‘అభయహస్తం’కు రూ.35 కోట్లు విడుదల | telangana govt 35 crore pension funds released for abhaya hastham | Sakshi
Sakshi News home page

‘అభయహస్తం’కు రూ.35 కోట్లు విడుదల

Published Sat, Dec 24 2016 2:28 AM | Last Updated on Sat, Aug 25 2018 4:02 PM

‘అభయహస్తం’కు రూ.35 కోట్లు విడుదల - Sakshi

‘అభయహస్తం’కు రూ.35 కోట్లు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: అభయహస్తం పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వాస్తవానికి ఈ పథకాన్ని కొనసాగించాలా, వద్దా అనే సంశయంతో గత జనవరి నుంచి లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 2,19,483 మంది లబ్ధిదారులు ఉండగా, ఇందులో 1,21,453 మందిని ఆసరా పథకం పరిధిలోకి గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తీసుకు వచ్చారు. మిగిలిన 98,030 మందికి నెలకు రూ.500 చొప్పున సుమారు రూ.5కోట్ల మేర విడుదల చేయాల్సి ఉంది.

గత 12 నెలలుగా బకాయిలను విడుదల చేయని సర్కారు, తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తడంతో శుక్రవారం రూ.35 కోట్లను విడుదల చేసింది. అభయహస్తం పింఛన్లతో పాటు లబ్ధిదారుల కుటుంబాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. మొత్తంగా రూ.70 కోట్ల బకాయిలకుగాను కొంతైనా విడుదల చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement