ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే? | Upcoming OTT Movies Telugu November 2nd Week 2024 Latest | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లో ఒక్క వారంలో 22 మూవీస్

Published Mon, Nov 11 2024 11:03 AM | Last Updated on Mon, Nov 11 2024 12:04 PM

Upcoming OTT Movies Telugu November 2nd Week 2024 Latest

'దేవర', 'వేట్టయన్', సమంత 'సిటాడెల్' లాంటి క్రేజీ మూవీస్, సిరీస్‌లన్నీ గత వారం ఓటీటీల్లోకి వచ్చేశాయి. దీంతో ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. ఉన్నంతలో అన్ స్టాపబుల్ సీజన్ 4 అల్లు అర్జున్ ఎపిసోడ్ ఆసక్తి కలిగిస్తోంది. ఇది కాకుండా అంటే పలు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులే ఉన్నాయి.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ నుంచి హరితేజ ఎలిమినేట్‌.. కిరాక్‌ రెమ్యునరేషన్‌)

మరోవైపు థియేటర్లలో ఈ వారం సూర్య 'కంగువ', వరుణ్ తేజ్ 'మట్కా' రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండింటిపైన హైప్ బాగానే ఉంది. కానీ ఏది హిట్ అవుతుందో చూడాలి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం 22 సినిమాలు-సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఏది ఏ ఓటీటీలో రానుంది?

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 11 - 17వ తేదీ వరకు)

అమెజాన్ ప్రైమ్

  • ఇన్‌ కోల్డ్‌ వాటర్‌ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 12

  • క్రాస్‌ (ఇంగ్లీష్ సిరీస్‌) - నవంబరు 14

నెట్‌ఫ్లిక్స్

  • ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ద డార్క్ క్వీన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 12

  • రిథమ్ ప్లస్ ఫ్లో: బ్రెజిల్ (పోర్చుగీస్ సిరీస్) - నవంబర్ 12

  • రిటర్న్‌ ఆఫ్‌ ది కింగ్‌ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 13

  • హాట్‌ ఫ్రాస్టీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 13

  • ద మదర్స్ ఆఫ్ పెంగ్విన్స్ (పోలిష్ సిరీస్) - నవంబర్ 13

  • ఎమిలియా పెరెజ్‌ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 13

  • ద ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 14

  • కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్‌) - నవంబరు 15

  • మైక్‌ టైసన్‌ వర్సెస్‌ పాల్‌ జాక్‌ (ఇంగ్లీష్ సినిమా)  - నవంబరు 15

ఆహా

  • అన్‪‌స్టాపబుల్ టాక్ షో (అల్లు అర్జున్ ఎపిసోడ్) - నవంబర్ 15

సోనీ లివ్

  • ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 15

జియో సినిమా

  • సెయింట్‌ డెనిస్‌ మెడికల్‌ (ఇంగ్లీష్ సిరీస్‌)  - నవంబరు 13

  • ద మ్యాజిక్ ఆఫ్ శ్రీ (హిందీ సిరీస్) - నవంబర్ 14

  • ద డే ఆఫ్‌ ది జకల్‌ (ఇంగ్లీష్ సిరీస్‌)   - నవంబరు 15

హాట్‌స్టార్

  • డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 12

  • యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 15

జీ5

  • పైథనీ (హిందీ సిరీస్) - నవంబర్ 15

ఆపిల్ టీవీ ప్లస్

  • బ్యాడ్‌ సిస్టర్స్‌ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్‌) - నవంబరు 13

  • సిలో సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్‌) -  నవంబరు 15

లయన్స్ గేట్ ప్లే

  • ఆపరేషన్‌ బ్లడ్‌ హంట్‌ (తెలుగు డబ్బింగ్‌ మూవీ) - నవంబరు 15

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement