తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత | Citadel Honey Bunny Actress Samantha Ruth Prabhu Interesting Comments On Motherhood, Deets Inside | Sakshi
Sakshi News home page

Samantha On Motherhood: తల్లయ్యే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా

Published Tue, Nov 12 2024 9:09 AM | Last Updated on Tue, Nov 12 2024 10:00 AM

Samantha Comments On Motherhood

ఒకప్పటితో పోలిస్తే సినిమాలు చేయడం సమంత చాలా తగ్గించేసింది. గతేడాది వచ్చిన 'ఖుషి' మూవీలో హీరోయిన్‌గా చేసింది. రీసెంట్‌గా 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో సమంత కిస్ సీన్స్, గ్లామర్ క్లిప్స్ వైరల్ అయ్యాయి గానీ సిరీస్‌కి ఫ్లాప్ టాక్ వచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే ప్రమోషన్స్‌లో భాగంగా తల్లి కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

'సిటాడెల్'లో ఓ పాపకు తల్లిగా నటించిన సమంత.. నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 'సిటాడెల్‌లో తల్లిగా చైల్డ్ ఆర్టిస్టుతో కలిసి పనిచేయడం కొత్త అనుభవం. ఆ పాపతో సెట్‌లో ఉన్నన్నీ రోజులు నా సొంత కూతురితో ఉన్నట్లే అనిపించేది.  తల్లి కావాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఇప్పుడు అనుకోవడం మరీ ఆలస్యం అని నేను అనుకోవట్లేదు'

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)

'తల్లి కావడానికి వయసు అనేది అడ్డుకాదని నేను నమ్ముతాను. అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అదో అద్భుతమైన అనుభవం. ఆ టైం నా జీవితంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఈ వయసులో తల్లి కావడం ఏంటని మీరు అంటారేమో.. అది అడ్డంకి అని అయితే నేను అనుకోను' అని సమంత తన అభిప్రాయాన్ని చెప్పింది.

గతంలో హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యాడు. డిసెంబరు తొలివారంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ వేడుక జరగనుంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement