Abhaya Hastham Scheme
-
ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి తరలిస్తుండగా కిందపడ్డ దరఖాస్తులు
-
తెలంగాణలో ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ
-
ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
తొలిరోజు విశేష స్పందన
-
ప్రజాపాలన దరఖాస్తు ఫారం: ఎలా నింపాలి ?..కావాల్సిన పత్రాలు ఏంటి..?
-
‘అభయహస్తం’ కోసం ఎదురుచూపులు
సాక్షి, హుజూరాబాద్: చెల్పూర్ గ్రామానికి చెందిన మల్లమ్మ ఒక్కరే కాదు కరీంనగర్ జిల్లాలోని ఐదు వేలకు పైగా మంది మహిళలు అభయహస్తం పథకంలో అందే పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2016 చొప్పున పింఛన్ అంది స్తోంది. వికలాంగులకు రూ.3016 పింఛన్ అందిస్తున్నారు. అభయహస్తం పథకంలో లబ్ధిదారులుగా ఉంటూ నెలకు రూ.500 పింఛన్ పొందేవారిని ప్రభుత్వం విస్మరించడంపై ఆందోళన చెందుతున్నారు. మహిళా సంఘాల సభ్యులకు బీమా, వృద్ధాప్యంలో పింఛన్ సౌకర్యం కల్పించేందుకు అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. 65 ఏళ్లు నిండిన మహిళా సంఘంలోని సభ్యులకు నెలకు రూ.500 చెల్లించేవారు. అభయహస్తం పింఛన్‌ను 2017 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం నిలిపివేయగా, రెండేళ్ల నుంచి జిల్లాలో 5150 మంది లబ్ధిదారులు పింఛన్ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబ సమగ్ర సర్వే సమయంలో కుటుంబంలో వివిధ రకాలుగా పింఛన్ పొందుతున్న వారి వివరాలను అధికారులు ఇంటింటికి వెళ్లి నమోదు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో అభయహస్తం ద్వారా పింఛన్ వస్తుందన్న విషయాన్ని తెలుసుకొని మరోమారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని లబ్ధిదారులకు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తమకు మొండి చేయి చూపారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు అందని మార్గదర్శకాలు అభయహస్తం పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారులకు మార్గదర్శకాలు అం దలేదని తెలుస్తోంది. ఆసరా పథకంలో గతంలో నే 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అం దజేయగా, అభయహస్తంలో పింఛన్ నిలిచిన వారు ఆసరా పథకంలో దరఖాస్తు చేసుకోవా లని సూచించగా, కొంతమంది పొందుతున్నా రు. ఒకే ఇంట్లో వృద్ధాప్య పింఛన్ ఇద్దరికి ఇచ్చే అవకాశం లేకపోవడంతో చాలామంది అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు ఆసరా పింఛన్ అందుకోలేకపోతున్నారు. 65 ఏళ్లు నిండిన వారికి అందుతున్న వృద్ధాప్య పింఛన్ ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వారందరికీ ఇస్తామని ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల హామీలో భాగంగా 57 ఏళ్ల పింఛన్ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లుగా కూడా ఇటీవలనే ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో రూ.1000 ఉన్న పింఛన్ తాజాగా రూ.2 వేలకు పెంచారు. 57 ఏళ్ల పింఛన్ హామీ అమలుకు కూడా మార్గదర్శకాలు రాకపోవడంతో ప్రస్తుతం పాత వారే కొత్త పింఛన్ తీసుకుంటున్నారు. జిల్లాలో సుమారుగా 14 వేల మంది 57 ఏళ్లు నిండిన వారు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కొంతమంది ఆసరా పథకంలో పింఛన్ పొందడానికి అర్హత ఉన్న అభయహస్తం పింఛన్ లబ్ధిదారులు ఆసరా పథకంలో పింఛన్ తీసుకుంటున్నారు. చాలామందికి అర్హత లేకపోవడంతో అభయహస్తం పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారులకు కూడా ఆసరా పథకంలో లబ్ధి చేకూరే విధంగా ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో అభయహస్తం లబ్ధిదారుల వివరాలు హుజూరాబాద్ మండలంలో 535 మంది, వీణ వంకలో 512, జమ్మికుంటలో 254, ఇల్లందకుంటలో 176, సైదాపూర్‌లో 296, శంకరపట్నంలో 480, చిగురుమామిడిలో 358, చొప్పదండిలో 365, గంగాధరలో 362, గన్నేరువరంలో 164, కరీంనగర్‌రూరల్‌లో 289, కరీంనగర్(మున్సిపాలిటీ)లో 24, కొత్తపల్లిలో 215, మానకొండూర్‌లో 350, రామడుగులో 473, తిమ్మాపూర్‌లో 297 మంది ఉన్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉంది అభయహస్తం పథకం అమలు విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఆసరా పథకం ప్రారంభమైన నేపథ్యంలో 2017 నుంచి అభయహస్తం పథకం నిలిచింది. ఆసరా పథకంలోనే ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇస్తున్న నేపథ్యంలో అర్హులైన వారు ఆసరా పథకంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పింఛన్ మంజూరుకు ప్రతిపాదించడం జరుగుతుంది. అభయహస్తం ప£థకం విషయాన్ని ఇప్పటికే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – వెంకటేశ్వర్రావు, డీఆర్డీఏ పీడీ ‘‘మూడేళ్లుగా అభయహస్తం పింఛన్ రావడం లేదు. మహిళా సంఘంలో సభ్యురాలైన నాకు గతంలో అభయహస్తం పథకంలో నెలకు రూ.500 వచ్చేవి. మూడేళ్ల సంది రావడం లేదు. పింఛన్ పైసలు వత్తలేవని ఊళ్లకు వచ్చే సార్లకు చాన సార్ల చెప్పిన ఆసరా పథకంలోనన్న పింఛన్ వచ్చేలా చూడాలె.’’ – ఇదీ హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన మల్లమ్మ ఆవేదన -
వైఎస్ అభయహస్తం బాటలో కేంద్ర పింఛన్ పథకం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అమలు చేసిన ఒక పథకానికి అచ్చుగుద్దినట్టు అలానే ఉండే పథకాన్ని ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతటా అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి డ్వాక్రా మహిళలందరికీ 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఎంతో కొంత పింఛను అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం తీరునే ఇప్పుడు దేశంలోని అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 60 ఏళ్ల తర్వాత పింఛన్లు అందించే పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన మహిళలు సభ్యులుగా ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అనేక అంక్షలు అమలు చేస్తున్న విషయాన్ని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకు రాగా వారి కోసం అభయహస్తం పేరుతో పింఛన్ల పథకాన్ని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున ఈ పథకంలో జమ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళ పేరున ఏడాదికి రూ.365 చొప్పున చెల్లిస్తుంది. మహిళ వాటా, ప్రభుత్వ వాటా రెండు కలిపి ప్రభుత్వమే ఆ డబ్బులను ఎల్ఐసీ వంటి బీమా సంస్థల్లో పింఛన్ల స్కీంలో పెట్టుబడిగా పెడుతుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి పింఛన్లు చెల్లిస్తోంది. సభ్యులు పథకంలో చేరిన సంవత్సరాల ఆధారంగా రూ.500 నుంచి రూ.2,600 మధ్య పింఛను చెల్లించాలి. మహిళలకు 60 ఏళ్లు రాకమునుపే ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పు ఇవ్వడం.. ఒక వేళ దుర్మరణం వంటి విషాదకర సంఘటన జరిగితే బీమాగా కొంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేయడం ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 34 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఈ పథకంలో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో 3,21,703 మంది ఈ పథకం ద్వారా ప్రతి నెలా ప్రస్తుతం పింఛన్లు అందుకుంటున్నారు. వైఎస్ ముందు చూపుతో ఆనాడే ఆదర్శ పథకం అసంఘటిత కార్మికుల కోసం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో సభ్యులుగా చేరిన వారు ఏడాదికి రూ.100 జమ చేస్తే.. ప్రభుత్వం కూడా వంద రూపాయలు అతని పేరిట జమ చేస్తూ.. అతనికి 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల వరకు పింఛను ఇస్తుంది. ఇది అభయహస్తం పథకానికి అచ్చుగుదినట్టుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో ఇలాంటి విన్నూత పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పుడు అవి దేశానికి ఆదర్శంగా మారాయని అంటున్నారు. అయితే, అభయహస్తం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం ‘అన్న అభయహస్తం’ అని పేరు మార్చిందే గానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మరింత మంది డ్వాక్రా మహిళలకు పింఛన్ల లబ్ధి కలిగేలా చేయడానికి మాత్రం అసక్తి చూపడం లేదనే విమర్శ ఉంది. -
అభయహస్తం.. బంద్..!
హన్మకొండ అర్బన్: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ విషయంలో లబ్ధిదారుల అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడంతో జిల్లాలో వేలాది మందికి కొత్తగా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే సమారు 40వేల మంది వరకు కొత్తగా అర్హత సాధిస్తారని అధికారులు ప్రాథమికంగా అంచనా సైతం వేశారు. దీంతో లబ్ధిదారుల వాటాతో పెన్షన్ అందుకునే అభయహస్తం పథకం ఇకపై పూర్తిగా రద్దుకానుంది. సెర్ప్ వెబ్సైట్లో సంబంధిత సమాచారం పూర్తిగా తొలగించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. అయితే అభయహస్తం పథకంలో లబ్ధిదారుల వాటా, ప్రభుత్వం వాటా మొత్తం రూ.కోట్లలో జమై ఉన్నది. వీటిని సభ్యులకు ఎలా చెల్లిస్తార్న విషయంలో అయోమయం నెలకొంది. ఆసరా పథకంలో అభయహస్తం పెన్షన్ కోసం లబ్ధిదారులు ఒక్కొక్కరు రోజుకు ఒకరూపాయి చొప్పున నెలకు రూ.30 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో జమచేసేది. సభ్యుల వయస్సు 60 ఏళ్లు నిండగానే వారికి ప్రతినెలా రూ.500 పెన్షన్ చెల్లించేది. గతంలో ఆసరా పెన్షన్ అర్హత వయస్సు 65 సంవత్సరాలుగా ఉన్నందున అభయహస్తం పెన్షన్ ఐదు సంవత్సరాలు ముందుగా అందేది. ప్రసుతం ఆసరా అర్హత వయస్సు 57 సంవత్సరాలకు చేయడంతో ఈ పథకం కంటే ఆసరా పథకం ద్వారా ఎలాంటి చెల్లింపులు లేకుండా నేరుగా ఈ ఏడాది మార్చి నెల నుంచి రూ.2016 అబ్ధిదారులకు అందనున్నాయి. 2009 సంవత్సరంలో మొదలు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2009 సంవత్సరంలో ఐకేపీ పెన్షన్, బీమా పథకం పేరుతో అభయహస్తం పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. సంఘాల్లోని పేద మహిళలకు అన్ని విధాలుగా ఉపయోగ కరంగా ఉండడంతో ఈ పథకంలో పెద్ద సంఖ్యలు సభ్యులుగా చేరారు. వయస్సు 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడం, వారి కుటంబాలకు బీమాతో భరోసా కల్పించడం, పిల్లల చదువులకు ఆర్థికంగా అండగా ఉండటం పథకం ముఖ్య ఉద్దేశంగా ఉండేది. బీమా ఉపకారం కూడా.. ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా సభ్యత్వాలు, వాటా ధనం చెల్లింపులు నిలిపి వేయడంతో అనధికారికంగా పథకం రద్దయినట్లు సంఘాల వారు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆసరా పథకంతో పెన్షన్ పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ బీమా, ఉపకార వేతనాలు వంటివి మాత్రం మహిళా సంఘాలు కోల్పోయే అవకాశం ఉందని సభ్యులు అంటున్నారు. ఈ పథకం కొంత మార్పులతో అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా అలాంటి చర్యలు కార్యరూపం దాల్చలేదు. వాటా ధనం సంగతి..? అభయహస్తం పథకంలో 18 సంవత్సరాలు నిండిన వారు చేరారు. వారు నెలకు రూ.30 చెప్పున వాటా ధనం చెల్లిస్తూ వచ్చారు. పథకం ప్రారంభం నుంచి ఉన్న ఒక్కో మహిళ ఇప్పటివరకు(అంటే సుమారు 10 ఏళ్ల కాలంలో)తన వాటా ధనంగా రూ.3600 చెల్లించి ఉంటుంది. అంతే మొత్తంలో ప్రభుత్వం జమచేసింది. అంటే ఒక్కో మహిళ పేరుతో రూ.7200 జమ అయిఉంటాయి. ఈ డబ్బులు తిరిగి చెల్లిస్తారా.. చెల్లిస్తే ఏ విధంగా ఇస్తారనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3.74 లక్షల మంది ఉండగా వీరిలో సుమారు 18వేల మంది పెన్షనర్లు. ఒక్కొక్కరికి రూ.7200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఏలా వస్తుందనే విషయమై సంఘాల సభ్యుల్లో కొంత ఆందోళన నెలకొంది. అలాగే పథకానికి సంబంధించిన క్లైములు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే జిల్లా అధికారులకు మాత్రం ఈ పథకం అమలు, రద్దు విషయంలో ఎలాంటి «అధికారిక సమాచారం అందలేదని అంటున్నారు. పైసలిస్తలేరు.. అభయహస్తం పైసలు ఇస్తలేరు. 60 సంవత్సరాలు నిండిన మహిళలకు అండగా ఉండాలని వైఎస్ 2009 సంవత్సరంలో చేపట్టిన అభయహస్తం పథకాన్ని ఇచ్చిండ్లు.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసింది. గతంలో నెలకోసారి తప్పకుండా క్రమం తప్పకుండా అభయహస్తం పథకం ద్వారా పెన్షన్ మంజూరయ్యేది. ఇప్పుడు ఆరునెలలకోసారి కూడా రాట్లేదు. అధికారులు, ప్రభుత్వం జర పట్టించుకోవాలె. పింఛన్ అందించాలి. – కొయ్యడ మల్లికాంబ, పరకాల -
ఏదీ అభయం
మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్ల కోసం నిధులు కేటాయిస్తున్నా అభయహస్తం ప థకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తోం ది. 2017 ఫిబ్రవరి వరకు అభయహస్తం పింఛన్ల కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వం 20 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో లబ్ధిదారులు పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. మహిళల కోసం వైఎస్సార్ ప్రవేశ పెట్టిన అద్భుత పథకం... మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి 55 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత ప్రతి నెలా రూ.500 మొదలుకొని ఎక్కువ మొత్తం పింఛన్ అందించే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన అద్భుత పథకం అభయహస్తం. అభయహస్తం పథకం కింద చేరిన మహిళలు వారి వయస్సు ప్రకారం సభ్యత్వం కింద రూ.500 నుంచి రూ. 3,600 వరకు జమ చేశారు. ఈ నిధులకు ప్ర భుత్వం కూడా కొన్ని నిధులను జమ చేసింది. జీవిత బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అభయహస్తం పథకం లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్ లభించేలా అప్పటి ప్రభు త్వం చర్యలు తీసుకుంది. అభయహస్తం పథకం కింద లబ్ధిదారులు జమ చేసిన మొత్తానికి వచ్చే వడ్డీకి కొంత నిధులను ప్రభుత్వం జత చేసి విడుదల చేస్తే లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్ అందించవచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అభయహస్తం పింఛన్ లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెంటికి చెడ్డ్డ రేవడిలా .. అభయహస్తం లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అభయహస్తం పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న బీడీ భృతికి కాని, ఒంటరి మహిళల పింఛన్లకు కాని అర్హత సాధించలేక పోతున్నారు. అయితే కనీసం ప్రతినెలా అభయహస్తం పింఛన్‌ను మంజూరు చేసినా సరిపోతుందని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. బకాయిలు రూ.13.50 కోట్లు... ఉమ్మడి జిల్లాలో అభయహస్తం పింఛన్ లబ్ధి దారులు 13,506 మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 8,879 మంది, కామారెడ్డి జిల్లాలో 4,627 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కో పింఛన్ లబ్ధిదారుకు రూ.10 వేల చొప్పున ఉమ్మడి జిల్లాలోని లబ్ధిదారులకు రూ.13 కోట్ల, 50 లక్షల, 60 వేల బకాయిని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. -
అందరికీ ‘అభయం’
ఆదిలాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లోని సభ్యులకు భరోసా కల్పించే అభయహస్తం పథకం ఇక పూర్తిగా మారనుంది. సభ్యులు, వారి భర్తలకు సైతం బీమా కల్పించేలా పథకంలో మార్పులు చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సైతం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమలులోకి రానున్నట్లు సమాచారం. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందిస్తున్న అభయహస్తం పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సభ్యులు తమ వాటాగా చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోంటోంది. ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగి ఇచ్చేయాలని భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బీమా సౌకర్యం, వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009లో ‘అభయహస్తం’ పథకం ప్రారంభించారు. 18నుంచి 60ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం కింద రూ.500 పింఛన్ చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 39,672 ఉండగా, 4,24,380 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 7,352 మంది అభయ హస్తం పింఛన్‌దారులు ఉండగా, 1,46,451 మంది మాత్రమే ఈ పథకంలో చేరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేస్తుండడంతో సంఘాల్లోని మొత్తం సభ్యులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. సభ్యులుగా ఉన్న వారి భర్తలకు కూడా బీమా పథకం వర్తించనుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీమా వర్తించే వారి సంఖ్య 8.50 లక్షలకు చేరనుంది. పథకంలో పూర్తిస్థాయిలో మార్పులు చేయనుండడంతో సభ్యులకు మరింత లాభం చేకూరనుంది. బీమా ఉచితమే.. ఈ పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. పథకంలో సభ్యులు బీమా కింద ఏటా రూ. 360, పింఛన్‌దారులు రూ. 356 చెల్లిస్తున్నారు. వీరు చెల్లించిన వాటికి అంతే మొత్తంలో ప్రభు త్వం తన వాటా చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం కొత్త మా ర్పులు చేయడంతో ఈ పథకంలో ఇప్పటి వరకు బీమా సొమ్ము కడుతున్న వారి వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో పాటు ఇప్పటి వరకు సభ్యులు చెల్లించిన బీమా మొత్తాన్ని వారికి తిరిగి ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 13 నెలలుగా అందని పింఛన్.. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అండగా నిలిచేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ ‘ఇందిరా అభయహస్తం’ పథకానికి 2009లో శ్రీకారం చుట్టారు. స్వయం సహాయ సంఘాల్లో సభ్యులై ఉండి, 60 ఏళ్లు నిండిన వృద్దులకు ఈ పథకం వర్తింపజేశారు. గతంలో సామాజిక పింఛన్ రూ.200 ఇస్తే.. అదే సమయంలో అభయహస్తం పింఛన్ రూ.500 ఇచ్చారు. ఒకప్పుడు నెలనెలా వృద్ధులకు ఆసరాగా నిలిచిన ఈ పింఛన్ ప్రస్తుతం పాలకుల తీరుతో పండుటాకులకు భరోసా ఇవ్వలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 7,352 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.500 చొప్పున 2017 జనవరి నుంచి పింఛన్ రావాల్సి ఉంది. నాలుగు జిల్లాల పరిధిలోని లబ్ధిదారులకు రూ. 4.77 కోట్లు రావాల్సి ఉంది. పింఛన్ డబ్బు అవసరానికి అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు. -
‘అభయ హస్తం’ ఇక ఉచితం!
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లోని సభ్యులకు భరోసా కల్పించే అభయ హస్తం పథకం పూర్తిగా మారనుంది. సభ్యులకు, వారి భర్తలకు సైతం బీమా కల్పించేలా పథకంలో మార్పులు చేశారు. రాష్ట్రంలో 78 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త విధానంలో పథకాన్ని అమలు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త తరహా అభయ హస్తం పథకం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందిస్తున్న అభయ హస్తం పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంఘాల్లోని సభ్యులు తమ వాటాగా చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే చెల్లించిన వారి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని భావిస్తోంది. లబ్ధిదారులకు అందించే ప్రయోజనాలను పెంచుతోంది. రాష్ట్రంలో మొత్తం 4.26 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 44.42 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం 20.15 లక్షల మంది మాత్రమే అభయ హస్తం పథకంలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులతో సంఘా ల్లోని మొత్తం సభ్యులు అభయ హస్తం పథకం పరిధిలోకి వస్తారు. సభ్యులుగా ఉన్న వారి భర్తకు కూడా బీమా పథకం వర్తించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీమా వర్తించే వారి సంఖ్య 78 లక్షలకు చేరనుంది. వైఎస్ హయాంలో ప్రారంభం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బీమా సౌకర్యం, వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారు. 18 నుంచి 60 ఏళ్లలోపు వారు అభయ హస్తం పథకానికి అర్హులు. రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.356 చెల్లిస్తే.. ప్రభుత్వం తన వంతుగా ఇంతే మొత్తాన్ని చెల్లిస్తోంది. పథకంలో సభ్యులకు 60 ఏళ్లు దాటిన తర్వాత కనీసం రూ.500 తగ్గకుండా పింఛను వస్తుంది. తెలంగాణ ఏర్పడిన రోజు వరకు రాష్ట్రంలో 2,13,852 అభయ హస్తం పింఛనుదారులు ఉన్నారు. అనంతరం వీరిలో 1,16,848 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారుల జాబితాలో చేరారు. మిగతా 97,004 మంది అభయ హస్తం పింఛను పొందుతున్నారు. అభయ హస్తం పింఛను నెలకు రూ.500 మాత్రమే ఉండగా.. అదే ఆసరా వృద్ధాప్య పింఛను నెలకు రూ.వెయ్యి అందుతోంది. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆసరా పింఛను ఇవ్వాలనే నిబంధన ఉంది. దీంతో వయస్సు పరంగా అర్హత ఉన్నా కుటుంబంలో మరొకరు ఆసరా లబ్ధిదారుగా ఉండటంతో 89,356 మందికి అభయ హస్తం పథకం కింద రూ.500 మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు అభయ హస్తం పథకంలో చేరిన వారు ప్రతి రోజు రూపాయి చెల్లించడంపైనా మహిళల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పథకం మొత్తాన్ని కొత్తగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
‘అభయ’మేదీ..?
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నత ఆశయంతో ప్రారంభించి అమలు చేసిన అభయహస్తం పింఛన్ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో డబ్బులు చెల్లించి సభ్యులుగా చేరిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఆందోళన చెందుతున్నారు. సంగెం(పరకాల): అభయహస్తం పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో పింఛన్లు ఇచ్చేవారు. 60 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు ఆదాయం, భద్రత కల్పించడానికి నెలకు రూ.500 పింఛన్ చెల్లించాలి. సభ్యుల వయసునుబట్టి బీమా చేయించుకున్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాధారణ పింఛన్ రూ.200లు ఉంటే అభయహస్తం పింఛన్ రూ.500లు ఉండేది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున అభయహస్తం పింఛన్ పథకం కింద డబ్బులు చెల్లించారు. జిల్లాలో 6046 మంది మహిళలు వయసును బట్టి ప్రతి ఏడాది రూ.400 నుంచి రూ.1200ల వరకు బీమా ప్రీమియం నాలుగేళ్లు చెల్లించారు. 2015 నుంచి రెన్యూవల్ తీసుకోకపోగా కొత్త వారిని సభ్యులుగా చేర్చుకోవడం లేదు. నిలిచిన పింఛన్లు.. అభయహస్తం పథకం కింద జిల్లాలో 96,427 మంది డబ్బులు చెల్లించగా వారిలో 60 ఏళ్లు నిండిన 6,046 మంది పెన్షన్‌కు అర్హత పొందారు. మొదట్లో నెలకు రూ.500ల చొప్పున పింఛన్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ప్రతి నెలా 5వ తేదీ లోపు పింఛన్ అందేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అభయహస్తం పింఛన్లు సక్రమంగా అందకపోవడం.. ఆసరా పింఛన్ రూ.1000 ఇస్తుండడంతో కొంత మంది ఆసరా పథకంలోకి మారారు. గత ఏడాది మే నెల నాటికి 60 ఏళ్లు నిండిన మరో 1000 మందికి పైగా మహిళలు నెలకు రూ.500ల పింఛన్ పొందడానికి అర్హత సాధించి ఎదురుచూస్తున్నారు. అభయహస్తం పింఛన్లు సక్రమంగా అందడం లేదని మహిళ సంఘాల సభ్యులు ఆందోళన దిగడంతో 2016 సెప్టెంబర్ వరకు పంపిణీ చేశారు. అక్టోబర్ నుంచి 2017 నవంబర్ వరకు పాత వారికి అభయహస్తం పింఛన్లు రావాల్సి ఉంది. నిలిచిన ఉపకార వేతనాలు విద్యార్థులు మధ్యలో చదువు ఆపివేయకుండా.. ఉన్నత విద్య అభ్యసించేందకు పోత్సాహకంగా అందించే ఉపకార వేతనాలు సైతం నిలిపివేశారు. అభయహస్తం బీమా చెల్లించిన మహిళలకు ఇద్దరు పిల్లలకు(9, 10 తరగతులు), ఇంటర్మీడియట్, ఐటీఐ చదువుతున్న వారికి ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకారవేతనం అందించేవారు. అది కూడా మూడున్నరేళ్లుగా నిలిచిపోయింది. పథకంపై స్పష్టత కరువు. అభయహస్తం పింఛన్ పథకం విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. పింఛన్ ఇవ్వకపోయినా తాము చెల్లించిన బీమా ప్రీమియం తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరిగితే రాష్ట్ర ప్రభుత్వం పథకం కొనసాగింపు, పింఛన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. ఎంతో ఆశగా కట్టాం.. అభయహస్తం బీమా పథకంలో చేరి డబ్బులు చెల్లిస్తే వృద్ధాప్యంలో పింఛన్ వస్తుందని అధికారులు చెప్పడంతో ఆశతో అప్పులు చేసి ప్రీమియం కట్టాం. నాకు 2015 మే నెల నుంచి పెన్షన్ రావాల్సి ఉంది. కొత్తవారికి పింఛన్ రావడం లేదు. రెన్యూవల్స్ తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఎందుకు ఆపిందో తెలవడం లేదు. – కుంటపల్లి నీలమ్మ, సంగెం 4 నెలల పింఛన్ అకౌంట్లల్లో వేశాం. అభయహస్తం పింఛన్లకు సంబంధించి గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది జనవరి డబ్బులు మంజూరయ్యాయి. వాటిని లబ్ధిదారుల అకౌంట్లలో వేశాం. మిగిలినవి రాగానే వేస్తాం. అభయహస్తం పథకం నిలిచిపోయింది. అందుకే రెన్యూవల్స్ తీసుకోవడం లేదు. ప్రభుత్వం నిర్ణయంపై రెన్యూవల్స్, పథకం అమలు ఆధారపడి ఉంది. – డీఆర్డీఓ, శేఖర్‌రెడ్డి -
60 లక్షల మంది మహిళలకు అభయహస్తం!
- 50 లక్షల మంది భర్తలకూ ప్రమాద బీమా - పథకంలో మార్పులు చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ - సీఎం ఆమోదానికి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో దివం గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (2009లో) ప్రవేశపెట్టిన ‘అభయ హస్తం’ పథకాన్ని ఇకపైనా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో ప్రస్తుతం 24 లక్షల మంది మహి ళలు సభ్యులుగా ఉండగా, ఎస్‌హెచ్‌జీల్లోని మొత్తం 60 లక్షల మంది మహిళలకూ పథకాన్ని వర్తింప జేసేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మార్పులు చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళలతో పాటు వారి భర్తలకు (సుమారు 50 లక్షల మంది) కూడా అభయహస్తం పథకం కింద వర్తించే ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రస్తుత అభయహస్తం నిబంధనలతో పోల్చితే సభ్యురాలికి కొత్త ప్రతిపాదనల మేరకు సహజ మరణం కేటగిరీలో ఇంతకు మునుపు కంటే ఏడు రెట్లు, ప్రమాదం కారణంగా మర ణిస్తే మూడు రెట్లు అధికంగా ఇన్సూరెన్స్ కవరేజీ లభించనుంది. ప్రస్తుతం సభ్యురాలు మరణించాకే కార్పస్ ఫండ్ సొమ్ము కుటుంబ సభ్యులకు దక్కనుండగా, తాజా ప్రతి పాదనలతో 65 ఏళ్లు దాటిన మహిళలు బతికి ఉండగానే ఇంతకు మునుపు కంటే ఎక్కువ మొత్తం కార్పస్ ఫండ్‌ను స్వయంగా అందుకునే వెసులు బాటు కల్పించారు. ప్రస్తుతం అభయ హస్తం పథకం కింద నెలకు రూ. 500 పింఛన్ మాత్రమే అందుతుండగా, కొత్త ప్రతిపాదనల్లో 65 ఏళ్లు దాటిన మహిళ లకు ఆసరా పథకం కింద నెలకు రూ. 1,000 పింఛన్ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతిపాదిత అభయహస్తం పథకం అమలుకు రానున్న ఐదు సంవ త్సరాల్లో ఆర్థికపరమైన ప్రణాళికను కూడా ప్రభుత్వానికి పంపారు. అభయహస్తం పథకంలో మార్పులకు ఆమోదం నిమిత్తం సదరు ప్రతిపాదనలను సెర్ప్ అధికారులు ముఖ్యమంత్రికి పంపినట్లు తెలిసింది. సభ్యురాలు/జీవిత భాగస్వామికి ప్రతిపాదిత బీమా కవరేజీ (రూ.లక్షల్లో) సభ్యురాలు ప్రస్తుతం ప్రతిపాదిత సహజ మరణం 0.30 2.30 ప్రమాద మరణం 0.75 4.75 శాశ్వత వైకల్యం 0.75 2.75 పాక్షిక వైకల్యం 0.37 1.37 జీవిత భాగస్వామి.. ప్రమాద మరణం లేదు 2.00 శాశ్వత వైకల్యం లేదు 2.00 పాక్షిక వైకల్యం లేదు 1.00 -
కోటి మందికి ‘అభయ హస్తం’
► ఎస్‌హెచ్‌జీ మహిళలతో పాటు వారి భర్తలకూ వర్తింపు ► కొత్త ‘అభయ హస్తం’పై కొలిక్కి వచ్చిన కసరత్తు.. ► సీఎం ఆమోదమే తరువాయి సాక్షి, హైదరాబాద్: మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి (2009లో) ప్రవేశపెట్టిన ‘అభయ హస్తం’పథకాన్ని ఇకపైనా కొనసాగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అయితే.. మరింతమందిని ఈ పథకం పరిధిలోకి తీసుకు రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని మార్పులను సూచించింది. గత 3 నెలలుగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొత్త మోడల్ రూపకల్పనపై చేస్తున్న కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. దాదాపు రూ. కోటీ పది లక్షలమందికి అభయ హస్తం పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా మరో రూ.160 కోట్ల భారం పడనుందని అంచనా. కొత్త మోడల్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, ఫైలు ఆర్థిక శాఖకు వెళ్లింది. ఆపై ముఖ్యమంత్రి ఆమోదించిన వెంటనే కొత్త మోడల్ ‘అభయహస్తం’ను అమల్లోకి తీసుకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. అభయ హస్తం తాజా మోడల్ ఇలా..! ► స్వయం సహాయక గ్రూపులోని పేద మహిళలకు అభయ హస్తం పథకం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరనుంది. 18 ఏళ్లు పైబడిన మహిళలు ఈ పథకంలో సభ్యురాలిగా చేరవచ్చు. గతంలో 59 ఏళ్లున్న గరిష్ట వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచనున్నారు. ► ప్రస్తుతం అభయహస్తం పథకంలో 20.15 లక్షల మంది సభ్యత్వం పొందగా.. కొత్త మోడల్లో 60 లక్షల మంది మహిళలకు సభ్యత్వం ఇవ్వనున్నారు. వారికి, వారి జీవిత భాగస్వాములు సుమారు 50 లక్షలమందికి బీమా సదుపాయం కల్పించనున్నారు. ► ఈ పథకంలో చేరిన సభ్యులు రోజుకు రూపాయి చొప్పున(ఏడాదికి రూ.365) కార్పస్ ఫండ్ చెల్లిస్తే గతంలో రూ.3లక్షల ప్రమాదబీమా, రూ.75వేల జీవిత బీమా లభించేది. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం రూ.12తో బీమా సదుపాయం లభిస్తోంది. ఎస్హెజ్జీ సభ్యురాలితో పాటు ఆమె జీవిత భాగస్వామికీ ఈ ప్రీమియంను సర్కారే చెల్లించనుంది. ► గతంలో సభ్యురాలిది సహజ మరణమైతే ప్రమాద బీమా మొత్తం రూ.30 వేలు కాగా.. ప్రస్తుతం అది రూ.2.30 లక్షలు కానుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో రూ.75వేల బీమా ఉండగా.. ఇప్పుడు 4.75 లక్షలు చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యం జరిగితే రూ.1.37 లక్షలు, శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.2.75 లక్షలు చెల్లిస్తారు. ► సాధారణ బీమా ప్రయోజనం 60 ఏళ్లదాకా, ప్రమాద బీమా సదుపాయం 70 ఏళ్ల వరకు వర్తిస్తుంది. జీవిత భాగస్వామి చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష బీమా మొత్తం లభిస్తుంది. ► గతంలో 50 ఏళ్ల వరకే కార్పస్ ఫండ్ కంట్రిబ్యూషన్ తీసుకొని 60 ఏళ్ల నుంచి జీవితాంతం అభయహస్తం పెన్షన్ (రూ.500)ను కొనసాగించేవారు. అయితే.. ప్రస్తుతం 65 ఏళ్ల వరకు కార్పస్ ఫండ్ కంట్రిబ్యూషన్ స్వీకరించి, ఆపై అర్హులైన వారికి ఆసరా పింఛన్‌ను వర్తింప చేయనున్నారు. ► కొత్త మోడల్ ద్వారా కార్పస్ ఫండ్‌కు సభ్యురాలు చెల్లించిన మొత్తంతో పాటు ప్రభుత్వం కూడా దాదాపు అంతే మొత్తం జమ చేయనుంది. 65 ఏళ్ల తర్వాత జీవించి ఉన్న సభ్యురాలికి ఈ మొత్తాన్ని ఎల్ఐసీ అందించే వడ్డీతో సహా చెల్లించనున్నారు. గతంలో సభ్యురాలు మరణిస్తేనే నామినీకి ఆ మొత్తాన్ని అందజేసేవారు. ► గతంలోలానే సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1,200 చొప్పున నాలుగేళ్ల పాటు (9 నుంచి 12వ తరగతి వరకు) ఎల్ఐసీ నుంచి ఉపకారవేతనం ఇకపైనా లభించనుంది. -
‘అభయహస్తం’కు రూ.35 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: అభయహస్తం పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వాస్తవానికి ఈ పథకాన్ని కొనసాగించాలా, వద్దా అనే సంశయంతో గత జనవరి నుంచి లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 2,19,483 మంది లబ్ధిదారులు ఉండగా, ఇందులో 1,21,453 మందిని ఆసరా పథకం పరిధిలోకి గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తీసుకు వచ్చారు. మిగిలిన 98,030 మందికి నెలకు రూ.500 చొప్పున సుమారు రూ.5కోట్ల మేర విడుదల చేయాల్సి ఉంది. గత 12 నెలలుగా బకాయిలను విడుదల చేయని సర్కారు, తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తడంతో శుక్రవారం రూ.35 కోట్లను విడుదల చేసింది. అభయహస్తం పింఛన్లతో పాటు లబ్ధిదారుల కుటుంబాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. మొత్తంగా రూ.70 కోట్ల బకాయిలకుగాను కొంతైనా విడుదల చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. -
‘అభయ’మివ్వరేం..?
తొమ్మిది నెలలుగా అందని అభయహస్తం పింఛన్లు ఉమ్మడి జిల్లాలోనే రూ.89.19 కోట్ల బకాయిలు 19,823 మంది లబ్ధిదారుల నిరీక్షణ అభయహస్తం అమలుపై అనుమానాలు మలిసంధ్యలో చేదోడుగా ఉంటుందనుకున్న అభయహస్తం పింఛన్లు అందకుండా పోతున్నాయి. తొమ్మిది నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో పింఛన్ డబ్బులపైనే ఆధారపడ్డ అవ్వలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముకరంపుర : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 41,660 మంది అభయహస్తం పింఛన్‌దారులున్నారు. 2009లో ప్రారంభమైన ఈ పథకం కింద 60 ఏళ్లు దాటిన వారికి నెలకు కనీసం రూ.500 పింఛన్ వస్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు సంవత్సరానికి రూ.365 చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం చెల్లించేది. ఇలా పదేళ్లపాటు చెల్లించినట్లయితే రూ.3650 అవుతుంది. అంతే మొత్తంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత లబ్ధిదారులకు కనీసం రూ.500 పింఛన్ వారు మరణించే వరకు వస్తుంది. టీఆర్ఎస్ సర్కారు ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన ఆసరా పథకంలో రూ.వెయ్యి పింఛన్ వస్తుండడంతో అభయస్తంలోని వృద్ధులు, వితంతువుల్లో చాలా మంది దానికి దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 41,660 మంది అభయహస్తం పింఛన్‌దారులుండగా అందులో నుంచి 20,672 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. కొంతమంది మరణించారు. మిగిలిన 19,823 మందిని అభయహస్తం పింఛన్ లబ్ధిదారులుగానే ఉంచారు. ఆసరాకు మళ్లించిన వారి డాటా బేస్ కూడా పూర్తి చేసి ఊరించారు. ఆధార్ అనుసంధానం, పరి శీలన పేరిట ఆసరాకు మళ్లించిన వారిని 70 శాతానికి పైగా తిరస్కరించి తొలగించారు. 70 శాతంలో దాదా పు 15 వేల మంది అటు అభయహస్తానికి, ఇటు ఆసరాకు నోచుకోలేదు. ఇక ప్రతీ నెల 19,823 మంది అభయహస్తం లబ్ధిదారులకు రూ.9.91 కోట్ల పింఛన్లు చెల్లించాల్సి ఉంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు రూ. 89.19 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఉమ్మడిగా ఉన్న కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి నూతన జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో ఆయా జిల్లాల వారీగా పించన్లు విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రద్దు చేసే ఆలోచనలో సర్కారు..! ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ఎత్తివేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ద్వారా తీసుకువచ్చిన ఈ పథకంపై సర్కారు నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. లబ్ధిదారులు మాత్రం అభయహస్తం పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. చాలా మందికి అర్హతలున్నప్పటికీ అభయహస్తం వస్తుందన్న కారణంతో ఆసరా పింఛన్లు పొందలేకపోతున్నారు. పథకాన్ని రద్దు చేస్తే.. అర్హతలున్న వారికి ఆసరా పింఛన్లు అందించాలని వేడుకుంటున్నారు. -
భరోసా ఇవ్వని ‘అభయహస్తం’
సాక్షి, హైదరాబాద్: పేరుకే అభయహస్తం. కానీ, అది ఎక్కడా కానరావడంలేదు. ఆ పథకం నిధుల విడుదల ఆగిపోయింది. దీంతో 8 నెలలుగా లబ్ధిదారులకు సాయం అందడంలేదు. ప్రభుత్వ వైఖరి మూలంగా ఆ పథకానికే భరోసా లేకుండా పోయింది. 1.08 లక్షలమందికి రూ.65 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అభయ హస్తం పథకాన్ని ఎత్తివేయాలని తొలుత భావించిన సర్కారు తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ప్రస్తుతానికి 30 శాతం మంది మహిళలకే ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతోంది. దాన్ని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలందరికీ వర్తింపజేయాలని, వారి జీవిత భాగస్వాములకు కూడా బీమా ప్రయోజనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అభయహస్తం పథకంలో మార్పులు, చేర్పులు చేయాలని ఆదేశించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిధుల విడుదల ఆగిపోయిందని అధికారులు అంటున్నారు. అభయహస్తం ఇలా... మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ‘అభయహస్తం’ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వయం సహాయక గ్రూపులోని పేద మహిళలకు ఈ పథ కం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరనుంది. పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి మహిళ ఈ పథకంలో సభ్యురాలిగా చేరేందుకు అర్హత కల్పించారు. రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే రూ.75 వేల జీవిత బీమా లభిస్తుంది. సభ్యురాలు చెల్లించినదానికి సమానంగా ప్రభుత్వం కూడా జీవిత బీమా సంస్థకు ప్రీమియం చెల్లిస్తుంది. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున నాలుగేళ్లపాటు( 9 నుంచి 12వ తరగతి వరకు) ఎల్ఐసీ నుంచి ఉపకారవేతనం కూడా లభిస్తుంది. సభ్యులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.500 చొప్పున పింఛను కూడా వస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణించినా, శాశ్వత అంగవైక్యలం కలిగినా రూ.75 వేల బీమా అందుతుంది. సహజ మరణానికి కూడా రూ.30 వేల బీమా బాధిత కుటుంబానికి లభిస్తుంది. -
అభయహస్తం ఏది?
ఏడు నెలలుగా అందని పింఛన్ ఆందోళనలో లబ్ధిదారులు కోనరావుపేట : స్వశక్తి మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ‘అభయహస్తం’ పథకానికి నిధులు కరువయ్యాయి. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ పథకం ద్వారా అందించే పింఛన్లు ఏడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్ అభయహస్తం లబ్ధిదారులు జిల్లాలో 44,219 మంది ఉండగా కోనరావుపేట మండలంలో 5,538 మంది చేరారు. ఇందులో 812 మంది 60 ఏళ్లు పైబడిన పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.500 ల పింఛన్ అందిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరికి సంబంధించిన పింఛన్ మాత్రమే ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ అందలేదు. రోజుకు రూ.1 స్వయం సహాయక సంఘాల్లోని నిరుపేద మహిళలకు వైఎస్సార్ అభయహస్తం పథకం ద్వారా పలు రకాలుగా లబ్ధి చేకూరుతోంది. 18–59 ఏళ్లలోపు మహిళలు ఈ పథకంలో చేరవచ్చు. వీరి రోజుకు రూ.1 చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం నుంచి మరో రూ.365 జమ చేసి జనశ్రీ భీమా యోజన పథకంలో లబ్ధిదారులుగా చేరుస్తారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 చెల్లిస్తారు. సభ్యురాలి ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1200ల చొప్పున ఉపకారవేతనాలు (9 నుంచి 12వ తరగతి వరకు) అందజేస్తారు. దురదృష్టవశాత్తు వారు మృతి చెందితే బీమా కంపెనీ ద్వారా రూ.30వేలు, ప్రమాదవశాత్తు మర ణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం పొందితే రూ.37,500 చొప్పున పరిహారం అందిస్తారు. ఇబ్బందిగా మారిన ‘ఆసరా’ పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ అభయహస్తం లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది. రూ.3,800ల కంట్రిబ్యూషన్ కట్టిన మహిళలకు 60 ఏళ్లు నిండగానే రూ.500 పింఛన్ పొందుతుండగా, 65 ఏళ్లు నిండిన వారు ఎలాంటి డబ్బులు కట్టకుండానే ఆసరా పింఛన్ ద్వారా రూ.వెయ్యి ప్రభుత్వం ఇస్తుండడంతో వీరు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పైగా ఆసరా పింఛన్ ప్రతి నెలా ఠంచన్‌గా వస్తుండడం, అభయహస్తం పింఛన్ మూడు, ఆరు నెలలకోసారి వస్తుండడం ఇబ్బందిగా మారుతోంది. తమకు అందించే పింఛన్‌ను కూడా రూ.వెయ్యికి పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఏడు నెలలుగా అస్తలేదు నేను అభయహస్తం పథకంలో లబ్ధిదారురాలిగా చేరాను. మాకెప్పుడు కూడా ప్రతినెలా పింఛన్ రాలేదు. గతంలో మూడు నెలలకోసారి ఇచ్చేవారు. ఇప్పుడు ఆరు నెలలు గడుస్తున్నా పింఛన్ రాలేదు. మాకిచ్చే పింఛన్‌ను కూడా పెంచితే బాగుంటుంది. – అండెం లచ్చవ్వ, కనగర్తి ఎదురుచూసుడే అభయహస్తం ద్వారా మాకు ఇచ్చేదే ఐదొందలు. వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నం. ఈ డబ్బులు మందులకూ సరిపోతలేవు. ఏడు నెలలుగా రాకపోతే ఎట్లా బతికేది. మా పింఛన్లపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. –ధీటి భూదవ్వ, వట్టిమల్ల -
ఈ పథకాలకు ఏమైంది?
► అభయహస్తం, ఆమ్ఆద్మీ అమలులో అంతులేని నిర్లక్ష్యం ► రెండింటిలోనూ జిల్లా లాస్ట్ ► అవగాహన లోపంతోనే సమస్య ప్రచార లేమి.. అవగాహన లోపం.. ఆపై అధికారుల బాధ్యతారాహిత్యం.. వెరసి అభయహస్తం, ఆమ్ఆద్మీ పథకాలు అటకెక్కాయి. ఫలితంగా కొందరు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా చివరిస్థానంలో ఉంది. కోవూరు: జిల్లాలో అభయహస్తం పథకంలో 1,36,194 మంది ఉన్నారు. వారిలో 62,353 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. ఈ పథకం సభ్యులు సాధారణంగా మృతి చెందితే రూ.30 వేలు, పూర్తి అంగవైకల్యం అయితే రూ.37,500, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.70 వేలు అందుతోంది. సభ్యులకు 60 సంవత్సరాలు పైబడితే నెలకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛను పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఆమ్ఆద్మీ విషయానికి వస్తే మొత్తం 1,13,349 మంది సభ్యులున్నారు. వీరిలో 61,835 మంది మాత్రమే రెన్యువల్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందులో 8406 మంది ఆమ్ఆద్మీకి అర్హులు కాదంటూ నిర్ధరించి వాటిని అధికారులు తొలగించారు. ఈ పథకంలో వివి ధ రకాల పనులు చేసే కూలీలతో పాటు బయట వ్యక్తులకు కేవలం రూ.15 చెల్లిస్తే ఈ పథకంలో రెన్యూవల్ చేసుకున్నారు. ప్రభుత్వం వీరి తరఫున మరో రూ.320 జమ చేస్తుంది. సగంమంది మాత్రమే: డీఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యంతోనే రెండు పథకాల అమలు నత్తనడకన సాగుతోంది. పథకాలపై అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. రెన్యువల్ చేయడంలోను సిబ్బంది శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా చివరిస్థానంలో ఉంది. రెన్యువల్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు: అభయహస్తం,ఆమ్ఆద్మీ పథకాల రెన్యువల్ చేయించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం అధికారుల లెక్కల కోసమే చెబుతున్నారు. మే ము కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి.- రమణమ్మ, చెర్లోపాళెం సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉంది: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్ఆద్మీ, అభయహస్తం పథకాలను రెన్యువల్ చేయడంలో నెల్లూరు జిల్లా చివరిస్థానంలో ఉండటం వాస్తవమే. ఇందుకు సిబ్బంది నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది సిబ్బందికి మెమోలు జారీ చేసాం. కొందరు సకాలంలో పనిచేసిన మరికొందరు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. అభయహస్తం, ఆమ్ఆద్మీలకు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పడం వాస్తవమే. -మురళీ, ఇన్సూరెన్స్ డీపీఎం -
‘పథకం’ ప్రకారం కసరత్తు
♦ అభయహస్తం ఉంచాలా.. వద్దా? ♦ డ్వామా, డీఆర్డీఏలను ఒక్కటి చేద్దామా.. ♦ పావలా వడ్డీ.. రుణ పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు ♦ బడ్జెట్ తయారీపై ముగిసిన ప్రణాళికా విభాగం కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఆయా శాఖల్లో అమలవుతున్న పథకాల్లో కొన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు రాష్ర్ట ప్రణాళిక సంఘం కసరత్తు చేస్తోంది. కొన్నింటిని రద్దు చేయాలని భావిస్తోంది. అభయహస్తం ఉంచాలా.. వద్దా.. అని ఆలోచిస్తోంది. ఈ పథకాన్ని ఆసరాలో విలీనం చేసే విషయంపైనా యోచిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)ను ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చే వీలుందా అని పరిశీలిస్తోంది. పొలంబడి పథకం రద్దు చేయాలని, తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు పట్టు పరిశ్రమలకు అనుకూలించనందున ఆ పథకాలన్నీ తొలగించాలని, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ పథకాలన్నీ ఒకే పథకం కిందికి తీసుకురావాలని, విత్తనోత్పత్తి పథకం, సీడ్ ఫామ్స్ పథకం, సబ్సిడీపై విత్తన సరఫరా పథకం, సబ్సిడీ సీడ్ ప్రొడక్ట్స్ పథకాలన్నీ ఒక్కటిగానే పరిగణించాలని, ఈ తరహాలో వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న పథకాల్లో సగం పద్దులు తొలగించాలని భావిస్తోంది. ఇదే తీరుగా శాఖల వారీగా జరిగిన బడ్జెట్ తయారీ సమీక్షలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం నివేదికను సిద్ధం చేస్తోంది. 260 పద్దుల విలీనం: ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్లో వివిధ పథకాలకు సంబంధించి 839 పద్దులున్నాయి. వీటిలో 260 పథకాలను మిగతావాటిలో విలీనం చేసేందుకు వీలుందని ఆర్థిక శాఖ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ జాబితాలను అన్ని శాఖలకు పంపించింది. వీటి ఆధారంగానే రాష్ట్ర ప్రణాళిక సంఘం వివిధ శాఖలతో 4 రోజులపాటు సమీక్ష నిర్వహించింది. గతానికి భిన్నంగా శాఖలవారీగా సమీక్షలు నిర్వహించి పథకాల విలీన ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రణాళిక సంఘం నివేదికను తయారు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదికను సీఎస్ రాజీవ్‌శర్మకు సమర్పించి.. తర్వాత సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపిస్తారు. వాయిదా పడ్డ జిల్లా అభివృద్ధి కార్డుల తయారీ ప్రక్రియ బడ్జెట్ తర్వాతే చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
‘స్మార్ట్’గా ఫిర్యాదు చేయవచ్చు..
పోలీసు ‘అభయం’ యాప్‌కు ఆధునిక హంగులు ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లో ఘటనా స్థలానికి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: పోలీసు సహాయం కావాల్సినా, ఫిర్యాదు చేయాలన్నా ఇకపై పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ కోణంలో ఇప్పటికే ‘ఐ క్లిక్’ పేరుతో ఎఫ్ఐఆర్ కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్న పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం మహిళల భద్రత కోసం విశాఖపట్నంలో మాత్రమే అమలులో ఉన్న ‘అభయం’ మొబైల్ యాప్‌కు ఆధునిక హంగులు అద్దుతోంది. అందరికీ ఉపయుక్తంగా ఉండేలా రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి పోలీసు సాంకేతిక సేవల విభాగం సన్నాహాలు చేస్తోంది. ప్లేస్టోర్‌లో లభించే ఈ అప్లికేషన్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని, నిర్దేశించిన బటన్ నొక్కితే ఆ ఫిర్యాదు సంబంధిత పోలీసు స్టేషన్‌కు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంటర్నెట్ సౌకర్యంతో సంబంధం లేకుండా పని చేసేలా ఈ యాప్ ఉండాలని అధికారులు భావిస్తున్నారు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్), గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) పరిజ్ఞానాల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ బాధితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని గుర్తించి కంట్రోల్ రూమ్ ద్వారా సంబంధిత స్టేషన్‌కు చేరవేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం గరిష్టంగా ఐదు నిమిషాల్లో పూర్తయ్యే విధంగా యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రాజమండ్రి అర్బన్ పోలీసు జిల్లాలో అమలులోకి తెచ్చిన ‘రక్షిత’, విశాఖపట్నంలో అందుబాటులోకి తీసుకువచ్చిన ‘అభయం’ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ‘అభయం’ యాప్‌ను అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దీనిపై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ కార్యాలయం పోలీసు సాంకేతిక సేవల విభాగాన్ని ఆదేశించింది. బాధితులకు సమస్య వచ్చినప్పుడు పోలీసు స్పందించే ‘రెస్పాన్స్ టైమ్’ సాధ్యమైనంత తక్కువ చేయడం కోసం ఈ తరహా వ్యవస్థ అభివృద్ధి చేస్తున్నామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. -
మహిళలకేదీ ‘అభయం’
అనంతపురం సెంట్రల్ : నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అభయహస్తం పథకాన్ని నీరుగారుస్తున్నారు. పొమ్మనలేక పొగ పెట్టినట్లు ఈ పథకాన్ని నిబంధనల సుడిగుండంలోకి నెట్టారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పథకం మూలాలపైనే దెబ్బ కొట్టింది. ఫలితంగా ఒకే ఏడాది 34874 మంది అభయహస్తం లబ్ధిదారులు పథకం నుంచి వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెలితే... 2009లో ఈ పథకాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇది నిరుపేద మహిళల జీవితాల్లో వెలుగు నింపింది. మహానేత మరణం ఈ పథకానికి శాపంగా మారింది. క్రమేణా పథకం అమలుపై నీలినీ డలు కమ్ముకుంటూ వస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు అభయహస్తం పథకంలోకి చేరేందుకు అర్హులు. ముఖ్యంగా అత్యంత పేదలు(పీఓపీ), ఎస్సీ, ఎస్టీ, మత్యుకారులు, చేనేత కార్మికులు, వితంతువులు, అంగవైకల్యం ఉన్న వారికి అవకాశం కల్పించారు. రూ.365 ప్రీమియం, రూ.20 సేవా రుసుముతో కలిపి మొత్తం రూ.385 చెల్లించి అభయహస్తం పథకంలోకి సభ్యురాలిగా చేరితే ఆ మొత్తానికి ప్రభుత్వం మరో రూ.365 కలిపి బీమా సౌకర్యం కల్పిస్తుంది. పథకం లబ్దిదారురాలి చదుకునే పిల్లలు ఉంటేతొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనం మం జూరవుతుంది. 60 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.500 (అప్పటి వృద్దాప్య, వితంతు పింఛన్ రూ. 200లకు రూ. 300 అదనంగా చెల్లించి) చొప్పున పిం ఛను చెల్లిస్తారు. సహజ మరణం అయితే రూ.30 వే లు, ప్రమాదంలో మృతి చెందితే రూ.70వేలు బీమా సౌకర్యం ఉంటుంది. ఇవి కాక లబ్ధిదారురాలు మృతి చెందిన విషయాన్ని గంటలోపు 08554-278275 సెల్‌కు తెలియజేస్తే అదేరోజే రూ.5 వేలు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం అదనంగా చెల్లిస్తారు. ఇలాం టి మంచి పథకాన్ని నీరుగార్చే నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నా యి. రూ. 200 పింఛన్ వచ్చే రోజుల్లో రూ. 300లు అదనంగా కలుపుకొని మొత్తం రూ. 500 చొప్పున అ భయహస్తం పింఛన్‌దారులకు అందించేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ రూ. 1000లు మంజూరు చేస్తోంది. అభయహస్తం ల బ్ధిదారులు ప్రీమియం చెల్లించినా అదనంగా ఒరిగే ప్ర యోజనమేమీ లేకపోవడంతో మహిళల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. జిల్లాలో 63 మండలాల్లో 1.90,004 మంది లబ్ధిదారులు ఉండగా 1,36,018 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. మిగిలిన 34974 మంది రెన్యువల్ చేసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే మహిళలకు రక్షణ కల్పించే పథకాలపై పాలకులకు ఉన్న చిత్తశుద్ది ఏపాటితో అర్థమవుతోంది. -
అభయహస్తం డిజైన్ మారుస్తాం: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అభయహస్తం లబ్ధిదారులకు ఇకపై ప్రతినెలా పింఛన్లు చెల్లిస్తామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. వాటితోపాటు బకాయిలనూ చెల్లిస్తామన్నారు. అభయహస్తం పథకానికి మార్పులు చేసి, ఏప్రిల్ నుంచి మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వాటర్‌గ్రిడ్, రోడ్లు, హరితహారం, ఉపాధిహామీ, పెన్షన్లు వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.కాగా, కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం వెంకట్రావుపేటలో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. వేసవిలో కరెంటు కోతలు భరించకతప్పదని అన్నారు. విభజనతో తెలంగాణకు విద్యుత్ సరఫరా తగ్గిందని చెప్పారు. -
‘నవ’ వసంతానికి నాంది పలకాలి
కొన్ని గంటల్లో పాత సంవత్సరానికి టాటా చెప్పబోతున్నాం. కొత్త వసంతాన్ని ఆహ్వానించనున్నాం. ఎంతో ఉత్సాహంగా స్వాగత సంబరాలకు సిద్ధవుతున్నాం. కొంగొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నాం. గతించిన సంవత్సరంలో చేసిన తప్పులను మననం చేసుకుంటూ కొత్తఏట వాటిని పునరావృత్తం కాకుండా చూడాలని తలస్తున్నాం. ఆనందంగా నవ వసంతానికి ఆహ్వానం పలకాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం బాగుండాలి.. మన సమాజం బాగుండాలి అనే నినాదంతో ముందుకు సాగాలి. నవోదయాన సంతోషాల హరివిల్లు విరియాలంటే నవ సూత్రాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.. అవేమిటంటే.. - సాక్షి నెట్వర్క్ పొదుపు పాటిద్దాం పొదుపు పాటించడం అలవాటు చేసుకుంటే జీవితాల్లో ప్రగతి సాధించవచ్చు. ఆర్థిక బాధల నుంచి గట్టెక్కవచ్చు. రోజూ కొంత మొత్తాలను దాయడాన్ని చిన్నారులకూ అలవాటు చేయాలి. ఫలితంగా వారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. నేషనల్ బ్యాంకుల్లోనే కాకుండా దగ్గరలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోనూ పొదుపు ఖాతాలు ప్రారంభించవచ్చు. చాలా బ్యాంకులు ప్రస్తుతం పొదుపు పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిల్లో మనకు ఉపకరించేవి ఏవో ఎంచుకోవాలి. జనధన్ పథకం ద్వారా ఉచితంగా బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నారు. రూ. ఐదు వేల రుణం ఇస్తారు. కొన్ని బ్యాంకులు ఖాతాదారులకు బీమా కల్పిస్తున్నాయి. ఆంధ్రాబ్యాంకులో అభయ గోల్డ్, అభయా సేవింగ్స్, అభయ్ జీవన్ వంటి పథకాలతో బీమా వసతి కల్పిస్తున్నారు. {పైవేటు పొదుపు సంస్థలతో అప్రమత్తంగా ఉండాలి. అధిక వడ్డీ ఆశకు లోనుకావద్దు. - ఇ.పెంచలయ్య. ఏజీఎం, ఆంధ్రాబ్యాంకు, రాజమండ్రి మహిళలను గౌరవిద్దాం మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. దీనిని పాటిస్తూ భావి తరాలకూ ఆ స్పృహ కలిగించాలి. ఫలితంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు చెక్ పెట్టవచ్చు. వరకట్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస వంటి అంశాల్లో బలైపోతున్న అబలలకు అండగా నిలవాలి. ఈ చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాలి. జిల్లా కేంద్రంతోపాటు రాజమండ్రి, అమలాపురం, తుని, రావులపాలెం, రామచంద్రపురం వంటి ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్‌పై ప్రస్తుతం నిఘా కొరవడిందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్య, వసతి గృహాలు, వ్యాపార సంస్థల్లో మహిళల రక్షణ కోసం భద్రతా చర్యలు లేవు. ఈ నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈవ్ టీజింగ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఈ చట్టం ప్రకారం.. బాధిత యువతులు వెంటనే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు అందుకున్న ప్రిన్సిపాల్ ఈవ్టీజింగ్నకు పాల్పడిన విద్యార్థిని, యువకుడిపై చర్య తీసుకోవాలి. పోలీసులకూ ఫిర్యాదు చేయాలి. పోలీసులు దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేస్తారు. ఈవ్‌టీజింగ్ నిరూపణ అయితే కనీసం మూడేళ్ల జైలు లేదా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ నాన్ బెయిలబుల్ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. {పతి కళాశాల ఆవరణ, తరగతి గదుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇబ్బందుల్లో ఉన్న యువతులు, మహిళలు 1091కు కాల్ చేయాలి. యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి భవితను నాశనం చేసుకోకూడదు. కఠిన శిక్షలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త! - కృష్ణ ప్రసన్న, డీఎస్పీ ట్రాఫిక్, రాజమండ్రి పరిశుభ్రతపై దృష్టిపెడదాం వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మన జీవితంలో అంతర్భాగం. ఈ రెంటిలో ఏది పాటించకపోయినా నష్టపోయేది మనమే. రోగాలు ప్రబలుతాయి. ఒళ్లు, ఇల్లు గుల్లవుతాయి. అందరూ పరిశుభ్రత పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం కష్టమేమి కాదని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. దీనిపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఇంటి పరిశుభ్రత, వంట సామగ్రి శుభ్రత పాటించాలి. ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దైనందిన జీవితంలో చేసే పనులు క్రమపద్ధతిలో చేయాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. రోజుల తరబడి చెత్తను నిలవ ఉంచకూడదు. - డాక్టర్ మూర్తి, హెల్త్ ఆఫీసర్, రాజమండ్రి యోగా చేద్దాం ఒత్తిళ్లతో కూడిన ప్రస్తుత సమాజంలో అందరికీ యోగా అవసరం. దీనివల్ల ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణ అలవడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రోజుకు ఓ గంటైనా యోగా చేయాలి. యోగాతో ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. - చిట్టూరి చంద్రశేఖర్, యోగా కోచ్, యోగా రత్న అవార్డు గ్రహీత, తాటిపాక ఇంధన పొదుపు చేసేద్దాం ఇంధన వినియోగం ఎక్కువైంది. వనరులు తగ్గిపోయాయి. ఫలితంగా భవిష్యత్తులో కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే అందరూ ఇంధన పొదుపు పాటించాలి. విద్యుత్ వినియోగంపైనా దృష్టిపెట్టాలి. ఎల్ఈడీ, సీఎఫ్ఎల్ లైట్ల వాడకాన్ని అలవర్చుకోవాలి. అవసరం లేకుండా ఫ్యాన్లు, లైట్లు వేయకూడదు. ఇళ్లలో వృథాను అరికట్టండి. {sాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల ఇంజిన్ ఆపేయాలి. దీనివల్ల పెట్రోలు ఆదా అవుతుంది. రోడ్లపై ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా అలా చేస్తే మంచిది. ఎవరికి వారు పెట్రోలు పొదుపు పాటించాలి. తక్కువ దూరం ఉన్నప్పుడు సైకిళ్లపైగానీ, నడక ద్వారా గానీ వెళ్లడం మంచిది. ఇది ఆరోగ్యానికీ శుభసూచిక. వాహనాలను నీడలో పార్క్‌చేస్తే పెట్రోల్ ఆవిరి కాదు. వాహనాల మైలేజ్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి. పొగవస్తుంటే తక్షణం సర్వీసింగ్ చేయించండి. వారానికి ఓ సారి మోటారు వాహనాలకు హాలిడే ప్రకటించండి. సౌర విద్యుత్ వాడకాన్ని పెంచాలి. - ఎన్. గంగాధర్, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్, రాజమండ్రి రోడ్లపై అప్రమత్తత అవసరం రోడ్లపై ప్రయాణించేటప్పుడు అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు వాడేవారు వేగ నియంత్రణ పాటించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఒత్తిడిని అధిగమించాలి. ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకూడదు. {sాఫిక్ నిబంధనలు పాటించాలి. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అధిక లోడు, అతివేగం అనర్థదాయకం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. నిర్దేశిత ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలి. - ఎ. మోహన్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, కాకినాడ మద్యం మానేద్దాం మద్యం మహమ్మారికి ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి. వికృత నేరప్రవృత్తిని మద్యం ప్రేరేపిస్తోంది. దీనివల్ల ఎన్నో అనర్థాలు తలెతుత్తాయి. ఆరోగ్యానికీ హాని. మద్యం అలవాటు ఉన్నవాళ్లు మానేయాలి. మద్యం వల్ల మెదడు అదుపు తప్పుతుంది. తిన్నది వంటబట్టదు. నరాల బలహీనత సంభవిస్తోంది. {బెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉంది. మద్యం అలవాటు ఉన్న వాళ్లు దానికి క్రమేపీ దూరంగా ఉండడానికి యత్నించాలి. {Mమం తప్పకుండా తాగేవారు ఒక్కసారిగా మానేయకూడదు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణానికీ ప్రమాదం వాటిల్లుతుంది. మద్యం ప్రియులకు నయానా భయానా నచ్చజెప్పి ఆ అలవాటు మాన్పించాలి. దురుసుగా మాట్లాడితే వారు మనస్తాపానికి చెంది మరింత పేట్రేగే ప్రమాదం ఉంది. - డాక్టర్ కె. రత్నకుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కాకినాడ జీజీహెచ్ ఆహార నియమాలు పాటిద్దాం ఉరుకుల,పరుగుల జీవన యానంలో అందరూ ఆహార నియమాలు పాటించాలి. మితంగా పౌష్టికాహారం తీసుకోవాలి. తినేవాటి విషయంలో శ్రద్ధపెట్టకుంటే అనర్థాలు తప్పవు. రోడ్డు పక్కన దొరికే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. నూనె పదార్థాలు తగ్గించాలి. రోజూ ఆరు గ్లాసుల నీళ్లు తాగాలి. ఆహారంలో సమతౌల్యత పాటించాలి. వైద్యుల సూచనలు పాటించాలి. రసాయన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆవిరి ద్వారా ఉడికించిన పదార్థాలు చాలా మంచిది. హడావుడిగా ఆహారం తీసుకోకూడదు. వారానికి ఒక సారి ఉపవాసం ఉంటే మంచిది. భోజన వేళలు కచ్చితంగా పాటించాలి. మొబైల్ ఫోబియా వదిలేద్దాం ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం జీవితంలో భాగమైపోయింది. దీని వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. వీటి వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు అందరూ చర్యలు తీసుకోవాలి. మొబైల్ ఎక్కువసేపు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్ఫోన్ల వల్ల ఇంటర్నెట్ చూడడం వ్యసనంలా మారుతుంది. చెడు అలవాట్లు అబ్బుతాయి. యువత స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండాలి. రాత్రుళ్లు నిద్రపోయే సమయంలో ఫోన్లలో మాట్లాడకూడదు. - ఎ. మణిబాబు, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, రాజమండ్రి -
అ‘భయం’
పథకం కొనసాగుతుందా..? * ఆందోళన చెందుతున్న పింఛన్‌దారులు * ఈ నెల నిధులు నిలిపేసిన సర్కారు * ఆసరా పథకం వర్తింపజేయాలని విజ్ఞప్తి నల్లగొండ : అభయహస్తం పథకం అమలుపై మహిళా స్వయంసహాయక సంఘాల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆసరా’తో పింఛన్ పెరుగుతుందని ఆశించిన అభయహస్తం పింఛన్‌దారులకు నిరాశే ఎదురైంది. నవంబర్ నెలకు చెల్లించాల్సిన అభయహస్తం పింఛన్ సొమ్మును కూడా ప్రభుత్వం నిలిపేసింది. దీంతో పాటు సంఘాల్లోని సభ్యుల్లో 9, 10, ఇంటర్, ఐటీఐ చదివే పిల్లలకు చెల్లించే ఉపకార వేతనాలు కూడా ఆగిపోయాయి. అదీగాక కొంతకాలంగా ఈ పథకం అమలుతీరు గురించి రాష్ట్రస్థాయిలోనే ఎలాంటి సమీక్షలూ నిర్వహించలేదంటే ప్రభుత్వ ఆలోచన ఏమైఉంటుందనేది కూడా జిల్లా అధికారులకు అంతుచిక్కడం లేదు. లబ్ధిదారుల్లో ఉత్కంఠ.... మహిళలకు చేయూతనివ్వాలని, వారికి ఆర్థికస్వావలంబన కల్పించాలన్న ఉద్దేశంతో వైఎస్.రాజశేఖరరెడ్డి 2009లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం నవంబర్ 1 నుంచి అభయహస్తం పింఛన్ కింద అర్హులైన వారికి నెలకు 500 రూపాయల చొప్పున చెల్లించారు. ఇలా జిల్లాలో 26,354 మంది మహిళలు ఈ పెన్షన్ పొందుతున్నారు. 60 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలో పెన్షన్ పొందేందుకు అర్హులు. అదే సామాజిక భద్రత పెన్షన్లు 65 ఏళ్లు నిండిన వారికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు. పాత పద్ధతి ప్రకారం సామాజిక పింఛన్లు రూ.200 చెల్లిస్తున్నప్పుడు..అభయహస్తం పింఛన్ రూ.500లు చెల్లించారు. ఈ ప్రభుత్వం సామాజిక పింఛన్లు రెండు వందల నుంచి వెయ్యికి పెంచింది కానీ అభయహస్తం పింఛన్‌దారులకు దానిని వర్తింపజేయలేదు. అయితే అభయహస్తంలో పెన్షన్ పొందుతున్న వారిలో 65 ఏళ్లు నిండిన వారు ‘ఆసరా’కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు మౌఖికంగా సంఘాలకు చెప్పాయి. కానీ ఆచరణలో అది ఎంతవరకు సక్సెస్ అయ్యిందన్న సమాచారం లేదు. పెన్షన్ నిధిపై సందేహాలు... అభయహస్తం పెన్షన్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మహిళలు డబ్బులు జమచేశారు. మొత్తం 60వేల సంఘాల్లో 24,105 సంఘాలు అభయహస్తంలో చేరాయి. ఈ సంఘాల్లో మొత్తం 2 లక్షల 77 వేల మంది సభ్యులు ఉన్నారు. ఐదేళ్ల నుంచి ప్రతి ఏడాది 365 రూపాయల చొప్పున సెర్ప్‌కు చెల్లిస్తున్నారు. సభ్యులు తమ వాటాధనం కింద రూ.365లు చెల్లిస్తే...ప్రభుత్వ మరో వాటా రూ.365లు అదనంగా జమ చేస్తుంది. ఈ మొత్తం నగదు అంతా సెర్ప్ నుంచి ఎల్ఐసీకి చేరుతుంది. ఇలా ఇప్పటివరకు 5 కోట్ల 55 లక్షల 25 వేల రూపాయలు పెన్షన్ నిధికి జమ చేశారు. ఇలా జమచేస్తే వృద్ధాప్యంలో తమకు అదనంగా పెన్షన్ వస్తుందని పైసాపైసా కూడబెట్టుకుని అభయహస్తం వాటా ధనం చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు పెన్షన్‌లో ఈ విషయమై అధికారులను అడిగితే... తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని, తామేమీ చేయలేమని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ ఇంకా ఇవ్వలేదు.. నేను మూడేళ్ల క్రితం అభయహస్తం పథకంలో చేరి రూ.3700 చెల్లించా. నాకు 60 ఏండ్లు నిండిన తరువాత నెలకు రూ.500 పింఛన్ వస్తుందని చెప్పారు. అన్నట్లుగా నాకు గత ఏడాదిన్నర క్రితం 60 ఏండ్లు నిండడతో ప్రతి నెలా రూ.500 పింఛన్ వచ్చేది. కానీ ఈ నెల ఇంకా ఇవ్వలేదు. ఎందుకు వస్తలేదో ఎవరూ చెప్పడం లేదు. గ్రామ పంచాయతీ వారు త్వరలో లిస్టు పెడుతారంటా, అందులో పేరు ఉంటే ఇస్తామంటున్నారు. వారు ఇంకా లిస్టు పెట్టలేదు. - కరాట్ని లక్ష్మమ్మ, మునుగోడు