YSR Family
-
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్‌కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్‌రెడ్డి, వైఎస్ మధుకర్‌రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్‌రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్‌రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్‌రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్‌రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ కుటుంబంతోనే
తిరుపతి మంగళం: వైఎస్సార్ కుటుంబానికి తాను ఎప్పటికీ విధేయుడినేనని, తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. మహాత్మ గాంధీ ఆత్మకథ పునఃముద్రణ పుస్తక ఆవిష్కరణ సభలో తాను యథాతథంగా పలికిన గాంధీ మహాత్ముడి మాటలను కొన్ని పత్రికలు, చానల్స్ వక్రీకరించడం బాధాకరమన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ► మహాత్మాగాంధీ ఆత్మకథ పునఃముద్రణ పుస్తకాన్ని శనివారం భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేతుల మీదుగా ఆవిష్కరించే సభలో నేను మాట్లాడిన మాటలకు కొంత మంది దురుద్దేశాలు ఆపాదించారు. ► నేను చాలా నిబద్ధత కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిని. వైఎస్ కుటుంబంతో నాకు 48 ఏళ్ల అనుబంధం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమేయం వల్ల నేను తీవ్రవాద రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చా. ఆయన కుటుంబానికి రాజకీయ సేవ చేసుకోవడం కోసమే నేను ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉన్నాను. ► నా ఊపిరి ఉన్నంత వరకు నా రాజకీయ జీవితం మా నేత జగన్‌తోనే కొనసాగుతుంది. నా నాయకుడి మీద నేను అసహనం చూపిస్తే నాకంటే పాపి మరొకరు ఉండరని తెలుగు ప్రజలకు మనవి చేస్తున్నా. -
వైఎస్ఆర్ కుటుంబానికి నేను ఎప్పుడూ విధేయుడినే..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం తనకు కేబినెట్లో చోటు దక్కకపోవడంపై బాలినేని శ్రీనివాస్ స్పందించారు. బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబానికి తాను ఎప్పుడూ విధేయుడినేనని స్పష్టం చేశారు. తాను రాజీనామా చేస్తున్నాననే వార్తలను ఖండించారు. పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదని.. పార్టీ కోసమే పని చేశానని అన్నారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. పార్టీ ఒక కుటుంబం.. అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. పార్టీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామర్థ్యం ఉన్న వారినే సీఎం జగన్ కేబినెట్లోకి తీసుకున్నారు. ఆదిమూలపు సురేష్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఈ సందర్బంగా క్లారిటీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీనే అని బాలినేని ప్రశంసించారు. అందరికీ పదవులు ఒకేసారి రావు అని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. -
ఘాట్ వద్ద.. చెమర్చిన కళ్లతో
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందురోజే ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా సమాధి ప్రాంగణం వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో వైఎస్సార్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సీఎం జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, పెద్దమ్మ వైఎస్ భారతమ్మలు ఒకింత భావోద్వేగానికి గురై చెమర్చిన కళ్లతో కనిపించారు. అక్కడికి సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సీఎంతోపాటు కుటుంబ సభ్యులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. అల్పాహారం అనంతరం నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తనను కలిసేందుకు నిరీక్షిస్తున్న వారిని పలకరించారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయన 11.10 గంటల వరకు వినతులు స్వీకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు కార్యకర్త ‘సల్మా’కు ఫోన్లో పరామర్శ అనారోగ్యంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేంపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సల్మాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ కార్యకర్త భారతి ద్వారా సల్మా అనారోగ్యం గురించి తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ నేత అనిల్ కుమార్తెకు నామకరణం చేసిన సీఎం లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దమల్లు అనిల్‌కుమార్‌రెడ్డి, పెద్దమల్లు అనూషల కుమార్తెకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జగతి అని నామకరణం జరిగింది. అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులు ఇడుపులపాయలో ముఖ్యమంత్రిని కలిశారు. పలువురు నివాళులు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు ఎస్బీ అంజాద్‌బాషా, నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, జకియాఖానమ్, కత్తి నరసింహారెడ్డి, కల్పలత, గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీïసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పరిశ్రమలశాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, డీఐజీ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, చక్రాయపేట ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
కాలిఫోర్నియా, బే ఏరియాలో వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72 వ జయంతి వేడుకలు అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా జరిగాయి. బ్లూ ఫాక్స్ ఇండియన్ హోటల్ లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. యూఎస్ఏ వైస్సార్సీపీ కన్వినర్, ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల సలహాదారు చంద్రహాస్ పెద్దమల్లు ,యూఎస్ఏ వైఎస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది. వైఎస్సార్సీపీ యూఎస్ఏ కమిటీకి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతనిధులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు . యూఎస్ఏ వైఎస్సార్సీపీ కన్వినర్, ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల సలహాదారు చంద్రహాస్ పెద్దమల్లు మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం, ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా, వైఎస్సార్సీపీ యూఎస్ఏ, డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ "కమ్యూనిటీ సేవ" సంస్థ ద్వారా సుమారుగా 500 కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్యూనిటీ సేవ సంస్థ ఫౌండర్ చైర్మన్ నాథన్ గణేశన్ వైఎస్సార్సీపీ యూఎస్ కమిటీ, డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ వారికి కృతఙ్ఞతలు తెలియచేశారు వైఎస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీరెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు. వైఎస్సార్ స్పూర్తితో , వారి ఆశయాలను వారి కుమారుడు నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారు అని కొనియాడారు. వైస్సార్సీపీ యూఎస్ కమిటీ ముఖ్య సభ్యులైన సురేంద్ర అబ్బవరం, సుబ్రహ్మణ్యం రెడ్డివారి , హరిద్ర శీలం , కిరణ్ కూచిభట్ల త్రిలోకనంద రెడ్డి ఆరవ, మహేశ్వర్ రెడ్డి, వంశి ఏరువారం, పుల్లారెడ్డి లు మాట్లాడుతూ వైఎస్సార్ సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజన్న రాజ్యం తిరిగి వారి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమలో బే ఏరియా వైఎస్సార్ అభిమానులు అంకిరెడ్డి , గోపాల్, వీరారెడ్డి, హారిన్ద్ర శీలం, కొండారెడ్డి, సుగుణ, సుబ్బారెడ్డి, ప్రశాంతి, రామిరెడ్డి, నరేంద్ర కొత్తకోట, వినయ్, సుబ్బారెడ్డి ,తిరుపతిరెడ్డి పేరం, అమర్, రామిరెడ్డి , సురేష్ తనమల , అంకిరెడ్డి, వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులు పాల్గొన్నారు. -
టెక్సాస్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
అమెరికాలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో టెక్సాస్ రాష్ట్రం లో ఆస్టిన్ నగరంలో ప్రవాసాంధ్రులు వైఎస్సార్ జయంతి జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతినిధులు ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గండ్ర నారాయణ రెడ్డి, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి,ప్రవర్ధన్ చిమ్ముల , మల్లిక్ ఆవుల, కొండా రెడ్డి ద్వారసాల, వెంకట శివ నామాల, రవి బల్లాడ, పుల్లా రెడ్డి, పరమేష్ రెడ్డి, వసంత్ రెడ్డి, వెంకటేష్ భాగేపల్లి, చంద్ర గురు ద్వారసాల, అశోక గూడూరు, నర్సి రెడ్డి, బ్రహ్మేంద్ర లక్కు, హేమంత్ బల్ల, విజయ్ రెడ్డి ఎద్దుల, ప్రదీప్ లక్కిరెడ్డి, అనంత్ రెడ్డి తో పాటు పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
అన్నం పెట్టడానికి ఆర్థిక ఇబ్బందులా?
సమాజానికి ఏదో చేయాలనే ఆకాంక్ష, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడాలనే కృత నిశ్చయం, సమస్యలపై ధైర్యంగా పోరాడే తత్వం, అన్నింటినీ మించి మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం... ఇవన్నీ కలగలిసిన జన నాయకుడు ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు మిషనరీ ఆసుపత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి, పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టి, రూపాయి ఫీజుకే వైద్యం అందించారు. 28 ఏళ్ల పిన్న వయసులోనే శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లుగా ఎంపీగా గెలిచారు. ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలిసిన సంస్కారవంతుడు వైఎస్. ఆయన దగ్గరకు వెళ్లిన ఏ ఒక్కరూ ఎన్నడూ అసంతృప్తికి లోను కాలేదు. 2009 ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తనదే బాధ్యత అని బహిరంగంగా, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రకటించిన నిఖార్సయిన నాయకుడు. ఓటమి లేకుండా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. తన హయాంలో సుమారు 10 వేల మంది పేద పిల్లలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించారు. ‘‘మీ పిల్లలకు పునర్జన్మనిచ్చే అవకాశం నాకు, నా ప్రభుత్వానికి కల్పించారు. నా జీవితం ధన్యమైంది’’ అని వినయంగా ప్రకటించారు. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి కుటుంబాన్ని కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తున్నట్లుగానే, అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ కూడా ఠంచనుగా అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుం బాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్. లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం ఒక సరికొత్త ప్రయోగం. ‘‘మేం 20 రాష్ట్రాల్లో పర్యటించాం. ఇలాంటి పథకం ఎక్కడా చూడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ సహా పలు సంక్షేమ పథకాలతో ఈబీసీలను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించడం మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది’’ అని నాటి ఈబీసీ కమిషన్ ఛైర్మన్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించారు. దానికి వైఎస్ స్పందిస్తూ.. ‘అది మా ప్రభుత్వ బాధ్యత’ అని వినమ్రంగా సమాధానమిచ్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా వైఎస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంలో సీఎంగా ఉన్న వైఎస్.. బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 11గంటలు. గిరిజన గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం, కాన్సెప్ట్ స్కూళ్లపై వైఎస్ తో మాట్లాడారు. గిరిజన, పేద విద్యార్థులకు సరైన విద్య అందితే అద్భుతాలు సృష్టిస్తారని.. దేశ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తారని కలాం చెప్పారు. గిరిజన గురుకులాలు, ఆంగ్ల మాధ్యమంలో బోధన వంటి అంశాలను చేపట్టడంలో మీరు దేశానికే రోల్ మోడల్ అని ప్రశంసించారు. అప్పుడు వైఎస్.. ‘మీ ఆశీర్వాదాలు కావాలి సర్’ అంటే.. ఆయన ‘గాడ్ బ్లెస్ యు రాజశేఖర్’ అని దీవించారు. డాక్టర్ వైఎస్సార్‌కు రైతులంటే ఎనలేని అభిమానం. రైతులను నిర్లక్ష్యం చేస్తే కన్నతల్లిని నిర్లక్ష్యం చేసినట్లేనని చెప్పేవారు. రైతులకు నీళ్లిస్తే వారు ఎవరి మీదా ఆధారపడరని, రైతు బాగుం టేనే దేశం బాగుంటుందని స్పష్టం చేసేవారు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగునీరందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందం చూడడమే తన ఆకాంక్ష అన్నారు. జలయజ్ణం పేరిట రాష్ట్ర సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీటి వసతి కల్పించారు. వైఎస్ పాలించిన ఐదేళ్లూ రాష్ట్రంలో వర్షాలకు లోటు లేదు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రమంతటా జలాశయాలన్నీ నిండు కుండల్లా మారాయి. ‘వాన దేవుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆశీర్వదించాడు’ అని వైఎస్ తరచూ చెప్పేవారు. దాదాపు 200 లక్షల టన్నుల ధాన్యం దిగుబడితో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఆవిర్భవించింది. ‘‘అధికారంలోకి వచ్చి, నేను సీఎం అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా విద్యుత్తును అందించలేని నాడు నేను ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా కొనసాగను’’ అని ఢిల్లీ పెద్దలకు తేల్చిచెప్పిన ధీశాలి వైఎస్సార్. 2004లో సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వైఎస్ తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలుపైనే చేశారు. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అంతకముందు సచివాలయంలో జరిగిన చర్చలో కొందరు ఆర్థిక భారం అన్నారు. ‘‘పారిశ్రామికవేత్తలకు కోరినన్ని రాయితీలు ఇస్తారు. పేదవాడికి అన్నం పెట్టడానికి మనకు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తాయా? ఇదేం పద్ధతయ్యా? ఇంతవరకు నేను ప్రారంభించిన పథకం ఏదైనా ఆగిపోయిందా? లేదు కదా?’’ అని వైఎస్ స్పష్టం చేశారు. పావలా వడ్డీ, అభయహస్తం, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి ప్రతి పథకాన్ని గొప్పగా అమలు చేశారు. ప్రతి పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. బీహెచ్ఈఎల్ ప్రాజెక్టును ఒక కేంద్రమంత్రి 2009లో రాజ స్తాన్ తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ‘‘దేశంలో మళ్లీ యూపీఏ అధికారంలోకి రావడానికి ఏపీనే కారణం. 30కి పైగా ఎంపీ సీట్లు ఇచ్చాం. ఈ ప్రాజెక్టు గనుక రాజస్తాన్ తీసుకెళ్తే నేను ఢిల్లీలో అడుగుపెట్టను. ఇది నా మాటగా ప్రధానికి చెప్పండి’’ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్‌కు చెప్పగా ‘‘రాజశేఖర్ చెప్పింది అక్షరాలా నిజం. మన్నవరం ప్రాజెక్టును ఏపీకే ఇద్దాం. నేనే శంకుస్థాపన చేయడానికి వెళ్తా. ఈ విషయాన్ని ఆయనకు చెప్పండి’’ అని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో హాలీవుడ్ నటుడు, నాటి కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్ ‘మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీరు ఇంత ఫిట్‌గా ఉన్నారు. 9 కోట్ల జనాభా గల ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని ఒత్తిడిలో ఉండే మీకు ఇది ఎలా సాధ్యం?’ అని అడిగారు. ‘పాజిటివ్ థింకింగ్’ అని వైఎస్ చిరునవ్వుతో బదులిచ్చారు. ఎ. చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త వైఎస్ మాజీ మీడియా కార్యదర్శి -
కంటిచూపు ప్రదాత కన్నుమూత
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల : పులివెందుల ప్రజలు ఆప్యాయంగా కంటి చూపు ప్రదాత అని పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి(89) బుధవారం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం కడపలోని తన కుమారుడు విలియమ్స్ సత్యానందరెడ్డి ఇంటికి వెళ్లిన ఆయనకు బుధవారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో గుండెపోటు రాగా.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అక్కడి నుంచి ఆయన భౌతిక కాయాన్ని కుమారుని ఇంటిలో అక్కడి బంధువుల సందర్శనార్థం ఉంచి అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలోని ఆయన నివాసం ఉండే గృహానికి తరలించారు. వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజారెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిల మరణం తర్వాత కుటుంబ పెద్దగా ఉంటూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వైఎస్ పురుషోత్తమరెడ్డి దివంగత వైఎస్ రాజారెడ్డికి స్వయాన సోదరుడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు చిన్నాన్న. ఆయన మరణంతో వైఎస్ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి 1929 డిసెంబర్ 19న సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో వైఎస్ వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు మూడో కుమారునిగా జన్మించారు. ఎలిమెంటరీ విద్యను బలపనూరులో.. హైస్కూలు విద్యను పులివెందులలో, ఇంటర్ అనంతపురం, ఎంబీబీఎస్ ఆంధ్రా యూనివర్సిటీలో, డీఓఎంఎస్ (ఓపీహెచ్) విశాఖపట్టణం, గుంటూరు మెడికల్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. 1958లో డాక్టర్ ఫ్లావియతో ఆయనకు వివాహమైంది. ఆయనకు నలుగురు కుమారులు. వారిలో స్టాన్లీ సత్యానందరెడ్డి, మైఖేల్ సత్యానందరెడ్డిలు ఇంజినీర్లుగా అమెరికాలో స్థిరపడగా.. విలియమ్స్ సత్యానందరెడ్డి కడపలో, థామస్ సత్యానందరెడ్డి తాడిపత్రిలో వైద్యులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. డాక్టర్‌గా వైద్యసేవలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి వైద్యునిగా విశేష సేవలందించారు. 1956 నుంచి 22ఏళ్లుగా ఒంగోలు, జమ్మలమడుగు, కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చర్చిల ఆసుపత్రుల్లో వైద్యునిగా ప్రజలకు ఉత్తమ సేవలందించారు. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రితో ఆయనకు విడదీయరాని సంబంధం ఉంది. దాదాపు 36ఏళ్లుగా వైఎస్‌రాజారెడ్డి ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్‌గా, ఐ స్పెషలిస్ట్‌గా తాను మరణించేవరకు జీతం లేకుండా ప్రజలకు సేవలందించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు, సిబ్బందితో ఆత్మీయంగా ఉంటూ వైద్యంలోని మెలకువలను నేర్పించేవారు. రాజారెడ్డి ఆసుపత్రిలో రోటరీ క్లబ్, ప్రభుత్వ అంధ త్వ నివారణ సంస్థ సహకారంతో 70వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి వారికి చూపు ప్రసాదించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన మరణంతో ఆసుపత్రి సిబ్బంది తాము పెద్ద దిక్కును కోల్పోయామని బోరున విలపించారు. ఎమ్మెల్యేగా సేవలు వైఎస్ పురుషోత్తమరెడ్డి డాక్టర్‌గానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా పులివెందుల ప్రాంత ప్రజలకు సేవలందించారు. 1991లో అప్పటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ వివేకానందరెడ్డి అనివార్య కారణా లవల్ల రాజీనామా చేయడంతో పులివెందులలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో పురుషోత్తమరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలస్వామిరెడ్డిపై 97వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పులివెందుల రాజకీయ చరిత్రలో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన సాధారణ జీవితాన్నే గడిపారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల నుంచి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ రిజర్వాయర్ నిర్మాణంలోనూ, నియోజకవర్గంలోని 177 గ్రామాలకు మంచినీటి వసతి, పులివెందులలో మొట్టమొదటిసారిగా బైపాస్ రోడ్డు నిర్మాణం, టీటీడీ కల్యాణ మండపం ఏర్పాటు, బాలికల జూనియర్ కళాశాల, నియోజకవర్గంలోని ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఆయన హయాంలో జరిగాయి. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఐఎంఏ ప్రెసిడెంట్‌గా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, ఆసుపత్రి అసోసియేషన్ కడప బ్రాంచ్ ప్రెసిడెంట్‌గా, పులివెందుల సీఎస్ఐ చర్చి ట్రెజరర్‌గా, జీజీఆర్, జీజెడ్ఆర్ఐ క్యాంప్స్ చైర్మన్‌గా సేవలందించారు. ఆయన డాక్టర్‌గా చేస్తున్న సేవలకు ది ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ గ్రోత్ సొసైటీ, న్యూఢిల్లీ వారు 1999లో ‘నేషనల్ మెడికల్ ఎక్స్‌లెన్సీ అవార్డు’లో ఆయన పేరును చేర్చారు. నివాళులర్పించిన వైఎస్ కుటుంబీకులు వైఎస్ పురుషోత్తమరెడ్డి మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి, మున్సి పల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేత్రదానం నేత్ర వైద్యుడిగా అమూల్యమైన సేవలు అందించి వేలాది మందికి కంటి చూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన మరణం తర్వాత కూడా మరో ఇద్దరికి చూపును ప్రసాదిం చారు. బుధవారం ఆయన కార్నియాలను కుమారులు స్టాన్లీ, మైఖేల్, విలియమ్స్, థామస్ అంగీకారంతో పురుషోత్తమరెడ్డి మనుమరాలు డాక్టర్వింధ్య సేకరించి స్నేహ సేవా సమితి సభ్యులు రాజు, మధుసూదన్‌రెడ్డిలకు అందజేశారు. రేపు అంత్యక్రియలు వైఎస్ పురుషోత్తమరెడ్డి భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు థామస్ సత్యానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8గంటలకు స్థానిక సీఎస్ఐ చర్చి ఆవరణలో ఆయన భౌతిక కాయం ఉంచి అక్కడ బిషప్‌లు, పాస్టర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ ఫ్యామిలీ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
జగన్ ద్వారా వైఎస్సార్ పాలన తీసుకొద్దాం
సాక్షి కడప/వేంపల్లె: ‘‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుని దగ్గరున్నారు. ప్రజల కోసం చేయాల్సిన పనులన్నీ చేసి ఆయన దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కారణజన్ముడిగా మిగిలిపోయారు. అలాంటి పాలనను, పథకాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కొనసాగించగలరు. జగన్ ద్వారా వైఎస్సార్ పాలనను మళ్లీ తీసుకొద్దాం’’ అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. విజయమ్మతో పాటు కోడలు భారతిరెడ్డి, కుమార్తె షర్మిల, వైఎస్ జగన్ కుమార్తె హర్ష, షర్మిల కుమార్తె అంజలి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్సార్ సోదరి విమలమ్మ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజద్ బాషా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, తదితరులు వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. వైఎస్సార్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా విజయమ్మతో పాటు వైఎస్ భారతి రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యాంతమయ్యారు. పాస్టర్ నరేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈరోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల మధ్య తిరుగుతున్నాడు. వైఎస్సార్ ఆశయాలను, సిద్ధాంతాలను జగన్ నిలబెడతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజలందరికీ జగన్ ఎల్లవేళలా తోడుంటాడు’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మీ అందరికీ ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక మనవడిగా నా బిడ్డ నిలబడతాడు. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. అందుకోసం ప్రతి ఒక్కరూ జగన్‌కు అండగా నిలబడాలి’’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని ఆకాంక్షించారు. -
వైఎస్సార్‌కు కుటుంబసభ్యులు ఘన నివాళి
-
మహనీయా..మళ్లీరావా!
సాక్షి, కడప : పులివెందులలో తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి సమక్షంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో 69 కిలోల కేకును కట్ చేసి పంచి పెట్టారు. అంతకుముందు పులివెందుల పట్టణానికి చెందిన ఆటో కార్మికులు జూనియర్ కళాశాల సమీపంలోని మహాత్మాగాంధీ సర్కిల్ నుంచి పూల అంగళ్ల మీదుగా ఆర్టీసీ బస్టాండు వరకు ఆటోలకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి కార్మికులతో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిలు పాలాభిషేకం చేశారు. అనంతరం అవినాష్‌రెడ్డి ఖాకీ యూనిఫాం ధరించి పార్టీ కార్యాలయం వరకు ఆటో నడిపారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సుమారు 400 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతలు చొప్పున ఖాకీ యూనిఫాం దుస్తులను అందజేశారు. అలాగే పులివెందులలోని రాజారెడ్డి భవన్లో జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కడపలో భారీగా కార్యక్రమం కడపలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పార్టీ కార్యకర్తల కేరింతల మధ్య కట్ చేసి పంచిపెట్టారు. నగర మాజీ అధ్యక్షుడు బండి నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సురేష్‌బాబు, అంజద్‌బాష, అమర్నాథరెడ్డిలు ప్రారంభించారు. జువైనల్ హోంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రాజశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లాల ఆధ్వర్యంలో జువైనల్ హోంలో కేక్ కట్ చేయడంతోపాటు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అంతేకాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ప్రొద్దుటూరు, రాయచోటిలోఎమ్మెల్యేల ఆధ్వర్యంలో.. ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరురోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం చేయడంతోపాటు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. రాయచోటి పట్టణంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం రామాపురం, సంబేపల్లె మండలాల్లో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.చిన్నమండెం మండలం చాకిబండలో ఎంపీటీసీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డిలు కూడా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజంపేట పాతబస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్ద బీసీ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంటిమిట్టలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బద్వేలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేయడంతోపాటు అన్నదానం చేశారు. జమ్మలమడుగులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం క్యాంబెల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కొండాపురంలో పార్టీ శ్రేణులు రక్తదాన కార్యక్రమం చేపట్టాయి. ఎర్రగుంట్లలో మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్దన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. కమలాపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించాయి. అన్నిచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. మైదుకూరులో వైఎస్సార్ సీపీ నేత రాచమల్లు రవిశంకర్‌రెడ్డి నేతృత్వంలో బద్వేలు రోడ్డులోని సీఎస్ఐ చర్చి వద్ద వృద్ధులు, వికలాంగులు, పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. -
వైఎస్సార్ కారణజన్ముడు!
సాక్షి ప్రతినిధి, కడప/విజయవాడ సిటీ/ : ‘వైఎస్ రాజశేఖరరెడ్డి కారణజన్ముడు. దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చి దేవుని సన్నిధికి చేరుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో ఆయన రోల్‌మోడల్‌గా నిలిచారు. ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమి చేయగలరో చేసి చూపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత సతీమణి వైఎస్ విజయమ్మ రచించిన ‘నేను కాను.. క్రీస్తే’అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పటికీ ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. రాజకీయాల్లో రోల్‌మోడల్‌గా నిలిచారని, మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమి చేయాలో ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో చేసి చూపించారని కొనియాడారు. తండ్రిలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రజలకు మంచి చేయాలని పాదయాత్ర చేస్తున్నారని ఆమె వివరించారు. తండ్రికి ఉన్న ఉద్దేశాలు ప్రతీదీ నెరవేర్చాలని జగన్ కోరుకుంటున్నారని ఆమె వివరించారు. సంక్షేమ పథకాలు సంపూర్ణంగా ప్రజల మధ్యలో ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా రాజన్న ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, దేవుడు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానని వైఎస్ విజయమ్మ విశ్వాసం వ్యక్తంచేశారు. వైఎస్‌ను మంచి భర్తగా, మంచి రాజుగా, మంచి సీఎంగా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది హృదయాల్లో నిలిపినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. కాగా, ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటుగా వివిధ జిల్లాల్లో రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
ఇడుపులపాయలో ఘనంగా వైఎస్సార్ జయంతి
-
ఇడుపులపాయలో మహానేతకు ఘన నివాళి
-
ఇడుపులపాయలో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, వేంపల్లె / పులివెందుల : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కార్యక్రమం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి వైఎస్ షర్మిల, ఈసీ గంగిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు శనివారమే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆదివారం ఉదయాన్నే వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న కుటుంబసభ్యులు, వైఎస్సార్ సన్నిహితులు ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్ బాషా, పార్టీ నేతలు సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు : అనంతరం వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రజలు రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారని, ప్రజల మద్దతు ఆయనకు ఉందని చెప్పారు. అనంతరం ఆమె రచించిన 'అనుదిన జ్ఞానావళి' పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
క్రిస్మస్ వేడుకలలో వైఎస్ కుటుంబసభ్యులు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలలో వైఎస్ కుటుంబసభ్యులు పాల్గొని ప్రార్థనలు చేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డితోపాటు ఇతర కుటుంబసభ్యులు ఫాదర్ బెనహర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వైఎస్సార్ సోదరి విమలమ్మ క్రీస్తు సందేశాన్ని వివరించారు. అనంతరం వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ప్రజలందరికి ఈ సందర్భంగా వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్ మేనత్త కమలమ్మ, పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వారి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతోపాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
సౌమ్యుడు, స్నేహశీలి వైఎస్ వివేకానందరెడ్డి
రైల్వేకోడూరు రూరల్: సౌమ్యుడు, స్నేహశీలి వైఎస్ వివేకానందరెడ్డి అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు పట్టణంలోని వైఎస్సార్ అతిథి గృహంలో శనివారం ఎమ్మెల్యే కొరముట్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో కేడర్‌ను బలపరచడానికే.. ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ కేడర్‌ను మరింత బలపరచడానికి వైఎస్ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. నియోజకవర్గ అ«భివృద్ధిలో వైఎస్ వివేకానందరెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్న నమ్మకం అందరిలో ఉందన్నారు. వైఎస్ ఫ్యామిలీకి ఓటు వేసే సువర్ణావకాశం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని వారికి ఓటు వేసే సువర్ణావకాశం మనకు దక్కడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొరముట్ల అన్నారు. తప్పుడు కేసులకు భయపడవద్దు: వివేకా అధికార పార్టీకి తప్పుడు కేసులు పెట్టే అలవాటు పరిపాటి అయిందని, తాము అండగా ఉంటామని ఎవరూ భయపడవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. అందరి అభిప్రాయంతోనే తనను అధిష్టానం ఎంపిక చేసిందని తెలిపారు. తప్పుడు కేసులతో ఎంపీపీ పదవిని పోగొట్టారు– బాబుల్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి తనను జైలుకు పంపి ఎంపీపీ పదవిని పోగొట్టారని ముద్దా వెంకటసుబ్బారెడ్డి అలియాస్ బాబుల్‌రెడ్డి తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడమని పేర్కొన్నారు. కొల్లంకు ఘన స్వాగతం కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి శనివారం సమావేశానికి హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, ఉప కన్వీనర్ రౌఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నందాబాలా, ఆర్వీ.రమణ, మహేష్, కోడూరు, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె మండల కన్వీనర్లు సుధాకర్ రాజు, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ముస్తాఖ్, నరసింహారెడ్డి, వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఆదాం సాహేబ్, ఎస్ఎండీ రఫి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, జిల్లా మైనార్టీ నాయకులు ఎన్.మస్తాన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, క్షత్రియ నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సదాస్మరామి
♦ జిల్లావ్యాప్తంగా ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు ♦ ఇడుపులపాయ ఘాట్‌లో నివాళు లర్పించిన వైఎస్ కుటుంబసభ్యులు ♦ కడపలో రక్తదానం.. పలుచోట్ల అన్నదానాలు ♦ వైఎస్ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసిన అభిమానులు ♦ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన నేతలు ♦ పాల్గొన్న ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, మేయర్ సాక్షి కడప: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కాగా ఇడుపులపాయకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇడుపులపాయ గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన కేక్‌ను వైఎస్ జగన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కట్ చేసి పంచిపెట్టారు. వాడ.. వాడలా వైఎస్ జయంతి వేడుకలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కుల,మత, వర్గ, బేధాలు లేకుండా వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడపలోని హెడ్ పోస్టాఫీసు వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పాలాభిషేకం చేశారు. అలాగే పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు. చాపాడు, దువ్వూరు, మైదుకూరులలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. మైదుకూరులోని వికలాంగుల పాఠశాల విద్యార్థులకు పార్టీ నేతలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాయచోటిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పూలమాలవేసి క్షీరాభిషేకం చేయడంతోపాటు పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చెర్మైన్ నసిబున్ ఖానం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రైల్వేకోడూరులోని టోల్గేట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మానందరెడ్డిలు పూలమాలలువేసి నివాళులర్పించారు. రాజంపేటలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకులు సుధాకర్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పోలా శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. రాష్ట్ర నేతలు ఆకేపాటి మురళిరెడ్డి, చొప్ప యల్లారెడ్డి పాల్గొన్నారు. అన్నదానం చేశారు. బద్వేలు నియోజకవర్గంతోపాటు పోరుమామిళ్లలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్ఆర్ చిత్ర పటానికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులర్పించారు. జమ్మలమడుగులో రాష్ట్ర నాయకులు హనుమంతురెడ్డి, శుద్దపల్లె శివుడు, పోరెడ్డి మహేశ్వరరెడ్డి, దన్నవాడ మహేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో చేయగా.. మైలవరం మండలం దన్నవాడలో రాష్ట్ర నాయకురాలు అల్లె ప్రభావతి, తాళ్లప్రొద్దుటూరులో సర్పంచ్ రామసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకంతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. ప్రొద్దుటూరులోని అన్వర్ థియేటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి కల్లూరు నాగేందర్‌రెడ్డి, ఎంపీపీ మల్లెల ఝాన్సీరాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మా శివచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి కేక్‌ను కట్ చేశారు. కమలాపురంలో పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా.. అప్పాయపల్లెలోని అనాథ శరణాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతి సిమెంటు కర్మాగార ఆవరణంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ టి.సాయి రమేష్, అసిస్టెంటు వైస్ ప్రెసిడెంటు దత్తా, జనరల్ మేనేజర్ మధుసూదన్, మైన్స్ జీఎం నాగసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
పదవుల కోసమే వైఎస్ కుటుంబంపై ఆరోపణలు
పులివెందుల : పదవులు, ప్రమోషన్ల కోసమే టీడీపీ నాయకులు వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని పులివెందుల వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పులివెందుల అభివృద్ధి గురించి టీడీపీ నేతలు ర్యాలీలు, బహిరంగ సభలు పెట్టడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందన్నారు. అభివృద్ధి అంటేనే వైఎస్ అని రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి కోసం, వైద్య, విద్యాలయాల కోసం కృషి చేసింది వైఎస్ కుటుంబం మాత్రమేనన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ ద్వారా 177 గ్రామాలకు తాగునీరు అందించే సమగ్ర మంచినీటి పథకం, వైఎస్ రాజారెడ్డి వైద్యశాల, డిగ్రీ, పాల్టెక్నిక్, ఐటీఐలతోపాటు వెంకటప్ప మోమోరియల్ స్కూలు ఏర్పాటు చేశారని.. లింగాల కుడికాలువ, పైడిపాలెం ప్రాజెక్టులతోపాటు జెఎన్టీయూ, పశుపరిశోధన సంస్థ, ట్రిపుల్ ఐటీ, ఎక్కడ చూసినా అద్భుతమైన రోడ్లు మహానేత వైఎస్ఆర్ హయాంలోనే వచ్చాయన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్లులు, పులివెందుల, వేంపల్లె, ఇప్పట్ల ప్రాంతాలలో సిమెంటు బ్యాగులు తయారు చేసే ఫ్యాక్టరీలు వచ్చాయన్నారు. గత 5 ఏళ్లలో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ ఎంపీ నిధులతో గ్రామ, గ్రామాల్లో ఖర్చు చేసింది వైఎస్ కుటుంబమేనన్నారు. అలాగే ప్రతి ఏడాది వేసవి కాలంలో పులివెందుల పట్టణ ప్రజలకు 20 ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్న ఘనత వైఎస్ కుటుంబానికే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ నాయకులను ఏకంచేసి వర్గ రాజకీయాలను రూపుమాపారని గుర్తుచేశారు. పట్టిసీమ గురించి శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సవివరంగా మాట్లాడారని, తాను ఈ పథకానికి వ్యతిరేకం కాదని అందులో లోపాలు సరి చేసుకోవాలని, దీనివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకూడదని పేర్కొన్నార న్నారు. ఈ విషయాలు టీడీపీ నేతలకు తెలియవా అంటూ ప్రశ్నించారు. సొంత నియోజకవర్గాల్లో ప్రజల మన్ననలు పొందలేని నాయకులు వైఎస్ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రిపురం ఎంపీపీ సుభాషిణి, తొండూరు ఎంపీపీ, జడ్పీటీసీలు జయప్రద, లక్ష్మినారాయణమ్మ, లింగాల జడ్పీటీసీ అనసూయమ్మ, లింగాల ఎంపీపీ సుబ్బారెడ్డి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు ఎర్రగంగిరెడ్డి, వేముల జడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, పులివెందుల మండల ఉపాధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర రైతు విభాగపు కార్యదర్శి అరవిందనాథరెడ్డి, వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, రాష్ట్ర బీసీ కార్యదర్శి నారాయణస్వామి, లింగాల, తొండూరు మండలాల యూత్ కన్వీనర్లు మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రసూల్, రైతు విభాగపు కార్యదర్శి సర్వోత్తమరెడ్డి, చక్రాయపేట మండల నాయకులు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాయనకు కుటుంబ సభ్యుల నివాళి
ఇడుపులపాయ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మతో పాటు కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతి, అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌తో పాటు పలువురు అంజలి ఘటించారు. అంతకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి మహానేతకు నివాళులు అర్పించారు. -
ఎవరు నరరూప రాక్షసులు?
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మందిని దారుణంగా హతమార్చి, మరో 119 మంది మీద పాశవిక దాడులకు పాల్పడిన అంశాన్ని ప్రస్తావించేసరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎక్కడ లేని గుబులు పుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఈ అంశం మీద వాయిదా తీర్మానం ఇచ్చారు. దీంతో పెను దుమారమే రేగింది. కృష్ణాజిల్లాలో కేవలం టీడీపీకి ఓటేయలేదన్న దుగ్ధతో ఒక గ్రామ ఉపసర్పంచిని అత్యంత పాశవికంగా ఇంటినుంచి బయటకు లాక్కొచ్చి మరీ చంపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు, ఇలాగే దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల వాళ్లు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా చూశారు. ఇదే విషయాన్ని ఆయన అసెంబ్లీలో వాయిదా తీర్మానం రూపంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద ఆయన వాయిదా తీర్మానం ఇచ్చారు. విషయం అత్యంత సున్నితమైనది కాబట్టి, ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దుచేసి దాని స్థానంలో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అది కుదరదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసనకు దిగారు. అప్పుడు సభ వాయిదా పడింది. సరిగ్గా ఈ సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాలువ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు వైఎస్ కుటుంబంపై విషం కక్కారు. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగి, కోర్టు తీర్పులు కూడా వచ్చేసిన పరిటాల రవీంద్ర హత్య కేసును ప్రస్తావించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణలు గుప్పించారు. ఆయన తండ్రి, తాత.. అందరూ నేరచరితులేనని, నరరూప రాక్షసులని అన్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. పరిటాల రవీంద్ర హత్య కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మీద కూడా సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు అప్పట్లో డిమాండ్ చేయగా, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాంటి పక్షపాతం లేకుండా సీబీఐ విచారణ జరిపించారు. వారు ముగ్గురినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయినా ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని తెలుగుదేశం నాయకులు కేవలం ఎదురుదాడి చేయడం కోసమే అన్నట్లుగా విమర్శలు చేయడం వారి నీచత్వాన్ని చూపిస్తోందని నాయకులు, రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. వైశ్రాయ్ హోటల్ కుట్రతో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేసి, ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా దించేసి, మనస్తాపంతో మరణించడానికి కారకులైన టీడీపీ నాయకులే అసలైన నరరూప రాక్షసులని మండిపడ్డారు. -
దళితులను ఆదరించింది వైఎస్ కుటుంబమే
తిరుపతి ఎంపీ వరప్రసాదరావు నెల్లూరు: ‘‘దళితులను వైఎస్ కుటుంబం ఆదరించినంతగా మరే కుటుంబం, ఏ పార్టీ కూడా ఆదరించి అక్కున చేర్చుకోలేదు. దళితులకు వైఎస్సార్సీపీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలోనూ లేదు. అంతెందుకు ప్రాంతీయ పార్టీల్లో దళితులను మాట్లాడనివ్వడమే గగనం. అలాం టిది అనేకమంది దళిత నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే’’ అని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామితో కలిసి ఆయన ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ కుటుంబం జూపూడి ప్రభాకరరావుకు ఇచ్చినంత ప్రాధాన్యం మరెవరికీ ఇవ్వలేదన్నారు. నాడు వైఎస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారని గుర్తు చేశారు. తాజాగా వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారన్నారు. జూపూడి ఓటమికి పార్టీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డిని నిందించడం సరికాదన్నారు. సుబ్బారెడ్డి సొంతపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమిని కోరుకుంటారనడం సరికాదన్నారు. ఓటమి బాధలో జూపూడి కీలక నేతలను నిందించడం సరికాదన్నారు. -
వైఎస్‌కు కుటుంబసభ్యుల ఘన నివాళి
వేంపల్లె, న్యూస్‌లైన్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పిం చారు. ఉదయం 10 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్దకు చేరుకున్న జగన్, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ బ్రదర్ అనిల్‌కుమార్, సతీమణి భారతీరెడ్డి, మేనల్లుడు రాజారెడ్డి, మేనకోడలు అంజలి, కుమార్తెలు హర్ష, వర్షలతోపాటు వైఎస్సార్సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ చక్రాయపేటఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి తదితరులు వైఎస్‌కు నివాళులు అర్పించారు. చర్చిలో ప్రార్థనలు: క్రిస్మస్కు ఒకరోజు ముందుగా ఇడుపులపాయ చర్చిలోని ఆడిటోరియంలో జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దాదాపు 2 గంటల సేపు ఈ ప్రార్థనలు జరిగాయి. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఆయన గడిపారు. అంతకుముందు ఫాస్టర్లు ఐజాక్ వరప్రసాద్, మృత్యుంజయ, నరేష్‌బాబులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వారిని దీవించారు. అనంతరం పులివెందులకు బయలుదేరివెళ్లారు. -
వైఎస్ కుటుంబానికి విధేయులం
ఆ పత్రికలోవి అసత్య కథనాలు ఏపీ ఎన్జీవో నాయకుల సృష్టీకరణ పులివెందుల, న్యూస్‌లైన్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి తాము విధేయులుగానే ఉన్నామని.. తమపై ఓ దినపత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందని పులివెందుల ఎన్జీవో సంఘ నాయకులు స్పష్టంచేశారు. సోమవారం ఎన్జీవో కార్యాలయంలో అధ్యక్షుడు గురుప్రసాద్, ఉపాధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందులలో ఎన్జీవో సంఘం అభివృద్ధికి వైఎస్ కుటుంబీకులు ఎంతో సహకరించారన్నారు. వారి చలువతోనే పట్టణ నడిబొడ్డున కార్యాలయాన్ని నిర్మించుకున్నామన్నారు. అశోక్‌బాబు, బషీర్‌లు తమ నాయకులేనని.. ఎవరు గెలిచినా వారి కింద పనిచేస్తామన్నారు. అశోక్‌బాబును ఓడించాలని.. బషీర్‌ను గెలిపించాలని వైఎస్ జగన్ తమకు చెప్పలేదన్నారు. కొంతమంది స్వార్థపరులు, సంఘంలో పదవులు పోగొట్టుకున్నవారు దుష్ర్పచారం చేయించారన్నారు. వైఎస్ కుటుంబానికి, ఉద్యోగుల మధ్య మనస్పర్థలు రావడానికి ఓ పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందన్నారు. ఆ పత్రికపైన, కథనాన్ని రాసిన విలేకరిపైన పరువు నష్టం దావా వేస్తామన్నారు. సమావేశం అనంతరం వారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. -
పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు
-
పదే పదే అదే విషం.. పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు
* పరాకాష్టకు చేరిన రామోజీ రాతలు * జగన్ బెయిల్‌పై తీర్పు వెలువడే ముందు విషపు రాతలు * భారతి సిమెంట్‌పై వాస్తవాల్ని వదిలిపెట్టి ఏకపక్ష కథనం * ప్రైవేటు భూమి కొనుగోలు చేస్తే... ప్రభుత్వానికి నష్టమంటూ రాతలు * లీజు పొందిన గుజరాత్ అంబుజా ఐదేళ్లుగా ఫ్యాక్టరీ పెట్టనే లేదు అందుకే రద్దు; మూడేళ్లలో ఫ్యాక్టరీని సాకారం చేసిన జగన్ * దానిద్వారా ప్రస్తుతం 8 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి * కావాలనే వాస్తవాలను విస్మరించి రామోజీ రంకెలు * దర్యాప్తు ఆరంభం నుంచీ ఇవే తరహా విషపు రాతలు * దానికి ఎల్లో మీడియా, చంద్రబాబు తందాన తాన * విచారణకే స్వీకరించని చార్జిషీటు రామోజీకెలా అందింది? వైఎస్ కుటుంబంపై విషంగక్కేలా దారుణ వ్యాఖ్యలు చేస్తూ... మళ్లీ దానికి ‘సీబీఐ చార్జిషీట్’ అనే రంగు పులిమారు. అయినా సీబీఐ కోర్టుకిచ్చిన పత్రాలు ఈనాడు చేతికెలా వచ్చాయి? అవిభక్త కవలల్లాంటి రామోజీ-చంద్రబాబులు సీబీఐతో కుమ్మక్కయిన ఫలితమా ఇది? నిత్యం ఉషోదయంతోపాటే జగన్ నామ జపం చేయనిదే పొరపాటున కూడా పొద్దు గడవని ‘ఈనాడు’.. వైఎస్సార్సీపీ అధినేతపై షరామామూలుగానే మళ్లీ విషం కక్కింది. ఈసారి మరింతగా దిగజారిపోయింది. ఆ క్రమంలో నైచ్యానికే నయా అర్థం చెప్పింది. ‘సీబీఐ వేసిన చార్జిషీట్’ అంటూ గురువారం పతాక శీర్షికల్లో అది వండి వార్చిన కథనాన్ని చూస్తే గోబెల్స్ కూడా గుండెలు బాదుకోవాల్సిందే! ఇంకా బయటికి వెల్లడేకాని, న్యాయమూర్తి విచారణకైనా స్వీకరించని, నిందితుడికి కాపీ కూడా ఇవ్వని చార్జిషీట్లోని వివరాలు ఇవేనంటూ శివాలెత్తిపోయి రామోజీ రాసిన రోత రాతలపై.. బరితెగించడానికైనా, దిగజారిపోవటానికైనా ఒక హద్దుంటుంది అరాచకానికైనా, నైచ్యానికైనా పరాకాష్టంటూ ఒకటుంటుంది కానీ రామోజీరావు, ఆయన విషపుత్రిక ‘ఈనాడు’ వాటన్నిటినీ ఎప్పుడో దాటేశారు!. న్యాయస్థానాల్లో ప్రమాణం చేసి మరీ అవలీలగా అబద్ధాలాడేస్తారు రామోజీ! బంధువుల్ని కూడా వదలకుండా నమ్మినవారిని నిలువునా వంచిస్తారు రామోజీ! ఫోర్జరీ, చీటింగ్ కేసులు ఎదుర్కొంటున్నా... పన్ను కట్టలేదన్న కేసులు పెండింగ్‌లో ఉన్నా... ‘మార్గదర్శి’ పునాదులే అక్రమమని చెప్పే కేసులు న్యాయస్థానాల్లో నడుస్తున్నా... కనీస విలువలు పాటించాలన్న జ్ఞానం ఆయనకు రాకపోవటమే దారుణం. సీబీఐ వేసిన ‘చార్జిషీట్’ అంటూ గురువారం పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అసలు ఏ దర్యాప్తు సంస్థయినా కోర్టుకు చార్జిషీటు సమర్పిస్తే ఆ చార్జిషీటును తొలుత న్యాయమూర్తి విచారణకు స్వీకరించాలి. అప్పుడే అది బహిరంగమవుతుంది. పెపైచ్చు నిందితుడికి కాపీ ఇస్తారు. కానీ రెండు రోజుల కిందట వేసిన చార్జిషీట్‌ను ఇంకా జడ్జి విచారణకు స్వీకరించనేలేదు. నిందితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డికీ దాని కాపీ అందలేదు. కానీ ఇంతలోనే రామోజీ శివాలెత్తేశారు. జగన్మోహన్రెడ్డి బెయిలు పిటిషన్‌పై న్యాయస్థానం తీర్పు వెలువరించనుండటంతో... ‘దాన్ని ప్రభావితం చేయడానికా?’ అనే రీతిలో అడ్డగోలు రాతలు రాసేశారు. వైఎస్ కుటుంబంపై విషం గక్కేలా దారుణ వ్యాఖ్యలు చేస్తూ... మళ్లీ దానికి ‘సీబీఐ చార్జిషీట్’ అనే రంగు పులిమారు. అయినా సీబీఐ కోర్టుకిచ్చిన పత్రాలు ఈనాడు చేతికెలా వచ్చాయి? అవిభక్త కవలల్లాంటి రామోజీ-చంద్రబాబులు సీబీఐతో కుమ్మక్కయిన ఫలితమా ఇది? బాబుపై దర్యాప్తుకు చేతులు రావు! దర్యాప్తు సంస్థతో రామోజీ-చంద్రబాబు కలయిక ప్రభావాన్ని ఇప్పటికే ఈ రాష్ట్రం ప్రత్యక్షంగా చూసింది. చంద్రబాబు, రామోజీల అక్రమాలపై విచారణ జరపండంటూ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులిచ్చినా సరే... సీబీఐ మాత్రం వాళ్ల జోలికే వెళ్లలేదు. ఆఖరికి ఈ మిత్రద్వయం సుప్రీంకోర్టుకు వెళ్లి, అక్కడా కాదన్నాక మళ్లీ హైకోర్టుకు వచ్చి... కేసు రెండు మూడు బెంచిలు మారేలా నాటకమాడేదాకా సీబీఐ కదిలితే ఒట్టు! చివరకు హైకోర్టులో జస్టిస్ రోహిణి నేతృత్వంలోని బెంచ్... అంతకుముందు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయటంతో ఆ దర్యాప్తు ఆగిపోయింది. దానికన్నా ముందు ఐఎంజీ కేసులోనూ ఇంతే. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే... ఇదే సీబీఐ తనకు తగినంత సిబ్బంది లేరనే సాకుతో బాబును వదిలిపెట్టేసింది!! అదే సీబీఐ వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయానికొచ్చేసరికి మాత్రం ఎక్కడలేని సత్తువనూ కూడగట్టుకుని ‘నభూతో...’ అన్న రీతిలో రెచ్చిపోయింది. 29 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ... ఇళ్లు, ఆఫీసులు, ఇన్వెస్టర్ల కార్యాలయాలు అన్నిటిపై ఏకకాలంలో దాడులు చేసి మరీ... 14 రోజుల్లోనే కోర్టుకు నివేదిక సమర్పించింది. బాబు-రామోజీ ద్వయం సీబీఐతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు ఇవన్నీ బలం చేకూర్చేవే కాదా? బాబు దొరికినా వదిలేశారందుకే!! బాబు అడ్డంగా దొరికింది ఐఎంజీ కేసులో మాత్రమే కాదు... ఎమ్మార్, రాంకీ కేసుల్లో కూడా. ఎందుకంటే శ్రీమంతుల గోల్ఫ్ కోర్సుకు ప్రభుత్వ భూమి ఇవ్వాలన్న ఆలోచన బాబుదే. 200 ఎకరాలివ్వాలనుకున్నా... అది చాలదని దాన్ని 435 ఎకరాలకు పెంచిందీ బాబే. ఎమ్మార్‌కు టెండరు దక్కేలా చక్రం తిప్పటమే కాక... అంత భూమినీ పప్పుబెల్లాలకు కట్టబెట్టేసిందీ ఈ బాబే. అన్ని చేసినా ఎమ్మార్‌పై దర్యాప్తులో మాత్రం బాబును వదిలేసింది దర్యాప్తు సంస్థ. అదేమని కోర్టు అడిగితే... 2004 కన్నా ముందు జరిగిన దాన్ని తాము దర్యాప్తు చేయటం లేదని కూడా చెప్పింది!! ఏమనుకోవాలి ఈ బంధాన్ని? రాంకీ సంస్థకు విశాఖ ఫార్మా సిటీలో 2,142 ఎకరాలను సింగిల్ టెండర్‌పై కట్టబెట్టింది కూడా బాబే. కానీ ఈ అంశంపై దర్యాప్తు చేసినపుడు... గ్రీన్‌బెల్ట్ పెంచుతామని ప్రతిపాదించి పెంచనందుకు వైఎస్ ప్రభుత్వాన్నే సీబీఐ తప్పుబట్టింది తప్ప... 2,142 ఎకరాల్ని సింగిల్ టెండర్‌పై ఎలా కట్టబెట్టారని బాబును అడిగితే ఒట్టు! బాబుకెందుకు ఈ నజరానాలు? రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లుకు పరోక్షంగా మద్దతిచ్చినందుకా? రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను గాలికొదిలేసినందుకా? రూ.32,000 కోట్ల కరెంటు భారం మోపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిన దెబ్బకు మండిపడుతూ ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్‌ను కాపాడినందుకా? బెయిల్ అనగానే ఢిల్లీకెందుకో? కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తారు? చనిపోయిన నాయకుడిపై... అది కూడా మరణించిన ఏడాదిన్నర తరవాత... అది కూడా ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాక... ఇద్దరూ కుమ్మక్కయి కేసులు వేయటం నిజం కాదా? చట్టప్రకారం 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే సాకుతో అడ్డుకోవటం అబద్ధమా? అయినా జగన్ బెయిల్ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చినా చంద్రబాబు ఢిల్లీకెందుకు వెళతారు? తన మనుషుల్నెందుకు పంపిస్తారు? ఏదో ఒక సంచలనాన్ని సృష్టిస్తూ... దాన్ని ఎల్లో మీడియా ద్వారా తాటికాయలంత అక్షరాలతో ఏదో జరిగిపోయినట్టుగా రాయించటం... న్యాయస్థానాల్ని ప్రభావితం చేసే రీతిలోనే ఆ రాతలుండటం... ఇవన్నీ ఎందుకు? ఏం! జగన్మోహన్రెడ్డికి బెయిలొస్తుందంటే బాబుకు అంత భయమెందుకు? రామోజీకి అంత ఉలుకెందుకు? జగన్ జనం గుండెల్లో ఉన్న నేత కనుక ఆయన బయటికొస్తే తమ చిరునామాలు గల్లంతౌతాయనా? కొనగలవా రామోజీ? ఇక్కడ రామోజీ గమనించాల్సిందేంటంటే... వైఎస్ రాజశేఖరరెడ్డి గనక నిజంగా తన కుమారుడికి మేలు చేయాలనుకుంటే ఎల్ అండ్ టీకి బాబు కట్టబెట్టినట్లుగా హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా ఏ రూ.4 వేలకో ఇస్తారు గానీ... ఇలా ప్రైవేటు భూములను ఎకరా రూ.3 లక్షలు పై చిలుకు పెట్టి కొనుక్కునేలా ఎందుకు చేస్తారు? నిజం చెప్పాలంటే ప్రభుత్వ భూముల్లో ఉంటేనే మైనింగ్ లీజులకు విలువ. ఎందుకంటే కారుచౌకగా కట్టబెట్టే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేటు భూముల్లోనైతే కొనుగోలుదారే డిమాండ్‌కు తగ్గ ధర చెల్లించి మరీ కొనాలి. రామోజీ గనక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే అలాంటి భూములు చాలానే ఉంటాయి. అయినా సున్నపురాయి నిక్షేపాలు సిమెంట్ కంపెనీకి కాక దేనికైనా పనికొస్తాయా? సిమెంట్ కంపెనీకి వాటిని లీజుకిస్తే తప్పేంటి? అంబుజా ఎందుకు ఫ్యాక్టరీ పెట్టలేదు? గుజరాత్ అంబుజా కంపెనీ 2000 నుంచి 2005 వరకూ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టలేదన్న విషయం రామోజీ రాతల్లో కనిపిస్తుంది. దాన్ని ఏమాత్రం ప్రశ్నించని రామోజీ.. అలా చేయనందుకే ఆ లీజును జగన్కుఇచ్చారని. జగన్ మూడేళ్లలో ఫ్యాక్టరీ కట్టి చూపించారని మాత్రం చెప్పరు. ఎందుకంటే తన ‘పాలసీ’ పుట్టలో అది పట్టదు మరి! మరీ ఇంత దారుణమా రాజ గురివిందా!! ఈరోజు భారతి సిమెంట్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల పైచిలుకు మందికి ఉద్యోగాలు కల్పిస్తోందిగా! గుజరాత్ అంబుజా అక్కడ ప్లాంటు పెట్టని నేపథ్యంలో, జగన్ కూడా ముందుకు రాకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవా? కడప జిల్లాలో ‘భారతి’ వచ్చేదాకా పాతికేళ్లుగా ఒక్క సిమెంట్ కంపెనీ అయినా వచ్చిందా? అయినా ప్రైవేటు భూమిని కొనుక్కుని కంపెనీ పెడితే ప్రభుత్వానికి పన్నులు, ఇతర సుంకాల వల్ల భారీ ఆదాయమే తప్ప నష్టమెలా వస్తుంది? ఇదేమీ ఫిల్మ్ సిటీ మాదిరిగా పేద రైతుల్ని బెదిరించి, ప్రభుత్వ యంత్రాంగం సాయంతో కబ్జాలు చేసి సాధించుకున్న భూమి కాదు కదా! ఇప్పటికీ ఫిల్మ్ సిటీ భూముల్ని పోగొట్టుకుని వేదన అనుభవిస్తున్న రైతులు రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టూ కోకొల్లలు. కానీ భారతి సిమెంట్ వల్ల నష్టపోయామనే వారిని ఒక్కరినైనా చూపించగలరా రామోజీ? మరెందుకీ దగుల్బాజీ రాతలు? ఈ మాత్రం ఇంగితం లేదా? జగన్మోహన్రెడ్డి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. సోమవారం తీర్పు రానుంది. దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పింది కనక ఇక బెయిల్‌కు అడ్డు ఉండకపోవచ్చన్నది న్యాయ వర్గాలు సైతం చెబుతున్న మాట. ఈ తరుణంలో ఇంకా ఎవరికీ అందని చార్జిషీటు సమాచారం ఎల్లో బ్రదర్స్ పత్రికల్లోనే ఎలా వచ్చింది? పోనీ ఆ చార్జిషీట్లోని సమాచారాన్ని యథాతథంగా ప్రచురిస్తారా అంటే అదీ లేదు. నాణేనికి ఒకవైపును మాత్రమే చూపిస్తూ... దానికి తమ తిక్క కామెంట్లు జోడిస్తూ నోటికొచ్చినట్టుగా వండి వార్చేస్తారు రామోజీ!! తీర్పుకు ముందు ఇంతటి భ్రష్టుపట్టిన రాతలు రాశారంటే రామోజీకి దురుద్దేశాలు లేవని నమ్మేదెవరు? ఇరికించాలన్నదే మీ లక్ష్యమా? కేసు లేకపోయినా... తప్పు జరగకపోయినా... ప్రతి విషయంలోనూ ఏదో జరిగిపోయినట్టుగా రాసి అందరినీ ప్రభావితం చేయాలన్న దురుద్దేశంతో ఎల్లో కూటమి దిగజారి చేస్తున్న యుద్ధమిది. అందుకే ఇండియా సిమెంట్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం నీళ్లివ్వటం రామోజీ దృష్టిలో గానీ, సీబీఐ దృష్టిలో గానీ తప్పు కాదు. అదే కంపెనీకి, అవే నీళ్లను రెన్యువల్ చేస్తూ వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు!! అయినా నీళ్లు, కరెంటు ఇవ్వకపోతే కంపెనీలొస్తాయా? కంపెనీలు లేకుంటే ఉద్యోగాలొస్తాయా? పెన్నా సిమెంట్స్ అధిపతి తన సొంత భూమిలో హోటల్ కట్టుకుంటానంటే... మిగతా హోటళ్లలానే దానికి అనుమతి ఇస్తే... అది వైఎస్ ప్రభుత్వం ఇచ్చింది కనక తప్పేననే రీతిలో సాగిన దర్యాప్తు కాదూ ఇది!!?. దర్యాప్తు అధికారి నేరుగా మీడియాకు ఐదారు వందల ఫోన్ కాల్స్ చేసి... వైఎస్ కుటుంబంపై బురద చల్లటమే లక్ష్యంగా చేసిన దర్యాప్తు కాదూ ఇది? దాన్ని భూతద్దంలో చూపిస్తూ... వక్రీకరించి పతాక కథనాలు వండుతూ అటు ఎల్లో మీడియా... దానికి మద్దతుగా అపవిత్ర పొత్తులతో చెలరేగుతున్న ఎల్లో పార్టీ... ఇవన్నీ కలిసి ఈ రాష్ట్రం విభజన పేరిట రావణ కాష్టంలా మారినా దాంట్లోనే చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి భ్రష్టుపట్టిన వ్యవస్థల రాతల్ని ఈ రాష్ట్ర ప్రజలే తిరగరాస్తారు. సాయిరెడ్డి ఆ సమావేశాల్లో ఉన్నారా? భారతి సిమెంట్‌కు ఒక్క ఓబీసీ మాత్రమే రుణమిచ్చినట్టు... అది కూడా విజయసాయిరెడ్డి వల్లే వచ్చినట్టు ఎందుకీ కుట్రపూరిత రాతలు? ఆ సంస్థకు ఆరేడు బ్యాంకులు రుణాలిచ్చాయి. వాటిలో ఓబీసీ ఒకటి. మరి వాటన్నిటినీ సాయిరెడ్డి మేనేజ్ చెయ్యగలరా? అయినా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు బ్యాంకు బోర్డు ముందుకు వచ్చినప్పుడు సాయిరెడ్డి తనంత తనే సమావేశాల నుంచి బయటికెళ్లిపోయారు. అవన్నీ రికార్డులు చూస్తే తెలుస్తాయి. మరి దానర్థం కంపెనీ ప్రమోటర్లతో తనకున్న సంబంధాలు చెప్పినట్టు కాదా? అయినా బ్యాంకులు రుణాలిస్తే తప్పా? జగన్ తను వ్యక్తిగత గ్యారంటీ ఇవ్వటంతో పాటు షేర్లు కూడా తనఖా పెట్టారు. అంతేకాక ఆ రుణాన్ని అణా పైసల్తో సహా సకాలంలో చెల్లించారు. ఇందులో తప్పేముంది? అప్పటికే ఒక కంపెనీని విజయవంతంగా నడుపుతున్న జగన్‌కు బ్యాంకులు రుణాలిస్తే తప్పా? ఏం... మీలా చిత్తు కాగితాలు, పాత సీరియళ్ల పేటెంట్ హక్కుల్ని తనఖా పెట్టి వేల కోట్లు రుణం తీసుకోకపోవటమే తప్పా? ముఖ్యమంత్రి ఇంట్లో సంతకాలు జరగటమూ తప్పేనా? దానర్థం అప్పట్లో జగన్ ఇక్కడ లేరనేగా! బెంగళూరులో ఉండే జగన్మోహన్రెడ్డి నెలకు ఒకటిరెండు రోజులు ఇక్కడకు వస్తే... ఆ రెండు మూడ్రోజులు తన తల్లిదండ్రులతో ఉంటే అది తప్పా? బ్యాంకు అధికారులు బెంగళూరుకు ఖర్చులు పెట్టుకుని వచ్చే బదులు... ఇక్కడే సంతకాలు తీసుకుంటే అది అక్రమమా? కొన్ని సంతకాలు బెంగళూరులో కూడా పెట్టినా ఆ విషయం మాత్రం ఎందుకు రాయరు? ఎందుకీ కుట్రలు? న్యాయమూర్తి నివేదికా పట్టదా? రాష్ట్ర ప్రభుత్వం గనక ఈ భూ కేటాయింపులో తప్పు చేసి ఉంటే ట్రిబ్యునల్‌లో గుజరాత్ అంబుజా వాదనలు వినిపించింది కదా! కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వటం రామోజీకి తెలియదా! ఆ తరవాత హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ రాజు నేతృత్వంలో కమిషన్ వేయడం.. ఆయన నివేదికనిస్తూ దీన్లో ఏ తప్పూ జరగలేదని చెప్పడం... ఇవేవీ రామోజీకి పట్టవా? ఒకవేళ పట్టినా, ‘కళ్లు మూసుకుని అబద్ధాలు చెబితే చాలు, ఎవరినైనా తప్పుదోవ పట్టించొచ్చు’ అన్న కుయుక్తా!? లీజు గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? మైనింగ్ లీజుల గురించి మాట్లాడుతున్న రామోజీకి... అసలు లీజు అనే పదాన్ని పలికే నైతిక అర్హత ఉందా? హైదరాబాద్ నుంచి విశాఖపట్నం దాకా ఎక్కడ చూసినా రామోజీది గ‘లీజు’ చరిత్రేగా!! హైదరాబాద్‌లో లీజుకు తీసుకున్న భూమిని ఖాళీ చేయనంటూ భీష్మించుకుంటే చివరికి రాజకీయ జోక్యంతో స్థల యజమాని సెటిల్ చేసుకోవటం అబద్ధమా? అదే యజమానికి చెందిన విశాఖ స్థలాన్ని లీజు గడువు ముగిసినా ఇంకా ఖాళీ చెయ్యలేదు రామోజీ. అంతేగాక దాన్ని తన సొంత స్థలమని చెప్పి... కొంత భాగం ప్రభుత్వానికిచ్చి, పరిహారంగా ఇచ్చిన భూమిని తనే భోంచేసిన చరిత్ర ఆయనది. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి చీటింగ్, ఫోర్జరీ వంటి ఇతర నేరాలకు పాల్పడ్డారనే కేసులూ నమోదయ్యాయి. ఇక విశాఖలో డాల్ఫిన్ హోటల్ కోసం లీజుకిచ్చిన వారిని బెదిరించి మరీ కారుచౌకగా కొట్టేసిన ఘనుడాయన. విజయవాడలో సొంత బంధువుల స్థలాన్ని లీజుకు తీసుకుని, గడువు ముగిసినా తిరిగివ్వకుండా న్యాయ పోరాటానికి దిగిన ఘనుడు కూడా! ఇలాంటి వ్యక్తికి ఎదుటివారు ఏం చేసినా అది అక్రమంగానే కనిపించటంలో చిత్రమేముంది? ఫిల్మ్ సిటీ భూముల మాటేంటి? నగరానికి అత్యంత సమీపంలో 2,500 ఎకరాలకు పైగా స్థలాన్ని... పేద రైతుల పొట్టగొట్టి, బెదిరింపులకు పాల్పడి మరీ ఫిల్మ్ సిటీ కోసం సొంతం చేసుకున్న రామోజీకి... ఇతరులు ఏం చేసినా అన్యాయంగా కనిపించటం ఆశ్చర్యం అనిపించదు. ఎకరాకు రూ.10-15 వేలు విదిలించి, పేద రైతుల్ని బెదిరించి మరీ భూముల్ని స్వాధీనం చేసుకున్న రామోజీకి భూముల క్రయ విక్రయాలన్నీ అక్రమాలుగానే కనిపించొచ్చు. ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, అసైన్డ్ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, ఆఖరికి భూ దాన భూముల్ని కూడా భోంచేసిన రామోజీకి ప్రైవేటు వ్యక్తులకు భారీ ధర చెల్లించి కొనుక్కోవటం కూడా నేరమనే అనిపించొచ్చు. రామోజీ కట్టాల్సిన పన్ను 1,117 కోట్లు! ఇతరులపై బురద జల్లటానికి చెలరేగిపోయే రామోజీకి... తన ఒంటికున్న మకిలి కనిపించకపోవటమే విచిత్రం. ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట అక్రమంగా డిపాజిట్లు తీసుకున్నందుకు ఆయనపై భారీగా ఐటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీని ప్రకారం 2001-02 నుంచి 2005-06 మధ్య ఆయన రూ.1,117 కోట్ల పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారు. దీన్ని చెల్లించాలని ఐటీ నోటీసులివ్వడంతో రామోజీ కోర్టుకు వెళ్లారు. తనకు నోటీసులిచ్చిన అధికారికి దురుద్దేశాలు ఆపాదించటంతో కోర్టు కోపగించింది. రామోజీపై జరిమానా వేసింది. దాంతో జరిమానా చెల్లించి పిటిషన్లు విత్ డ్రా చేసుకున్నారు. అయినా మళ్లీ కొత్త పిటిషన్లు వేసి.. ఐటీ పేర్కొన్న చట్టాలేవీ తనకు వర్తించవన్నారు. హైకోర్టులో ఇది పెండింగ్‌లో ఉంది. కాకపోతే దీన్ని వెకేట్ చేయించడానికి 2009 నుంచి ఇప్పటిదాకా ఐటీ శాఖ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఏటా కనీసం రూ.120 కోట్ల మేరకు వడ్డీ నష్టపోతున్నా ఐటీ శాఖ ఎందుకు మిన్నకుందనేది ఎవరికీ అర్థం కాదు!