మహిళలకేదీ ‘అభయం’
అనంతపురం సెంట్రల్ : నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అభయహస్తం పథకాన్ని నీరుగారుస్తున్నారు. పొమ్మనలేక పొగ పెట్టినట్లు ఈ పథకాన్ని నిబంధనల సుడిగుండంలోకి నెట్టారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పథకం మూలాలపైనే దెబ్బ కొట్టింది. ఫలితంగా ఒకే ఏడాది 34874 మంది అభయహస్తం లబ్ధిదారులు పథకం నుంచి వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెలితే... 2009లో ఈ పథకాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇది నిరుపేద మహిళల జీవితాల్లో వెలుగు నింపింది.
మహానేత మరణం ఈ పథకానికి శాపంగా మారింది. క్రమేణా పథకం అమలుపై నీలినీ డలు కమ్ముకుంటూ వస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు అభయహస్తం పథకంలోకి చేరేందుకు అర్హులు. ముఖ్యంగా అత్యంత పేదలు(పీఓపీ), ఎస్సీ, ఎస్టీ, మత్యుకారులు, చేనేత కార్మికులు, వితంతువులు, అంగవైకల్యం ఉన్న వారికి అవకాశం కల్పించారు. రూ.365 ప్రీమియం, రూ.20 సేవా రుసుముతో కలిపి మొత్తం రూ.385 చెల్లించి అభయహస్తం పథకంలోకి సభ్యురాలిగా చేరితే ఆ మొత్తానికి ప్రభుత్వం మరో రూ.365 కలిపి బీమా సౌకర్యం కల్పిస్తుంది.
పథకం లబ్దిదారురాలి చదుకునే పిల్లలు ఉంటేతొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనం మం జూరవుతుంది. 60 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.500 (అప్పటి వృద్దాప్య, వితంతు పింఛన్ రూ. 200లకు రూ. 300 అదనంగా చెల్లించి) చొప్పున పిం ఛను చెల్లిస్తారు. సహజ మరణం అయితే రూ.30 వే లు, ప్రమాదంలో మృతి చెందితే రూ.70వేలు బీమా సౌకర్యం ఉంటుంది. ఇవి కాక లబ్ధిదారురాలు మృతి చెందిన విషయాన్ని గంటలోపు 08554-278275 సెల్‌కు తెలియజేస్తే అదేరోజే రూ.5 వేలు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం అదనంగా చెల్లిస్తారు.
ఇలాం టి మంచి పథకాన్ని నీరుగార్చే నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నా యి. రూ. 200 పింఛన్ వచ్చే రోజుల్లో రూ. 300లు అదనంగా కలుపుకొని మొత్తం రూ. 500 చొప్పున అ భయహస్తం పింఛన్‌దారులకు అందించేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ రూ. 1000లు మంజూరు చేస్తోంది. అభయహస్తం ల బ్ధిదారులు ప్రీమియం చెల్లించినా అదనంగా ఒరిగే ప్ర యోజనమేమీ లేకపోవడంతో మహిళల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. జిల్లాలో 63 మండలాల్లో 1.90,004 మంది లబ్ధిదారులు ఉండగా 1,36,018 మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. మిగిలిన 34974 మంది రెన్యువల్ చేసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే మహిళలకు రక్షణ కల్పించే పథకాలపై పాలకులకు ఉన్న చిత్తశుద్ది ఏపాటితో అర్థమవుతోంది.