
తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈమెది హైదరాబాద్. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది.
(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)
చాన్నాళ్ల క్రితం క్రిష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ ఇప్పుడు ప్రీతి చల్లాని పెళ్లి చేసుకోవడంతో వాటికి ఎండ్ కార్డ్ పడింది. అలానే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన క్రిష్‌కి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.
పవన్‌తో 'హరిహర వీరమల్లు' సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండేసరికి తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

Comments
Please login to add a commentAdd a comment