తెయూ వీసీ రెసిడెన్స్ వద్ద నిరసన తెలుపుతున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వీ సీ ప్రొఫెసర్ సాంబయ్యను అవుట్ సోర్సింగ్ సి బ్బంది అడ్డుకుని నిరసన తెలిపారు. వీసీ మూడే ళ్ల పదవీకాలం బుధవారం ముగిసింది. గురువా రం వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి వెళ్లేందుకు వీసీ సిద్ధమయ్యారు. ఇంతలోనే వీసీ రెసిడెన్స్ వ ద్దకు చేరుకున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అక్క డే బైటాయించి ధర్నా నిర్వహించారు. జీవో నెంబరు 14 ప్రకారం వేతనాలు పెంచకుండా తమకు తీవ్ర అన్యాయం చేశాడరని ఆరోపించారు. మూడేళ్ల కాలంలో వీసీ ఒక నియంతలా వ్య వహరించారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీ వ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్స్ నుంచి బయటకు వచ్చిన వీసీ సాంబయ్యను చుట్టుముట్టిన అవుట్‌సోర్సింగ్ సిబ్బంది తమ పొట్టారని ఆరోపిస్తూ దుర్భాషలాడారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లిం చాలని జీవో ఉన్నప్పటికీ తెలంగాణ యూనివర్సిటీలో అమలు చేయకుండా సాంబయ్య తమ కు అన్యాయం చేశారని సిబ్బంది ఆగ్రహం వ్య క్తం చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వా తావరణం ఏర్పడింది. సమాచారం అందుకు న్న డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌కు మార్ క్యాంపస్ కు చేరుకుని అవుట్ సోర్సింగ్ సి బ్బందిని సముదాయించి శాంతింపజేశారు. సాంబయ్యను అక్కడి నుంచి వాహనంలో పం పించి వేశారు. నియంత అధికారి వర్సిటీని వది లి వెళుతున్నారని పేర్కొంటూ అవుట్ సోర్సింగ్ సిబ్బంది బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment