
వైఎస్‌కు కుటుంబసభ్యుల ఘన నివాళి
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పిం చారు.
వేంపల్లె, న్యూస్‌లైన్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పిం చారు. ఉదయం 10 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్దకు చేరుకున్న జగన్, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ బ్రదర్ అనిల్‌కుమార్, సతీమణి భారతీరెడ్డి, మేనల్లుడు రాజారెడ్డి, మేనకోడలు అంజలి, కుమార్తెలు హర్ష, వర్షలతోపాటు వైఎస్సార్‌సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ చక్రాయపేటఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి తదితరులు వైఎస్‌కు నివాళులు అర్పించారు.
చర్చిలో ప్రార్థనలు: క్రిస్మస్‌కు ఒకరోజు ముందుగా ఇడుపులపాయ చర్చిలోని ఆడిటోరియంలో జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దాదాపు 2 గంటల సేపు ఈ ప్రార్థనలు జరిగాయి. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఆయన గడిపారు. అంతకుముందు ఫాస్టర్లు ఐజాక్ వరప్రసాద్, మృత్యుంజయ, నరేష్‌బాబులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వారిని దీవించారు. అనంతరం పులివెందులకు బయలుదేరివెళ్లారు.