
తెలుగు యాంకర్స్ సుడిగాలి సుధీర్, రవి అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. ఓ టీవీ షోలో చేసిన స్కిట్ కారణంగా వీరిపై పలు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దీనికి సంబంధించి యాంకర్ రవి ఆడియో ఒకటి వైరల్ అయింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇప్పుడు రవి.. క్షమాపణలు చెప్పాడు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
ఆడియోలో యాంకర్ రవి మాట్లాడుతూ.. బావగారు బాగున్నారా సినిమాలోని సీన్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. అది ఎవరైనా తప్పని చెప్పుంటే మాకు తెలిసేది. అయినా మేము ఏ దేవుడినీ కించపరచలేదు. అయినా మా స్కిట్‌పై కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ వీడియోను యూట్యూబ్‌లో నుంచి తీసేశాం. మేము ఎవరినీ కించపరచలేదని ధైర్యంగా చెప్తున్నాను. మేము ఏ తప్పూ చేయలేదు అని వివరణ ఇచ్చాడు.
ఇది వైరల్ అయిన కొంతసేపటికే యాంకర్ రవి వీడియో రిలీజ్ చేశారు. క్షమాపణలు చెప్పాడు. 'నేను, మరికొందరు యాక్టర్స్ తో కలిసి ఓ షోలో స్ఫూప్ చేశాం. ఎవరి మనోభావాలనో నొప్పించడం మా ఉద్దేశం కాదు. ఇది రైటర్ ని పెట్టుకుని రాయించిన స్క్రిప్ట్ కాదు. ఓ సినిమా సీన్ ని స్టేజీపైన మేం ప్రదర్శించాం. దీనివల్ల చాలామంది హిందువులు బాధపడ్డారని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి. ఇంకోసారి ఇలాంటి చేయకుండా జాగ్రత్త పడతాను. క్షమించండి. జైశ్రీరామ్, జైహింద్' అని యాంకర్ రవి క్లారిటీ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: నటన మానేసి బట్టలు అమ్ముకుంటున్న సీరియల్ నటి)
యాంకర్ రవి క్షమాపణలు #anchorravi #Sudigalisudheer https://t.co/urEAAKhg4x pic.twitter.com/kCVkbJoOjj
— SZN (@Suzenbabu) April 11, 2025