60 లక్షల మంది మహిళలకు అభయహస్తం! | Abhayahastam for 60 lakh women | Sakshi
Sakshi News home page

60 లక్షల మంది మహిళలకు అభయహస్తం!

Published Wed, Jun 7 2017 2:06 AM | Last Updated on Sat, Aug 25 2018 4:02 PM

60 లక్షల మంది మహిళలకు అభయహస్తం! - Sakshi

60 లక్షల మంది మహిళలకు అభయహస్తం!

- 50 లక్షల మంది భర్తలకూ ప్రమాద బీమా
- పథకంలో మార్పులు చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ
- సీఎం ఆమోదానికి ప్రతిపాదనలు  
సాక్షి, హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో దివం గత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (2009లో) ప్రవేశపెట్టిన ‘అభయ హస్తం’ పథకాన్ని ఇకపైనా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో ప్రస్తుతం 24 లక్షల మంది మహి ళలు సభ్యులుగా ఉండగా, ఎస్‌హెచ్‌జీల్లోని మొత్తం 60 లక్షల మంది మహిళలకూ పథకాన్ని వర్తింప జేసేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మార్పులు చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళలతో పాటు వారి భర్తలకు (సుమారు 50 లక్షల మంది) కూడా అభయహస్తం పథకం కింద వర్తించే ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) తాజాగా ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రస్తుత అభయహస్తం నిబంధనలతో పోల్చితే సభ్యురాలికి కొత్త ప్రతిపాదనల మేరకు సహజ మరణం కేటగిరీలో ఇంతకు మునుపు కంటే ఏడు రెట్లు, ప్రమాదం కారణంగా మర ణిస్తే మూడు రెట్లు అధికంగా ఇన్సూరెన్స్‌ కవరేజీ లభించనుంది. 
 
ప్రస్తుతం సభ్యురాలు మరణించాకే కార్పస్‌ ఫండ్‌  సొమ్ము కుటుంబ సభ్యులకు దక్కనుండగా, తాజా ప్రతి పాదనలతో 65 ఏళ్లు దాటిన మహిళలు బతికి ఉండగానే ఇంతకు మునుపు కంటే ఎక్కువ మొత్తం కార్పస్‌ ఫండ్‌ను స్వయంగా అందుకునే వెసులు బాటు కల్పించారు. ప్రస్తుతం అభయ హస్తం పథకం కింద నెలకు రూ. 500 పింఛన్‌ మాత్రమే అందుతుండగా, కొత్త ప్రతిపాదనల్లో 65 ఏళ్లు దాటిన మహిళ లకు ఆసరా పథకం కింద నెలకు రూ. 1,000 పింఛన్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతిపాదిత అభయహస్తం పథకం అమలుకు రానున్న ఐదు సంవ త్సరాల్లో ఆర్థికపరమైన ప్రణాళికను కూడా ప్రభుత్వానికి పంపారు. అభయహస్తం పథకంలో మార్పులకు ఆమోదం నిమిత్తం సదరు ప్రతిపాదనలను సెర్ప్‌ అధికారులు ముఖ్యమంత్రికి పంపినట్లు తెలిసింది.
 
సభ్యురాలు/జీవిత భాగస్వామికి ప్రతిపాదిత బీమా కవరేజీ (రూ.లక్షల్లో)
సభ్యురాలు     ప్రస్తుతం    ప్రతిపాదిత
సహజ మరణం   0.30      2.30
ప్రమాద మరణం  0.75      4.75
శాశ్వత వైకల్యం   0.75      2.75
పాక్షిక వైకల్యం    0.37      1.37
 
జీవిత భాగస్వామి..
ప్రమాద మరణం లేదు  2.00
శాశ్వత వైకల్యం లేదు   2.00
పాక్షిక వైకల్యం లేదు    1.00

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement