
కోట్లకు పడగలెత్తినా రాని కిక్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన క్షణం తనకు కలిగిందని అంటున్నారు ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి. సుడిగాలి సుధీర్ నటించిన తాజా చిత్రం ‘గాలోడు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి లాయర్ పాత్రలో నటించి, మెప్పించాడు. ‘గాలోడు’ చిత్రం చూసిన తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, తన ఊరివాళ్లు, తోటి ఎన్నారై ఫ్రెండ్స్ అభినందనలు తెలపడం సంతోషంగా ఉందన్నారు.
నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేయించిన దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నప్పటి నుంచి నటన అంటే మక్కువ అని, విభిన్నమైన పాత్రలు పోషించి, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందన్నారు. గాలోడు చిత్రం ద్వారా నటుడిగా తనకు మంచి గుర్తింపు లభించిందన్నారు. నటన ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పాడు. నటుడిగా పేరు తప్ప పారితోషికం అవసరం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment