సుడిగాలి సుధీర్ ప్రయత్నం.. కట్ చేస్తే ప్రభాస్ సినిమాలో | Imanvi First Choice For Sudigali Sudheer Movie | Sakshi
Sakshi News home page

Imanvi: ప్రభాస్ బ్యూటీపై చాన్నాళ్ల క్రితమే కన్నేశారు.. కానీ!

Published Tue, Nov 12 2024 10:29 AM | Last Updated on Tue, Nov 12 2024 12:10 PM

Imanvi First Choice For Sudigali Sudheer Movie

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు. ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా చేస్తోంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమెకు ఇదే తొలి మూవీ. సినిమా లాంచింగ్ రోజే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు కమెడియన్ గెటప్ శీను ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

'జబర్దస్త్' ఫేమ్ సుడిగాలి సుధీర్.. తన కొత్త సినిమా 'G.O.A.T'లో ఇమాన్విని హీరోయిన్‌గా పెట్టాలని అనుకున్నారట. కాకపోతే ఎంత ప్రయత్నించినా సరే ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వదిలేశారట. ఈ విషయం గెటప్ శీను.. ఓ షోలో బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)

సుడిగాలి సుధీర్ సినిమాలో ఛాన్స్ వద్దనుకున్న ఇమాన్వి.. ప్రభాస్-హను మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈమె షూటింగ్‌లో పాల్గొంది. ఓ పాట, కొన్ని సీన్సు షూట్ చేయగా.. ఇమాన్వి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని తెలుస్తోంది. ప్రభాస్-ఇమాన్వి కెమిస్ట్రీ కూడా సూపర్ అని లీక్ ఒకటి బయటకొచ్చింది.

ఏదేమైనా సుడిగాలి సుధీర్ ప్రయత్నించాడు. ఒకవేళ ఓకే అనుకుంటే ఎందరో హీరోయిన్లలో ఒకరిగా మిగిలిపోయేది. ఇప్పుడు ప్రభాస్ మూవీ చేస్తోంది. ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం పాన్ ఇండియా స్టార్ అయిపోవడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement