సెలబ్రిటీ నీకన్నా ఎవడురా... | Sudigali Sudheer Goat Movie Second Song Released | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీ నీకన్నా ఎవడురా...

Published Mon, Aug 19 2024 12:49 AM | Last Updated on Mon, Aug 19 2024 12:49 AM

Sudigali Sudheer Goat Movie Second Song Released

‘‘పైసా లేకున్నా మాయా.. పనేం లేకున్నా నాలాంటోడ్ని బతుక్కేమీ పర్లేదు...’’ అంటూ సాగుతుంది ‘బాసే హే..’ పాట. ‘సుడిగాలి’ సుధీర్‌ హీరోగా నటిస్తున్న ‘జీ.ఓ.ఎ.టీ’ (గోట్‌) సినిమాలోనిది ఈ పాట. ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో దివ్వభారతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొగుళ్ళ చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘బాసే హే నీలా ఉండే లక్కు మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్నా ఎవడురా’ అనే పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. లియోన్‌ జేమ్స్‌ సంగీత సారథ్యంలో కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను దీపక్‌ బ్లూ ఆలపించారు. జీతూ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌. ‘‘హీరో క్యారెక్టరైజేషన్‌ని వివరించే ఇంట్రడక్షన్‌ సాంగ్‌ ఇది. టాకీ పార్టు దాదాపు పూర్తయింది. యాక్షన్‌ ఎపిసోడ్స్, రెండు పాటల షూట్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నాయి’’ అని నిర్మాత చంద్రశేఖర్‌ చె΄్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement