
'బాల్యం నుంచి ప్రతి దశలోనూ మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. కాలక్రమంలో అందులో కొందరిని మనం మర్చిపోవడం సహజం. కానీ జీవితపు ప్రారంభ దశలో ప్రేమాభిమానాలు కురిపించే బాల్య స్నేహితులను మాత్రం కాదు' అని డైరెక్టర్ మారుతి అన్నాడు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!)
అక్టోబర్ 1న మచిలీపట్నం జార్జికారనేషన్ హైస్కూల్‌కు చెందిన ఆయన చిన్నప్పటి ఫ్రెండ్స్.. గెట్ టుగెదర్ కార్యక్రమంతో పాటు, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తమ ఫ్రెండ్ మారుతిని ప్రేమగా సత్కరించారు. ప్రభాస్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మారుతి.. చిన్ననాటి స్నేహితులను పేరుపేరున పలకరించి, వారితో అప్పటి విశేషాలని గుర్తుచేసుకున్నాడు.
ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను, తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు, తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి, సన్మానపత్రం కూడా అందజేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment