మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్‌ల కోసం నిధులు కేటాయిస్తున్నా అభయహస్తం ప థకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తోం ది. 2017 ఫిబ్రవరి వరకు అభయహస్తం పింఛన్‌ల కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వం 20 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో లబ్ధిదారులు పింఛన్‌ల కోసం నిరీక్షిస్తున్నారు.
మహిళల కోసం వైఎస్సార్ ప్రవేశ పెట్టిన అద్భుత పథకం...
మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి 55 సంవత్సరాల వయస్సు నిండిన తరువాత ప్రతి నెలా రూ.500 మొదలుకొని ఎక్కువ మొత్తం పింఛన్ అందించే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన అద్భుత పథకం అభయహస్తం. అభయహస్తం పథకం కింద చేరిన మహిళలు వారి వయస్సు ప్రకారం సభ్యత్వం కింద రూ.500 నుంచి రూ. 3,600 వరకు జమ చేశారు. ఈ నిధులకు ప్ర భుత్వం కూడా కొన్ని నిధులను జమ చేసింది.
జీవిత బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అభయహస్తం పథకం లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్ లభించేలా అప్పటి ప్రభు త్వం చర్యలు తీసుకుంది. అభయహస్తం పథకం కింద లబ్ధిదారులు జమ చేసిన మొత్తానికి వచ్చే వడ్డీకి కొంత నిధులను ప్రభుత్వం జత చేసి విడుదల చేస్తే లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్ అందించవచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అభయహస్తం పింఛన్ లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
రెంటికి చెడ్డ్డ రేవడిలా ..
అభయహస్తం లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అభయహస్తం పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న బీడీ భృతికి కాని, ఒంటరి మహిళల పింఛన్‌లకు కాని అర్హత సాధించలేక పోతున్నారు. అయితే కనీసం ప్రతినెలా అభయహస్తం పింఛన్‌ను మంజూరు చేసినా సరిపోతుందని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
బకాయిలు రూ.13.50 కోట్లు...
ఉమ్మడి జిల్లాలో అభయహస్తం పింఛన్ లబ్ధి దారులు 13,506 మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 8,879 మంది, కామారెడ్డి జిల్లాలో 4,627 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కో పింఛన్ లబ్ధిదారుకు రూ.10 వేల చొప్పున ఉమ్మడి జిల్లాలోని లబ్ధిదారులకు రూ.13 కోట్ల, 50 లక్షల, 60 వేల బకాయిని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment