తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మలయాళంలో మాత్రం థ్రిల్లర్ మూవీస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా సెప్టెంబరులో రిలీజైన ఓ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.5 కోట్లు పెడితే రూ.50 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.
అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మూవీ 'కిష్కింద కాండం'. కోతుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 19 నుంచి హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్)
'కిష్కింద కాండం' విషయానికొస్తే.. అజయన్ (అసిఫ్ అలీ), అపర్ణ (అపర్ణ బాలమురళి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ అప్పటికే అజయన్‌కి పెళ్లయి బాబు కూడా పుడతాడు. కానీ భార్య చనిపోవడంతో ఈ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇది జరిగిన కొన్నిరోజులకే కొడుకు మాయమవుతాడు. ఆ కుర్రాడు ఏమైపోయాడు? అజయన్ తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేదే మిగతా స్టోరీ.
చివరి వరకూ సినిమాలో ట్విస్ట్‌ను కొనసాగించడంతో పాటు థ్రిల్‌ను ఏమాత్రం తగ్గనీయకుండా దర్శకుడు సినిమా తీశాడు. 'కిష్కింద కాండం' టైటిల్ పెట్టడానికి కూడా కారణముంది. కోతులు ఎక్కువగా కనిపించే ఆ ఊరిలో వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సందర్భంలో మనిషి శవం ఉండాల్సిన చోట కోతి శవం కనిపిస్తుంది. ఇలా మొదటి నుంచి చివరివరకు ట్విస్టులు, థ్రిల్స్ మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేయడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?)
Comments
Please login to add a commentAdd a comment