తాను రాసిన పుస్తకంతో వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు
సాక్షి, కడప : పులివెందులలో తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి సమక్షంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో 69 కిలోల కేకును కట్ చేసి పంచి పెట్టారు. అంతకుముందు పులివెందుల పట్టణానికి చెందిన ఆటో కార్మికులు జూనియర్ కళాశాల సమీపంలోని మహాత్మాగాంధీ సర్కిల్ నుంచి పూల అంగళ్ల మీదుగా ఆర్టీసీ బస్టాండు వరకు ఆటోలకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి కార్మికులతో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిలు పాలాభిషేకం చేశారు. అనంతరం అవినాష్‌రెడ్డి ఖాకీ యూనిఫాం ధరించి పార్టీ కార్యాలయం వరకు ఆటో నడిపారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సుమారు 400 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతలు చొప్పున ఖాకీ యూనిఫాం దుస్తులను అందజేశారు. అలాగే పులివెందులలోని రాజారెడ్డి భవన్‌లో జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
కడపలో భారీగా కార్యక్రమం
కడపలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పార్టీ కార్యకర్తల కేరింతల మధ్య కట్ చేసి పంచిపెట్టారు. నగర మాజీ అధ్యక్షుడు బండి నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సురేష్‌బాబు, అంజద్‌బాష, అమర్‌నాథరెడ్డిలు ప్రారంభించారు. జువైనల్ హోంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రాజశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లాల ఆధ్వర్యంలో జువైనల్ హోంలో కేక్ కట్ చేయడంతోపాటు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అంతేకాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి.
ప్రొద్దుటూరు, రాయచోటిలోఎమ్మెల్యేల ఆధ్వర్యంలో..
ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరురోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం చేయడంతోపాటు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. రాయచోటి పట్టణంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం రామాపురం, సంబేపల్లె మండలాల్లో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.చిన్నమండెం మండలం చాకిబండలో ఎంపీటీసీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డిలు కూడా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజంపేట పాతబస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్ద బీసీ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంటిమిట్టలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బద్వేలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేయడంతోపాటు అన్నదానం చేశారు.
జమ్మలమడుగులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం క్యాంబెల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కొండాపురంలో పార్టీ శ్రేణులు రక్తదాన కార్యక్రమం చేపట్టాయి. ఎర్రగుంట్లలో మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్దన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. కమలాపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించాయి. అన్నిచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. మైదుకూరులో వైఎస్సార్ సీపీ నేత రాచమల్లు రవిశంకర్‌రెడ్డి నేతృత్వంలో బద్వేలు రోడ్డులోని సీఎస్‌ఐ చర్చి వద్ద వృద్ధులు, వికలాంగులు, పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment