కంబదహాల్ గ్రామానికి చెందిన అంపన్న 2011లో ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం సివిల్ విభాగంలో స్పెషల్ పార్టీలో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం తడకనపల్లె శివారులోని వామసముద్రం వద్ద సీఎం బందోబస్తు విధుల నిర్వహణ ఉన్నాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నప్పుడు అంపన్న వద్దనున్న ఏకే 47 పేలింది. దీంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు 108 అంబులెన్స్ లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఛాతీ ఎడమ వైపున బుల్లెట్ గాయం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. నిర్ధారణకు సీటీ స్కాన్ కు పంపించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
ఏకే -47
-
ఒక తల కాదా?
తల తాజా చిత్రంలో ఒకరు కాదు ఇద్దరుగా అజిత్ మరోసారి దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారనే టాక్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అభిమానులు తల అని పిలుచుకునే అజిత్ తాజా చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇది ఆయనకు 57వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రానికి ఇంకాపేరు నిర్ణయంచకపోయినా,ప్రస్తుతం ఏకే 57 అన్న పేరుతోనే పిలుచుకుంటున్నారు. ఇంతకు ముందు అజిత్ హీరోగా వీరం, వేదాళం వంటి విజయవంతమై చిత్రాలను దర్శకత్వం వహించిన శివ ఆయనతో తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ఇది. సత్యజ్యోతి ఫిలింస్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో తల ఒకరు కాదు ఇద్దరుగా నటిస్తున్నారన్నది తాజా సమాచారం. అజిత్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు దాదాపు మంచి విజయాన్ని సాధించాయన్నది గమనార్హం. వాలి,వరలారు, అసల్, అట్టహసం చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వరలారు చిత్రంలో ఏకంగా త్రిపాత్రాభినయంతో అలరించారు. తాజా చిత్ర కథ గురించి కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇది తమిళనాడులో జరిగిన ఒక నేరం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం.అయితే ఈ నేరానికి మూలాలు యూరోపియన్ దేశంలో కలిగి ఉండడంతో ఈ మిస్టరీని ఛేదించడానికి ఇంటర్‌పోల్ పోలీస్ అధికారిగా అజిత్ రంగంలోకి దిగుతారట. అయితే ఇందులో మరో అజిత్ పాత్ర మాత్రం చాలా సర్ప్రైజ్గా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడించాల్సిఉంటుంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలిసింది. -
ఉత్తరప్రదేశ్‌లో అద్దెకు ఏకే 47లు..!
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఏకే 47 లాంటి ఆధునిక ఆయుధాలు అమ్మకానికే కాదు.. అద్దెకు కూడా లభిస్తున్నట్లు తాజాగా తేలింది. స్థానిక బీజేపీ నేత బ్రిజ్‌పాల్ తియోతియా హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఒక్కో ఏకే 47కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డిపాజిట్ పెట్టుకుని స్థానిక గ్యాంగ్‌లు వాటిని అద్దెకు ఇస్తుంటాయి. అద్దెకు తీసుకున్న తుపాకీని తిరిగిచ్చినప్పుడు రూ.50 వేల నుంచి 60 వేల వరకు మినహాయించుకుని డిపాజిట్‌ను తిరిగిస్తారు. ఒకవేళ తుపాకీని పోగొడితే.. ఆ డిపాజిట్ తిరిగివ్వరు. ఢిల్లీ సరిహద్దుల్లోని యూపీ ప్రాంతంలో కొన్ని గ్యాంగ్‌లు హత్యలను సబ్ కాంట్రాక్ట్‌కు ఇస్తూ, వారికి ఇలా ఆయుధాలను అద్దెకిస్తుంటారు. కొందరు గ్యాంగ్ లీడర్లు జైళ్లలో నుంచి కూడా ఈ బిజినెస్‌ను నడిపిస్తుంటారట -
ఏకే47 మిస్‌ఫైర్... కానిస్టేబుల్ మృతి
ఆక్టోపస్ కార్యాలయంలో ఘటన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఉగ్రవాద వ్యతిరేక కమాండో విభాగం (ఆక్టోపస్) కార్యాలయంలో ఆదివారం మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శివకుమార్ అక్కడికక్కడే మృతి చెం దాడు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన శివకుమార్ (24) 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్. ప్రస్తుతం టీఎస్ఎస్పీ 13వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా డిప్యుటేషన్‌పై గ్రీన్ల్యాం డ్స్‌లో ఉన్న ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో సెం ట్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతం లో విధులు ముగించుకున్న శివకుమార్ తన వద్దనున్న ఏకే-47 (.9ఎంఎం) పిస్టల్‌ను శుభ్రం చేసేందుకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి గెడ్డం కింది నుంచి తూటా దూసుకుపోయి, తల భాగం నుంచి బయటకు వచ్చింది. తుపాకీ శబ్దంతో అక్కడి చేరుకున్న సహోద్యోగులు అతడిని యశోదా ఆసుపత్రికి తరలిం చగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపా రు. మృతదేహాన్ని నిమ్స్ మార్చురీలో ఉంచారు. ఆక్టోపస్ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆక్టోపస్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఏకే 47 తో విద్యార్థులు.. ఇండోర్ లో కలకలం
భోపాల్: మధ్యప్రదేశ్ లో కాలేజ్ ఫంక్షన్ లో విద్యార్థులు ఏకే 47 గన్ తో డాన్స్ చేయడం కలకలం రేపుతోంది. ఇండోర్ లోని హోల్కర్ సైన్స్ కాలేజ్ 125 వ వార్షికోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు ఏకే 47 ను పట్టుకొని డాన్సులు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకోగా, విద్యార్థులు పారిపోయారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు, కాలేజీ యాజమాన్యం పైనా చర్యలు తీసుకోనున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. -
ఏకే 47 తో కాల్చి చంపేస్తాం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ స్కూలులో అందరినీ చంపేస్తానంటూ ఓ ఆగంతకుడు హెచ్చరించడం కలకలం రేపింది. దీంతో యాజమాన్యం, విద్యార్థులు గజగజ వణికిపోయారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుండగుడు ఫోన్ చేశాడు. ఏకే 47 తుపాకితో అందర్నీ కాల్చి చంపేస్తానంటూ ఫోన్ లో బెదిరించాడు. కంగారుపడిన స్కూలు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే అది ఫేక్ కాల్ అని పోలీసులు తర్వాత తేల్చారు. అయితే ఆ కాల్ ఎక్కడనుంచి వచ్చిందీ, ఎవరు చేశారు అనే వ ఇషయాలను ఆరా తీస్తున్నారు. -
ఎంపీకి ఝలక్ ఇచ్చిన ఘరానా దొంగ!
న్యూఢిల్లీ: ఓ ఎంపీకి ఘరానా దొంగ గట్టి ఝలక్ ఇచ్చాడు. ఎంపీని మాయమాటలతో బురిడికొట్టించి సర్వస్వం దోచాడు. ఆ ఎంపీకి చెందిన విలువైన వస్తువులు దొంగిలించి అవాక్కయ్యేలా చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అఫ్ఘానిస్తాన్ పార్లమెంట్ ఎంపీ అయిన డాక్టర్ సయ్యద్ గులామ్ ఫరూక్ మిర్రానే అనే వ్యక్తి వైద్యం నిమిత్తం భారత్‌కు వచ్చాడు. ఈ విషయం ముందే తెలుసుకున్న అఫ్ఘానిస్తాన్ కే చెందిన నూరుల్లా అరబ్ అనే 21 ఏళ్ల యువకుడు ఫరూక్ మిర్రానేను సంప్రదించాడు. తాను అనువాదకుడిగా సహాయపడతానని చెప్పి గత ఆదివారం ఆయనను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికాడు. అనంతరం ఆయనతోపాటు లజపత్ నగర్ లోని ఓ హోటల్ కు వెళ్లాడు. అనంతరం ఆయన కళ్లుగప్పి పర్స్, మొబైల్ ఫోన్, రూ.3,12,107 డబ్బు, క్రెడిట్ కార్డులు, మూడు ఆయుధాల లైసెన్సులు ఎత్తుకెళ్లిపోయాడు. అందులో ఒక లైసెన్స్ ఏకే 47 తుపాకీకి సంబంధించినది. ఈ మేరకు ఆ ఎంపీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కంగారు పడ్డారు. గణతంత్ర వేడుకలు దగ్గరకు రావడం దొంగతనానికి పాల్పడిన యువకుడి చేతిలో ఆయుధాల లైసెన్సులు ఉండటం వారిని హడలెత్తించింది. దీంతో వేగంగా స్పందించి అతడిని అరెస్టు చేశారు. అరెస్టయిన నూరుల్లా అఫ్ఘానిస్తాన్ లోని మజరీ షరీఫ్ ప్రాంతానికి చెందినవాడు. గత మార్చిలోనే అతడు భారత్ కు వచ్చి ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. -
పాయింట్ బ్లాంక్‌లో ఏకే 47 పేలలేదెందుకో?
-
పాయింట్ బ్లాంక్‌లో ఏకే 47 పేలలేదెందుకో?
పారిస్: నవంబర్ 13న పారిస్ నగరమంతా ఒక్కసారిగా అట్టుడికింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వీధులు, రహదారులు, నివాసాలు, హోటళ్లు ఇలా ప్రతి ఒక్కటి క్షణాల్లో భయం గుప్పిట్లోకి జారుకున్నాయి. ఒక్కసారిగా ముష్కరుల తుపాకీ చప్పుళ్లు హోరెత్తించాయి. దఫాల వారిగా దాడులు చేస్తూ దాదాపు ఆ రోజంతా కాల్పులు జరిపి 129మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు ఇస్లామిక్ ఉగ్రవాదులు. అదే సమయంలో ఓ ఆసక్తి కరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ కేఫ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయినదాని ప్రకారం ఓ మహిళ ఓ ఉగ్రవాది భారి నుంచి బయటపడింది. అదృష్టమంటే అదేనేమో.. తొలుత ఆ కేఫ్ పై ఎంతో వేగంగా కాల్పులు జరిపిన ఉగ్రవాది తాను రెండడుగులు వేస్తే దొరికిపోయేంత దూరంలో ఓ మహిళ ఉండటం గమనించి ఆమె దగ్గరికి వాయువేగంతో వెళ్లి అతడి చేతిలోని ఏకే 47 గన్ ను ఆ మహిళ తలకు గురిపెట్టాడు. కానీ ట్రిగ్గర్ నొక్కినా అది పేలలేదు. స్ట్రక్ అయిపోవడంతో అతడు రెండు మూడు సెకన్లు మాత్రమే మరోసారి నొక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతబట్టుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఆ కేఫ్ లో తలదాచుకున్న ఇద్దరు దంపతులు కూడా బతికిబట్టకట్టారు. -
పోలీసు శునకం వీరమరణం
పారిస్: పారిస్‌లో బుధవారం జరిగిన పోలీసుల షూటౌట్లో డీజిల్ అనే బెల్జియన్ షెపర్డ్ జాతి పోలీసు శునకం వీరమరణం పొందింది. ఆపరేషన్‌లో భాగంగా.. సెయింట్ డెనిస్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో ఉగ్రవాదుల ఆచూకీ తెలుసుకునేందుకు ముందుగా డీజిల్‌ను పంపించారు. పోలీసుల లక్ష్యం వరకు డీజిల్ జాగ్రత్తగానే వెళ్లింది. ఇంతలోనే ఉగ్రవాద గ్రూపులోని ఓ మహిళ.. ఏకే-47 తుపాకీతో పోలీసులపై కాల్పులు ప్రారంభించింది. పోలీసులు ఆమెను లొంగిపోమ్మని హెచ్చరిస్తుండగానే.. ఆ మహిళ తనను తాను పేల్చుకోవటంతో.. అక్కడే ఉన్న డీజిల్ శరీరం రెండు ముక్కలైంది. డీజిల్ మరణాన్ని పారిస్ పోలీసులు తట్టుకోలేకపోయారు. ప్రత్యేకంగా తయారు చేయించిన శవపేటికపై ‘ఓ ఆత్మీయుడిని కోల్పోయాం’ అని రాసి ఘనంగా నివాళులర్పించారు. ‘జాతీ య భద్రతలో డీజిల్ కన్నుమూసిందంటూ’ ట్వీట్లు చేశారు. -
భారత్‌లో ఏకే-47 రైఫిల్స్ తయారీ?
ముంబై: శక్తిమంతమైన ఏకే-47 రైఫిల్స్‌ను భారత్‌లో తయారు చేసే అవకాశాలున్నాయి. భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో కలసి ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ఏకే-47 తయారీ సంస్థ రష్యాకు చెందిన 'కలష్నికోవ్' సుముఖంగా ఉంది. ఈ విషయంపై భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. స్థానిక భాగస్వామ్యులతో సాంకేతికతను పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. '2008 నుంచే భారత్ కంపెనీలు ఏకే-47 రైఫిల్స్‌ను తయారు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం. చర్చలు సానుకూలంగా ఉన్నా.. ఇంకా ఖరారు కాలేదు. అయితే భారత రక్షణ శాఖతో చర్చలు జరపలేదు' అని కలష్నికోవ్ కంసర్న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెక్సీ కృవోరుచ్కో చెప్పారు. ఏడాదికి కనీసం 50 వేల రైఫిల్స్‌ను తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. -
గన్ మిస్‌ఫైర్.. జవాన్‌కు గాయాలు
బక్సార్(బిహార్) : ఏకే-47 గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి ఐటీబీపీ జవాన్ గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... రాకేష్ కుమార్ ఐటీబీపీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం తన సర్వీస్ రివాల్వర్ ను క్లీన్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో గన్ మిస్ ఫైర్ అయింది. రాకేష్ కుమార్ కాలుకు గాయాలయినట్లు సదార్ హాస్పిటల్ డిప్యూటీ చీఫ్ ఆర్కే గుప్తా తెలిపారు. మెరుగైన చికిత్స కోసం రాకేష్ కుమార్ ను పట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించినట్లు గుప్తా వివరించారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో అతడు బందోబస్తుకు వచ్చాడు. అదృష్టవశాత్తూ జవాన్ ప్రాణానికి ప్రమాదమేం లేదన్నట్లు తెలుస్తోంది. -
రెండు గంటలు హైడ్రామా
కొండపాక: నడుస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో నుంచి ‘ఏకే 47 తుపాకీ బైనట్’ కింద పడిన ఘటనలో రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. కరీంనగర్‌జిలాల్ల గంగాధరం పోలీస్‌స్టే షన్‌కు రెండు కిలో మీటర్ల దూరంలోని కురుక్యాలలో దీన్ని పడేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పాటు పోలీసు స్టేషన్ ముందున్న సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో బస్సును ట్రేస్ చేసిన గంగాధరం ఎస్ఐ మొగిలి... వెంటనే మెదక్ జిల్లాలోని సిద్దిపేట పోలీసులను అప్రమత్తం చేశారు. ఏకే 47 బైనట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగిత్యాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళుతున్న ఈ బస్సును కొండపాకలోని లకుడారం గ్రామంలోని రాజీవ్ రహదారిపై... సిద్దిపేట సీఐ ప్రసన్నకుమార్, కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డిల బృందం ఆపింది. అంతా గందరగోళం! లకుడారంలో బస్సు ఆపిన పోలీసులు ప్రయాణికులను అణువణువూ తనిఖీ చేశారు. ఇందు లో మొత్తం 32 మంది ప్రయాణికులున్నారు. ఒక్కొక్కరి వివరాలు నమోదు చేసుకున్నారు. వారి బయోటేటాలు, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఐడెంటీ కార్డులు సరిచూశారు. ఈ తతంగమంతా చూసి ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి లోనయ్యారు. ఈ లోగా గంగాధరం ఎస్ఐ వచ్చి విషయం చెప్పడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. మక్కాకు వెళుతున్న ఇద్దరు వ్యక్తుల వద్ద సరైన ఐడీ కార్డులు, ప్రూఫ్‌లు లేకపోవడంతో వారి వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు తీసుకున్నారు. ఈ విషయం మండలమంతా వ్యాపించింది. అసలేం జరుగుతుందో తెలుసుకొనేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ లోపు అక్కడికి వచ్చిన ఎస్ఐ మొగిలి... సీసీ కెమెరాల ఫుటేజీ, స్థానికులు తెలిపిన వివరాల ఆధారంగా బస్సును గుర్తించగలిగామన్నారు. తమకు లభించిన ఈ బైనట్ ఏకే47కు కీలకమైన పార్ట్ అని తెలిపారు. -
జమ్ములో కొనసాగుతోన్న కర్ఫ్యూ..
సిక్కు యువకులు, పోలీసులకు మధ్య ఘర్షణల నేపథ్యంలో జమ్ములో విధించిన కర్ఫ్యూ శుక్రవారం కూడా కొనసాగుతున్నది. దీంతో జమ్ము రీజియన్ లోని ఐదు జిల్లాల్లో జననీవనం పూర్తిగా స్తంభించింది. సత్వారీ, మిరియాన్ షబీబ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంతవరకు కర్య్పూ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. 144 సెక్షన్ ను అనుసరించి జమ్ము నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిందిగా జమ్ము జిల్లా కలెక్టర్ సిమ్రన్ దీప్ సింగ్ ఆదేశాలు జారేచేశారు. కాగా, గురువారం పోలీసులతో జరిగిన తోపులాటలో ఆందోళనకారులు.. ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నుంచి ఏకే 47 తుపాకిని లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనను సీరియర్ గా తీసుకున్న పోలీసులు ఆర్మీ సహాయంతో నిందితుల కోసం గాలిస్తోంది. సత్వారీ జిల్లాలోని గఢీగఢ్ లో బుధవారం సిక్కు యువకులు ఆందోళనలు నిర్వహించారు. వీరిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా.. జగ్జిత్ సింగ్ అనే యువకుడు మరణించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు హింసాయుత కార్యక్రమాలకు దిగారు. ఈ అల్లర్లను అదుపుచేసేందుకు జమ్ము వ్యాప్తంగా గురువారం నుంచి కర్ప్యూ అమలవుతున్నది. -
సికింద్రాబాద్‌లో సంచలనం
హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్లో ఒక వ్యక్తి ఏకే 47 గన్ పట్టుకొని తిరుగుతుండటం సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే ఉత్తర మండలం టాస్క్ ఫర్స్ పోలీసులు రంగంలోకి దిగి ఆ గన్ పట్టుకు తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కు చెందిన అఖిలేష్ అనే వ్యక్తి ఏకే 47 పట్టుకొని తిరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిని అరెస్ట్ చేసి, ఆ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అతనిని రిమాండ్ కు తరలించారు. -
మాజీ ఎమ్మెల్యే రాంబీర్ షౌకీన్‌కు నాన్ బెయిలబుల్ వారంట్
సాక్షి, న్యూఢిల్లీ: నీరజ్ బవానా కేసులో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే రాంబీర్ షౌకీన్ అరెస్టుకు ఢిల్లీలోని ఓ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. షౌకీన్‌కు బెయిలుకు వీలులేని వారంటు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్... అదనపు సెషన్స్ న్యాయమూర్తి నీనా భన్సల్ కష్ణ ఎదుట పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తుకు సహకరించవలసిందిగా కోరుతూ షౌకీన్‌కు నోటీసులు జారీచేసినప్పటికీ ఆయన ముందుకు రాలేదని స్పెషల్ సెల్ ఏసీపీ మనీషీ చంద్ర తెలిపారు. షౌకీన్ ఎక్కడున్నది తమకు తెలియదని ఆయన బంధువులు తమతో అంటున్నారని చంద్ర తెలిపారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఇటీవల ప్రముఖ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నీరజ్ అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు బవానా ప్రాంతంలో షౌకీన్‌కు చెందిన ఓ ప్లాటులో పాతిపెట్టిన ఏకే-47 తుపాకీని, ఎస్ఎల్ఆర్ రైఫిల్‌ను వెలికితీశారు. అయితే షౌకీన్ మాత్రం ఆ ప్లాటుకు తనకూ సంబంధం లేదని, రాజకీయ దురుద్దేశంతో తనపై బురద చ ల్లుతున్నారని చెప్పారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. -
ఏకే -47 రైఫిల్స్ తో మంత్రి గారి గార్డు పరారీ!
శ్రీనగర్:మంత్రులకు రక్షణగా ఉండాల్సిన గార్డులే చోర కళావతారం ఎత్తితే ఇక చేసేదేముంది. కశ్మీర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రజా పనుల మంత్రిగా పని చేస్తున్న సయ్యద్ అల్తాఫ్ వద్ద నిసార్ అహ్మద్ అనే కానిస్టేబుల్ పర్సనల్ సెక్యూరిటీ గార్డుగా నియమితుడయ్యాడు. గత కొంత కాలంగా మంత్రి వద్ద విధులు బాగానే నిర్వహిస్తున్న అహ్మద్ తన వద్ద నున్న రైఫిల్స్ ను అపహరించాలని భావించాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా శనివారం కూడా యథావిధిగా డ్యూటీకి వచ్చాడు. ఈక్రమంలోనే రెండు ఏకే 47 రైఫిల్స్ ను దొంగిలించి ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఏకే 47తో విజయోత్సవాలు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్‌తో గాలిలో పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే, తాను కాల్పులు జరపలేదని, తన భద్రతాధికారి తుపాకీ కిందపడితే.. తీసిచ్చానని మిర్ వివరణ ఇచ్చారు. కాగా, ‘ఏకే 47తో కాల్పులు జరిపిన మిర్‌పై పోలీసులు కేసు పెట్టే ధైర్యం చేయగలరా?’ అని ఒమర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. -
విజయానందం.. ఏకే47తో గాల్లోకి కాల్పులు
రాజకీయ నాయకులకు ఉత్సాహం వచ్చిందంటే పట్టలేం. తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ఇలాగే జరిగింది. పీడీపీ తరఫున పోటీచేసి.. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను సోనావార్ స్థానం నుంచి ఓడించిన అష్రఫ్ మీర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తన విజయ సంబరాల్లో ఏకంగా ఏకే 47 తుపాకి తీసుకుని.. గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన ఇంటి ఎదుట మద్దతుదారులు గుమిగూడి.. మీర్‌ను అభినందించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒమర్ అబ్దుల్లాను 4వేల ఓట్ల తేడాతో ఓడించడంతో కాశ్మీర్లో ఇప్పుడు ఆయనను అంతా జెయింట్ కిల్లర్ అంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన కాల్పులు జరిపిన ఏకే 47 తుపాకి ఆయనదేనా, లేక భద్రతా సిబ్బందిదా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. తాను గెలిచి తీరుతానన్న నమ్మకం ముందునుంచి తనకుందని, ఒమర్ అబ్దుల్లా తన శక్తి మేరకు ప్రయత్నిస్తే.. తాను తన శక్తి మేరకు ప్రయత్నించానని గెలిచిన తర్వాత అష్రఫ్ మీర్ చెప్పారు. 15 ఏళ్లుగా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ రాజ్యమేలుతున్నా.. తాము గెలిచి చూపించామని తెలిపారు. -
పది ఏకే-47 తుపాకుల లూటీ
సుకుమా: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ పై దాడికి పాల్పడిన తర్వాత మావోయిస్టులు జవానుల నుంచి అత్యాధునిక ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 10 ఏకే-47, 56 తుపాకులు తీసుకెళ్లారు. 3 ఏకే-47 తుపాకుల్లో అత్యాధునిక సదుపాయాలున్నాయి. వీటిని అంబర్ బ్యారెల్ డ్రెనేడ్ లాంఛర్స్ కు ఫిట్ చేసినట్టు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఐఎన్ ఎస్ఏఎస్ రైఫిల్, 400 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయని తెలిపింది. మావోయిస్టుల ఏరివేతకు వెళ్లిన జవాన్లలో చాలా మంది అడవిలో ఉన్నారని, ప్రస్తుతానికి కూంబింగ్ నిలిపి వేశామని సీఆర్పీఎఫ్ ప్రకటించింది. సుకుమా జిల్లాలో సోమవారం మావోయిస్టులు జరిపిన దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. -
ఓబులేసు అరెస్టు
జాకెట్లో పెట్టుకుని ఏకే-47 చోరీ ఓర్వకల్లు గుట్టల్లో ఆయుధం దాచివేత మీడియా సమావేశంలో సీపీ మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీ ఆర్) పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కిడ్నాప్‌కు యత్నించి, కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ ఓబులేసు(37)ను పోలీ సులు అరెస్టు చేశారు. ఓబులేసు నేరాలబాట.. ఏకే-47 చోరీ.. అరెస్టుపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఏకే 47- దొంగిలించాడిలా... ఓబులేసు గ్రేహౌండ్స్‌లో ఉన్నప్పుడు అక్కడి ఏకే-47ను దొంగిలించేందుకు జాకెట్‌ను ఉపయోగించాడు. గత ఏడాది డిసెంబర్లో కూంబింగ్‌కు వెళ్లి వచ్చిన సిబ్బంది ఏకే-47 ఆయుధాలను బెల్ఫామ్ గదిలో భద్రపర్చారు. ఇలా కూంబిం గ్‌కు వెళ్లివచ్చిన వారికి మూడు రోజులు సెలవు ఇస్తారు. కానీ, సెలవులో ఉన్నా కూడా ఓబులేసు ఈ గదిలోకి వెళ్లి లోడెడ్ ఏకే-47ను తీసుకొని సంచిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు చేరుకున్నాడు. అక్కడి రాళ్ల గుట్టల్లో సంచితో పాటు ఆయుధాన్ని దాచిపెట్టాడు. తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అయితే తాను పెట్టిన చోట ఆయుధం ఉందా లేదా అని చూసుకునేందుకు ఓబులేసు ప్రతి వారం ఓర్వకల్లుకు వెళ్లి వచ్చేవాడు. మొదటి కిడ్నాప్ సక్సెస్.. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో మొదటిసారిగా కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనవడు కేబీఆర్ పార్కుకు వాకింగ్ వచ్చినప్పుడు ఏకే-47తో బెదిరించి కిడ్నాప్ చేసి కొత్తూరు శివార్లలోకి తీసుకెళ్లాడు. రూ.10 లక్షలు తీసుకుని వదిలిపెట్టాడు. ఇందులోంచి రూ.3 లక్షలను తన బ్యాంకు అకౌంట్లో మరుసటి రోజు జమచేశాడు. మిగిలిన ఏడు లక్షలతో వాహనం ఖరీదు చేసి జల్సా చేశాడు. ముందు రోజు రాత్రి కేబీఆర్ పార్కులోనే... కేబీఆర్ పార్కు వద్ద మొదటి కిడ్నాప్ విజయవంతమవడంతో మరోసారి అదేవిధంగా వీఐపీని కిడ్నాప్ చేసేందుకు ఓబులేసు పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఓర్వకల్లుకు వెళ్లి ఏకే-47 తీసుకొచ్చి నార్సింగిలోని తన గదిలో దాచిపెట్టాడు. 18వ తేదీ రాత్రి 10.30 గంటలకు ఆయుధాన్ని దాచిన సంచితో ఆర్టీసీ బస్సులో ఎస్ఆర్నగర్ వరకు వచ్చాడు. అక్కడి నుంచి ఆటోలో కృష్ణానగర్‌లో దిగిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ కేబీఆర్ పార్కుకు చేరుకుని అక్కడే ఓ చెట్టు పొదల్లో దాక్కున్నాడు. మరుసటి రోజు ఉదయం అందరిలాగే వాకింగ్ చేస్తున్నట్లు నటించి ఖరీదైన కారు గురించి చూ స్తుండగా అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కారు వచ్చి ఆగింది. అతడిని లక్ష్యంగా చేసుకొన్న ఓబులేసు.. 7.20 గంటలకు నిత్యానందరెడ్డి కారులోకి ఎక్కిన సమయంలో కిడ్నాప్‌కు యత్నించాడు. అయితే ఆయన ధైర్యంగా ప్రతిఘటించడం, అతని సోదరుడు ప్రసాద్‌రెడ్డి కూడా సహకరించడంతో ఓబులేసు వారి చేతు లు కొరికి కేబీఆర్ పార్కు నుంచి పారిపోయాడు. సీసీ కెమెరాలే పట్టించాయి... ఈ ఘటన తర్వాత ఓబులేసు అశోకాబిల్డర్, ఇందిరానగర్ నుంచి కృష్ణానగర్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆటో ఎక్కి అమీర్‌పేటలో దిగి ఆర్టీసీ బస్సు ఎక్కి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో మరో బస్సు ఎక్కి కర్నూలు చేరుకున్నాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఓబులేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే గుర్తించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఎట్టకేలకు ఓబులేసును కర్నూలులో అరెస్టు చేశాయి. ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనబర్చిన వెస్ట్‌జోన్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు. వారికి రివార్డులు ప్రకటించారు. 19 బుల్లెట్లు ఎక్కడ? ఓబులేసు గ్రేహౌండ్స్ నుంచి ఏకే-47తో పాటు మ్యాగజైన్‌ను తస్కరించాడు. ఆ సమయంలో మ్యాగజైన్లో 36 బుల్లెట్లు ఉన్నాయి. అయితే కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనలో పది రౌండ్లు ఉపయోగించగా, మరో ఏడు పేలని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 బుల్లెట్లు గుర్తించారు. మిగతా 19 బుల్లెట్లు ఎక్కడ అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరేదైనా నేరం చేసిన సమయంలో కాల్పులకు ఉపయోగించాడా లేక ఎక్కడైనా దాచిపెట్టాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఓబులేసును తిరిగి పోలీసు కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అతడి వెనకాల మరెవరైనా ఉన్నారా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. -
కరో.. కరో.. జర జల్సా
విలాసాల కోసం యువత పెడదారి దొంగతనాలు, నేరాల బాట పోలీసుల విచారణలో వెల్లడి నిందితులలో ఉద్యోగులు, విద్యావంతులు విలాసాలు... జల్సాలకు అలవాటు పడడం... విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం... కార్లు... విందు వినోదాలు... పబ్‌లు...ఇవన్నీ నగరంలోని యువతను అడ్డదార్లు తొక్కిస్తున్నాయి. ఉన్నత విద్యావంతులు... బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్న వారు సైతం పెడదారి పడుతున్నారు. రాత్రికి రాత్రే ధనవంతులం కావాలనే అత్యాశతో దొంగతనాలు... కిడ్నాప్‌లు... మర్డర్ల వంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించే కంటే... అడ్డదారిలో ముందుకు వెళ్లాలనే దురాశతో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. గ్రేటర్లో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాలు...ఇతర నేరాల్లో పోలీసులకు చిక్కుతున్న నిందితుల్లో అధికశాతం ఈ తరహా వారేనని వెల్లడైంది. మద్యం... అమ్మాయిలను ఆకర్షించడం వంటిప్రయత్నాలు చేసే క్రమంలో వారు నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నగరంలో గత మూడు రోజుల్లో చోటు చేసుకున్న సంఘటనలూ ఈ కోవలోకే వస్తున్నాయి. తాగుడు.... రాసలీలలకు బానిసైన కానిస్టేబుల్ ఓబులేసు ఏకంగా ఏకే-47 చోరీ చేసి...నేరాల బాట పట్టాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కె.విశ్వనాథ్(25) కూడా ఉన్నత విద్యావంతుడే. జల్సాలకు అలవాటు పడి... డబ్బు కోసం తుపాకీతోజనాలను బెదిరిస్తూ పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లాకు చెందిన దేవరాజ్ (28) బీటెక్ పూర్తి చేశాడు. ఆ యువకుడూ విలాసాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ సంఘటనలు నగరంలో పెరుగుతున్న విష సంస్కృతికి అద్దం పడుతున్నాయి. క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఏపీఎస్పీ బెటాలియన్‌లో శిక్షణ పొందిన ఓబులేసు జల్సాల బాట పట్టి నేరప్రవృత్తికి అలవాటు పడ్డాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న దురాశ... నేరాల వల్ల వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం ప్రవృత్తిగా మారడమే అతన్ని కిడ్నాప్ యత్నానికి పురిగొల్పిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చిన్నవయసులోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. వేతనాన్ని విలాసాలకు ఖర్చు చేయడమేకాక.. తల్లిదండ్రులకు తన కష్టార్జితంలో నయాపైసా విదల్చకపోవడం గమనార్హం. అవివాహితుడైన ఓబులేసు అడ్డదారుల్లో సంపాదించిన మొత్తాన్ని రాసలీలలకే ఖర్చు చేసేవాడంటే... ఎంత జల్సారాయుడో అర్థం చేసుకోవచ్చు. గతంలో కిడ్నాప్ యత్నానికి పాల్పడి రూ.లక్షల్లో దండుకొని... కేవలం పబ్‌లు, విందు, వినోదాలు, విలాసాలకే ఖర్చు చేయడం గమనార్హం. విలాసాల బాట పట్టి కటకటాలపాలైన ఈ కానిస్టేబుల్ ఉదంతం పోలీసు అధికారులను నివ్వెరపరిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు వెళ్లేవాడని తెలిసింది. ఒక్కసారి పబ్బుకు వెళ్తే కనీసం రూ.20 నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టేవాడని సమాచారం. అమ్మాయిలతో రాసలీలకే ఎక్కువ మొత్తం వెచ్చించేవాడు. నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పారిపోయి... కర్నూలులోని లాడ్జిలో పట్టుబడే సమయంలోనూ అమ్మాయిలతో ఉన్నట్టు తెలిసింది. సెలవులో ఉన్నాడంటే అంతే... జల్సాలైనా... నేరాలైనా సెలవు రోజుల్లోనే చేయడం ఓబులేసు హాబీ, గత ఏడాది డిసెంబర్లో గండిపేటలోని గ్రేహౌండ్స్ విభాగం నుంచి ఏకే-47 చోరీ చేసింది తాను సెలవులో ఉన్న సమయంలోనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనవడిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు దోచుకున్నప్పుడూ సెలవులోనే ఉన్నాడు. ఇకనిత్యానంద రెడ్డి కిడ్నాప్ యత్నం, కాల్పులకు బరి తెగించింది కూడా తాను సెలవులో ఉన్న రోజే. చివరికి అరెస్టయిందీ సెలవులో ఉన్నప్పుడే. తలకు విగ్‌తో.. నేరానికి పాల్పడే సమయంలో ఓబులేసు తలకు విగ్ వాడేవాడు. కేబీఆర్ పార్కు వద్ద కాల్పుల సంఘటన స్థలంలో విగ్ లభించింది. నిత్యానందరెడ్డి, ప్రసాద్‌రెడ్డిలు ఓబులేసును ప్రతిఘటించే క్రమంలో అతని తలకు ఉన్న విగ్ ఊడి కింద పడింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే విగ్ వాడుతున్నట్లు విచారణలో ఓబులేసు అంగీకరించాడు. తుపాకీతో బెదిరిస్తూ... దత్తాత్రేయనగర్: తుపాకితో సంచరిస్తున్న ఓ విద్యార్థిని టప్పాచబుత్ర పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ బి. రవీందర్ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కె. విశ్వనాథ్(25) ఎంబీఏ విద్యార్థి. జల్సాలకు అలవాటు పడిన విశ్వనాథ్ కొంత మంది బీహారీలతో కలిసి 3 నెలల క్రితం బీహార్‌కు వెళ్లాడు. అక్కడ సింగిల్ బ్యారెల్ తుపాకి, 6 బుల్లెట్లను కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి ఏకాంతంగా ఎవరైనా కనిపిస్తే బెదిరించి డబ్బులు, వారి వద్ద ఉన్న సొత్తును దోచుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుడిమల్కాపూర్ వెనకాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విశ్వనాథ్ అటుగా వెళ్తున్నాడు. ఆయన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా తుపాకి, 6 బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసులపై అనుమానాలు
-
సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసులపై అనుమానాలు
హైదరాబాద్: కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. గతంలో ఏకే-47 తుపాకీ కనిపించకుండాపోయిన కేసులో ఏడుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దుండగుడు వదిలేసిన ఆయుధం ఫిబ్రవరి 3న గ్రేహౌండ్స్ పోలీసుల నుంచి మిస్సైన తుపాకీగా గుర్తించారు. దీనిపై నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదైందని పోలీసులు తెలిపారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆగంతకుడు ట్రాక్ షూట్, తెలుగు రంగు టీషర్టు ధరించినట్టు పోలీసులు గుర్తించారు. -
నిత్యానందరెడ్డిపై కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఆగంతకుడు కాల్పులు జరిపిన ఏకే 47 ...గత ఏడాది చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుండగుడు ఏకే 47 ఉపయోగించాడని... ఆ గన్... ఏడాది క్రితం గ్రేహౌండ్స్ పోలీసుల వద్ద చోరీకి గురైనట్లు తెలిపారు. సాయంత్రంలోగా కేసును ఛేదిస్తామని సీపీ వెల్లడించారు. కాగా ఏకె 47 చోరీకి గురైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్ను ఆగంతకుడు కాల్పులకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. -
ఏకే47లతో లోపలికి వచ్చిన ఉగ్రవాదులు..
* ఏమైందక్కడ? * బీబీఎంపీ వద్ద బాంబు పేలుళ్లు * ముసుగు ధరించి ఏకే47లతో లోపలికి వచ్చిన ఉగ్రవాదులు * ఉద్యోగులు, జనం అరుపులు.. కేకలు * క్షణాల్లో పోలీసుల మోహరింపు * అందరినీ అదుపులోకి తీసుకున్న వైనం * ఇదంతా మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరిపీల్చుకున్న జనం బెంగళూరు : అది బీబీఎంపీ కార్యాలయం... సమయం ఉదయం పది గంటలు. ఉద్యోగులందరూ విధుల్లో నిమగ్నమయ్యారు. అధికారులతో పనులున్న వాళ్లు వస్తున్నారు.. పోతున్నారు. ఆవరణమంతా ప్రశాంతంగా ఉంది. ఉన్నట్లుండి బీబీఎంపీ కార్యాలయం గేటు వద్ద బాంబ్ పేలింది. ఆ పేలుడుకు భూమి దద్దరిల్లింది. అధికారులు, ప్రజల గుండెలదిరాయి. ఈ అనుకోని సంఘటనతో ఒక్కసారిగా అక్కడి వారు షాక్‌కు గురయ్యారు. ఏమి జరిగింది.. ఏమైంది... అంటూ అటు ఇటు పరుగులు పెట్టారు. అంతలోనే పాలికె కౌన్సిల్ సమావేశం జరిగే భవనం ముందు మరో రెండు బాంబులు పేలాయి. నిమిషం క్రితం ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం.. ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించేలా మారింది. ఏమవుతోందో అర్థం కాక అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. అంతలోనే కొందరు ఉగ్రవాదులు ముసుగులు ధరించి చేతిలో ఏకే- 47, స్టన్గన్లతో కార్యాలయంలోకి చొరబడ్డారు. అంతే అక్కడున్న వారి ప్రాణాలు పైకి పోయాయి. అక్కడున్న ఉద్యోగులు, ప్రజలను ఆ ఉగ్రవాదులు చుట్టుముట్టారు. వారిని ఒక చోటకు వెళ్లాలని బెదిరించారు. వారి అరుపులకు అక్కడి వారు జడుసుకున్నారు. వారు చెప్పినట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉగ్రవాదుల నిరోధక దళం వారు పాలికె సర్వసభ్య సమావేశ భవనాన్ని చుట్టుముట్టారు. చాకచక్యంగా లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వారిని క్షేమంగా రక్షించారు. అంతా అయిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ఇదంతా మాక్‌డ్రిల్‌లో భాగమని.. ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడానికే ఇలా చేశామని అధికారులు చెప్పారు. దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆయుధాల అడ్డా..
మనం కిరాణా షాపుకెళ్లి.. పప్పులు ఉప్పులు కొంటాం.. అదే ఇక్కడికెళ్తే.. ఏకే 47లు, మెషీన్ గన్లు, పిస్టళ్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ కిరాణా షాపులున్నట్లే.. అక్కడ ఆయుధాలు అమ్మే దుకాణాలు ఉంటాయి..! ఇంతకీ ఎక్కడ? పాకిస్థాన్‌లోని దర్రా ఆదం ఖేల్ చిన్న పట్టణమే.. అయితే.. అక్రమాయుధాలకు పెద్ద అడ్డా. ఇక్కడ ప్రధాన వీధికి రెండు వైపులా దుకాణాలు. అన్నీ గన్లు అమ్మేవే! ఇక్కడి ప్రజల్లో 75 శాతం మంది ఇదే బిజినెస్‌లో ఉన్నారు. ఏ మోడల్ గన్ను అయినా.. ఇక్కడ లోకల్‌గా దొరికే సామాన్లతో వీరు డూప్లికేట్‌ను తయారుచేసేసి అమ్మేస్తారు. పెన్నుల్లో ఇమిడిపోయే గన్ల దగ్గర్నుంచి.. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాల వరకూ అన్నీ.. గత 150 ఏళ్లుగా ఇక్కడి బిజినెస్ మూడు గన్నులు ఆరు గ్రనేడ్లుగా వర్థిల్లుతోంది. ముఖ్యంగా తాలిబన్లు వంటి టైస్టులు వీరి వద్ద నుంచి ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తారని చెబుతారు. కొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోని పాక్ ప్రభుత్వం.. చివరికి ఈ ఆయుధాలను టైస్టులు తమపైకి గురిపెట్టేసరికి.. కొన్నిసార్లు దాడులు జరిపింది. భారీ ఆయుధాల తయారీని నిషేధించింది. అయినప్పటికీ.. షరామామూలే.. -
బుల్లెట్లకు బెదరని బీఎండబ్ల్యూ..
బుల్లెట్ ప్రూఫ్ కార్లు చాలా ఉన్నాయి.. అయితే.. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 సెక్యూరిటీ ప్లస్ వాహనం ఏకే 47ను కూడా లైట్ తీసుకుంటుందట. ఏకే 47ను సైతం తట్టుకునే కారు ఇదొక్కటేనని సదరు కంపెనీ చెబుతోంది. ఈ వాహనం తయారీలో ప్రత్యేకమైన స్టీలును వాడారట. దీంతో తూటాలు తగిలినా.. వాహనానికేం కాదు. చిత్రం చూశారుగా.. అవన్నీ బుల్లెట్ తాలూకు మచ్చలే. బాడీకే కాదు.. అద్దాలకు కూడా ఏం కాదట. మాస్కో మోటారు షోలో ప్రదర్శనకు పెట్టిన ఈ వాహనం ధర రూ. 1.5 కోట్లు దాకా ఉండొచ్చని చెబుతున్నారు. -
రాజన్నకు రక్షాబంధన్!
సోదరీ సోదరుల అనురాగం, అప్యాయతలు, అనుబంధం, రక్షణకు ప్రతీక... రాఖీ పౌర్ణమి (రాక్షాబంధన్). ఆ పర్వదినం నేడే. ఈ నేపథ్యంలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ స్మరించుకుంటుంది. కుటుంబంలో ఓ మహిళ ఆర్థికాభివృద్ధి సాధిస్తే కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని మనసా వాచా కర్మణ నమ్మె వ్యక్తి వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఓ సోదరుడిగా ఆయన తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వులు చిందించాలని ఆకాంక్షించారు. అందుకు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులోభాగంగా అభయహస్తం, పావల వడ్డీకే రుణాలు, వితంతువులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్తోపాటు పలు పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలు లబ్ది పొందారు. ఆ మహిళల ఇంట ఆనందం తాండవమాడింది. అంతలో ఆ మహానేత ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఆ పథకాలను నిర్లక్ష్యం చేశారు. దాంతో మహిళల ఇళ్లలో చీకట్లు అలముకున్నాయి. వైఎస్ఆర్ ఉండిఉంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు తమకు కొండంత అండగా ఉండేవని మహిళలంతా అనుకుంటున్నారు. ఓ సోదరుడిగా తమ కుటుంబాలలో వెలుగులు నింపినందుకు రాఖీ పౌర్ణమి రోజైన ఈ రోజు (ఆదివారం) తెలుగునేలపై ఉన్న మహిళలంతా ఆ మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి తిలకం పెట్టి, రక్షాబంధన్ ఉంచారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్దకు ఆదివారం అధిక సంఖ్యలో మహిళలు విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన సమాధి వద్ద రాఖీలని ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రానికి మహానేత చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. -
ఏకే-47 మాయం!
మాగజైన్, అందులోని 30 తూటాలు సైతం గండిపేటలోని {Vేహౌండ్స్ హెడ్-క్వార్టర్స్‌లో ఉదంత హైదరాబాద్ శివార్లలోని గండిపేట ప్రాంతం.. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషనల్ విభాగమైన గ్రేహౌండ్స్ హెడ్-క్వార్టర్స్ ఉంది ఇక్కడే.. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ప్రదేశమిది. అటువంటి చోటి నుంచి అత్యంత ప్రమాదకరమైన ఏకే-47 రైఫిల్ మాయమైంది. దాంతో పాటు బుల్లెట్లు ఉండే భాగమైన మాగజైన్, అందులోని 30 తూటాలు సైతం కనిపించట్లేదు. నెల రోజుల క్రితం ఈ ఉదంతం చోటు చేసుకోగా.. రహస్యంగా ఉంచిన అధికారులు.. విచారణ చేపట్టారు. రికార్డుల్లో ఎంట్రీతోనే జారీ చేస్తారు.. రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టుల కూంబింగ్‌తో పాటు ఇతర ఆపరేషన్లకు గ్రేహౌండ్స్ హెడ్-క్వార్టర్స్ నుంచి కంపెనీలుగా పిలిచే బృందాలను తరలిస్తారు. ఒక్కో కంపెనీ ఆపరేషన్‌కు బయలుదేరే ముందు ఇతర వనరులతో పాటు అక్కడ ఉండే ఆయుధాగారం (బెల్ ఆఫ్ ఆర్మ్స్) నుంచి తుపాకులు, తూటాలు అందిస్తారు. ఆ సమయంలో ఏ ఆయుధం ఎవరికి ఇస్తున్నామనేది వారి పేర్లు, తుపాకీ బట్ నంబర్ సహా రికార్డు చేసుకుని సంతకం తీసుకుంటారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత తిరిగి అప్పగించేప్పుడూ మరోసారి రికార్డుల్లో ఎంట్రీ చేసిన తరవాతే డిపాజిట్ చేసుకుంటారు. రెండు నెలల క్రితం ఆంధ్రా-ఛత్తీస్‌గ ఢ్ సరిహద్దుల్లో కూంబింగ్‌కు వెళ్తున్న ఓ కంపెనీకి ఆయుధాలు జారీ చేశారు. వీరు తిరిగి వస్తున్న సమయంలో ఓ ఉద్యోగి అత్యవసరమై మధ్యలోనే ఆగిపోయారు. ఆయన ఏకే-47ను, మాగజైన్, తూటాలు సహా సహచరులకు ఇచ్చి పంపారు. ఇవి బెల్ ఆఫ్ ఆర్మ్స్‌కు చేరినట్లు రికార్డులు సైతం ఉన్నాయి. ఎన్నికల హడావుడి ప్రారంభమైన తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో కూంబింగ్ చేయాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు భారీ స్థాయిలో కంపెనీల్ని రంగంలోకి దింపారు. వీరికి ఆయుధాలు కేటాయిస్తున్న సందర్భంలో ఏకే-47తో పాటు మాగజైన్, తూటాలు మిస్ అయిన విషయం వెలుగులోకొచ్చింది. దీంతో విషయాన్ని బయటకు పొక్కకుండా ఉంచిన అధికారులు అంతర్గతంగా ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు. ఇది ‘ఇంటి దొంగలు’ పనిగా నిర్థారిస్తూ ఆ కోణంలో ముందుకెళ్తున్నారు. అయితే నెల రోజులు దాటినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్చార్జ్ సహా పలువురిపై బదిలీ వేటు పడింది. -
'ఏకే 49తో దేశానికే ప్రమాదం'
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఏకే 49గా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభివర్ణించారు. బుధవారం జమ్మూ కాశ్మీర్ లోని కట్రా పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రాంరభించారు. ఈ సందర్భంగా ఆయన కేజ్రీవాల్‌పై తన దైన శైలిలో విమర్శించారు.ఆయన కన్వీనర్‌గా గల ఆప్ పార్టీ సంఘ వ్యతిరేక శక్తిగా అవరించిందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లేకుండా భారత్ దేశ చిత్ర పటాన్ని ఆ పార్టీ అధికారిక వెబ్సైట్లో ఉంచిన ఘనత 'ఆప్' సొంతమని మోడీ వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీ నేత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రిఫరెండం నిర్వహించాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి మూడు ఏకేలతో ప్రమాదం ముందని ఆయన హెచ్చరించారు.ఆ మూడు ఏకేలు... రైఫిల్ ఏకే 47, దేశ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని, అరవింద్ కేజ్రీవాల్(ఏకే) అంటూ ఆయన చమత్కరించారు.ఆ మూడు ఏకేలు పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు సహకరిస్తున్నాయని మోడీ ఈ సందర్భంగా ఆరోపించారు. న్యూఢిల్లీ శాసనసభకు గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు కైవసం చేసుకుంది. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 49 రోజులు మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. దాంతో అరవింద్ కేజీవ్రాల్ ను ఏకే 49గా మోడీ అభివర్ణించారు. వచ్చే నెలలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో మోడీ వారణాసి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆ స్థానం నుంచే మోడీ ప్రత్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నిక బరిలో నిలవనున్నారు. -
జూనియర్ జిహాదీ..
వీడి వయసు 4 ఏళ్లు. వీడో జిహాదీ!! బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో బులెట్లతో ఆడుకుంటున్నాడు. ఏకే 47 అంత లేడు.. అయినా దాన్ని పట్టుకుని బులెట్ల వర్షం కురిపిస్తున్నాడు. వీడు అల్‌ఖైదా ఉగ్రవాది!! ఈ పిల్లాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. సిరియా సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అల్‌ఖైదా ఈ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఈ పిల్లాడితోపాటు 9 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పలువురు బాలురు తుపాకీలు పట్టుకుని.. శిక్షణ పొందుతున్న దృశ్యాలు ఉన్నాయి. -
ఏకే-47 తయారు చేసి తప్పు చేశాను: కలష్నికోవ్
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకుల మరణాలకు కారణమైయ్యాననే కారణంతో ఏకే-47 రూపశిల్పి మిఖాయిల్ కలష్నికోవ్ తన మరణానికి ముందు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. భయకరమైన అత్యాయుధాన్ని రూపొందించినందుకు కుమిలిపోతూ మాస్కో పాట్రియార్క్, ఆల్ రష్యా క్రిరిల్ 1 కు తన మరణానికి ఆరు నెలల ముందు గత డిసెంబర్ లో లేఖ రాశారు. తాను రూపొందించిన ఆయుధం కారణంగా అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటం ఆయనను ఆందోళనకు గురిచేస్తోందని లేఖలో వెల్లడించారు. ఆయన రష్యాలోని ఓ సాంప్రదాయ చర్చి అధినేతతో తన బాధను పంచుకున్నట్టు ఇజ్వేషియా దినపత్రిక ఓ కథనం వెలువడింది. 'నేను రూపొందించిన ఏకే-47 ఆయుధం అనేక ప్రాణాల మంది మరణానికి కారణమవుతోంది. సమాధానం దొరకని అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. లోలోపల చాలా బాధపడుతున్నాను' అని చర్చి పెద్దతో కలష్నికోవ్ తన బాధను పంచుకున్నారని తెలిపారు. మన దేశంలో ఎన్నో చర్చిలు, శాంతి సంఘాలు ఏర్పడ్డాయి. అయినా ఉగ్రవాదమనే భూతాన్ని తుదముట్టించలేకపోయాయి. మంచి-చెడు, వెలుగు-నీడలు అనేవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ఒకటి లేక మరొకటి ఉండవు. వాటిని ఇలాగేనా దేవుడు రూపొందించేది?. ఇలాంటి పరిస్థితిలోనే మానవాళి జీవించాల్సిందేనా అని కలష్నికోవ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇటీవల చర్చిపై దాడి జరిగిన సమయంలోనే కలష్నికోవ్ లేఖను రాసినట్టు ఇజ్వేషియా వెల్లడించింది. -
ఏకే-47 సృష్టికర్త కలష్నికోవ్ కన్నుమూత
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాల్లో ప్రాచుర్యం పొందిన ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ రూపశిల్పి మిహాయిల్ కలష్నికోవ్ (94) సోమవారం రష్యాలోని ఉద్ముర్షియా ప్రాంతంలో కన్నుమూశారు. సోవి యట్ యూనియన్ హయాంలో ఏకే-47 రూపొందించినందుకు కలష్నికోవ్ జాతీయస్థాయిలో గౌరవాదరణలు పొందారు. ‘అవ్తొమాత్ కలష్నికోవ్’ రైఫిల్‌ను మిహాయిల్ కలష్నికోవ్ 1947లో రూపొందించడంతో ఈ రైఫిల్‌కు ఏకే-47 అనే పేరు వచ్చింది. పలు దేశాల సాయుధ బలగాలతో పాటు ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం ఏకే-47 రైఫిళ్లను నేటికీ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్లకు పైగా ఏకే-47 రైఫిళ్లు వాడుకలో ఉన్నట్లు అంచనా. కాగా, సైబీరియాలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కలష్నికోవ్ తొలుత రైల్వే క్లర్క్‌గా పనిచేశారు. తర్వాత 1938లో రెడ్ ఆర్మీలో చేరిన తర్వాత సోవియెట్ యుద్ధట్యాంకుల ఆధునికీకరణ వంటి పనుల్లో కీలకపాత్ర పోషించారు. నాజీ బలగాలతో 1941లో జరిగిన పోరులో గాయపడ్డ కలష్నికోవ్, ఆస్పత్రి నుంచి బయటపడ్డాక ఐదేళ్లు శ్రమించి ఏకే-47 రైఫిల్‌కు రూపకల్పన చేశారు.