అభయహస్తం పథకంలో సభ్యులుగా చేరాలి | members have to join abhaya hastham scheme | Sakshi
Sakshi News home page

అభయహస్తం పథకంలో సభ్యులుగా చేరాలి

Published Fri, Mar 7 2014 2:31 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

members have to join abhaya hastham scheme

 మునుగోడు, న్యూస్‌లైన్ : సమభావన సంఘాలలోని మహిళలంతా అభయహస్తంపథకంలో సభ్యులుగా చేరాలని అభయహస్తం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రత్తయ్య సూచించారు. గురువారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ సిబ్బందికి, సంఘబంధ అధ్యక్ష, కార్యదర్శులకు అభయహస్తంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అభయహస్తంలో చేరినవారు తిరిగి రెన్యువల్ చేసుకుంటే వారి పిల్లకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నుట్లు చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఎస్టీ మహిళలు కేవలం నెలకు 15 చొప్పున చెల్లించి జనశ్రీ భీమాయోజన పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి బీమా ఏజీఎం అరుణ్‌సింగ్, ఏపీఎం కవిత, సీసీలు సత్యనారాయణ, ప్రభాకర్, క్రిష్ణయ్య, శేఖర్, సంఘబంధాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement