![Telangana High Court Judge Justice Rajasekhar Reddy Retire On May 3 - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/29/WHATSAPP-IMAGE-2022-04-28-A.jpg.webp?itok=2x7MxhTP)
ఫుల్ కోర్టు వీడ్కోలులో సీజే జస్టిస్ సతీష్‌చంద్రతో జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి (కుడివైపున)
సాక్షి, హైదరాబాద్: మే 3వ తేదీన పదవీ విరమణ చేయనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డికి ఫుల్‌కోర్టు (హైకోర్టు న్యాయమూర్తులంతా) ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ అధ్యక్షతన మొదటి కోర్టు హాల్లో ప్రత్యేక వీడ్కోలు సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన న్యాయాధికారులు, న్యాయవాదులకు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, అడిషినల్ సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌గౌడ్, అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment