డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా? | Director Krish Second Marriage Rumours Trending On Social Media, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Director Krish Marriage Rumours: టాలీవుడ్ దర్శకుడికి మరోసారి పెళ్లంటూ రూమర్స్

Nov 5 2024 9:21 AM | Updated on Nov 5 2024 9:48 AM

Director Krish Second Marriage News

ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి మాటలు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. త్వరలో నాగచైతన్య కూడా ఇలానే మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. ఇదలా ఉంచితే తెలుగు దర్శకుడు క్రిష్ కూడా మరోసారి వివాహం చేసుకోబోతున్నాడనే రూమర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి.

(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)

'గమ్యం', 'వేదం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష్.. 2016లో రమ్య అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు కానీ మనస్పర్థలు వచ్చి 2021లో విడిపోయారు. అప్పటినుంచే సింగిల్‌గానే ఉంటున్న క్రిష్.. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడట. ఓ లేడీ డాక్టర్‌తో త్వరలో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వచ్చే వారం ఈ మేరకు నిశ్చితార్థం జరుపుకోనున్నారనే టాక్ వినిపిస్తుంది.

క్రిష్‌ పెళ్లి చేసుకోబోయే మహిళకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని, 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని అంటున్నారు. మరి ఈ రూమర్స్ నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. చివరగా 'కొండపొలం' మూవీతో పలకరించిన క్రిష్.. పవన్ 'హరిహర వీరమల్లు' సినిమా మొదలుపెట్టాడు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోయింది. పవన్ ఎంతకీ ఈ మూవీ గురించి పట్టించుకోకపోవడంతో దర్శకుడిగా ఇతడు పక్కకు తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' మూవీ చేస్తున్నాడు. ఇంతలోనే ఇలా క్రిష్ పెళ్లి రూమర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్‌ని భయపెట్టిన బిచ్చగాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement