రాజన్నకు రక్షాబంధన్! | YSR remembered on Raksha Bandhan | Sakshi
Sakshi News home page

రాజన్నకు రక్షాబంధన్!

Published Sun, Aug 10 2014 1:42 PM | Last Updated on Tue, Jun 4 2019 6:43 PM

రాజన్నకు రక్షాబంధన్! - Sakshi

రాజన్నకు రక్షాబంధన్!

సోదరీ సోదరుల అనురాగం, అప్యాయతలు, అనుబంధం, రక్షణకు ప్రతీక... రాఖీ పౌర్ణమి (రాక్షాబంధన్). ఆ పర్వదినం నేడే. ఈ నేపథ్యంలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ స్మరించుకుంటుంది. కుటుంబంలో ఓ మహిళ ఆర్థికాభివృద్ధి సాధిస్తే కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని మనసా వాచా కర్మణ నమ్మె వ్యక్తి వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఓ సోదరుడిగా ఆయన తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వులు చిందించాలని ఆకాంక్షించారు.

అందుకు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులోభాగంగా అభయహస్తం, పావల వడ్డీకే రుణాలు, వితంతువులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్తోపాటు పలు పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలు లబ్ది పొందారు. ఆ మహిళల ఇంట ఆనందం తాండవమాడింది. అంతలో ఆ మహానేత ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఆ పథకాలను నిర్లక్ష్యం చేశారు.
 
దాంతో మహిళల ఇళ్లలో చీకట్లు అలముకున్నాయి. వైఎస్ఆర్ ఉండిఉంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు తమకు కొండంత అండగా ఉండేవని మహిళలంతా అనుకుంటున్నారు. ఓ సోదరుడిగా తమ కుటుంబాలలో వెలుగులు నింపినందుకు రాఖీ పౌర్ణమి రోజైన ఈ రోజు (ఆదివారం) తెలుగునేలపై ఉన్న మహిళలంతా ఆ మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి తిలకం పెట్టి, రక్షాబంధన్ ఉంచారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్దకు ఆదివారం అధిక సంఖ్యలో మహిళలు విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన సమాధి వద్ద రాఖీలని ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రానికి మహానేత చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement