Rajasekhar Reddy
-
మనవరాలి పెళ్లి సంగీత్‌లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎదో విధంగా హల్చల్ చేస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్‌ని ఇరగదీశారు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని.. కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది.మనవరాలి సంగీత్ లో డీజే టిల్లు పాటకు మల్లన్న మాస్ స్టెప్పులు 🕺👌#MallaReddy #Mallareddydance pic.twitter.com/D0tMDpBED6— Pulse News (@PulseNewsTelugu) October 21, 2024 -
నర్రెడ్డి నాటకాలు చాలు
-
నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధాలేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. నర్రెడ్డి బ్రదర్స్ నాటకాలాడుతున్నారని చెప్పారు. వైఎస్ వివేకా రక్తపు వాంతులతో చనిపోయాడని తాను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెప్పలేదన్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్‌లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. అలాంటిది రాజశేఖర్‌రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్ వివేకా లెటర్‌ను దాచిపెట్టడానికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్ గురించి తాను రాజశేఖర్‌రెడ్డికి ఫోన్లో చెప్పగా ఆయనే దాచమన్నారని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నారు.అవినాశ్‌రెడ్డి తనను మేనేజ్ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్‌ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగానికి 9 నెలలు సస్పెన్షన్‌కు గురయ్యానని, ప్రమోషన్, పాస్‌పోర్ట్ రెన్యువల్ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.తాను వైఎస్ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలిపారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మనస్పర్థలు వచ్చాయన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ కుమారుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వారా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తున్నారన్నారు. గతంలో డ్రైవర్‌గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ముందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రామ్‌సింగ్ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారుఓసారి సునీత దంపతులు తనను హైదరాబాద్‌కు పిలిపించుకొని, రామ్‌సింగ్ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరాఖండిగా చెప్పానన్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖర్‌తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్పటికైనా ఈ కేసులో రాజశేఖర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు.వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్‌సింగ్ కొట్టాడుఢిల్లీలో సీబీఐ అధికారి రామ్‌సింగ్ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆతర్వాత ఒకరోజు రామ్‌సింగ్ వాట్సప్ కాల్ చేసి తన కుమారుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.తామిద్దరం మరుసటిరోజు రామ్‌సింగ్ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టెతో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికిస్తామని చెప్పాడన్నారు. తన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్‌సింగ్ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకున్నారని తెలిపారు.నాకేదైనా జరిగితే వారిదే బాధ్యతతనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్‌రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. -
నల్లమలకూ ఓ వీరప్పన్!
విలువైన కలపను టోకుగా కాజేశాడా నేత.. నల్లమల వీరప్పన్‌గా పేరుమోశాడాయన.. నాటుసారా వ్యాపారంలో అందెవేసిన చేయి.. తన సారా వ్యాపారానికి అడ్డొచ్చి న వారి అంతు చూడడానికి సైతం వెనుకాడనంత దౌర్జన్యపరుడు.. ఈ అక్రమాలన్నిటితో రూ.వేల కోట్లను అనతికాలంలోనే ఆర్జించి.. తన దోపిడీ సామ్రాజ్యాన్ని బలపరుచుకున్న నేత.. అక్కడి జనాన్ని తన కంటి చూపుతో శాసించారు.సారా వ్యతిరేకోద్యమం ముమ్మరంగా రాష్ట్రంలో ఊపేస్తే.. అప్పటి ఈ టీడీపీ నేత నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈయనకు వ్యతిరేకంగా గొంతెత్తడానికి సాహసించలేకపోయారంటే జనాన్ని ఎంతగా భీతిగొలిపారో అర్థం చేసుకోవచ్చు. తుదకు తనఅక్రమాలకు మద్దతిచ్చే టీడీపీలో చేరారు.. అదొక్కటే కాదు.. అవకాశవాదంతో ఏ ఎండకా గొడుగు పడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోనూ చేరారు.. ఈ నేత నీడన పెరిగిన ఆయన తనయ ప్రస్తుతం టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.సాక్షి, టాస్‌్కఫోర్స్: ఆ పేరు వింటే చాలు నల్లమల వీరప్పన్ గుర్తుకు వస్తారు. కొన్నేళ్ల కిందట నల్లమల అడవిని అడ్డాగా చేసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. కలప చెట్లను ఇష్టానుసారం నరికి హైదరాబాద్‌కు తరలించి రూ. వేల కోట్లు సంపాదించారు. తనకు ఎదురుమాట్లాడితే వారి పని అంతే. అడ్డుకుందామని యతి్నంచిన అధికారులను నయానో భయానో లొంగదీసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. అంగబలానికి తోడు అర్ధబలం తోడవడంతో ఆయన అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది. తండ్రి రాజకీయ అండతో..: తండ్రి రాజకీయ అండతో ఈ నేత విచ్చలవిడిగా సంపాదించారు. జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు, ఓర్వకల్లు మండలాల్లో సొంతంగా సారా అంగళ్లు తెరిచారు. పల్లెలకు సారాను పరిచయం చేశారు. సారా వల్ల అనేక వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సారా అంగళ్లను తమ గ్రామాల్లో తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా, తన అంగబలంతో వాటిని అణచివేశారు.1989లో రాష్ట్ర వ్యాప్తంగా సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. రోడ్ల మీదకి వచ్చి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న సారా రక్కసిని పారదోలాలని రాష్ట్రమంతటా నినదించారు. ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంలో మాత్రమే సారా ఉద్యమం చేయాలంటే గజగజ వణకాల్సిన పరిస్థితిని ఈ నేత సృష్టించారు. ఉద్యమం చేస్తే తమను ఏం చేస్తారోనన్న భయం నియోజకవర్గ ప్రజలను వెంటాడింది. ఉద్యమం పెద్ద ఎత్తున ఎగసిపడిన రోజుల్లోనూ స్థానికంగా మాత్రం సారా వ్యాపారం విచ్చలవిడిగా సాగిపోయింది. రూ.కోట్లలో విభేదాలతో బయటకు... 1993లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డితో సారా కాంట్రాక్టు విషయంలో ఈ నేతకు విభేదాలు వచ్చాయి. తన సారా వ్యాపారానికి సహకరించడంలేదన్న కోపంతో ఆయన టీడీపీలో చేరి 1994లో నందికొట్కూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్షరాస్యత పెద్దగా లేని నాటి రోజుల్లో అమాయక ప్రజలను తన రాజకీయ లబ్ధి కోసం ఈ నేత వాడుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు చేపట్టి ఎంతో మంది మహిళల పుస్తెలు తెంపిన ఘన చరితా ఈయనదేనన్న ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి ఎన్నికవడంతో.... 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ నేత ఆగడాలు శృతిమించాయి. నల్లమల అడవిని చెరబట్టి అటవీ సంపదను కొల్లగొట్టారు. విలువైన కలపను ఇతర ప్రాంతాలను రవాణా చేసి రూ.కోట్లు గడించారు. అటవీ అధికారులను బెదిరించి విలువైన కలప చెట్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి రూ.వేల కోట్లు సంపాదించారు. ఆ నేత ఇంటిలో, హైదరాబాద్‌లోని హోటల్లో ఎక్కడ చూసినా విలువైన కలప కళాఖండాలు కనిపిస్తాయని ఉమ్మడి కర్నూలు ప్రజలందరికీ తెలుసు. బీడీల కట్టలు కట్టి అమ్ముకునే నిరుపేదల రక్తం తాగారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల నుంచి కారుచౌకగా బీడీ కట్టలను కొనుగోలు చేసి తాను మాత్రం ఎక్కువ రేటుకు విక్రయించి లాభాలు గడించారు. ఆ నేతకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన ఆగడాలను ప్రశి్నంచినా వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే. ఈ నేతకు విలేకరులంటే అలుసు. అప్పట్లో విలేకరుల సమావేశాలంటూ పిలిచి కురీ్చలు కూడా వేసేవారు కాదు. పాత్రికేయులు నిలుచునే ఆయన చెప్పేది నోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రాలలో ఉండే ముఖ్య ప్రతినిధి వస్తే మాత్రమే కుర్చీ వేసేవారు. ∗ 2004లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నేత వరుసగా పార్టీలు మారారు. కొద్ది రోజులు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో హడావుడి చేశారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లోకి ఆయన వెళ్లొచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ ఊసరవెల్లి రాజకీయాలు సాగించిన ఘనత దక్కుతుంది. కేసులు.. వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడంతో ఆయనపై ఐపీసీ 341 కింద నియోజకవర్గంలో కేసు నమోదైంది. ఐపీసీ 143, 188, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న తనయతండ్రికి తానేమీ తక్కువకాదన్నట్లుగా ఆయన తనయ వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈమె నోరు తెరిస్తే చాలు అవతలి వ్యక్తి హడలిపోవాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లెలో ఈమెపై క్రిమినల్ కేసు నమోదైంది. దళిత వ్యక్తిని దూషించడంతో పాటు దాడి చేయడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈమె టీడీపీ తరఫున లోక్ సభకు పోటీ చేస్తున్నారు. -
ఆ లెటర్ ఎందుకు దాచారు ? పోలీసులకు ఎందుకు చెప్పలేదు ?
-
"వాలంటీర్లను చావగొట్టండి.." టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
-
CREDAI: అందుబాటు గృహాలకు స్థలాలు కేటాయించండి!
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేయాలంటే అందుబాటు గృహాలను నిర్మించాలి. చందన్వెల్లి, కొత్తూరు వంటి పలు ప్రాంతాలలో తయారీ రంగం అభివృద్ధి చెందింది. ఆయా ప్రాంతాలలో రూ.50 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్‌కు డిమాండ్ ఉంది. కానీ, స్థలాలు అందుబాటులో లేవు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కలి్పంచడంతో పాటు స్థలాలను అందించాలని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐటీ, ఫార్మా రంగాలతో అభివృద్ధి పశి్చమ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆయా ప్రాంతాలలో లగ్జరీ ప్రా జెక్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యుని సొంతింటి కల మరింత భారంగా మా రిందని, దీనికి పరిష్కారం అందుబాటు గృహాల నిర్మాణమేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ స్థలాలను గుర్తించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆయా గృహాలను విక్రయిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి మహిళా గృహ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతానికి తగ్గించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఈ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుల మధ్య రేడియల్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రమే చేస్తున్నామని, అనుమతులు మాత్రం భౌతికంగానే జారీ అవుతున్నాయని తెలిపారు. అనుమతులను కూడా ఆన్లైన్లో జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
దస్తగిరి చెప్పేవన్ని అబద్ధాలే
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని.. హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ సమీప బంధువు భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రౌడీయిజం, గూండాయిజం, సెటిల్మెంట్లు ఎలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గపు పనిని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీయిజంతో హల్చల్ చేస్తున్నాడన్నారు. ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అబద్ధపు మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. నిజాన్ని కప్పిపుచ్చి దస్తగిరితో వెనుక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. గతంలో సునీల్‌యాదవ్, దస్తగిరిలు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను సంప్రదించేవారని.. అప్పట్లో ఐస్ బండి వ్యాపారం చేస్తూ అప్పులతో ఉన్న దస్తగిరి ఇప్పుడు విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడని భరత్‌యాదవ్ ప్రశ్నించారు. తనకు కూడా డబ్బులు బాకీ ఉన్న దస్తగిరి తననూ దూషించాడన్నారు. వివేకా రెండో భార్య అయిన షమీమ్‌కు ఆస్తి పోతుందనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడన్నారు. అతను వెనుక ఉండి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిల ద్వారా హత్య చేయించాడన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే అసలు విషయాలు వెల్లడి.. ఈ హత్యలో ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే పూర్తి విషయాలు బయటపడతాయని భరత్‌యాదవ్ చెప్పారు. తనకు సునీల్‌యాదవ్ రూ.16 లక్షలు ఇవ్వాలని, అప్పట్లో తాను డబ్బుల విషయం అడిగితే రాజశేఖర్ సార్ ఇవ్వాలని, డబ్బులు వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేవాడన్నారు. అలాగే, డబ్బుల విషయమై ఒకసారి ఎర్రగంగిరెడ్డి కూడా నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు, త్వరలోనే వస్తాయని తనతో చెప్పేవాడన్నారు. దస్తగిరి, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతున్నారో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భరత్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. అసలు సునీతమ్మ తన తండ్రిని చంపిన దస్తగిరి కోసం ఎందుకు ఆరాటపడుతోందో ఆమెకే తెలియాలన్నారు. గతంలో తనను సీబీఐ ఎంక్వైరీకి పిలిచినప్పుడు అన్ని విషయాలు వారికి తెలిపానని, అయినా కూడా వారు తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే ఈ కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర బయటపడుతుందని భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. -
క్రెడాయ్ నూతన కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెసిడెంట్‌గా వీ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా బీ జగన్నాథరావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఎన్ జైదీప్‌రెడ్డి ఎన్నికయ్యా రు. వైస్ ప్రెసిడెంట్లుగా బీ ప్రదీప్‌రెడ్డి, సీజీ మురళీ మోహన్, కొత్తపల్లి రాంబాబు, ఎం శ్రీకాత్‌లు, ట్రెజరర్‌గా మనోజ్ కుమార్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీలు జీ నితీష్ రెడ్డి, క్రాంతికి రణ్‌రెడ్డిలు ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఏ వెంకట్ రెడ్డి, బీ జైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ బన్సల్, సీ అమరేందర్‌రెడ్డి, సుశీ ష్ కుమార్ జైన్, మోరిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్, ఎన్ వంశీధర్‌రెడ్డిలు వ్యవహరిస్తారు. 2023–25 సంవత్సరాలకు ఈ పదవిలో కొనసాగుతారు. -
మైనంపల్లికి ప్రత్యామ్నాయం!.. తెరమీదకు మర్రి,శంభీపూర్ రాజు పేర్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. అలాంటి వారిపై కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది. అసంతృప్తి, అసమ్మతి పేరిట పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తే వేటు వేయడానికి కూడా వెనుకాడేది లేదన్న సంకేతాలను ఇస్తోంది. ఈ సమయంలో మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు మంగళవారం సైతం.. తన కుమారునికి మెదక్ టికెట్ విషయంలో తాను పార్టీ పై కాని, సీఎంపై కానీ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అంటూనే తనను ఎవరు టచ్ చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాట్లాడడం, హైదరాబాద్ వెళ్లాక కార్యాచరణ ప్రకటిస్తానంటూ వ్యాఖ్యానించడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. మైనంపల్లికి వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు గళం విప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం చేయడం, అదే సమయంలో ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం సంబంధిత అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న ఇతర నేతలను సాధ్యమైనంత వరకు బుజ్జగించే యత్నాలు చేస్తూనే, పార్టీ గీత దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తెరపైకి కొత్తపేర్లు మైనంపల్లి స్థానంలో ఇతరులకు టికెట్ కేటాయించేందుకు పార్టీ సన్నద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. మండలి సభ్యుడు శంభీపూర్ రాజు, పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ కార్మిక విభాగం నేత, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించి అభ్యరి్థగా ప్రకటించడంపైనా మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. మైనంపల్లికి కాంగ్రెస్ ఆఫర్! తిరుమల పర్యటనకు వెళ్లిన మైనంపల్లి ఇంకా స్థానిక కేడర్‌కు అందుబాటులోకి రాలేదు. ఆయన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత మల్కాజిగిరి వ్యవహారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మైనంపల్లికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్‌ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది. ‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా! పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు. శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్‌బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి. పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు. ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్‌లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే! శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు. రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి మద్రాస్‌లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్. ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది. సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్‌ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్‌తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం. చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్‌ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్‌ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్‌కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి. ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది. డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్‌కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది. అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు. సత్య శోధన శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ) ► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయి. ► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు. ► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్‌లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు. ► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు ► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్‌ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్‌లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్‌లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్‌ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్‌కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు. ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్‌కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు. వర్ధెల్లి మురళి -
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలను సచివాలయంలోని ఆప్కో విక్రయశాల ద్వారా ఈ నెలాఖరు వరకు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత ప్రకటించారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వ్రస్తాలను తప్పనిసరిగా ధరించాలనే విధానాన్ని అమలు పరిచారని గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగులు అంతా చేనేత వ్రస్తాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. చేనేత వ్రస్తాలు ధరించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత వ్రస్తాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సరళ, కనకదుర్గ, సునీత, ఇమామ్ వలీ, మోహనరావు, ప్రసాద్‌కు బహుమతులను అందజేశారు. నేతన్నలను ఆదుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. ప్రధానంగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ఊతమిచ్చారని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత స్పష్టం చేశారు. చేనేత జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో చేనేత వారోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సునీత మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతుల్లో తయారైన చేనేత వస్త్రాలకు విదేశాల్లో సైతం మంచి ఆదరణ ఉండటంతో ఆ దిశగా పత్తి రైతులు, చేనేత కార్మికులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచంలో వినియోగిస్తున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశంలోనే తయారైనవేనని, చేనేతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయించేలా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న చేనేత ప్రదర్శన, సబ్సిడీపై విక్రయాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సునీత కోరారు. 1.75 లక్షల మందికి ఉపాధి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ..రాష్ట్రంలో చేనేత రంగం 1.75 లక్షల మందికి ఉపాధి చూపుతోందన్నారు. ఈ రంగాన్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఎంతో మద్దతునిస్తూ ప్రతి జిల్లాలో ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తిస్తూ వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్లు గంజి చిరంజీవి, చిల్లపల్లి మోహనరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆప్కో జీఎం తనూజారాణి మాట్లాడారు. -
సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. వివేకా హత్య కేసులో స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేసింది. సుమారు 3 గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. రెండోసారి సీబీఐ విచారణకు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు కాల పరిమితిని సుప్రీంకోర్టు పొడిగించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు(బుధవారం) వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు -
వివేకా కేసు: సీబీఐ ఎదుట సునీత భర్త
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ విచారించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో శనివారం రెండు గంటల పాటు సీబీఐ అధికారులు రాజశేఖర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ సందర్బంగా రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో హత్యా స్థలంలో దొరికిన లేఖపై ప్రశ్నలు అడిగారు సీబీఐ అధికారులు. వివేకా లేఖను ఎందుకు దాచిపెట్టమని చెపాల్సి వచ్చిందని సీబీఐ ప్రశ్నించింది. కాగా, వివేకా హత్యలో కుటుంబ కలహాలే కారణమని కొంత కాలంగా ఆరోపణలున్నాయి. తనను వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కూతురు సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని షమీమ్ తెలిపారు. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్‌రెడ్డిపై షమీమ్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు నన్ను బెదిరించారంటూ సీబీఐ ఎదుట షమీష్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: సీబీఐ స్టేట్మెంట్లో వివేకా రెండో భార్య షమీమ్ సంచలన విషయాలు -
సుధీర్, రష్మిలతో ‘గాలోడు’ కుదరలేదు.. ‘గజ్జల గుర్రం’ చేస్తా: రాజశేఖర్‌రెడ్డి
‘‘గాలోడు’ సినిమా పక్కా కమర్షియల్ కంటెంట్ కావడంతో ఈ విజయాన్ని ముందే నేను ఊహించాను. నేను ఇది వరకు కమర్షియల్ డైరెక్టర్ల వద్దే పని చేశాను. నేను పని చేసిన చిత్రాలన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా మీద ముందు నుంచి నమ్మకంగానే ఉన్నాను’ అని దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్. నవంబర్ 18న ఈ చిత్రం విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► సుధీర్‌తోనే తీసిన‘ సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాను ముందు వేరే హీరోతో అనుకున్నాను. కానీ ఆ హీరో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో.. ఓ కామెడీ టచ్ ఉన్న హీరో కావాలని అనుకున్న సమయంలో సుధీర్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. అలా ఆయనతో జర్నీ మొదలైంది. నేను మాములుగా అయితే ముందు గాలోడు సినిమాను చేయాలి. సాఫ్ట్ వేర్ సుధీర్ కథ, ఈ గాలోడు కథను సింగిల్ సిట్టింట్లో ఓకే అయింది. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాను. ► గాలోడు సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. విమర్శలు కూడా వచ్చాయి. వాటిని సరిదిద్దుకుంటాను. సప్తగిరి గారు, మిగతా ఆర్టిస్టులు కాల్ చేసి మెచ్చుకున్నారు. ► నేను ముందు డైలాగ్ రైటర్‌గా పని చేశాను. కాబట్టి కథలో ఎక్కడైనా స్లోగా అనిపిస్తే డైలాగ్స్‌తో మ్యానేజ్ చేశాను. అది చాలా ప్లస్ అయింది. నేను ఎక్కువగా ఘోస్ట్ రైటర్‌గానే పని చేశాను. కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతోనే ఉన్నాను. ► మొదటి సినిమా సమయంలో సుధీర్ ఇమేజ్ నాకు అంతగా తెలియదు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో ఆయన క్రేజ్ తెలిసింది. ఈయనకు మంచి క్రేజ్ ఉందని నాకు అర్థమైంది. అప్పుడు విజయం పై మరింత నమ్మకం పెరిగింది. ► సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు సినిమా కథలను రష్మీకి చెప్పాం. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. రష్మీ, సుధీర్ ఇద్దరితో నేను ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. త్వరలో కచ్చితంగా చేస్తాను. ఆ ఇద్దరితో గజ్జల గుర్రం అనే సినిమాను చేయాలని అనుకుంటున్నాను. ► నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్‌లున్నాయి.. అవి సుధీర్ గారికి సూట్ అవుతాయ్ కాబట్టే ఆయనతో సినిమాలు చేశాను. ఇప్పుడు గజ్జల గుర్రం అనేది కథగానే ఉంది. బౌండ్ స్క్రిప్ట్ లేదు. అందుకే కాస్త లేట్ అవుతుంది. ఆయనతో నాకు.. నాకు ఆయనతో మంచి కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయి. మనకన్నా కూడా ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ► డైరెక్షన్ తో పాటు, ప్రొడక్షన్ కూడా చేయడం అనేది చాలా కష్టమైన పని. మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు చాలా బిజీ. ఆయన కోసం ఆరు నెలలు ఆగాను. ఎలాగైనా సినిమా బాగా రావాలని ఆయన కోసం ఆగాం. ఇప్పుడు థియేటర్స్ లో ఆయన విజువల్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ► ఎంత కొత్తదనంతో సినిమాలు వస్తున్నా కూడా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. కంటెంట్ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టినా కూడా వృథానే. అందుకే ఒక కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఉంది. -
జస్టిస్ రాజశేఖర్‌రెడ్డికి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: మే 3వ తేదీన పదవీ విరమణ చేయనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డికి ఫుల్‌కోర్టు (హైకోర్టు న్యాయమూర్తులంతా) ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ అధ్యక్షతన మొదటి కోర్టు హాల్లో ప్రత్యేక వీడ్కోలు సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన న్యాయాధికారులు, న్యాయవాదులకు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, అడిషినల్ సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌గౌడ్, అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
బదిలీ.. దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తా
సాక్షి, హైదరాబాద్: ‘తొమ్మిదేళ్లకుపైగా ఉమ్మడి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా తీవ్ర పని ఒత్తిడితో తీరిక లేకుండా గడిపా. ఆరోగ్యం మీద ప్రభావం చూపించడంతోపాటు భార్యాపిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయా. పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నన్ను బదిలీ చేయడం.. కుటుంబంతో తీరికగా గడిపేందుకు దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తా’అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు పేర్కొన్నారు. యువ న్యాయవాదులకు కష్టపడితేనే విజయం సాధ్యమని, సక్సెస్‌కు షార్ట్కట్లు ఉండవని పేర్కొన్నా రు. ఇక్కడ పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు జస్టిస్ రామచందర్‌రావుకు శనివారం ఆన్లైన్లో ఘనంగా వీడ్కోలు పలికింది. ‘1990లో కేంబ్రిడ్జిలో ఎల్ఎల్ఎం కోసం లండన్‌కు వెళ్లా. భారత్‌కు వచ్చేటప్పుటికి నా ఆలోచన విధానం, ప్రవర్తన, నిబద్దత పూర్తిగా మారిపోయాయి. న్యాయవ్యవస్థలో విభజించు.. పాలించు విధానం, రాజకీయాలు సరికాదు. బార్లో కులం, ప్రాంతీయ వివక్ష చూపించరాదు. బార్ అసోసియేషన్ అంతర్గత విభేధాలను పక్కనపెట్టాలి. సమష్టిగా ఉండాలి’అని జస్టిస్ రామచందర్‌రావు పేర్కొన్నారు. జస్టిస్ రామచందర్‌రావు నుంచి ఎంతో నేర్చుకున్నానని, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఆయనతో తనకు ఎంతో అను బంధం ఉందని జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బదిలీ ఇక్కడి న్యాయవ్యవస్థకు లోటని పేర్కొన్నారు. న్యాయమూర్తిగా నిక్కచ్చిగా తీర్పులిచ్చేవారని, ఆయన తీర్పులు కొత్తతరం న్యాయవాదులకు స్ఫూర్తిదాయకమని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్ అనుపమ చక్రవర్తి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, పీపీ ప్రతాప్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి వై.రేణుక, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ తిరుమల దేవి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
2022లో దర్శకత్వం చేస్తా
‘‘నాది గుంటూరు. ఇంజనీరింగ్ చదివేందుకు చెన్నై వెళ్లాను. అక్కడికి వెళ్లాక సినిమాలపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏఎల్ విజయ్ నాకు మంచి స్నేహితుడు. తన టేకింగ్ విధానం, కథ చెప్పే తీరు చూసి నేను కూడా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. అంతకంటే ముందు ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని నిర్మాతగా మారాను’’ అని యం. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ‘ప్రేమలో పడితే’, ‘నకిలీ’ వంటి డబ్బింగ్ చిత్రాలతో పాటు ‘త్రిపుర’ సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళంలో ‘శైవం’ చిత్రాన్ని నిర్మించి విజయం అందుకున్నాను. తెలుగులో స్ట్రయిట్‌గా ‘త్రిపుర’ చిత్రాన్ని నిర్మించాను. ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రాన్ని ‘శ్రీధర్’ పేరుతో, ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని ‘కేరాఫ్ కాదల్’ పేరుతో తమిళంలో రీమేక్ చేశాను. ఈ ఏడాది నా సినిమాలు నాలుగింటిలో ‘కేరాఫ్ కాదల్’ విడుదలవగా ‘జ్వాలా, క్లాప్, అక్టోబర్ 31’ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలు తెలుగు–తమిళ భాషల్లో రూపొందినవే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అక్టోబర్ 31’ చిత్రం 8 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. విశ్వక్సేన్, మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, రెబ్బా జా¯Œ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘జ్వాలా, క్లాప్, అక్టోబర్ 31’ సినిమాలను ఈ ఏడాది వరుసగా జూలై, ఆగస్టు, సెప్టెంబరులో విడుదల చేయాలనుకుంటున్నాను. ఓ ప్రముఖ ఓటీటీ కోసం వెబ్‌సిరీస్‌ను నిర్మించనున్నా. 2022లో నేను దర్శకత్వం వహిస్తా.. ఈ చిత్రానికి కూడా నేనే నిర్మాతను. ప్రస్తుతం కరోనా కాలంలో నా వంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 11 లక్షలు విరాళం అందించాను. ఆపదలో ఉన్న స్నేహితులను ఆసుపత్రిలో చేర్పించి, వారి అవసరాలు తీర్చి ఆసరాగా ఉన్నాను’’ అన్నారు. -
తమిళ్, మలయాళంలో ‘C/o కంచరపాలెం’ రీమేక్
గతేడాది విడుదలైన చిన్న బడ్జెట్ చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. ఇప్పుడీ సినిమా తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘శైవం’తో పాటు తెలుగులో ‘కలర్స్’ స్వాతి, నవీన్ చంద్ర ముఖ్య తారలుగా ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ‘త్రిపుర’ చిత్రాన్ని నిర్మించిన యమ్. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. రేపు (బుధవారం) తన పుట్టిన రోజు సందర్భంగా రాజశేఖర్ రెడ్డి తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా షిరీడీ సాయి మూవీస్ పతాకంపై తాను నిర్మించనున్న చిత్రాల గురించి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ‘స్ట్రయిట్ చిత్రాలు నిర్మించడంతో పాటు గతంలో విజయ్ ఆంటోనీని తెలుగు తెరకు పరిచయం చేసిన ‘నకిలీ’, అలాగే ‘ప్రేమలో పడితే’, తమిళ చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేశాను. అలాగే తెలుగులో సిద్ధార్థ్, శ్రుతీహాసన్, హన్సిక కాంబినేషన్లో రూపొందిన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రాన్ని తమిళంలో ‘శ్రీధర్’ పేరుతో అనువదించి, విడుదల చేశాను. గతంలో నేను హోటల్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగాలలో అనేక బిజినెస్‌లు చేశాను. ఎన్ని బిజినెస్‌లు చేసినా నాకు తృప్తినిచ్చేది సినిమా మాత్రమే. అందుకే మంచి సినిమాలు తీయాలనే నిర్ణయంతో నా పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య నేను చూసిన బెస్ట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. ఆ సినిమాలోని చాలా సన్నివేశాలకు నేను కనెక్ట్ అయ్యాను. సినిమా చూడగానే డైరెక్ట్‌గా సురేశ్‌బాబు దగ్గరికెళ్లి ఫ్యాన్సీ రేట్ చెల్లించి ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం తమిళ, మలయాళ రైట్స్‌ను సొంతం చేసుకున్నాను. సినిమా రైట్స్ సొంతం చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాం. తమిళంలో పేరు పొందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. మలయాళ వెర్షన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాం. జూన్ నెల చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది కాకుండా తెలుగులో మంచి పేరున్న నటీనటులతో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తాను’ అని చెప్పారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజశేఖర్ రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈద రాజశేఖర్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. రాజశేఖర్ రెడ్డి గుంటూరు జిల్లా, గురజాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు. దీనికి సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని ఎంఈవో టి.రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం పుల్లలచెరువులోని ఎస్సీ కాలనీ పాఠశాల పరిధిలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలనీ లో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో వసతులను సమకూరుస్తుందని, కార్పొరేట్ చదువులకు ధీటుగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే కలిగే లాభాలను వివరించారు.అనంతరం కాలనీలో ఉన్న చిన్నారులలో కొంతమందిని ఒకటో తరగతిలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మానాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవా పిల్ల కాలువలకు మోక్షం
ఏవీఆర్ హంద్రీ-నీవా సుజలస్రవంతి ప్రాజెక్టు రెండోదశ పనుల్లో భాగంగా పిల్ల కాలువల పనులను చేపట్టేందుకు వ్యయం పెంచుతూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.550కోట్ల అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధమైంది. బి.కొత్తకోట: సీఎం రాజశేఖరరెడ్డి హయాం లో ఉపకాలువల నుంచి రైతుల పోలాల్లోకి తీసుకువెళ్లాల్సిన పిల్లకాలువ పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు ఎకరాకు రూ.4,700తో ఒప్పందం చేసుకున్నారు. వీటీ ద్వారా చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 4,04,500 ఎకరాలకు సాగునీటీని అందించాలన్నది లక్ష్యం. అయి తే కాలువ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు పిల్ల కాలువల పనులపై శ్రద్ధచూపించలేదు. ఈ పనులను రూ.4,700తో చేపట్టేందుకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు మొండికేయడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎకరాకు రూ.10,500కు పెంచుతూ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోయే చివరి రోజుల్లో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికారంలోకి వచ్చిన మొదట్లో టీడీపీ ప్రభుత్వం నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకొంది. తాజాగా ప్రభుత్వం పిల్లకాలువల పనులను ఎకరాకు రూ.10,500కే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత ఒప్పందం మేరకు రూ.190కోట్లతోనే పనులు జరగాలి. ఇప్పుడు మొత్తానికి పనుల వ్యయం రూ.424కోట్లకు చేరింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు మరింత ధరను పెంచాలన్న డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. ఇకపై పనులు రద్దే.. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పిల్లకాలువల నిర్మాణం, ప్యాకేజీల్లోని పనులకు ఒప్పందం విలువను పెంచింది. ఈ విషయంలో కాంట్రాక్టర్లు మళ్లీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల మేరకు పెంచాలని డిమాండ్ చేస్తే చర్యలుంటాయి. పనిచేయని వాటిని రద్దుచేస్తాం. కొత్తవారికి పనులు అప్పగించే చర్యలతో ముందుకు వెళ్తాం. -మురళీనాధ్‌రెడ్డి, ఎస్ఈ, మదనపల్లె సర్కిల్ -
ఎంపీడీవోపై మాజీ సీఎం వర్గీయులు దౌర్జన్యం
తిరుపతి: చిత్తూరు జిల్లా కలికిరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక ఎంపీడీవో రాజశేఖరరెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. రాజశేఖరరెడ్డి తనకు అనుకూలంగా వ్యవహారించడం లేదని ఓ ఉద్యోగి మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వర్గీయులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగంలోకి దిగి.... ఈ రోజు ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయం గది నుంచి రాజశేఖరరెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా బయటకు నెట్టి... రాజశేఖరరెడ్డి గదికి తాళం వేశారు. -
70 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు?
మోర్తాడ్: గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల ఇళ్లు రద్దు అయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను, అంతకు ముందు సంవత్సరాల్లో మంజూరు అయిన ఇళ్లకు సంబంధించి ఎంతో కొంత బిల్లు చేసిన ఇళ్లను మాత్రమే ఆన్లైన్లో ఉంచిన అధికారులు అసలే బిల్లు చేయని ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అయితే, పాత విధానానికి స్వస్తి పలుకుతూ కొత్త విధానానికి దివంగ త ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించి ఆర్థిక సహాయాన్ని పెంచారు. సకల సదుపాయాలు కల్పిం చే విధంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బెడ్రూం లు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాతురూం కలిగిన ఇంటిని రూ. మూడు లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తామని ప్రకటించింది. అయితే ఇంతవరకు గృహనిర్మాణ సంస్థ ద్వారా అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన పాలసీని ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందనే నమ్మకంతో ఎంతో మంది ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. బంధు, మిత్రులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి అనేక మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభిం చారు. ఎలాగూ ఇల్లు మంజూరు అయ్యింది కదా అని భావించిన లబ్ధిదారులు బిల్లు వచ్చిన తరువాత అప్పులు తీర్చేయవచ్చని ఆశించి ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశారు. అయితే రాష్ట్ర విభజనకు ముందుగానే బిల్లుల చెల్లింపునకు వెబ్‌సైట్‌ను క్లోజ్ చేసిన గృహనిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కు అనుమతి ఇవ్వలేదు. వెబ్సైట్ ఆన్‌లో ఉంటేనే ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించే వీలు ఉంది. ఇళ్లు మంజూరు అయినా ఎంతో కొంత బిల్లు చెల్లింపు జరుపకపోవడంతో 70 వేల ఇళ్లు రద్దు కానున్నాయని సంబంధిత అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పాతవి, కొత్తవి కలుపుకుని 1.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 25 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో 25 వేల ఇళ్లు 50 శాతం నిర్మాణ దశను పూర్తి చేసుకున్నాయి. 30 వేల ఇళ్ల నిర్మాణం మొదలు కావడంతో 10 శాతం బిల్లు చెల్లింపు జరిగింది. 70 వేల ఇళ్లకు అసలే బిల్లు చెల్లింపు జరుగకపోవడంతో అవి రద్దు కానున్నాయి. మంజూరు అయి రద్దు అవుతున్న ఇళ్ల స్థానంలో రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూం గల ఇంటిని మంజూరు చేస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పథకం ప్రకారం తమకు ఇళ్లు మంజూరు అయితే పర్వాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం విషయమై ప్రభుత్వ పాలసీ ఖరారు కాక పోవడంతో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వెబ్సైట్ క్లోజ్ అయ్యింది. వెబ్సైట్ ఆన్‌లో ఉంటే ఏదైనా చెప్పగలం. ఇళ్లు రద్దు విషయం మాకు అధికారికంగా ఇంకా తెలియలేదు. బిల్లులు అసలే చెల్లించకుంటే ఆ ఇళ్లను రద్దు చేస్తారా లేక కొత్త పథకం కింద తీసుకుంటారో ఇంకా స్పష్టత లేదు. -
సీమాంధ్ర అభివృద్ధి జగన్ కే సాధ్యం
సంత మాగులూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని సినీ నటుడు గిరిబాబు పిలుపునిచ్చారు. వైఎస్సా సీపీ అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ను గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పాతమగులూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో సువర్ణ పాలన సాగించిన ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. వైఎస్సార్ వారసత్వం పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటతప్పని, మడమ తిప్పని నేతగా ఎదిగారన్నాన్నారు. కుమ్మక్కు కుట్రలతో వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజాదరణ గల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని కాంగ్రెస్, టీడీపీ.. ఓట్లు, సీట్ల కోసం అన్నపూర్ణ లాంటి తెలుగు గడ్డను రెండు ముక్కలుగా చేశాయని నిప్పులు చెరిగారు. సీమాంధ్ర సమగ్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. చేయగలిగిన హామీలను మాత్రమే ఆయన ప్రకటించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో పేదల జీవితాల్లో వెలుగులు నింపేదిగా ఉందని చెప్పారు. జగన్‌ను సీఎం చేయడం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు కృషి చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అద్దంకి నియోజ వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న గొట్టిపాటి రవికుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలను అశాంతికి నిలయాలుగా మార్చే కొందరు నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అటువంటి వారి విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గిరిబాబు రాకతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఆయన సమక్షంలో మిన్నెకల్లు, పాతమాగులూరు కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.