‘‘గాలోడు’ సినిమా పక్కా కమర్షియల్ కంటెంట్ కావడంతో ఈ విజయాన్ని ముందే నేను ఊహించాను. నేను ఇది వరకు కమర్షియల్ డైరెక్టర్ల వద్దే పని చేశాను. నేను పని చేసిన చిత్రాలన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా మీద ముందు నుంచి నమ్మకంగానే ఉన్నాను’ అని దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్. నవంబర్ 18న ఈ చిత్రం విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► సుధీర్‌తోనే తీసిన‘ సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాను ముందు వేరే హీరోతో అనుకున్నాను. కానీ ఆ హీరో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో.. ఓ కామెడీ టచ్ ఉన్న హీరో కావాలని అనుకున్న సమయంలో సుధీర్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. అలా ఆయనతో జర్నీ మొదలైంది. నేను మాములుగా అయితే ముందు గాలోడు సినిమాను చేయాలి. సాఫ్ట్ వేర్ సుధీర్ కథ, ఈ గాలోడు కథను సింగిల్ సిట్టింట్‌లో ఓకే అయింది. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాను.
► గాలోడు సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. విమర్శలు కూడా వచ్చాయి. వాటిని సరిదిద్దుకుంటాను. సప్తగిరి గారు, మిగతా ఆర్టిస్టులు కాల్ చేసి మెచ్చుకున్నారు.
► నేను ముందు డైలాగ్ రైటర్‌గా పని చేశాను. కాబట్టి కథలో ఎక్కడైనా స్లోగా అనిపిస్తే డైలాగ్స్‌తో మ్యానేజ్ చేశాను. అది చాలా ప్లస్ అయింది. నేను ఎక్కువగా ఘోస్ట్ రైటర్‌గానే పని చేశాను. కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతోనే ఉన్నాను.
► మొదటి సినిమా సమయంలో సుధీర్ ఇమేజ్ నాకు అంతగా తెలియదు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో ఆయన క్రేజ్ తెలిసింది. ఈయనకు మంచి క్రేజ్ ఉందని నాకు అర్థమైంది. అప్పుడు విజయం పై మరింత నమ్మకం పెరిగింది.
► సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు సినిమా కథలను రష్మీకి చెప్పాం. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. రష్మీ, సుధీర్ ఇద్దరితో నేను ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. త్వరలో కచ్చితంగా చేస్తాను. ఆ ఇద్దరితో గజ్జల గుర్రం అనే సినిమాను చేయాలని అనుకుంటున్నాను.
► నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్‌లున్నాయి.. అవి సుధీర్ గారికి సూట్ అవుతాయ్ కాబట్టే ఆయనతో సినిమాలు చేశాను. ఇప్పుడు గజ్జల గుర్రం అనేది కథగానే ఉంది. బౌండ్ స్క్రిప్ట్ లేదు. అందుకే కాస్త లేట్ అవుతుంది. ఆయనతో నాకు.. నాకు ఆయనతో మంచి కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయి. మనకన్నా కూడా ఆయన చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటారు.
► డైరెక్షన్ తో పాటు, ప్రొడక్షన్ కూడా చేయడం అనేది చాలా కష్టమైన పని. మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు చాలా బిజీ. ఆయన కోసం ఆరు నెలలు ఆగాను. ఎలాగైనా సినిమా బాగా రావాలని ఆయన కోసం ఆగాం. ఇప్పుడు థియేటర్స్ లో ఆయన విజువల్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
► ఎంత కొత్తదనంతో సినిమాలు వస్తున్నా కూడా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. కంటెంట్ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టినా కూడా వృథానే. అందుకే ఒక కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment