‘నవ’ వసంతానికి నాంది పలకాలి | new year special story | Sakshi
Sakshi News home page

‘నవ’ వసంతానికి నాంది పలకాలి

Published Wed, Dec 31 2014 12:24 AM | Last Updated on Sat, Aug 25 2018 4:02 PM

‘నవ’ వసంతానికి నాంది పలకాలి - Sakshi

‘నవ’ వసంతానికి నాంది పలకాలి

 కొన్ని గంటల్లో పాత సంవత్సరానికి టాటా చెప్పబోతున్నాం. కొత్త వసంతాన్ని ఆహ్వానించనున్నాం. ఎంతో ఉత్సాహంగా స్వాగత సంబరాలకు సిద్ధవుతున్నాం. కొంగొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నాం. గతించిన సంవత్సరంలో చేసిన తప్పులను మననం చేసుకుంటూ కొత్తఏట వాటిని పునరావృత్తం కాకుండా చూడాలని తలస్తున్నాం. ఆనందంగా నవ వసంతానికి ఆహ్వానం పలకాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం బాగుండాలి.. మన సమాజం బాగుండాలి అనే నినాదంతో ముందుకు సాగాలి. నవోదయాన సంతోషాల హరివిల్లు విరియాలంటే నవ సూత్రాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.. అవేమిటంటే..
 - సాక్షి నెట్‌వర్క్
 
 పొదుపు పాటిద్దాం
 పొదుపు పాటించడం అలవాటు చేసుకుంటే జీవితాల్లో ప్రగతి సాధించవచ్చు. ఆర్థిక బాధల నుంచి గట్టెక్కవచ్చు. రోజూ కొంత మొత్తాలను దాయడాన్ని చిన్నారులకూ అలవాటు చేయాలి. ఫలితంగా వారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.
     నేషనల్ బ్యాంకుల్లోనే కాకుండా దగ్గరలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోనూ పొదుపు ఖాతాలు ప్రారంభించవచ్చు.
     చాలా బ్యాంకులు ప్రస్తుతం పొదుపు పథకాలు ప్రవేశపెట్టాయి.
     వాటిల్లో మనకు ఉపకరించేవి ఏవో ఎంచుకోవాలి.
     జనధన్ పథకం ద్వారా ఉచితంగా బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నారు. రూ. ఐదు వేల రుణం ఇస్తారు.
     కొన్ని బ్యాంకులు ఖాతాదారులకు బీమా కల్పిస్తున్నాయి.
     ఆంధ్రాబ్యాంకులో అభయ గోల్డ్, అభయా సేవింగ్స్, అభయ్ జీవన్ వంటి పథకాలతో బీమా వసతి కల్పిస్తున్నారు.  
     {పైవేటు పొదుపు సంస్థలతో అప్రమత్తంగా ఉండాలి.
     అధిక వడ్డీ ఆశకు లోనుకావద్దు.
 - ఇ.పెంచలయ్య. ఏజీఎం, ఆంధ్రాబ్యాంకు, రాజమండ్రి
 
 మహిళలను గౌరవిద్దాం
 మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. దీనిని పాటిస్తూ భావి తరాలకూ ఆ స్పృహ కలిగించాలి. ఫలితంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు చెక్ పెట్టవచ్చు. వరకట్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస వంటి అంశాల్లో బలైపోతున్న అబలలకు అండగా నిలవాలి. ఈ చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాలి.  జిల్లా కేంద్రంతోపాటు రాజమండ్రి, అమలాపురం, తుని, రావులపాలెం, రామచంద్రపురం వంటి ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్‌పై ప్రస్తుతం నిఘా కొరవడిందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్య, వసతి  గృహాలు, వ్యాపార సంస్థల్లో మహిళల రక్షణ కోసం భద్రతా చర్యలు లేవు. ఈ నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 
     ఈవ్ టీజింగ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.  
     ఈ చట్టం ప్రకారం.. బాధిత యువతులు వెంటనే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయాలి  
     ఫిర్యాదు అందుకున్న ప్రిన్సిపాల్ ఈవ్‌టీజింగ్‌నకు పాల్పడిన విద్యార్థిని, యువకుడిపై చర్య తీసుకోవాలి. పోలీసులకూ ఫిర్యాదు చేయాలి.
     పోలీసులు దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేస్తారు.
     ఈవ్‌టీజింగ్ నిరూపణ అయితే కనీసం మూడేళ్ల జైలు  లేదా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ నాన్ బెయిలబుల్ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు.
     {పతి కళాశాల ఆవరణ, తరగతి గదుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
     ఇబ్బందుల్లో ఉన్న యువతులు, మహిళలు 1091కు కాల్ చేయాలి.
     యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి భవితను నాశనం చేసుకోకూడదు. కఠిన శిక్షలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త!
 - కృష్ణ ప్రసన్న, డీఎస్పీ ట్రాఫిక్, రాజమండ్రి
 
 పరిశుభ్రతపై దృష్టిపెడదాం
 వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మన జీవితంలో అంతర్భాగం. ఈ రెంటిలో ఏది పాటించకపోయినా నష్టపోయేది మనమే. రోగాలు ప్రబలుతాయి. ఒళ్లు, ఇల్లు గుల్లవుతాయి. అందరూ పరిశుభ్రత పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం కష్టమేమి కాదని వైద్యులు చెబుతున్నారు.  
     వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. దీనిపై పిల్లలకు అవగాహన కల్పించాలి.
     ఇంటి పరిశుభ్రత, వంట సామగ్రి శుభ్రత పాటించాలి.
     ఏదైనా తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దైనందిన జీవితంలో చేసే పనులు క్రమపద్ధతిలో చేయాలి.
     పరిసరాల పరిశుభ్రత పాటించాలి.  
     రోజుల తరబడి చెత్తను నిలవ ఉంచకూడదు.  
 - డాక్టర్ మూర్తి, హెల్త్ ఆఫీసర్, రాజమండ్రి
 
 యోగా చేద్దాం
 ఒత్తిళ్లతో కూడిన ప్రస్తుత సమాజంలో అందరికీ యోగా అవసరం. దీనివల్ల ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణ అలవడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
     రోజుకు ఓ గంటైనా యోగా చేయాలి.
     యోగాతో ఏకాగ్రత పెరుగుతుంది.
     ఒత్తిళ్లు తొలగిపోతాయి.
     ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.  
 - చిట్టూరి చంద్రశేఖర్, యోగా కోచ్, యోగా రత్న అవార్డు గ్రహీత, తాటిపాక
 
 ఇంధన పొదుపు చేసేద్దాం
 ఇంధన వినియోగం ఎక్కువైంది. వనరులు తగ్గిపోయాయి. ఫలితంగా భవిష్యత్తులో కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే అందరూ ఇంధన పొదుపు పాటించాలి.   విద్యుత్ వినియోగంపైనా దృష్టిపెట్టాలి.  
     ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్ లైట్ల వాడకాన్ని అలవర్చుకోవాలి.  
     అవసరం లేకుండా ఫ్యాన్లు, లైట్లు వేయకూడదు.
     ఇళ్లలో వృథాను అరికట్టండి.  
     {sాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల ఇంజిన్ ఆపేయాలి. దీనివల్ల పెట్రోలు ఆదా అవుతుంది. రోడ్లపై ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా అలా చేస్తే మంచిది.
     ఎవరికి వారు పెట్రోలు పొదుపు పాటించాలి.
     తక్కువ దూరం ఉన్నప్పుడు సైకిళ్లపైగానీ, నడక ద్వారా గానీ వెళ్లడం మంచిది. ఇది ఆరోగ్యానికీ శుభసూచిక.  
     వాహనాలను నీడలో పార్క్‌చేస్తే పెట్రోల్ ఆవిరి కాదు.  
     వాహనాల మైలేజ్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి.
     పొగవస్తుంటే తక్షణం సర్వీసింగ్ చేయించండి.  
     వారానికి ఓ సారి మోటారు వాహనాలకు హాలిడే ప్రకటించండి.
     సౌర విద్యుత్ వాడకాన్ని పెంచాలి.
 - ఎన్. గంగాధర్, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్, రాజమండ్రి
 
 రోడ్లపై అప్రమత్తత అవసరం
 రోడ్లపై ప్రయాణించేటప్పుడు అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు వాడేవారు వేగ నియంత్రణ పాటించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఒత్తిడిని అధిగమించాలి. ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకూడదు.
     {sాఫిక్ నిబంధనలు పాటించాలి.
     వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం  
     మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.
     అధిక లోడు, అతివేగం అనర్థదాయకం
     ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి.
     నిర్దేశిత ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలి.  
 - ఎ. మోహన్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, కాకినాడ
 
 మద్యం మానేద్దాం
 మద్యం మహమ్మారికి ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి. వికృత నేరప్రవృత్తిని మద్యం ప్రేరేపిస్తోంది. దీనివల్ల ఎన్నో అనర్థాలు తలెతుత్తాయి. ఆరోగ్యానికీ హాని. మద్యం అలవాటు ఉన్నవాళ్లు మానేయాలి.
     మద్యం వల్ల మెదడు అదుపు తప్పుతుంది. తిన్నది వంటబట్టదు.
     నరాల బలహీనత సంభవిస్తోంది.
     {బెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉంది.
     మద్యం అలవాటు ఉన్న వాళ్లు దానికి క్రమేపీ దూరంగా ఉండడానికి యత్నించాలి.
     {Mమం తప్పకుండా తాగేవారు ఒక్కసారిగా మానేయకూడదు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణానికీ ప్రమాదం వాటిల్లుతుంది.
     మద్యం ప్రియులకు నయానా భయానా నచ్చజెప్పి ఆ అలవాటు మాన్పించాలి.
     దురుసుగా మాట్లాడితే వారు మనస్తాపానికి చెంది మరింత పేట్రేగే ప్రమాదం ఉంది.
 - డాక్టర్ కె. రత్నకుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కాకినాడ జీజీహెచ్
 
 ఆహార నియమాలు పాటిద్దాం
 ఉరుకుల,పరుగుల జీవన యానంలో అందరూ ఆహార నియమాలు పాటించాలి. మితంగా పౌష్టికాహారం తీసుకోవాలి. తినేవాటి విషయంలో శ్రద్ధపెట్టకుంటే అనర్థాలు తప్పవు.  
     రోడ్డు పక్కన దొరికే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.       నూనె పదార్థాలు తగ్గించాలి.
     రోజూ ఆరు గ్లాసుల నీళ్లు తాగాలి.
     ఆహారంలో సమతౌల్యత పాటించాలి. వైద్యుల సూచనలు పాటించాలి.  
     రసాయన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.  
     రోజూ వ్యాయామం చేయాలి.  
     ఆవిరి ద్వారా ఉడికించిన పదార్థాలు చాలా మంచిది.
     హడావుడిగా ఆహారం తీసుకోకూడదు.  
     వారానికి ఒక సారి ఉపవాసం ఉంటే మంచిది.  
     భోజన వేళలు కచ్చితంగా పాటించాలి.  
 
 
 మొబైల్ ఫోబియా వదిలేద్దాం
 ప్రస్తుతం మొబైల్ ఫోన్‌ల వినియోగం జీవితంలో భాగమైపోయింది. దీని వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. వీటి వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు అందరూ చర్యలు తీసుకోవాలి.
     మొబైల్ ఎక్కువసేపు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
     స్మార్ట్‌ఫోన్ల వల్ల ఇంటర్నెట్ చూడడం వ్యసనంలా మారుతుంది.
     చెడు అలవాట్లు అబ్బుతాయి.  
     యువత స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉండాలి.  
     రాత్రుళ్లు నిద్రపోయే సమయంలో ఫోన్లలో మాట్లాడకూడదు.
     - ఎ. మణిబాబు, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, రాజమండ్రి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement