Telugu director
-
అమీర్ ఖాన్ తో టాలీవుడ్ డైరెక్టర్.. ఫిక్స్ అయినట్లేనా?
-
రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్
తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈమెది హైదరాబాద్. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది.(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)చాన్నాళ్ల క్రితం క్రిష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ ఇప్పుడు ప్రీతి చల్లాని పెళ్లి చేసుకోవడంతో వాటికి ఎండ్ కార్డ్ పడింది. అలానే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన క్రిష్‌కి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.పవన్‌తో 'హరిహర వీరమల్లు' సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండేసరికి తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?
ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి మాటలు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. త్వరలో నాగచైతన్య కూడా ఇలానే మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. ఇదలా ఉంచితే తెలుగు దర్శకుడు క్రిష్ కూడా మరోసారి వివాహం చేసుకోబోతున్నాడనే రూమర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)'గమ్యం', 'వేదం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష్.. 2016లో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు కానీ మనస్పర్థలు వచ్చి 2021లో విడిపోయారు. అప్పటినుంచే సింగిల్‌గానే ఉంటున్న క్రిష్.. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడట. ఓ లేడీ డాక్టర్‌తో త్వరలో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వచ్చే వారం ఈ మేరకు నిశ్చితార్థం జరుపుకోనున్నారనే టాక్ వినిపిస్తుంది.క్రిష్ పెళ్లి చేసుకోబోయే మహిళకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని, 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని అంటున్నారు. మరి ఈ రూమర్స్ నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. చివరగా 'కొండపొలం' మూవీతో పలకరించిన క్రిష్.. పవన్ 'హరిహర వీరమల్లు' సినిమా మొదలుపెట్టాడు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోయింది. పవన్ ఎంతకీ ఈ మూవీ గురించి పట్టించుకోకపోవడంతో దర్శకుడిగా ఇతడు పక్కకు తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' మూవీ చేస్తున్నాడు. ఇంతలోనే ఇలా క్రిష్ పెళ్లి రూమర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు) -
వైఎస్ఆర్ వల్ల నా కష్టాలు తీరాయి: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఆయన.. విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలామందిని ఓ ఆపద్భాంధవుడిగా నిలిచాడు. ఆర్థిక భరోసా కల్పించారు. అందుకే ఇప్పటికీ వైఎస్ఆర్ పేరు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా అలా తెలుగు యంగ్ డైరెక్టర్.. రాజశేఖర్ రెడ్డి వల్ల తన ఎలా ఈ స్థాయికి చేరుకున్నానో బయటపెట్టాడు. వైఎస్ హయంలో ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది విద్యార్థుల పాలిట వరం అని చెప్పొచ్చు. అప్పట్లో లక్షలాది మంది విద్యార్థులు.. ఈ పథకం వల్ల లాభపడ్డారు. విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో సాఫీగా చదువుకున్నారు. మంచి మంచి ఉద్యోగాలతో పాటు నచ్చిన రంగాల్లో నిలదొక్కుకున్నారు. అలా రీసెంట్గా 'సర్కార్ నౌకరి' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శేఖర్ కూడా ఇలా వైఎస్ఆర్ వల్ల వెలుగులోకి వచ్చిన కుర్రాడు. (ఇదీ చదవండి: యాత్ర 2 టీజర్ వచ్చేస్తోంది!) 2006లో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కోర్స్‌లో జాయిన్ శేఖర్ గంగనమోని.. అప్పట్లో ఏడాది కాలేజీ ఫీజ్ రూ.6,500 కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. మరో దారిలేక తల్లి బంగారం తాకట్టు పెట్టి ఆ ఫీజ్ చెల్లించాడు. తర్వాత ఏడాది కూడా చిన్నచితకా పనులు చేసుకుని పైసా పైసా కూడబెట్టుకుని ఫీజ్ చెల్లించాడు. ఎప్పుడైతే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారో ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. తద్వారా ఈ పథకం వల్ల తనకు ఆర్థిక కష్టాలు తీరాయని దర్శకుడు శేఖర్ చెప్పుకొచ్చాడు. రూ.6,500 చెప్పుకోవడానికి చాలా చిన్న మొత్తం అయినప్పటికీ.. అప్పట్లో తను ఆర్థిక పరిస్థితి వల్ల అదే ఎక్కువగా అనిపించదని అన్నాడు. అయితే వైఎస్ దయ వల్ల ఫీజ్ రీఎంబర్స్మెంట్ వచ్చిందని.. తద్వారా తన కష్టాలు తీరిపోయాయని.. ఆ టైంలో వైఎస్ తనకు దేవుడిలా కనిపించారని శేఖర్ తన తీపి జ్ఞాపకాన్ని సాక్షి ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
ఎవరినైనా మర్చిపోతామేమో కానీ వాళ్లని కాదు: డైరెక్టర్ మారుతి
'బాల్యం నుంచి ప్రతి దశలోనూ మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. కాలక్రమంలో అందులో కొందరిని మనం మర్చిపోవడం సహజం. కానీ జీవితపు ప్రారంభ దశలో ప్రేమాభిమానాలు కురిపించే బాల్య స్నేహితులను మాత్రం కాదు' అని డైరెక్టర్ మారుతి అన్నాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) అక్టోబర్ 1న మచిలీపట్నం జార్జికారనేషన్ హైస్కూల్‌కు చెందిన ఆయన చిన్నప్పటి ఫ్రెండ్స్.. గెట్ టుగెదర్ కార్యక్రమంతో పాటు, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తమ ఫ్రెండ్ మారుతిని ప్రేమగా సత్కరించారు. ప్రభాస్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మారుతి.. చిన్ననాటి స్నేహితులను పేరుపేరున పలకరించి, వారితో అప్పటి విశేషాలని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను, తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు, తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి, సన్మానపత్రం కూడా అందజేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
సౌత్ ఇండియాలో క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇవే
తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్... తమిళ్ అంటే సాంబార్... మలయాళంకి కూడా సాంబార్ టచ్ ఉంది. ఇప్పుడు ఆవకాయ్ డైరెక్షన్‌కి సాంబార్ సై అనడంతో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల, ధనుష్... డీ 51 వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘ఫిదా, లవ్‌స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్‌తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించనున్నారట శేఖర్. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ధనుష్ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ చేస్తున్నది సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. చందు, సూర్య కాంబో కుదిరిందా? ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్సీ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్ దాదాపు కుదిరిందని టాక్. సరైన కథ కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. పరశురామ్‌తో కార్తీ? ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్. అటు కార్తీ, ఇటు పరశురామ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీతో దుల్కర్ లక్కీ భాస్కర్ తమిళ హీరో ధనుష్‌తో ‘సార్’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ నిర్మిస్తున్నారు. ‘సార్’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. -
ఎంట్రీ అదుర్స్
-
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
ముందే స్క్రిప్ట్ ఇస్తే నటులు ఇంకా బాగా చేస్తారు: చిరంజీవి
-
టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు..
Chiranjeevi Shocking Comments On Tollywood Directors: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం (జులై 24) గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేసిన చిరంజీవి టాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ నటన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అమీర్‌లా తమకు చేయాలని ఉన్నా పలు పరిధుల వల్ల తాము చేయలేకపోతున్నామని చిరు చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి పరిధుల గురించి ఈ కార్యక్రమంలో చిరంజీవి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ డైరెక్టర్లకు చురకలు అంటించారు. ''కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్లో అప్పటికప్పుడు డైలాగ్‌లు ఇస్తున్నారు. ఇది నటులను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది. స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలి. స్క్రిప్ట్ గురించి మిగతా టెక్నిషియన్స్‌కు ముందుగానే తెలిస్తే వారు పనిచేసే విధానం వేరు. దానికి వచ్చే ఫలితం వేరేలా ఉంటుంది. ఆ ఫలితం సినిమాపై చూపిస్తుంది. చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ఏమైపోయిందంటే.. సినిమాలో ప్రధాన హీరోకు సీన్స్ తెలుసేమో గానీ, అప్పుడే వచ్చిన కమెడియన్స్‌కు గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు మాత్రం తెలియదు. అప్పటికప్పుడు ఆ డైలాగ్‌లు చెప్పి చేయించడంతో ఇన్వాల్వ్మెంట్ అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. ముందుగా డైలాగ్‌లు ఇవి అని చెప్పాలి. ఆ డైలాగ్‌లు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. గదిలో రౌండ్టేబుల్పై కూర్చొని ఆ సీన్లు అనుకుని వాళ్లు గనుక చేయగలిగితే తర్వాత సెట్స్‌కు వెళ్లాక నా డైలాగ్ ఏంటని.. అది ఎలా గుర్తుంచుకోవాలని.. డైలాగ్ గుర్తుపెట్టుకోవండపై మనసు పెట్టక్కర్లేదు. అప్పుడు కేవలం నటనపైనే మనసు పెడితే చాలు. అది రావాలి. ఇదే వారు చేసేది (అమీర్ ఖాన్ గురించి)'' అని చిరంజీవి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. -
బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న తెలుగు డైరెక్టర్లు
హిందీ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా అరుదు. తెలుగు దర్శకులు హిందీకి వెళ్లడం కూడా అరుదే. అయితే ఇప్పుడు ఒకేసారి ఐదుగురు దర్శకులు హిందీ చిత్రాలు చేస్తున్నారు. హిందీ పరిశ్రమ మనవాళ్లకు ‘స్వాగ్ సే స్వాగత్’ పలికింది. అంటే... ఆత్మీయ స్వాగతం పలికింది. ఆ ఆహ్వానం అందుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగులో వీవీ వినాయక్ స్టార్ డైరెక్టర్. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. తొలి సినిమా ‘ఆది’ (2002)తోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్న వీవీ వినాయక్ ఆ తర్వాత ‘దిల్’(2003), ‘ఠాగూర్’(2003), ‘బన్నీ’(2005), ‘కృష్ణ’ (2008) ‘అదుర్స్’ (2010), ‘ఖైదీ నంబరు 150’ (2017) వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు హిందీ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ఆయన దర్శకుడిగా బీ టౌన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఇటు సాయి శ్రీనివాస్‌కు కూడా హిందీలో ‘ఛత్రపతి’యే తొలి సినిమా కావడం విశేషం. ఇక ‘అర్జున్‌రెడ్డి’ (2017) సక్సెస్‌తో డైరెక్టర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కభీర్ సింగ్’ (2019)గా రీమేక్ చేసి, బాలీవుడ్‌లోనూ నిరూపించుకున్నారు. ఇప్పుడు హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు సందీప్. మరోవైపు తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సాధించి ఇండస్ట్రీ దృష్టిని వెంటనే తన వైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా బీ టౌన్ దర్శకుల లిస్ట్‌లో చేరారు. విద్యుత్ జమాల్ హీరోగా‘ఐబీ 71’ అనే స్పై థ్రిల్లర్‌ను తీయనున్నారు సంకల్ప్. జాతీయ అవార్డు సాధించిన మరో తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా హిందీకి హాయ్ చెబుతున్నారు. ‘మళ్ళీ రావా’(2017) వంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల మెప్పు పొందిన గౌతమ్ 2019లో నానీతో తీసిన ‘జెర్సీ’కి జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరియే దర్శకుడు. ఈ ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వక్ సేన్ ‘హిట్’ (2020) చిత్రంతో దర్శకుడిగా హిట్టయ్యారు శైలేష్ కొలను. తెలుగు ప్రేక్షకులు ‘హిట్’ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు శైలేష్ కొలనుయే డైరెక్టర్. ఇందులో రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. ప్రముఖ సంగీత దర్శకులు యం.యం. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా పరిచయమైన చిత్రం ‘మత్తువదలరా’ (2019)తో దర్శకుడిగా పరిచయమయ్యారు రితేష్ రాణా. ఈ చిత్రం హిందీ రీమేక్‌తో దర్శకుడుగా రితేష్ బీ టౌన్లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్‌కు డైరెక్షన్ మార్చారు. ఇదిలా ఉంటే.. ఈ దర్శకులందరూ హిందీలో డైరెక్ట్ సినిమా ద్వారా పరిచయమవుతుంటే, ప్యాన్ ఇండియన్ సినిమాల ద్వారా మరికొందరు హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు. -
టాలీవుడ్లో తీవ్రవిషాదం: కరోనాతో సాయిబాలాజీ హఠాన్మరణం
సినీరంగంలో మూడున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్‌లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు. సాయిబాలాజీగా సుపరిచితులైన ఆయన పూర్తి పేరు నక్కల వరప్రసాద్. స్వస్థలం తిరుపతి దగ్గర అలమేలు మంగాపురం. హీరో శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’, అలాగే ఉదయకిరణ్ ఆఖరి చిత్రం ‘జై శ్రీరామ్’లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు కొన్ని పాటలు కూడా రాశారు. చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’కి కథ, స్క్రీన్‌ప్లే సాయిబాలాజీవే! ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ సీరియల్స్‌కూ ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడు రవిరాజా పినిసెట్టి శిష్యరికంలో మోహన్ బాబు ‘పెదరాయుడు’, బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, వెంకటేశ్ ‘చంటి’ తదితర చిత్రాలకు సాయిబాలాజీ పనిచేశారు. రచయిత ఎమ్మెస్ నారాయణతో ‘పెదరాయుడు’లో పాత్ర వేయించి, తెర మీదకు తీసుకురావడంలో కీలకపాత్ర వహించారు. నటుడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్ దర్శక, రచనా శాఖలో ఆయన పనిచేశారు. ముక్కుసూటితనం వెనుక మంచితనం మూర్తీభవించిన సాయిబాలాజీ సినీ రంగంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌తో సహా పలువురికి ఇష్టులు. స్నేహితులైన దర్శకులు కృష్ణవంశీ, వై.వి.ఎస్. చౌదరి రూపొందించిన సినిమాలకు కథా విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రపంచ, భారతీయ సినీ కథ, కథనాలను గమనించి, నిశితంగా విశ్లేషించడంలో సాయిబాలాజీ దిట్ట. ఆర్థిక అండదండలు లేని ఆయన జీవనం కోసం సినిమా స్క్రిప్టులతో పాటు ఇటీవల కొన్ని వెబ్ సిరీస్‌ల స్క్రిప్టులు సిద్ధం చేసుకుంటూ వచ్చారు. ఇంతలోనే కరోనా ఆయనను కబళించింది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 57 ఏళ్ళ సాయిబాలాజీకి భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. కుటుంబసభ్యులు ఇంట్లోనే కరోనా నుంచి కోలుకున్నా, ఆయన టిమ్స్ ఆసుపత్రిలో చివరి చూపైనా దక్కకుండా, ఆక్సిజన్ అందక ఆకస్మికంగా ప్రాణాలు వదలడం విషాదం. -
తండ్రి అయిన తెలుగు దర్శకుడు
తెలుగు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తండ్రయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ఆదివారం వెల్లడించారు. నేడు ఉదయం 10.55 గంటలకు బాబు జన్మించాడని చెప్పుకొచ్చారు. శ్రీరామ్ హీరో సుధీర్‌బాబు నటించిన "భలే మంచి రోజు" చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలిచిత్రంతోనే విజయాన్ని నమోదు చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన "శమంతకమణి" చిత్రాన్ని తీశారు. (చదవండి: లక్ష్మీభాయ్ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్ అయిపోతారా?) అనంతరం స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం సంపాదించుకున్నారు. అలా కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిల కలయికలో "దేవదాస్" చిత్రాన్ని రూపొందించారు. కానీ ఇది అనుకున్నంత హిట్ అవకపోగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో సంవత్సరం గ్యాప్ తీసుకున్న ఆయన గతేడాది చివరి నుంచి అశోక్ గల్లా (గల్లా జయదేవ్ కుమారుడు)ను హీరోగా పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: బాలీవుడ్ నటుడికి పుత్రికోత్సాహం) -
అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయింది
మీ బాల్యంలోని కొన్ని తీపి గుర్తులు పంచుకుంటారా? కోడి రామకృష్ణ: మాది పాలకొల్లు. నాన్న కోడి నరసింహమూర్తి, అమ్మ చిట్టెమ్మ. మా వీధిలో అందరూ నన్ను అమితంగా ఇష్టపడేవారు. ఎందుకంటే... నేను పుట్టాకే మా వీధిలో అందరికీ పిల్లలు పుట్టారట. దాంతో నేనంటే అందరికీ ఎంత సెంటిమెంట్ అంటే.. నెల పొడుపు రోజున చంద్రుడు కనిపించగానే.. చూసినవారందరూ కళ్లు మూసుకొని.. ‘పెద్దబాబూ.. రాముడూ..’ అని పెద్దగా అరిచేవారు. నేనెళ్లి.. ఒక్కొక్కర్నీ తాకేవాణ్ణి. అప్పుడు కళ్లు తెరిచి నా వైపు చూసేవారు. అంత సెంటిమెంట్! అలాగే మా వీధిలో ఓ బ్రాహ్మలావిడ ఉండేది. వారి ఎదురింట్లో శిరోమణి అనే ఆవిడ ఉండేది. వీళ్లిద్దరికీ అస్సలు పడదు. ఈవిడ శిరోమణిని తెగ తిడుతుండేది. ఓరోజు అనుకోకుండా శిరోమణి చనిపోయింది. ఆమె చావు తర్వాత కూడా ఈవిడ శిరోమణి పిల్లల్ని కూడా చీటికిమాటికీ తిట్టేది. ఓ రోజు ఉన్నట్లుండి బ్రాహ్మలావిడ వింతగా కోడిమాంసం కావాలని గోల గోల. బ్రాహ్మణ స్త్రీ చికెన్ అడగడమేంటని వీధంతా వింతగా చెప్పుకోవడం మొదలెట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, శిరోమణి దెయ్యమై.. ఆ బ్రాహ్మలావిడను పట్టిందట. ఆ శిరోమణి అమ్మకు బాగా పరిచయం. దాంతో అమ్మ వెళ్లి.. ‘శిరోమణి.. ఏంటే ఇదంతా..’ అంది. ‘ఇది నా పిల్లల్ని తిట్టిందక్కా.. దీంతో కోడిమాంసం తినిపించేదాకా వదల్ను’ అంది. చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో చెప్పి చూశారు. కానీ శిరోమణి ఆత్మ మాత్రం శాంతించడంలా. ‘మాంసం తేవాల్సిందే. దీంతో తినిపించాల్సిందే.. లేకపోతే నా పిల్లల్ని తిడుతుందా’ అని ఊగిపోతోంది. అప్పుడొచ్చాడు నాన్న. ‘ఏంటి?’ అనడిగితే.. విషయం చెప్పారు. సరాసరి ఆమె ముందుకెళ్లాడు. నాన్నను చూడగానే.. ఆమె కర్టెన్ చాటున దాక్కుంది. ‘ఏంటే ఇదంతా.. బ్రాహ్మలు కదా.. అలా చేయొచ్చా?’ అన్నాడు నాన్న. ‘ఏంటి బావగారూ మీరూ అలా మాట్లాడతారు. ఇది నన్ను తిట్టిందండీ... ఇప్పుడు నా పిల్లల మీద పడింది. అందుకే.. చికెన్ తినిపించేదాకా వదల్ను’ అంది ఏడుస్తూ... ‘తప్పే.. అలా చేయడం పాపమే. వెళ్లిపో.. నీ పిల్లల్ని నేను చూసుకుంటా. నాపై నమ్మకం ఉంటే వెళ్లిపో’ అని నాన్న అన్నారు. ఎట్టకేలకు శాంతించిందామె. చూస్తున్న నాకు ఇదంతా వింతగా అనిపించింది. చనిపోయాక కూడా నాన్నపై గౌరవం తగ్గకపోవడం గ్రేట్ అనిపించింది. దెయ్యాలు, భూతాలు నిజమని చెప్పను కానీ, మా వీధి సెంటిమెంట్లు అలా ఉండేవి. అమ్మానాన్నలతో మీ అనుబంధం? కోడి రామకృష్ణ: మా అమ్మానాన్నలకు నేను తొలిసంతానం. నా లైఫ్‌లో నేను చూసిన తొలి హీరో నాన్న. ఆయన రిటైర్డ్ మేజర్. మా నాన్న ఎంత చండశాసనుడో అంత అమాయకుడు కూడా. అప్పట్లోనే సినిమాల్లో వేషాలిప్పిస్తాం, సినిమాలు తీస్తాం అంటూ కొన్ని ఫ్రాడ్ బ్యాచ్‌లు మా ఊళ్లో తిరుగుతుండేవి. వాళ్లను ఇంటికి తీసుకొచ్చి, వాళ్లందరితో కూల్డ్రింకులు తాగించి, నా ఫొటోలు చూపిస్తుండేవారు నాన్న. నేను స్కూల్నుంచి వచ్చేసరికి వారందరూ వరండాలో కూర్చొని ఉండేవారు. వాళ్లను చూసి సైలెంట్‌గా ఇంట్లోకెళ్లేవాణ్ణి. నా వెనకే నాన్న వచ్చేవాడు. ‘వాళ్లు సినిమా తీస్తారంటరా. నీ గురించి చెప్పాను. నీ ఫొటోలు కూడా చూపించాను’ అని గుసగుసగా చెప్పేవారు. ‘అయ్యో నాన్నా, వాళ్లు దొంగలు. వృథాగా డబ్బులు ఖర్చు చేస్తున్నావ్. వాళ్లను పంపించేయ్’ అని మందలింపుగా చెప్పేవాణ్ణి. నిజం తెలుసుకొని వాళ్లను తరిమేసేవారు. ‘మనింట్లో డిగ్రీ చదివిన వాళ్లు లేరు. నువ్వు చదవాలి’ అని ఒకరోజు నాన్న నాతో అన్నారు. ‘మీ కోసం డిగ్రీ చదువుతాను. అయితే.. మధ్యలో ఎక్కడైనా తప్పితే మాత్రం అక్కడే ఆపేస్తా’ అని ఫిటింగ్ పెట్టాను. ‘నువ్వు తప్పవ్. నీపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు నాన్న. మేం నాటకం రిహార్సల్స్‌లో ఉండగా పీయూసీ రిజల్ట్స్ వచ్చాయి. నా నంబర్ పేపర్లో లేదు. తప్పాను. ఇక చదవనవసరం లేదు. నిర్ణయం తీసేసుకొని, ఇంటికెళ్లాను. అక్కడి పరిస్థితి చూడగానే షాక్. ఇరుగుపొరుగు వాళ్లకు నాన్న స్వీట్స్ పంచుతున్నారు. ‘ఓరి నాయనో.. ఈయన పేపర్ చూడలేదులా ఉంది..’ అనుకుంటూ ఆయన ముందుకెళ్లాను. నన్ను చూడగానే, ‘ఏయ్.. డిగ్రీ కూడా ఇలాగే పాసవ్వాలి. లేకపోతే చంపేస్తా’ అన్నారు ప్రౌడ్‌గా. నాకేమో అయోమయం! ఇంతలో మా తమ్ముడొచ్చి ‘నువ్వు సెకండ్‌క్లాస్‌లో పాసయ్యావ్రా’ అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను థర్డ్ క్లాస్‌లో మాత్రమే చూశానని, సెకండ్ క్లాస్‌లో చూడలేదని. కాలేజ్ టైమ్‌లో ప్రేమకథ ఏమైనా నడిపారా? కోడి రామకృష్ణ: మీరు అడిగారు కాబట్టి గుర్తున్న ఓ సంఘటన చెబుతాను. కాలేజ్ టైమ్‌లో నాకు ఓ స్టడీరూమ్ ఉండేది. నేను బొమ్మలు బాగా వేసేవాణ్ణి. అందుకే... సైన్స్ రికార్డ్స్‌లో బొమ్మలు గీయించుకోవడానికి అమ్మాయిలు నా రూమ్కొచ్చేవారు. అందరూ లవ్లీగా ఉండేవారు. ఆ అమ్మాయిల్లో ‘5 నంబర్ గోల్డ్’ అనే ఓ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తన రోల్ నంబర్ 5. ఇంటి పేరేమో ‘బంగారు’. అందుకే ‘5 నంబర్ గోల్డ్’ అని పిలిచేవాళ్లం. అసలు పేరు గుర్తులేదు. నాతో బొమ్మలు గీయించుకోవడానికి తనూ వచ్చేది. ఇంతమంది ఆడపిల్లలు నా దగ్గరకొస్తుంటే.. జెలసీగా ఫీలయ్యేవారు కూడా ఉంటారు కదా. ఎవడో వెళ్లి ‘5 నంబర్ గోల్డ్’ వాళ్ల అన్నయ్యకు చెప్పాడు ‘మీ చెల్లెలు రామకృష్ణతో క్లోజ్‌గా ఉంటోంది’ అని. నేను కాలేజ్‌కి వెళ్లే దారిలో వాళ్లన్నయ్య కాపు కాశాడు. నన్ను ఆపాడు. ‘జాగ్రత్త ఏమనుకున్నావో! ఏంటి? మా చెల్లితో మాట్లాడుతున్నావంట’ అన్నాడు సీరియస్‌గా. ‘మాట్లాడితే ఏమైంది’ అన్నాను. ‘మీ ఇద్దరూ దగ్గరగా ఉంటున్నారట’ అని సణిగాడు. ‘దగ్గరగా ఉంటే ఏమైందిరా?’ అని నేను దీటుగా ప్రశ్నించా. ‘సరేలే... నీ నాటకంలో నాకూ వేషం ఇస్తావా?’ అని అడిగాడు నింపాదిగా. ‘ఇస్తాలే’ అని మాటిచ్చాను. నా కాలేజ్ రోజుల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో. సినిమాపై మీ తొలి అడుగులు ఎలా పడ్డాయి? కోడి రామకృష్ణ: చిన్నప్పట్నుంచీ పెయింటింగ్ అంటే ఇష్టం. అజంతా ఆర్ట్స్ పేరుతో మా ఊళ్లో పెయింటింగ్ షాప్ కూడా పెట్టాను. గోడల మీద వాటర్ పెయింటింగ్ బోర్డ్స్ రాసేవాణ్ణి. అలాగే.. ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ కూడా. సినిమా హాళ్లకు ‘పొగత్రాగరాదు’, ‘నిశ్శబ్దం’, ‘ముందు సీట్లపై కాళ్లు పెట్టరాదు’.. ఇలా రకరకాల స్లయిడ్స్ ఫ్రీగా చేసిచ్చేవాణ్ణి. ఆ స్లయిడ్స్కి ఓ మూల ‘కోడి రామకృష్ణ’ అని నా పేరు రాసుకునేవాణ్ణి. తెరపై నా పేరు చూసుకోడానికే థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. సినిమాపై అభిమానానికి బీజం పడింది అక్కడే. అలాగే.. చిన్నప్పట్నుంచీ నాటకాల పిచ్చి. ట్రూప్ నాటకాల స్థాయికి చేరా. పరిషత్తులకు కూడా వెళ్లేవాళ్లం. దాదాపు వందకు పైగానే నాటకాలు రాసి, ప్రదర్శించాను. అల్లు రామలింగయ్యగార్కి అప్పట్లో నాటకం ట్రూప్ ఉండేది. ‘ఆడది’ అనే కమర్షియల్ నాటకం ఆడుతూ ఉండేవారు. ఆ నాటకంలో నేనే హీరో. లింగయ్యగారు దర్శకుడు. ఇదిలావుంటే.. టి.నాగేశ్వరరావుగారనీ... పెయింటింగ్‌లో నా గురువు. ఆయన దగ్గర నేను లితోలకు వర్క్ చేసేవాణ్ణి. ఆయనకు ఓ ఫొటో స్టూడియో కూడా ఉంది. అక్కడ నా ఫొటోలు తీసి... ‘కొత్త హీరో కావాలి’ అనే ప్రకటన పేపర్లలో కనిపిస్తే పంపించేరు. ఆ టైమ్‌లోనే మా ఊళ్లో ఓ సినిమా రిలీజైంది. ఆ సినిమా దర్శకుడికి అదే తొలిసినిమా. ఏ వీధిలో చూసినా ఆ సినిమా డిస్కషనే. ఆ సినిమా చూశాక అనిపించింది... ‘యాక్టర్ అయితే... ఒక్క పాత్రనే చెప్పచ్చు. అదే డైరెక్టరయితే.. ఎన్నో పాత్రల్ని చెప్పొచ్చు’ అని. నాలో డైరెక్టర్ అవ్వాలనే కాంక్షను పెంచిన ఆ సినిమానే ‘తాతా మనవడు’. ఆ డైరెక్టరే మా గురువుగారు దాసరి నారాయణరావు. ఆ తర్వాత దాసరి గారి దగ్గరే అసిస్టెంట్‌గా చేరారు? ఆయన్ను ఎలా కలిశారు? కోడి రామకృష్ణ: ఆయన చదివిన స్కూల్లోనే నేను చదువుకున్నా. నేను ఫస్ట్ ఫారం.. ఆయనేమో ఇంటర్ సెకండియర్. ‘నేను నా స్కూల్’ అనే నాటికను గురువుగారు స్వయంగా రాసి మా స్కూల్లో ప్రదర్శించారు. గ్రీన్‌రూమ్‌లో వాళ్లు మేకప్‌లు చేసుకుంటుంటే... మేమందరం కిటికీల్లోంచి చూసేవాళ్లం. ఆ రోజుల్లో సుబ్బరాయశాస్త్రిగారని మా స్కౌట్ మాస్టారు ‘పంచవర్ష ప్రణాళికలు’ అనే నాటికను రాశారు. దాన్ని గురువుగారు డైరెక్ట్ చేసి నటించారు. ఢిల్లీలో ఆ నాటికను ప్రదర్శిస్తే.. నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా గురువుగారినీ ఆయన ట్రూప్‌ని పాలకొల్లులో లారీపై ఊరేగించారు. ‘తాతా మనవడు’ సూపర్‌హిట్ అయినప్పుడు ఆ సినిమా యాభైరోజుల పండగ సందర్భంగా గురువుగారు నేరుగా పాలకొల్లు వస్తున్నారనే సంగతి తెలిసింది. అప్పట్లో స్టూడెంట్ లీడర్ని నేనే. నాకేమో.. ఎలాగైనా గురువుగారిని కలిసి అవకాశం అడగాలనుంది. గురువుగారు, కె.రాఘవగారు, ఎస్వీ రంగారావుగారు ఇలా... అందరూ వచ్చారు. నేనెళ్లి ధైర్యంగా గురువుగార్ని కలిశాను. ‘మీ దగ్గర సహాయకునిగా చేరాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వండి సార్’ అని ప్రాధేయపడ్డాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ‘బీకాం చదువుతున్నాను సార్’ అని చెప్పాను. అయితే.. ‘పూర్తి చేసి రా’ అన్నారు. గురువుగారి మాట ప్రకారం బీకాం పూర్తి చేసి చెన్నయ్ రైలెక్కాను. నిజానికి నేను పాలకొల్లులో ఉన్నప్పుడే.. కాకినాడలో ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్ జరిగింది. గురువుగారు వచ్చారని తెలిసి... కాకినాడ వెళ్లాను. నన్ను చూడగానే.. ఓ కేరక్టర్ ఇచ్చేశారు గురువుగారు. శారదగారికి అందులో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఆ ఇద్దరిలో నేనొకణ్ణి. మా కాంబినేషన్ సీన్స్ తీసేసి, మద్రాస్ వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ మాత్రం మిగిలి ఉంది. దాన్ని మద్రాస్‌లోని శివాజీ గార్డెన్స్‌లో తీస్తున్నారు. నేను చేసిన పాత్రకు ఓ డూప్‌ని ఏర్పాటు చేశారు. కానీ అతగాడు సెట్ కావడం లేదు. దాంతో కంగారు పడిపోతున్నారు. అలాంటి టైమ్‌లో నేను మద్రాసు వెళ్లి, గురువుగారిని వెతుక్కుంటూ శివాజీ గార్డెన్స్‌లో అడుగుపెట్టాను. నన్ను చూడగానే.. ఆ యూనిట్‌కి ఆనందం ఆగలేదు. భలే వచ్చావయ్యా... అంటూ గబగబా.. కాస్ట్యూమ్స్ తొడిగేశారు. మేకప్ వేసేశారు. నాపై క్లాప్ కొడుతుండగా గురువుగారొచ్చారు. ‘అరే... ఎప్పుడొచ్చావ్. నీక్యారెక్టర్ పెద్దటెన్షనే పెట్టింది. భలే వచ్చావే. ఇక్కడకు రాగానే.. మొహానికి రంగేయించుకున్నావ్. క్లాప్ కొట్టించుకున్నావ్. అదృష్టవంతుడవయ్యా. ఇకనుంచి నువ్వు నాతోనే ఉంటావ్’ అని మాటిచ్చేశారు. ఆ రోజే ఆయన కారెక్కాను. అప్పట్నుంచి కారుల్లో తిరుగుతూనే ఉన్నాను. అవునూ.. తలకు గుడ్డ కట్టుకుంటారెందుకని? కోడి రామకృష్ణ: ‘మా పల్లెలో గోపాలుడు’ షూటింగ్‌ని మద్రాస్ కోవలం బీచ్‌లో చేస్తున్నాం. నాకు గుర్తు అది మే నెల. విపరీతమైన ఎండలు. ఆ టైమ్‌లో మోకా రామారావుగారని ఎన్టీఆర్‌గారి కాస్ట్యూమర్. ‘మా పల్లెలో గోపాలుడు’కి కూడా కాస్ట్యూమర్ ఆయనే. ఓ మధ్యాహ్నం ఆయన నా దగ్గరకొచ్చి ‘మీ ఫోర్ హెడ్ చాలా పెద్దది. ఎండలో అది బాగా ఎక్స్పోజ్ అయిపోతోంది’ అని తన బాక్స్‌లోంచి ఓ జేబు రుమాల తీసి నా నుదుటికి కట్టాడు. ఆ రోజు మొత్తం ఆ రుమాల అలాగే ఉంది. రెండోరోజు ఆయనే వచ్చి, ‘నాకు తెలిసి చాలామంది ఇలా కట్టుకున్నారు కానీ... మీకు మ్యాచ్ అయినట్లు ఎవరికీ కాలేదు’ అని చెప్పి, ఓ టర్కీటవల్‌తో ప్రత్యేకంగా నా నుదురు కొలత ప్రకారం ఓ బ్యాండ్‌లా చేయించి, నాకిస్తే... కట్టుకున్నాను. అది చూసిన ప్రతివారూ బాగుంది అన్నారు. చివరకు బాలచందర్‌గారు కూడా. ఓ సారి ఆయన మా సెట్‌కి వచ్చారు. నన్ను చూసి ‘ఓసారి అద్దంలో చూసుకో’ అన్నారు. చూసుకుంటే.. నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలి ఉంది. దాని కారణంగా అందంగా కనిపిస్తున్నాను. అప్పుడన్నాడాయన.. ‘ఇది ఈ జన్మది కాదయ్యా... కచ్చితంగా పూర్వజన్మదే. అందుకే నీకు అంత బాగా అతికింది’ అని. అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయిపోయింది. నిజంగా ఇది విచిత్రమే. మొదటినుంచి సెంటిమెంట్లను నేను బాగా నమ్ముతాను. ‘అంకుశం’కి పాతికేళ్లు నిండిన సందర్భంలో కోడి రామకృష్ణ చెప్పిన కొన్ని విశేషాలు... ‘అంకుశం’కి ముందు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి సంస్థలో ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ చేశా. రెండూ సూపర్హిట్లే. మా కాంబినేషన్లో మూడో సినిమా కాబట్టి, అంచనాలకు తగ్గట్లు ఎలాంటి కథ చేయాలని ఒకటే ఆలోచన. చిన్నప్పటి నుంచీ పోలీసులంటే అభిమానం. అసలు ఆ వృత్తి అంటేనే నాకు గౌరవం. వారిపై నాటకాలు కూడా రాశా. అందుకే.. ఒక పోలీస్ కథను ఎంచుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నా మస్తిష్కంలో మెదిలింది. ఆ ఆలోచనే రెడ్డి గారితో చెప్పాను. ఆయన ‘చూస్తారంటారా?’ అన్నారు. కచ్చితంగా చూస్తారని నమ్మకంగా చెప్పా. పోలీసు కథంటే సెన్సార్ సమస్యలొస్తాయేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ‘సమస్యలు రాకుండా చూసే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చాను. అలా ‘అంకుశం’ కథ మొదలైంది. ఒక రాజకీయ నేత రోడ్ మీద ఆగితే... కూల్‌డ్రింక్ అందించేవారు కోకొల్లలు. కానీ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ, నిరంతరం ఎండలో నిలబడి వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తున్న ఒక పోలీస్‌కు మంచినీళ్ళివ్వడానికి ఒక్కడూ ముందుకు రాడు. మొదటి నుంచీ పోలీసంటే సమాజంలో చిన్న చూపు. దీన్ని ప్రశ్నిస్తూ, పోలీసు వ్యవస్థ గౌరవం పెంచాలనిపించింది. ఆ కసితోనే ముందు విజయ్ పాత్ర సృష్టించా. ఆ పాత్ర రాసుకున్న దగ్గర నుంచీ నా మనసులో మెదిలిన రూపం రాజశేఖరే. ఈ సినిమా గురించి చెప్పగానే... రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ప్రాణం పెట్టి చేస్తా సార్’ అన్నాడు. అన్నట్లుగానే సిన్సియర్‌గా చేశాడు. ►కథానాయకుని పాత్ర ఎలివేట్ అవ్వాలంటే, ప్రతినాయకుడు శక్తిమంతంగా ఉండాలి. రౌడీలను అతి సమీపంలో నుంచి చూసిన అనుభవం నాది. ఆ అనుభవాలను రంగరించే నీలకంఠం పాత్రను సృష్టించాను. ఆ పాత్రను ఎవరితో చేయించాలి? అన్వేషణ మొదలైంది. ఓ రోజు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి బంధువుల ఇంటికెళ్లాం. అక్కడ కనిపించాడు ఓ వ్యక్తి. రెడ్డిగారి బంధువు. అటూ ఇటూ తిరుగుతుంటే అతణ్ణే గమనిస్తూ కూర్చున్నా. వివరాలు తెలుసుకున్నా. పేరు రామిరెడ్డి. చదువుకుంటున్నాడు అని తెలిసింది. ఓ రోజు తనకు చెప్పకుండానే మేకప్ టెస్ట్ చేశాం. ‘ఏంటి ఇదంతా’ అని కంగారు పడ్డాడు. ఒప్పుకునేలా కనిపించలేదు. ఎమ్మెస్రెడ్డిగారితో చెప్పించాం. ‘చేయ్. విలన్ పాత్ర. బాగుంది. మంచి పేరొస్తుంది. సిగ్గెందుకు. నేను చేయడంలా?’ అని ఆయన గట్టిగా చెప్పడంతో ఒప్పుకున్నాడు. ►సంగీత దర్శకుడు సత్యం గారి చివరి సినిమా ‘అంకుశం’. ఓ పాట మిగిలుండగానే కన్నుమూశారాయన. నేపథ్యగీతం. ఎవరితో చేయించాలా అనుకుంటుండగా, రచయిత రాజశ్రీ ముందుకొచ్చారు. ►‘అంకుశం’ విడుదలయ్యాక ఓ రోజు నేను, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డిగారు ట్యాంక్‌బండ్ దగ్గర నిలబడ్డాం. అది నో పార్కింగ్ ప్లేస్. దాంతో ఇద్దరు పోలీసులు మా దగ్గరకొచ్చి, ‘ఫైన్ కట్టండి’ అన్నారు. దాంతో వారితో వాదన మొదలైంది. ఉన్నట్లుండి నాలుగు జీపులు వచ్చి అక్కడ ఆగాయి. అందులో నుంచి పోలీస్ ఉన్నతాధికారులు దిగారు. మమ్మల్ని చూసి పరుగుపరుగున మా వద్దకొచ్చారు. ‘ఆయన ఎవరనుకున్నారు? కోడి రామకృష్ణగారు. సెల్యూట్ కొట్టండి’ అని గద్దించారు. ‘మా పోలీసుల గౌరవాన్ని పెంచిన మనుషులు మీరు. మా వాళ్లు ఇలా ప్రవర్తించినందుకు సారీ సార్’ అన్నారు. తర్వాత ఓ ప్రభుత్వ వేడుకకు నన్ను అతిథిగా పిలిచి, పోలీస్ లాఠీ బహుమతిగా ఇచ్చారు. ఆ క్షణంలో ఎంత సంతృప్తి ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ ఆ లాఠీ నా దగ్గరే భద్రంగా ఉంది. ►‘అంకుశం’ 20 పైచిలుకు కేంద్రాల్లో వందరోజులాడింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో ఏడాది ఆడింది. ఆ రోజుల్లో బాగా వసూలు చేసిందా సినిమా. తమిళ, మలయాళాల్లోకి అనువదిస్తే, అక్కడ కూడా విజయం సాధించిందీ సినిమా. ఆ పాత్ర మీదున్న ప్రేమతో చిరంజీవి గారు హిందీలో ‘ప్రతిబం«ద్’గా చేసి, విజయం సాధించారు. నా కెరీర్లో ‘అంకుశం’ ఓ విలువైన రత్నం. ఇలాంటి మంచి సినిమాను నాతో చేయించిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డిగారికి థ్యాంక్స్. -
శోకసంద్రంలో సినీ పరిశ్రమ
-
'ఆ చిత్రాని'కి బాహుబలికి పోలికే లేదు
ముంబై: తాను తీసిన చిత్రాల్లోని నటీనటులు రియల్ లుక్‌లో కనబడే విధంగా చిత్రాలు తీస్తానని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వెల్లడించారు. అందుకోసం ఎప్పుడు ఎక్కడ 3డీ ఫార్మెట్‌ను ఉపయోగించలేదని తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కి.. విడుదలకు సిద్ధంగా ఉన్న బాహుబలి చిత్రంలో కూడా ఈ ఫార్మెట్‌ను ఉపయోగించలేదన్నారు. 3డీ ఫార్మెట్ తాను అంతగా ఇష్టపడనని తెలిపారు. బాహుబలి చిత్రం ప్రమోషన్ కోసం గురువారం ముంబయి వచ్చిన రాజమౌళి విలేకర్లతో ముచ్చటించారు. ఆ ఫార్మెట్ ఉపయోగించడం వల్ల కలిగే ఇబ్బందులను రాజమౌళి వివరించారు. బాహుబలిలో సన్నివేశాలు స్పెషల్ ఎఫెక్ట్స్‌తో చాలా బాగా వచ్చాయని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప్రశంసల జల్లు కురిపించిన సంగతిని ఈ సందర్భంగా రాజమౌళి వద్ద విలేకర్లు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ... అమితాబ్ ప్రశంసలు సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ చిత్రం చూసి దక్షిణాది ప్రేక్షకులు ఇదే విధంగా స్పందిస్తారని చెప్పారు. అలాగే బాహుబలి హిందీ వెర్షన్ చూసి ఇక్కడి ప్రేక్షకులు కూడా సంతోషిస్తారని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాహుబలి చిత్రానికి హలీవుడ్ బ్లాక్ బస్టర్ 300 చిత్రానికి పోలికలు ఉన్నాయంటూ విలేకర్లు లేవనెత్తిన ప్రశ్నలకు రాజమౌళి సమాధాన మిచ్చారు. బాహుబలి చిత్రానికి... హాలీవుడ్ చిత్రం 300 మధ్య పోలికే లేదన్నారు. బాహుబలి ప్రత్యేక చిత్రమని అన్నారు. ఆ రెండు చిత్రాల మధ్య పోలిక ఎలా ఏర్పడిందో తెలియదన్నారు. కాగా తన దర్శకత్వంలో వచ్చే చిత్రాలలో హీరో కంటే విలన్ పాత్రలు మరింత శక్తిమంతంగా.. పెద్దగా ఉండేలా ప్రయత్నిస్తానని చెప్పారు. అలాగే సినిమాలు నిర్మిస్తానని చెప్పారు. అందుకు రామ్‌చరణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా తన దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రాన్ని ఈ సందర్భంగా రాజమౌళి ఉదాహరించారు. ఇటీవల ముంబైలో బిగ్ బీ అమితాబ్ బాహుబలి చిత్రం ట్రైలర్ చూశారు. ఈ చిత్రం చాలా బాగుందంటూ అమితాబ్ కితాబ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.