డబ్బు లాక్కొని హీరోయిన్‌ని భయపెట్టిన బిచ్చగాడు | Nivetha Pethuraj Shares Shocking Experience With Beggar, Her Money Was Stolen At Chennai Traffic Signal | Sakshi
Sakshi News home page

Nivetha Pethuraj: బిచ్చగాడి బెదిరింపు.. షాక్‌లో టాలీవుడ్ హీరోయిన్

Nov 5 2024 8:22 AM | Updated on Nov 5 2024 9:07 AM

Nivetha Pethuraj Shares Shocking Experience With Beggar

హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్లు బెడద ఎక్కువే. లేదు అంటే వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం ఇచ్చేంత వరకు ఇబ్బంది పెడుతుంటారు. కొన్నిసార్లు పెన్నులు, బుక్స్ అమ్ముతాం అని చెప్పి డబ్బులు అడుగుతుంటారు. అలాంటి ఓ బెగ్గర్ వల్ల టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇబ్బంది పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంది.

తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ కాస్తంత బిజీగా ఉన్న నివేదా.. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. తాజాగా అడయార్ జంక్షన్ దగ్గర ఆగినప్పుడు 8 ఏళ్ల పిల్లాడు డబ్బులు అడిగాడని, ఇవ్వనని చెప్పేసరికి ఓ పుస్తకం చూపించి రూ.100 అడిగాడని.. సరే కదా అని 100 తీసి ఇస్తుండగా ఏకంగా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశాడని నివేదా చెప్పింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)

దీంతో పుస్తకం ఏమొద్దని చెప్పి 100 రూపాయలు తిరిగి తీసుకున్నానని.. అయితే ఆ బాలుడు పుస్తకాన్ని కారులో విసిరేసి తన దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడని నివేదా పేతురాజ్ తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఇలా బెదిరింపులతో భిక్షాటన చేయడం కరెక్టేనా అని ప్రశ్నించింది.

మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, బ్లడ్ మేరీ, దాస్ కా దమ్కీ తదితర సినిమాల్లో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది. తమిళంలో దాదాపు ఇన్నే చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)

Advertisement
 
Advertisement
Advertisement