released funds
-
‘ఎల్రక్టానిక్స్’కే రూ.320 కోట్లు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు పలు ఎల్రక్టానిక్ పరికరాల కొనుగోలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.320 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఈ రూ. 320 కోట్ల విడుదలకు ఆధారాలు లేవని తేల్చింది. పరికరాల కొనుగోలులో నిబంధనలు పాటించలేదని, బిల్లులు లేకుండానే నిధులు విడుదల చేశారని పేర్కొన్నట్టు తెలిసింది.సచివాలయ నిర్మాణంలో అవినీతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్.. ఐటీ విభాగంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. నిర్మాణ సంస్థకు ఇప్పటివరకు సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం సదరు సంస్థకు పరికరాల కొనుగోలు కోసమే రూ.500–600 కోట్ల వరకు విడుదల చేసినట్టు విజిలెన్స్ తేల్చింది. -
‘అభయహస్తం’కు రూ.35 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: అభయహస్తం పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వాస్తవానికి ఈ పథకాన్ని కొనసాగించాలా, వద్దా అనే సంశయంతో గత జనవరి నుంచి లబ్ధిదారులకు పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 2,19,483 మంది లబ్ధిదారులు ఉండగా, ఇందులో 1,21,453 మందిని ఆసరా పథకం పరిధిలోకి గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తీసుకు వచ్చారు. మిగిలిన 98,030 మందికి నెలకు రూ.500 చొప్పున సుమారు రూ.5కోట్ల మేర విడుదల చేయాల్సి ఉంది. గత 12 నెలలుగా బకాయిలను విడుదల చేయని సర్కారు, తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తడంతో శుక్రవారం రూ.35 కోట్లను విడుదల చేసింది. అభయహస్తం పింఛన్లతో పాటు లబ్ధిదారుల కుటుంబాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. మొత్తంగా రూ.70 కోట్ల బకాయిలకుగాను కొంతైనా విడుదల చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.