
గతేడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బేబి' కచ్చితంగా ఉంటుంది. అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సంచలన విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా నిర్మాతల్లో డైరెక్టర్ మారుతి ఒకడు. ఇప్పుడు ఈయన నుంచి మరో సినిమా వస్తోంది. దానికి 'బ్యూటీ' అని పేరు ఖరారు చేశారు.
(ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు)
సుబ్రహ్మణ్యం ఆర్.వీ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్‌తో కలిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ. విజయ్ పాల్ రెడ్డి నిర్మాత. ఈనెల 22న లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్పుడే టైటిల్‌ని కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ‘బేబీ’లో సినిమాలో దాదాపు అంతా కొత్తవారే కనిపించారు. అయితే అందులో కల్ట్ పాయింట్ పట్టుకొన్నారు. అది యూత్‌కి బాగా నచ్చింది. ఈ ‘బ్యూటీ’ కూడా అంతేనని సమాచారం. 'బేబీ' ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు.
(ఇదీ చదవండి: హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment