Gaalodu Movie
-
ఓటీటీకి వచ్చేస్తోన్న సుడిగాలి సుధీర్ ‘గాలోడు’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. ఇటీవల సుధీర్ నటించిన సినిమా గాలోడు. దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గతేడాది నవంబర్ 18న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది? ఇందులో మాస్ హీరోగా మెప్పించాడు సుధీర్. దీంతో సుధీర్ ఈ చిత్రంతో మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు చిత్ర ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. గాలోడు స్ట్రీమింగ్ రైట్స్ ఆహా వీడియోస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ఆహా. దీని ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి గాలోడు మూవీ ఆహాలో అందుబాటులోకి రానుంది. కాగా ఈ సినిమాలో గెహన సిప్పి హీరోయిన్గా నటించగా.. సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. Dance irukku… Comedy irukku… Action Irukku… Full on entertainment irukku… Sensational hit Galoodu Premieres Feb 17 only on aha😇#GalooduOnAHA #SudigaliSudheer @sudheeranand @gehna_sippy @SamskruthiFilms @PRDuddiSreenu pic.twitter.com/qvoi7INvtp — ahavideoin (@ahavideoIN) February 11, 2023 చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ -
‘గాలోడు’తో నటుడిగా గుర్తింపు వచ్చింది: వెంకట్ దుగ్గిరెడ్డి
కోట్లకు పడగలెత్తినా రాని కిక్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన క్షణం తనకు కలిగిందని అంటున్నారు ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి. సుడిగాలి సుధీర్ నటించిన తాజా చిత్రం ‘గాలోడు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి లాయర్ పాత్రలో నటించి, మెప్పించాడు. ‘గాలోడు’ చిత్రం చూసిన తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, తన ఊరివాళ్లు, తోటి ఎన్నారై ఫ్రెండ్స్ అభినందనలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేయించిన దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నప్పటి నుంచి నటన అంటే మక్కువ అని, విభిన్నమైన పాత్రలు పోషించి, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందన్నారు. గాలోడు చిత్రం ద్వారా నటుడిగా తనకు మంచి గుర్తింపు లభించిందన్నారు. నటన ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పాడు. నటుడిగా పేరు తప్ప పారితోషికం అవసరం లేదని అన్నారు. -
గాలోడు సక్సెస్‌తో గాల్లో తేలిపోతున్న నటుడు
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా... ఒకే ఒక్క సినిమా అతడి కెరీర్‌నే మార్చేసింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. మంచి సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తనకు "గాలోడు" రూపంలో ఘన విజయం లభించిందంటున్నాడు నటుడు రవిరెడ్డి. "గాలోడు" సక్సెస్ తనను గాల్లో విహరించేలా చేస్తోందంటున్నాడు. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసిన రవిరెడ్డి ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని, మోడలింగ్ సైతం చేశాడు. "ఇంటిలిజెంట్, దర్పణం, దొరసాని, డిగ్రీ కాలేజ్, వి, విరాటపర్వం, సాఫ్ట్వేర్ సుధీర్" తదితర చిత్రాలతో నటుడిగా ఇప్పటికే తన సత్తాను చాటుకున్నాడు. "గాలోడు" చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నటనకు ఆస్కారమున్న ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి తన నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకనిర్మాత "రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల"కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నాడు రవిరెడ్డి. చదవండి: ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి? స్పందించిన నటుడి కూతురు -
సుధీర్, రష్మిలతో ‘గాలోడు’ కుదరలేదు.. ‘గజ్జల గుర్రం’ చేస్తా: రాజశేఖర్‌రెడ్డి
‘‘గాలోడు’ సినిమా పక్కా కమర్షియల్ కంటెంట్ కావడంతో ఈ విజయాన్ని ముందే నేను ఊహించాను. నేను ఇది వరకు కమర్షియల్ డైరెక్టర్ల వద్దే పని చేశాను. నేను పని చేసిన చిత్రాలన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా మీద ముందు నుంచి నమ్మకంగానే ఉన్నాను’ అని దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్. నవంబర్ 18న ఈ చిత్రం విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► సుధీర్‌తోనే తీసిన‘ సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాను ముందు వేరే హీరోతో అనుకున్నాను. కానీ ఆ హీరో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో.. ఓ కామెడీ టచ్ ఉన్న హీరో కావాలని అనుకున్న సమయంలో సుధీర్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. అలా ఆయనతో జర్నీ మొదలైంది. నేను మాములుగా అయితే ముందు గాలోడు సినిమాను చేయాలి. సాఫ్ట్ వేర్ సుధీర్ కథ, ఈ గాలోడు కథను సింగిల్ సిట్టింట్లో ఓకే అయింది. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాను. ► గాలోడు సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. విమర్శలు కూడా వచ్చాయి. వాటిని సరిదిద్దుకుంటాను. సప్తగిరి గారు, మిగతా ఆర్టిస్టులు కాల్ చేసి మెచ్చుకున్నారు. ► నేను ముందు డైలాగ్ రైటర్‌గా పని చేశాను. కాబట్టి కథలో ఎక్కడైనా స్లోగా అనిపిస్తే డైలాగ్స్‌తో మ్యానేజ్ చేశాను. అది చాలా ప్లస్ అయింది. నేను ఎక్కువగా ఘోస్ట్ రైటర్‌గానే పని చేశాను. కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతోనే ఉన్నాను. ► మొదటి సినిమా సమయంలో సుధీర్ ఇమేజ్ నాకు అంతగా తెలియదు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో ఆయన క్రేజ్ తెలిసింది. ఈయనకు మంచి క్రేజ్ ఉందని నాకు అర్థమైంది. అప్పుడు విజయం పై మరింత నమ్మకం పెరిగింది. ► సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు సినిమా కథలను రష్మీకి చెప్పాం. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. రష్మీ, సుధీర్ ఇద్దరితో నేను ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. త్వరలో కచ్చితంగా చేస్తాను. ఆ ఇద్దరితో గజ్జల గుర్రం అనే సినిమాను చేయాలని అనుకుంటున్నాను. ► నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్‌లున్నాయి.. అవి సుధీర్ గారికి సూట్ అవుతాయ్ కాబట్టే ఆయనతో సినిమాలు చేశాను. ఇప్పుడు గజ్జల గుర్రం అనేది కథగానే ఉంది. బౌండ్ స్క్రిప్ట్ లేదు. అందుకే కాస్త లేట్ అవుతుంది. ఆయనతో నాకు.. నాకు ఆయనతో మంచి కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయి. మనకన్నా కూడా ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ► డైరెక్షన్ తో పాటు, ప్రొడక్షన్ కూడా చేయడం అనేది చాలా కష్టమైన పని. మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు చాలా బిజీ. ఆయన కోసం ఆరు నెలలు ఆగాను. ఎలాగైనా సినిమా బాగా రావాలని ఆయన కోసం ఆగాం. ఇప్పుడు థియేటర్స్ లో ఆయన విజువల్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ► ఎంత కొత్తదనంతో సినిమాలు వస్తున్నా కూడా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. కంటెంట్ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టినా కూడా వృథానే. అందుకే ఒక కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఉంది. -
జబర్దస్త్ నుంచి అందుకే బయటకు వచ్చాను : సుడిగాలి సుధీర్
-
సుధీర్ టీవీ షోస్ చెయ్యడం మానేస్తున్నాడా ..?
-
హాట్‌టాపిక్‌గా సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ రెమ్యునరేషన్!
నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. తాజాగా సుధీర్ నటించిన సినిమా గాలోడు. ఈ మూవీ నిన్న(నవంబర్ 18న) థియేటర్లో విడుదలైంది. విడుదలై తొలి షో నుంచి ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో గాలోడు చిత్రం సక్సెస్ వైపు దూసుకుపోతోంది. చదవండి: బేబీ బంప్‌తో నిత్యా మీనన్! ఫొటోలు వైరల్ ఈ క్రమంలో ఈ మూవీకి సుధీర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఆసక్తిగా మారింది. ‘సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా పరిచమైన సుధీర్.. ఆ తర్వాత 3 మంకీస్ సినిమాలో నటించాడు. తాజాగా గాలోడు మూవీతో హీరోగా మరోసారి ఫ్యాన్స్‌ని అలరించాడు. అయితే ఈ సినిమాకు సుధీర్ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సుమారు రూ. 40 నుంచి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మూడో సినిమాకే ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ అప్కమ్మింగ్ హీరోకు ఇది భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్ మూడో సినిమాకే ఈ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకున్న సుధీర్‌కు ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుందంటున్నారు నెటిజన్లు. సుధీర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ పారితోషికం ఇచ్చేందుకు వెనకాడలేదని తెలుస్తోంది. ఇక గాలోడు సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ. 2 నుంచి రూ. 2.5 కోట్ల చేసినట్లు టాక్. ఇటీవల కామెడీ షో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుదీర్ ఇప్పుడు మళ్లీ ఆ షోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు రీసెంట్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
గాలోడు మూవీ పబ్లిక్ టాక్
-
సుడిగాలి సుధీర్, బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ - పార్ట్ 2
-
సుడిగాలి సుధీర్, బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ - పార్ట్ 1
-
అందుకే రష్మితో కెమిస్ట్రీ కుదిరింది: సుడిగాలి సుధీర్
హీరోగా కంటే నేను ఎంటర్టైనర్ అని అనిపించుకునే దానిలో నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. కమెడియన్, హీరో.. ఇలా ఒక ఇమేజ్‌కి పరిమితం కావాలని లేదు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నాకు అలా లేదు. ఇప్పటికీ మ్యాజిక్ షోలు చేయమని అడిగినా చేస్తాను. మార్కెట్ రేంజ్ గురించి నాకు తెలియదు. నా వల్ల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదని కోరుకుంటాను. దాని కోసం నేను ఎంతైనా కష్టపడతాను’అని సుడిగాలీ సుధీర్ అన్నారు. సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్అండ్‌యాక్షన్ ఎంటర్టైనర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►గాలోడు కథ నాకు చాలా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది.. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా నడుస్తుంది. ► గాలోడు కొత్త కథ అని చెప్పను గానీ.. మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. చిన్నతనం నుంచి మాస్ సినిమాలంటే ఇష్టం, చిరంజీవి, రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మా మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈ సినిమాను చేశాను. ► కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను పెట్టాం. కాలేజ్‌లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. కొన్ని సీన్లు నేను సుధీర్‌లా ఆలోచించి.. వద్దని అనేవాడ్ని. కానీ గాలోడు అలానే చేస్తాడు అని మా డైరెక్టర్ చెప్పేవారు. ► సుధీర్ అంటే కామెడీ ఇమేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్‌కి కూడా సుధీర్ అంటే ఇష్టమే. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే గాలోడు చేశాను. ప్రయోగాలు చేస్తుండాలని అందరూ చెబుతుంటారు. ఇమేజ్ మార్చే సినిమా వస్తే ప్రయత్నం చేయాలి. జనాలు చూస్తారా? లేదా? అన్నది తరువాత. కానీ మనం మాత్రం ప్రయత్నం చేయాలి. ► మార్కెట్ రేంజ్ గురించి నాకు తెలీదు. కానీ ఏ నిర్మాతకు కూడా డబ్బులు పోకూడదని నేను కోరుకుంటున్నాను. సినిమాను కొన్న ప్రతీ ఒక్కరికీ నష్టం రాకూడదని అనుకుంటాను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటే చాలు. ఈ సినిమాను ఎంతలో తీశారు..ఎంత పెట్టారు అనే విషయాలు నాకు తెలీదు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తే చాలు. ► ఢీ షో తరువాతే సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడ డ్యాన్సులు, మ్యాజిక్, కామెడీ చేయడంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. ట్రై చేద్దామని కొంత మంది వచ్చారు. ఎదుటివాళ్ళు నన్ను నమ్మినప్పుడు.. నాపై నాకు కూడా నమ్మకం ఉండాలి కదా? అని సినిమాలను అంగీకరించాను. అలా అని సినిమాలే కాదు.. బుల్లితెరపై కూడా షోలు చేస్తుంటాను. ► ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నాకు అలా లేదు. మ్యాజిక్ షో చేయమని అడిగారు. చేస్తాను అని అన్నాను. అలానే షోలు అడిగితే కూడా చేస్తాను. ►ముందుగా గాలోడు కథను రష్మీ గౌతమ్ గారికే చెప్పారు. ఆమె డేట్స్ కుదరలేదు. మేం ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తాం. ► ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉన్నన్నీ రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని అనుకుంటాను. అది వెండితెర అయినా, బుల్లితెర అయినా పర్లేదు. అందర్నీ నేను నవ్విస్తూ ఉండాలని భావిస్తాను. ► ఇండస్ట్రీలో అందరూ నన్ను ఫ్యామిలీలా చూస్తారు. టీవీ ఆర్టిస్ట్ అన్న కోణంలో నన్ను చూడలేదు. వారిలో ఒకరిలానే నన్ను చూస్తుంటారు. ► ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్‌కు నేను చెప్పే పొజిషన్లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతాను. ► జబర్దస్త్ స్టేజ్‌ను మిస్ అవుతుంటాను. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని చెప్పా. ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పా. ► గాలోడు టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత.. చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇన్నాళ్లకు ఓ సినిమా చేసినట్టు ఉంది.. హీరోగా అనిపించింది అని చాలామంది అన్నారు. అదే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. రాం ప్రసాద్ గారి కెమెరా పనితనం, భీమ్ గారి సంగీతం, మా దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ రక్తం ధారపోసి పని చేశారు. ► ఇప్పటి వరకు రకరకాల సినిమాలు చూశాం. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చూశాం. కానీ ఇలాంటి మాస్ ఆడియన్స్ పక్కా మాస్ చిత్రాలను మిస్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ గాలోడు చిత్రం. ఈ చిత్రం కచ్చితంగా మాస్ ఆడియెన్స్‌ను నిరాశపర్చదు.