Nivetha Pethuraj
-
బై మిస్టేక్ హీరోయిన్.. లేదంటే కారు రేసర్! ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు
హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్లు బెడద ఎక్కువే. లేదు అంటే వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం ఇచ్చేంత వరకు ఇబ్బంది పెడుతుంటారు. కొన్నిసార్లు పెన్నులు, బుక్స్ అమ్ముతాం అని చెప్పి డబ్బులు అడుగుతుంటారు. అలాంటి ఓ బెగ్గర్ వల్ల టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇబ్బంది పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంది.తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ కాస్తంత బిజీగా ఉన్న నివేదా.. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. తాజాగా అడయార్ జంక్షన్ దగ్గర ఆగినప్పుడు 8 ఏళ్ల పిల్లాడు డబ్బులు అడిగాడని, ఇవ్వనని చెప్పేసరికి ఓ పుస్తకం చూపించి రూ.100 అడిగాడని.. సరే కదా అని 100 తీసి ఇస్తుండగా ఏకంగా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశాడని నివేదా చెప్పింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)దీంతో పుస్తకం ఏమొద్దని చెప్పి 100 రూపాయలు తిరిగి తీసుకున్నానని.. అయితే ఆ బాలుడు పుస్తకాన్ని కారులో విసిరేసి తన దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడని నివేదా పేతురాజ్ తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఇలా బెదిరింపులతో భిక్షాటన చేయడం కరెక్టేనా అని ప్రశ్నించింది.మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, బ్లడ్ మేరీ, దాస్ కా దమ్కీ తదితర సినిమాల్లో నివేదా పేతురాజ్ హీరోయిన్గా చేసింది. తమిళంలో దాదాపు ఇన్నే చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్) -
నా బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడు!
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్. తమిళంలో తిరునాళ్ కూత్తు చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈమె ఆ తర్వాత టిక్ టిక్ టిక్, సంఘతమిళన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలా విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని వంటి హీరోల సరసన నటించినా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఈమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తమిళంలో కొత్త చిత్రాలకు కమిట్ అయినట్టు చెబుతున్న నివేద పేతురాజ్ ఇటీవల కారులో వెళుతూ ఒక ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్లో ఒక భాగం అని ఆ తర్వాత తెలిసింది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ఇలా పేర్కొన్నారు. తన నెగెటివ్ ఆలోచనలన్నీ వాస్తవ రూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఒకరోజు తన బాయ్‌ఫ్రెండ్ తన మోసం చేశాడని ఊహించుకున్నానన్నారు. ఆ తర్వాత అదే విధంగా జరిగిందన్నారు .తన బాయ్‌ఫ్రెండ్ మరెవరినో తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తాను వాడుతున్న కారు నుంచి భవిష్యత్తులో కొనుక్కు పోయే కారు వరకు తన నెగటివ్ ఆలోచనలలేనని నటి నివేద పేతురాజు పేర్కొన్నారు. కాగా ఈ 32 ఏళ్ల పరువాలగుమ్మలో మంచి నటినే కాకుండా బైక్ రేసర్ క్రీడాకారిణి కూడా ఉన్నారన్నది గమనార్హం. -
నీలం డ్రస్‌లో మెరిసిన ‘నివేదా పేతురాజ్’ (ఫొటోలు)
-
ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్
ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు అంటే దాదాపు థ్రిల్లర్ కథలే ఉంటాయి. ఇప్పుడు అదే జానర్లో వస్తున్న తెలుగు స్ట్రెయిట్ సిరీస్ 'పరువు'. రీసెంట్గా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగిందని ఓ వీడియో వైరల్ అయింది కదా! అది ఈ సిరీస్ కోసమే. ఇప్పుడు దీని ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?)హీరోయిన్ నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'పరువు'. నాగబాబు కీలక పాత్ర చేశాడు. బిందుమాధవి విలన్‌గా చేసింది. సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. జూన్ 14 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి జాహ్నవి, విక్రమ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లని చంపడానికి కొందరు కిల్లర్స్ ప్రయత్నిస్తారు. వీళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రేమికులు కాస్త హంతకులుగా మారాల్సి వస్తుంది. చివరకు ఏమైంది అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!) -
పోలీసులతో నివేదా పేతురాజ్ వాగ్వాదం.. అసలు విషయం ఇదన్నమాట!
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పరిచయం అక్కర్లేదు.చెన్నైకి చెందిన ముద్దుగుమ్మ మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలోనూ మెరిసింది. అయితే ఇటీవల నివేదాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలైంది. కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారితీసింది. ఏకంగా పోలీసులతోనే వాగ్వావాదానికి దిగింది. ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వాదించింది. దీంతో అసలేం జరిగిందంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు. కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేయగా.. మరికొందరు ఇంకా ఏదో జరిగి ఉంటుందని ఎవరికీ వారు ఊహించేసుకున్నారు.తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. ఇదంతా మూవీ ప్రమోషన్లలో భాగమేనని తేలిపోయింది. తాజాగా ఈ విషయాన్ని జీ5 ట్వీట్ చేసింది. పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేదా పేతురాజ్ లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాను జూన్ 14నుంచి జీ5 స్ట్రీమింగ్ చేయనున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని తేలడంతో నెటిజన్స్ షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. Here you go! Not caught in the act, but really one for our latest original #PARUVUonZee5@GoldBoxEnt @sushkonidela @NagaBabuOffl #vishnulaggishetty @saranyapotla @Nivetha_Tweets @nareshagastya @patnaikpraneeta #AmitTiwari @pavansadineni @siddharth_vox @Rajvadlapati pic.twitter.com/z0ILXhKE7w— ZEE5 Telugu (@ZEE5Telugu) May 31, 2024 -
హీరోయిన్ డిక్కీలో ఏముంది
-
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
నివేతా పేతురాజ్.. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీ 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి మూవీతో ఇక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆపై విశ్వక్ సేన్‌తో కలిసి నటించిన పాగల్, దాస్ కా దమ్కీ చిత్రాలతో తన మార్క్ నటనతో ఫిదా చేసింది. అయితే, సుమారు రెండేళ్లుగా ఆమె నటించిన సినిమా ఏదీ కూడా తెరపై కనిపించలేదు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నివేతా పేతురాజ్ కారులో వెళ్తున్న సమయంలో చెకింగ్ పేరుతో పోలీసులు ఆపుతారు. కారు డిక్కీ ఓపెన్ చేయమని ఆమెను పోలీసులు కోరడంతో అందుకు ఆమె నిరాకరిస్తుంది. ఎందుకు ఓపెన్ చేయాలని చిన్నపాటి గొడవకు దిగుతుంది. పేపర్లు అన్నీ ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి అంటూ వారిస్తుంది. 'కారు డిక్కి మాత్రం ఓపెన్ చేయను, అది నా పరువుకు సంబంధించిన అంశం. మీకు చెప్పినా అర్థం కాదు. నేను డిక్కీ మాత్రం ఓపెన్ చేయను అంటూ.. పోలీసులతో గొడవకు దిగుతుంది. ఈ క్రమంలో వీడియో తీస్తున్న పోలీసును ఆమె అడ్డగిస్తుంది. ఈ వివాధానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన ప్రేక్షకులు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఏదైనా సినిమా ప్రమోషన్ అయి ఉండవచ్చని చెబుతున్నారు. అదీ కాకుంటే తన నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ఒక సీన్ అయి ఉంటుందని ఆమె తెలుపుతున్నారు. పోలీసులుగా ఉన్న వారిలో ఒకరు సాధారణ చెప్పులు ధరించడాన్ని నెటిజన్లు గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తప్పకుండా షూస్ ధరిస్తారని తెలిసిందే. దీంతో ఇదంతా సినిమా స్టంట్ అని నెటిజన్లు చెబుతున్నారు. ఇంత చక్కగా అమ్మాయి నటిస్తుంటే ప్రమోషన్స్ ఎందుకు..? అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొత్త సినిమా అప్డేట్?నివేదా పేతురాజ్..మొన్నటి వరకు అటు తమిళ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో అలరించింది. టాలీవుడ్లో చివరగా ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ(2023)’ చిత్రంలో నటించింది. ఈ వెంటనే ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘కాలా’ కూడా రిలీజైంది. ప్రస్తుతం అటు తమిళ్లో కానీ ఇటు తెలుగు కానీ నివేదాకు సినిమాలు లేవు. దీంతో తన కొత్త సినిమా ప్రకటన అందరికి రీచ్ అవ్వాలనే ఇలాంటి ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. Actress #NivethaPethuraj argued and hesitated to open backside trunk of the car and scolded the recorded person...Her expressions made Policemen to doubt on herself...#Tollywood #NivethaPethuraj #Police pic.twitter.com/49W6DNPcdL— Anchor_Karthik (@Karthikkkk_7) May 29, 2024 -
చీరకట్టులో కేజీఎఫ్ భామ.. శోభిత రానా బోల్డ్ లుక్స్!
దుబాయ్‌లో శోభిత రానా హోయలు... ట్విన్ టవర్స్ వద్ద యషిక ఆనంద్ లుక్స్ వైరల్.. శారీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి స్మైలీ లుక్స్... అలాంటి మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోజులు.. ఆలయంలో నివేదా పేతురాజ్ పూజలు.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) -
టాలీవుడ్ హీరోయిన్‌కు సీఎం కుమారుడు ఖరీదైన గిఫ్ట్.. వైరలవుతోన్న ట్వీట్!
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. గతేడాది యంగ్ విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్గా అలరించిన భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నటన, మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. అంతేకాదు ఇటీవలే మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేసింది. మీరు ఏదైనా రాసేముందు దయచేసి నిజాలు ఏంటో తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి వాటితో తమ కుటుంబం ఒత్తిడిలో ఉందని.. అనవసరంగా ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. నివేదా పేతురాజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నా. ఎందుకంటే దీని గురించి మాట్లాడే బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించా. వాటి వల్ల కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత రాస్తూ.. 'నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చా. 16 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లోనే నివసిస్తోంది. మేము దాదాపు 20 ఏళ్లకు పైగా దుబాయ్‌లో ఉన్నాం. సినీ పరిశ్రమలో కూడా నాకు అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోను అడగలేదు. ఇప్పటికీ 20కి పైగా సినిమాలు చేశా. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదని' రాసుకొచ్చింది. నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుంచి దుబాయ్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. అలాగే 2013 నుంచి రేసింగ్ అంటే నా అభిరుచి. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నా. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మానసికంగా పరిణీతి సాధించా. అంతేకాదు.. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు కోరుకున్నట్లే గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని.. ఇకపై నా పరువు తీసేలా వ్యవహరించని ఇప్పటికీ విశ్వసిస్తున్నందున చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక కుటుంబం ప్రతిష్టను కించపరిచేలా మాట్లాడేముందు.. మీరు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించుకోవాలని కోరుతున్నా. అలాగే మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని మీడియా మిత్రులకు అభ్యర్థిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే.. కాగా.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజ్‌కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. Lately there has been false news circulating about money being lavishly spent on me. I kept quiet because I thought people who are speaking about this will have some humanity to verify the information they receive before mindlessly spoiling a girl’s life. My family and I have… — Nivetha Pethuraj (@Nivetha_Tweets) March 5, 2024 -
కప్ కొట్టిన తెలుగు హీరోయిన్.. ఈమెలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
హీరోయిన్లలో యాక్టింగ్ బాగా చేయడం సహజమే. కానీ అంతకు మించిన టాలెంట్స్ కూడా కొందరిలో ఉంటాయి. అవి టైమ్ వచ్చినప్పుడు బయటపడుతుంటాయి. అలా తెలుగు హీరోయిన్ నివేతా పేతురాజ్లోని మరో ప్రతిభ ఇప్పుడు బయటపడింది. ఏకంగా కప్ కొట్టేయడంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఈమెలో ఏయేం టాలెంట్స్ ఉన్నాయి? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్.. 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే 'మెంటల్ మదిలో' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం తదితర సినిమాలు చేసింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈమె ఏం మూవీస్ చేస్తుందనేది తెలీదు. నటన-మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప్రొఫెషనల్ షట్లర్లా మారిపోయింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. అలానే 'తర్వాత ఏంటి?' అనే ఓ క్యాప్షన్ పెట్టింది. అంటే మళ్లీ ఏదో పోటీలో టాలెంట్ చూపించబోతుందనమాట. (ఇదీ చదవండి: బిజినెస్ మొదలుపెట్టిన నటి సన్నీ లియోన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
కార్ రేసింగ్ గురించి నటి నివేతా పేతురాజ్
-
దాస్ కా ధమ్కీ వల్ల మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీ
-
దాస్ కా ధమ్కీ సీక్వెల్ వచ్చేస్తోంది...హీరో,హీరోయిన్లు ఎవరంటే?
-
విశ్వక్ సేన్ కి ధమ్కీ ఇచ్చిన నివేత
-
ముంబైలో ఇల్లు కొన్న 'దాస్ కా ధమ్కీ' బ్యూటీ నివేదా
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక రీసెంట్గా దాస్ కా ధమ్కీ సినిమాలో హీరోయిన్గా అలరించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి ఆమెకు ఆఫర్స్ వచ్చినట్లు ఇటీవల దాస్ కా ధమ్కీ మూవీ సక్సెస్ మీట్లో తెలిపింది. దీంతో ఆమె త్వరలోనే బాలీవుడ్‌కు మకాం మార్చనుంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్లో భాగంగా నివేదా ముంబై ఓ ఇల్లు కొనుగోలు చేసిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దాస్ కా ధమ్కీ సక్సెస్ మీట్లో పాల్గొన్న నివేదా తాజాగా ముంబైలో తాను ఇల్లు కొన్నట్టు చెప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పలు బిజినెస్‌తో బిజీగా ఉన్నాను. అందుకే సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. వెబ్ సిరీస్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టి-సిరీస్ బ్యానర్లో ఓ సినిమాకు కమిట్ అయ్యాను. ఈ క్రమంలో ముంబైలో ఇల్లు కొన్నా. త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నా. హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని అనుకొన్నాను. కానీ కుదర్లేదు. ముంబైలో ఇల్లు కొన్నాను’ అని తెలిపింది. -
‘దాస్ కా ధమ్కీ’ మూవీ రివ్యూ
టైటిల్: దాస్ కా ధమ్కీ నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, రోహిణి, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: విశ్వక్ సేన్ సినిమాస్ నిర్మాత: విశ్వక్ సేన్ దర్శకత్వం: విశ్వక్ సేన్ సంగీతం: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు విడుదల తేది: మార్చి 22, 2023 టాలీవుడ్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఫలక్‌నుమా దాస్‌లో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్ పడలేదు. మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి నటించిన పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి తనకు అచ్చొచ్చిన మాస్ జోనర్‌ని ఎంచుకున్నాడు. ఆయన హీరో గా నటిస్తూనే డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ‘మాస్ కా ధమ్కీ’ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మాస్ కా ధమ్కీ’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కృష్ణ దాస్ ( విశ్వక్ సేన్) ఓ అనాథ. స్నేహితులు ఆది(హైపర్ ఆది), మహేశ్(రంగస్థలం మహేశ్)లతో కలిసి ఉంటూ.. ఓ స్టార్ హోటల్లో వెయిటర్‌గా పని చేస్తుంటాడు. అక్కడికి కస్టమర్‌గా వచ్చిన కీర్తి(నివేదా పేతురాజ్)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి కోటీశ్వరుడిలాగా నటిస్తాడు. కట్ చేస్తే.. అచ్చం కృష్ణదాస్ లాగే ఉండే సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) ఎస్సార్ ఫార్మా కంపెనీ స్థాపించి, క్యాన్సర్‌ని పూర్తిగా తగ్గించే డ్రగ్ కనిపెట్టడం కోసం తన బృందంతో కలిసి పోరాతుంటాడు. డ్రగ్ కోసం వ్యాపారవేత్త ధనుంజయ్(అజయ్)తో రూ. 10 వేల కోట్లు డీల్ కుదుర్చుకుంటాడు. ఓ కారణంగా సంజయ్ రుద్ర ప్లేస్‌లోకి కృష్ణదాస్ వస్తాడు. తన అన్న కొడుకు సంజయ్‌లా నటించమని స్వయంగా అతని బాబాయ్(రావు రమేశ్)కృష్ణదాస్‌ని తీసుకొస్తాడు. అతను ఎందుకు అలా చేశాడు? సంజయ్ ప్లేస్‌లోకి వచ్చాక కృష్ణదాస్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? డ్రగ్ కోసం సంజయ్ రుద్ర ఏం చేశాడు? అతని వేసిన ప్లాన్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్లో ‘దాస్క్ కా ధమ్కీ’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమాకు కథ అందించింది బెజవాడ ప్రసన్న కుమార్. పాత కథలనే అటు ఇటు మార్చి దానికి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి స్క్రీన్‌ప్లేతో మాయ చేయడం ప్రసన్న కుమార్‌కు బాగా అలవాటు. మొన్నటి బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ చిత్రంలోనూ ఇదే చేశాడు. ఇప్పుడు మాస్క్ కా ధమ్కీలో కూడా అదే పని చేశాడు. తెలిసిన కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఒకరి ప్లేస్‌లోకి ఒకరు రావడం... చివర్లో వచ్చే ట్విస్టులు.. ఇవన్ని ‘ధమాకా’, ‘ఖిలాడీ’తో పాటు ఇంతకు ముందు వచ్చిన చాలా తెలుగు సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఇక లాజిక్స్ గురించి అసలే మాట్లాడొద్దు. కొన్ని ట్విస్టులకు కూడా ప్రేక్షకులు ఈజీగా పసిగడతారు. అలా అని సినిమా మొత్తం ఊహకందేలా రొటీన్‌గా సాగుతుందని చెప్పలేం. కొన్ని చోట్ల వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కృష్ణదాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా సాగుతుంది. కీర్తితో ప్రేమాయణం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. మధ్య మధ్యలో ఆది వేసే పంచులతో పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌ను మాత్రం వరుస ట్విస్టులతో ప్లాన్ చేశారు. అయితే వాటిలో కొన్ని ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేయకుండా.. సహనానికి పరీక్షగా మారాయి. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా ఊహించొచ్చు. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. కొత్తదనం కోరుకోకుండా..కాస్త కామెడీగా ఉంటే చాలు అనుకునేవాళ్లకి ‘దాస్ కా ధమ్కీ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాతో నటన పరంగా విశ్వక్ సేన్ ఒక మొట్టు ఎక్కాడు. వెయిటర్ కృష్ణదాస్, డాక్టర్ సంజయ్ రుద్ర రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విశ్వక్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఒకవైపు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను వహిస్తూ.. ఇంత చక్కగా నటించిన విశ్వక్ సేన్‌ని అభినందించొచ్చు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు. కీర్తి పాత్రకు నివేదా పేతురాజ్ న్యాయం చేసింది. సెకండాఫ్‌లో ఆమె ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. సంజయ్ బాబాయ్‌గా రావు రమేశ్ తనదైన నటనతో మెప్పించాడు. హీరో స్నేహితులుగా ఆది, రంగస్థలం మహేశ్‌ల కామెడీ బాగుంది. ఒక తరుణ్ భాస్కర్ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. మహేశ్, అతని మధ్య వచ్చే సీన్ బాగా పేలింది. రోహిణి, అజయ్, అక్షరా గౌడ, పృథ్విరాజ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ మిరియాల సంగీతం అందించిన 'మావా బ్రో' తో పాటు మిగిలిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
దాస్ కా ధమ్కీ మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
బ్లాక్ శారీలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్ (ఫోటోలు)
-
‘దాస్ కా దమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ (ఫోటోలు)
-
కరీంనగర్ : అభిమానుల సమక్షంలో ‘దాస్ కా దమ్కీ’ ట్రైలర్ వేడుక (ఫోటోలు)
-
Das Ka Dhamki Movie Photos: విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’ మూవీ స్టిల్స్
-
హీరోయిన్ నివేదా పేతురాజ్ గ్లామర్ ఫోటోలు
-
ఫార్ములా రేసింగ్ కారును ఆవిష్కరించిన సినీ నటి నివేదా (ఫొటోలు)
-
సినిమా ఆఫర్లు రాకపోతే ఉద్యోగం చేసుకుంటా: హీరోయిన్
Nivetha Pethuraj Comments On Heroine Career: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత బ్రోచేవారెవరురా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్' వంటి తదితర మూవీస్‌లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల 'బ్లడీ మేరీ' చిత్రంతోనూ ఆకట్టుకుంది. నివేదాకు పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అయితే స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. హీరోయిన్ కన్నా నటిగా అనిపించుకోవడం గర్వంగా ఉంటుంది. కథానాయికగా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి బౌండరీస్ పెట్టుకోలేదు. నటనకు ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేస్తాను. ఒకవేళ సినిమా ఆఫర్లు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా. అని తెలిపింది నివేదా పేతురాజ్. ఆమె నటించిన 'విరాట పర్వం' సినిమా జూలై 1న విడుదల కానుంది. చదవండి: సినిమాల్లోకి రాకముందు నటి నివేదా ఏం చేసేదో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అంధురాలిగా నివేదా పేతురాజ్.. మేకింగ్ వీడియో వైరల్
Nivetha Pethuraj Bloody Mary Movie Making Video Released: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్' వంటి తదితర మూవీస్‌లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం 'బ్లడీ మేరీ'. కార్తీకేయ, సవ్యసాచి ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో పూర్తి తరహా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది 'బ్లడీ మేరీ'. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ అంధురాలిగా అలరించనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా 'బ్లడీ మేరీ' మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరిటీ దామరాజ్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతమందించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
ఆ పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తమిళ బ్యూటీ..!
Nivetha Pethuraj In Chiranjeevi Mega 154 Movie Directed By Bobby: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. యంగ్ హీరోలకన్నా తనేమి తక్కువ కాదంటూ మూడు సినిమాలను లైన్లో పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న చిరంజీవి మరో చిత్రం భోళా శంకర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక బాబీ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం ఒకటి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ఇందులో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అన్నదమ్ముల పాత్రల్లో చిరు, రవితేజ ? 'అన్నయ్య' మళ్లీ రిపీట్ ! మెగా 154వ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తున్నట్లు మహిళా దినోత్సవం రోజున మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో రవితేజకు జోడిగా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో చిరంజీవి, రవితేజ అన్నదమ్ముల పాత్రలో అలరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరూ అన్నదమ్ముల రోల్స్‌లో కనిపించినట్లే. గతంలో అన్నయ్య చిత్రంలో చిరంజీవితో కలిసి రవితేజ నటించారు. చదవండి: సినిమా టికెట్ల రేట్ల సవరణ.. స్పందించిన చిరంజీవి -
విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
Das Ka Dhumki: మరో మాస్ టైటిల్‌తో వస్తున్న విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. వెళ్లి పోమాకే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన విశ్వక్ సేన్.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామ దాస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల పాగల్‌తో ప్రేక్షకులను పలకరించాడు. ఆయన హీరోగా నటించిన మరోచిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ విడుదలకు సిద్దంగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు ఈ మాస్ హీరో. ఈ చిత్రానికి ‘దాస్ కా ధమ్కీ’అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చెశారు. ఈ మూవీకి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా, ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. వణ్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయవాడలో నివేదా పేతురాజ్ సందడి ఫొటోలు
-
సినిమాల్లోకి రాకముందు నటి నివేదా ఏం చేసేదో తెలుసా?
మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంటట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాల్లోకి రాకముందు బొటిక్ నిర్వహించేది. అంతేకాకుండా పలు ఈవెంట్లు, కార్ల కంపెనీల్లోనూ పనిచేశానని ఓ సందర్భంలో నివేదా పేర్కొంది. ఆ టైంలోనే మంచి ఫీచర్స్ ఉన్నాయి..సినిమాల్లో ట్రై చేయమని కొందరు ఫ్రెండ్స్ సూచించగా అలా ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. ఎక్కువ సినిమాలు చేయడం కంటే తన పాత్రకు స్కోప్ ఉంటేనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెబుతానని, ఒకవేళ నటిని కాకపోయి ఉంటే యోగా ఇన్ స్ట్రక్టర్ అయ్యేదాన్ని అని తెలిపింది. ఇటీవలె పాగల్ చిత్రంలో నటించిన ఈ అమ్మడు త్వరలోనే విరాటపర్వం సినిమాలో అలరించనుంది. చదవండి : KGF Chapter2: రిలీజ్ డేట్ ఫిక్స్..ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ 'డైరెక్టర్ కంటే డిజైనర్‌గానే ఎక్కువ సంపాదించా' -
అక్కడ అజిత్ సార్... ఇక్కడ విశ్వక్ సేన్
-
విశ్వక్ సేన్‌కి ఎన్టీఆర్ అంటే పిచ్చి...
-
నిజానికి నేను అలాంటిదాన్ని కాదు!
‘‘నేను ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి నాకు మిగలాలి. అంతకుమించి నాకు వేరే ఏ అంచనాలూ ఉండవు. ‘పాగల్’ చేస్తున్నప్పుడు మంచి సినిమా, మంచి పాత్ర చేస్తున్నాననే ఫీల్ కలిగింది’’ అన్నారు నివేదా పేతురాజ్. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా ‘దిల్’ రాజు – బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో వస్తోన్న చిత్రం ‘పాగల్’. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలతోంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం నరేశ్‌గారు ఈ సినిమా కథ చెప్పారు. ఒక్కసారి కాదు.. ఐదు సార్లు కథ చెప్పారు. వింటున్నప్పుడే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. కథ విన్న ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకున్నాను. నరేశ్‌గారు కథ చెప్పినప్పుడల్లా బెక్కెం వేణుగోపాల్‌గారు కూడా ఉన్నారు. ఈ కథను ‘దిల్’ రాజుగారు కూడా బాగా నమ్మారు. నరేశ్ ఎంత ఎమోషనల్‌గా కథ చెప్పారో అంతే బాగా తీశారు. ప్రేమలో ఉన్నవారందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్ సీరియస్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురములో’ వంటి చిత్రాల్లో దాదాపు సీరియస్ క్యారెక్టర్సే చేశారు.. మళ్లీ ‘పాగల్’లోనూ అలాంటి క్యారెక్టరే చేయడానికి కారణం? అనే ప్రశ్న నివేద ముందుంచితే– ‘‘కారణం నాకూ తెలియదు. బహుశా నా లుక్స్, ప్రవర్తన చూసి నాకు సీరియస్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయని ఇస్తున్నారేమో! నేను చూడటానికి సీరియస్ అమ్మాయిలా కనపడతాను. కానీ నిజానికి నేనలా ఉండను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘వేరే ఫీల్డ్‌లో అవగాహన పెంచుకోవాలని రీసెంట్గా రేసింగ్‌లో ఫస్ట్ లెవల్ పూర్తి చేశాను. రేసింగ్ ట్రైనింగ్ అప్పుడే కొత్త సినిమాలు కమిట్ అయ్యాను. తెలుగులో ఒకటి, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని నివేదా పేతురాజ్ అన్నారు. -
రియల్ లైఫ్‌లో హీరోయిన్ సాహసం: రేసులో లెవల్ వన్
ఫార్ములా రేసింగ్ నేర్చుకుంటున్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. ఇది సినిమా కోసం కాదు. రియల్ లైఫ్‌లో తన కలను నిజం చేసుకోవడానికి రేసింగ్ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఓ స్కూల్ నుంచి ‘ఫార్ములా రేసింగ్ లెవల్ 1 రేసర్’గా సర్టిఫికేట్ కూడా పొందారు. ఈ సందర్భంగా నివేదా మాట్లాడుతూ.. ‘‘స్కూల్ డేస్ నుంచే ఫార్ములా రేసింగ్ అంటే నాకు ఆసక్తి. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా బంధువుల్లో ఒకరు స్పోర్ట్స్ కారు కొన్నారు. దాంతో స్పోర్ట్స్ కార్లంటే మరింత ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే 2015లో ఓ స్పోర్ట్స్ కారు కొన్నాను. యూఏఈలో అప్పట్లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండో మహిళను నేనే. ఈ కారు వి6 ఇంజిన్ ఫాస్ట్ రేసింగ్‌కు సంబంధించినది. కానీ నేను బాగానే డ్రైవ్ చేశాను. చెన్నై వచ్చాక కొన్ని మోటార్ ట్రాక్స్‌ను చూసి, ఈ ట్రాక్స్‌పై డ్రైవ్ చేయగలనా? అనిపించింది. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఓ అడ్వాన్డ్స్ రేసింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాను. లెవల్ వన్ కంప్లీట్ చేశాను. మన దేశంలో ఫార్ములా వన్, ఫార్ములా 2 ఛాంపియన్ షిష్స్ మహిళా పోటీలు లేవు. ఉంటే ప్రోత్సాహంగా ఉంటుందని నా అభిప్రాయం. అయినా రేస్‌లో పాల్గొన్న ప్రతిసారీ రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. అందుకే ప్రస్తుతం రేసింగ్‌లోని నెక్ట్స్ లెవల్స్‌ను పూర్తి చేయడం పైనే దృష్టి పెట్టాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రముఖ హీరోయిన్‌కు చేదు అనుభవం.. భోజనంలో చచ్చిన బొద్దింక!
ప్రముఖ దక్షిణాది సినీ నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సాయంత్రం తను ఆర్డర్ చేసిన ఫుడ్‌లో చచ్చిన బొద్దిక వచ్చందంటూ సదరు రెస్టారెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆహరంలో ఉన్న బొద్దింక ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ రెస్టారెంట్ పేరు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం సాయంత్రం నివేదా చెన్నైలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ నుంచి ప్రముఖ ఫుడ్డెలివరి యాప్ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుంది. ఆర్డర్ రాగానే పార్శిల్ తెరిచి చూడగా అందులో చచ్చిన బొద్దింక దర్శనం ఇచ్చింది. దీంతో ఆమె మండిపడుతూ తన పోస్టులో ‘ప్రస్తుత రోజుల్లో స్విగ్గీ ఇండియా, ఆయా రెస్టారెంట్స్ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయో అర్థం కావడం లేదు. నిన్న నేను ఆర్డర్ పెట్టుకున్న ఆహారంలో బొద్దింక వచ్చింది. ఇదేం తొలిసారి కాదు గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇలాంటి రెస్టాంటెంట్స్ను రోజు తనిఖీ చేసి క్వాలిటీ లోపం ఉంటే భారీగా జరిమాన విధించడం చాలా అవసరం. ప్రస్తుతానికి అయితే ఈ రెస్టారెంట్‌పై ఓ కన్నేసి అది సరైన ప్రమాణాలను పాటిస్తుందో లేదో చెక్ చేయాలని కోరుకుంటున్న’ అంటూ ఆమె సదరు రెస్టారెంట్ పేరును ట్యాగ్ చేసిందే అంతేగాక తమ రెస్టారెంట్ల జాబితా నుంచి ఈ రెస్టారెంట్న తొలగించాల్సిందిగా స్విగ్గీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. చదవండి: ‘బంగార్రాజు’తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ! -
పాగల్ కోసం మూడో హీరోయిన్!
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు సమర్పిస్తున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ప్రేమ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, మేఘలేఖ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. తాజాగా మరో నాయికగా నివేదా పేతురాజ్ పేరును అనౌన్స్ చేశారు. తీర అనే పాత్రను నివేదా పోషిస్తున్నట్లు గురువారం ఓ పోస్టర్ ద్వారా చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన విశ్వక్–నివేద లుక్ వైరల్ అయ్యింది. మే 1న ‘పాగల్’ సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మణికందన్, సంగీతం: రధన్. చదవండి: డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు? -
విశాఖలో ‘రెడ్’ చిత్రం విజయోత్సవం
-
నిరాశపరిచే రీమేకు ఇది!
చిత్రం: ‘రెడ్’; తారాగణం: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్; సంగీతం: మణిశర్మ; కెమేరా: సమీర్ రెడ్డి; ఫైట్స్: పీటర్ హెయిన్; ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖ్; నిర్మాత: స్రవంతి రవికిశోర్; దర్శకత్వం: కిశోర్ తిరుమల; రిలీజ్: జనవరి 14. ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషకు తెస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యథాతథంగా మాతృకనే అనుసరించవచ్చా? అలా అనుసరిస్తే ఈజీనా, ఇబ్బందా? ఇది నిజంగా చర్చించాల్సిన విషయమే. మరీ ముఖ్యంగా రామ్ హీరోగా సంక్రాంతికి రిలీజైన ‘రెడ్’ చూసినప్పుడు ఈ ప్రశ్నలన్నీ మదిలో మెదులుతాయి. పక్క భాషలో ఎంత హిట్టయిన కథనైనా, మన దగ్గరకు తెచ్చుకున్నప్పుడు లోకల్ సెన్సిటివిటీస్‌కు తగ్గట్టు మార్చుకోవడం ఎంత అవసరమో, హిట్‌కు కారణమైన అంశాల్ని కదిలించకపోవడమూ అంతే కీలకం. తమిళ హిట్ ‘తడమ్’ ఆధారంగా వచ్చిన ‘రెడ్’ ఆ సంగతి మరోసారి ప్రూవ్ చేసింది. కథేమిటంటే..: సిద్ధార్థ (రామ్) భవన నిర్మాణ రంగంలో పైకి వస్తున్న సివిల్ ఇంజనీర్. మహిమ (మాళవికా శర్మ)ను ప్రేమిస్తాడు. మరోపక్క ఆదిత్య (రామ్ ద్విపాత్రాభినయం), అతని స్నేహితుడు వేమా (సత్య) ఆవారాగా తిరుగుతుంటారు. వాళ్ళు డబ్బు కోసం ఇబ్బందిపడుతున్న టైమ్‌లో ఆదిత్యకు, గాయత్రి (అమృతా అయ్యర్) ఎదురవుతుంది. ఈ ఇద్దరి కథలూ ఇలా సాగుతుండగా బీచ్ రోడ్డులో ఓ హత్య జరుగుతుంది. ఆ హంతకుడు సిద్ధార్థ, రామ్‌లలో ఎవరు అనేది చిక్కుముడి. ఆ హత్య ఎవరు, ఎందుకు చేశారు? సిద్ధార్థ – ఆదిత్యల మధ్య సంబంధం ఏమిటి లాంటివన్నీ మిగతా కథ. ఎలా చేశారంటే..: తెర మీద లైవ్ వైర్ లాంటి ఎనర్జీ ఉన్న కొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకరు రామ్. గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’లో అదేమిటో చూపిన హీరో రామ్ ఈసారి ‘రెడ్’లో ద్విపాత్రాభినయం చేశారు. సినిమాను తన రెండు పాత్రల భుజాల మీద మోశారు. కానీ, ఈ తమిళ రీమేక్ యాక్షన్ థ్రిల్లర్‌ను కొన్నిచోట్ల అనవసరంగా మార్చారు. కొన్నిచోట్ల అవసరం ఉన్నా మార్చలేదు అనిపిస్తుంది. దాంతో, తంటా వచ్చిపడింది. పోలీసు అధికారిగా నివేదా పేతురాజ్ ఉన్నంతలో తన పాత్ర బాగానే చేశారు. కానీ, ఆ పాత్రకున్న పరిధే తక్కువ. మాళవికా శర్మ చూడడానికి బాగున్నారు. సినిమాలో తక్కువ నిడివే ఉన్నా, బలంగా హత్తుకొనే గాయత్రి పాత్రలో అమృతా అయ్యర్ సరిగ్గా సరిపోయారు. కమెడియన్ సత్య కామిక్ రిలీఫ్ ఇస్తారు. అయితే, ఏ పాత్రా మనసుకు హత్తుకోకపోవడమే పెద్ద ఇబ్బంది. ఎలా తీశారంటే..: ఇప్పటికే ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన దర్శక, రచయిత కిశోర్ తిరుమల ప్రయత్నించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆయన తనకు అలవాటైన క్యూట్ లవ్ స్టోరీ ట్రాక్‌తోనే సినిమా మొదలెట్టారు. అక్కడక్కడ తనదైన మార్కు ఆకట్టుకొనే డైలాగులతో ఆకట్టుకున్నారు. అయితే, అసలు థ్రిల్లింగ్ కథ దగ్గరకు వచ్చేసరికి తన మార్కు చూపించలేకపోయారు. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపడానికి ప్రయత్నించినా, ఒక దశలో కొంత కన్ ఫ్యూజింగ్గానూ అనిపిస్తుంది. సినిమాలోని పాత్రల పాత కథల మీద ఉన్న శ్రద్ధ, వర్తమానంలో వాటి మధ్య ఉన్న సంఘర్షణను తెరపై చూపడం మీద పెట్టలేకపోయారు. అలాగే, సినిమాలోని డ్యుయల్ రోల్లో ఎవరు ఏ రామ్ అన్నది కన్ఫ్యూజన్ లేకుండా చూపడంలోనూ యూనిట్ ఫెయిలైంది. అయితే, ఇటలీలో తీసిన పాటలలాంటివి కలర్‌ఫుల్ గా ఉన్నాయి. హెబ్బా పటేల్‌తో తీసిన ఐటమ్ సాంగ్ ‘ఢించక్ ఢించక్...’ మాస్‌ను ఆకట్టుకుంటుంది. పీటర్ హెయిన్ తీసిన పోలీస్ స్టేషన్ ఫైట్ లాంటివి, హీరో డ్యుయల్ రోల్ సీన్లను సహజంగా అనిపించేలా తీసిన కెమేరా వర్క్‌నూ అభినందించాల్సిందే. మణిశర్మ నేపథ్య సంగీతం అమృతా అయ్యర్ ఎపిసోడ్, మదర్ సెంటిమెంట్ లాంటి ఘట్టాల్లో ప్రత్యేకించి బాగుంది. రెండు పాత్రల రామ్... తనది డ్యుయల్ ర్యామ్ అనిపించుకున్నారు. కానీ కథ, కథన లోపాలు – మదర్ సెంటిమెంట్ కూడా యాంటీ సెంటిమెంట్‌గా అనిపించడం – మన నేటివిటీకి నప్పని స్త్రీ పాత్రల స్వభావాలు – ఇవన్నీ అసంతృప్తికి గురిచేస్తాయి. రెడ్ అనే టైటిల్‌కు జస్టిఫికేషనూ వెతుక్కుంటాం. వెరసి, ఈ థ్రిల్లర్ సినిమాలో థ్రిలింగ్ తక్కువ. వినోదమూ తక్కువే. కొసమెరుపు: ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ జోరుకు ఇది ఓ రెడ్ సిగ్నల్! బలాలు: ∙రెండు పాత్రల్లో రామ్ ఎనర్జిటిక్ నటన ∙మణిశర్మ నేపథ్యసంగీతం, నిర్మాణ విలువలు ∙అక్కడక్కడ మెరిసే డైలాగులు బలహీనతలు: ∙తెలుగు నేటివిటీకి పొసగని కొన్ని స్త్రీ పాత్రల ప్రవర్తన ∙నిదానంగా సా...గే కథనం ∙కన్విన్సింగ్ గా లేని కీలకమైన సెకండాఫ్ ∙పండని మదర్ సెంటిమెంట్ ∙పస తగ్గిన థ్రిల్లింగ్ అంశాలు -రివ్యూ: రెంటాల జయదేవ -
రెడ్ మూవీ రివ్యూ
టైటిల్ : రెడ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : రామ్ పోతినేని, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, సంపత్ రాజ్, వెన్నల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాత : ‘స్రవంతి’రవికిశోర్ దర్శకత్వం : తిరుమల కిశోర్ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ విడుదల తేది : జనవరి 14, 2021 సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న రామ్, ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఇప్పుడు అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని తనకు గతంలో‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్' అనే సినిమా చేశాడు. తమిళ్ మూవీ తడమ్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో రామ్ తొలి సారిగా డ్యూయల్ రోల్ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు‘రెడ్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? కిశోర్ తిరుమల,రామ్ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ సిద్దార్థ్(రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తాను పని చేసే ఆఫీస్‌లోనే మహిమా(మాళవికా శర్మ)అనే యువతిని చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెతో వ్యక్తం చేయడానికి నానా ఇబ్బందులు పడుతాడు. చివరకు ఎలాగోలా తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పేస్తాడు. ఆమె కూడా సిద్దార్థ్‌ను ఇష్టపడుతుంది. కొద్ది రోజుల్లో పెళ్లికూడా చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే.. ఆదిత్య(రామ్) ఓ తెలివైన దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో.. జల్సాలు చేస్తుంటాడు. పేకాటలో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటాడు. ఇలా ఒకసారి తన ఫ్రెండ్ వేమ(సత్య) దాచుకున్న డబ్బులు తీసుకొని వెళ్లి పేకాటలో పొగుట్టుకుంటాడు. దాని వల్ల వేమ ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు. తన స్నేహితుడిని కాపాడటం కోసం ఆదిత్య 9 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఓ రౌడీకి ఇస్తాడు. ఇదిలా ఉంటే.. ఆకాశ్ అనే ఓ యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు సీఐ నాగేంద్ర కుమార్(సంపత్ రాజ్), ఎస్సై యామిని(నివేదా పేతురాజ్) ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపడతారు. ఇక ఈ కేసులో సిద్దార్థ్‌ను ఇరికించడానికి సీఐ నాగేంద్ర కుట్ర చేస్తాడు. అసలు ఈ హత్యకు సిద్దార్థ్, ఆదిత్యలకు సంబంధం ఏంటి? ఇద్దరిలో ఆకాశ్‌ని ఎవరు హత్య చేశారు? సీఐ నాగేంద్రకు, సిద్దార్థ్‌కు మధ్య ఉన్న గొడవేంటి? సిద్దార్థ్, ఆదిత్యల మధ్య సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును చేధించారా లేదా? అనేదే మిగత కథ నటీనటులు రెండు విభిన్న పాత్రలో కనిపించిన రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సిద్దార్థ్ పాత్రలో క్లాస్‌గా కనిపించి మెప్పించిన రామ్.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అలరించాడు. తన నటనతో మరోసారి ఎనర్జిటిక్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. మహిమా పాత్రలో మాళవికా శర్మ మెప్పించారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన ముద్రవేశారు. మాళవిక శర్మ-రామ్ రొమాన్స్ బాగా పండింది. లిప్ లాక్‌లతో హీటెక్కించారు. ఇక అమాయకపు యువతి పాత్రలో అమృతా అయ్యర్ అద్భుతంగా నటించాడు. సంపత్ రాజ్, వెన్నల కిషోర్, సత్య తమ పరిధిమేర నటించారు. విశ్లేషణ ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి సూపర్ హిట్ల తర్వాత తిరుమల కిశోర్, రామ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం రెడ్. ‘ఇస్మార్ట్ శంకర్'లాంటి సూపర్ హిట్ తర్వాతా రామ్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ‘రెడ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను కొంతమేర దర్శకుడు అందుకున్నాడు. తమిళ్ మూవీ తడమ్‌కు ఇది రీమేకే అయినా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు చేసి మెప్పించాడు. ఫస్టాఫ్‌లోనే ఇద్దరు రామ్‌లను తెరపై పరిచయం చేసిన దర్శకుడు... ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో సినిమా చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఇంటర్వేల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. ప్లాష్‌బ్యాక్ ట్విస్ట్‌లు కూడా ఆడియన్స్‌కి కథపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అయితే రామ్‌లోని ఎనర్జిటిక్ని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ.. సినిమా స్లోగా రన్ అవుతున్న భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ప్లాష్‌బ్యాక్‌లో రామ్ తల్లిని చూపించిన విధానం కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచు. సినిమాలోని డైలాగ్స్ బాగుండటంతో పాటు ఆలోచించే విధంగా చేస్తాయి. ‘రామాయణం మగాళ్లు కాకుండా ఆడాళ్లు రాసిఉంటే.. వారిపై అనుమానం ఉండేది కాదు అని ఒక్క డైలాగ్‌తో మహిళల బాధను తెలియజేశాడు. ‘నచ్చింది తినాలనుకున్నా.. తినకపోతే ఏమౌతుందిలే అనుకునే బతుకులు వాళ్లవి’ అంటూ మధ్యతరగతి బతుకులు ఏంటో తన డైలాగ్స్‌తో తెలియజేశాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఒక పాట మినహా మిగిలినవి అంతంత మాత్రమే అయినా, తనదైన బిజీఎంతో మ్యాజిక్ చేశాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రెడ్ మరీ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ కాదు కాని చూడాల్సిన చిత్రమే. ప్లస్ పాయింట్స్ : రామ్ నటన కథలోని ట్విస్టులు సెకండాఫ్ మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ ఫస్టాఫ్లొని కొన్ని సీన్లు అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తేదీ ఖరారు
సంక్రాంతి రేసులో నిలవడానికి పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో రామ్ ‘రెడ్’ సినిమా ఒకటి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. రవికిశోర్ మాట్లాడుతూ – ‘‘దేవదాసు’, ‘మస్కా’ తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. మా సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని. -
హీరోయిన్ నివేదా పేతురాజ్ ఫోటోలు
-
వాటిని ఎంకరేజ్ చేయకండి : నివేదా
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించడం కొందరు ఆకతాయిలకు పరిపాటిగా మారింది. ముఖ్యంగా అధికారిక గుర్తింపు లేని ఖాతాలు కలిగిన నటీనటులకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. అభిమానులు కూడా ఇందులో ఏది నిజమైన అకౌంట్ తేల్చుకోలేకపోతున్నారు. పలు సందర్భాల్లో ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటి నివేదా పేతురాజ్ పేరిట కూడా ట్విటర్లో పదులు సంఖ్యల్లో అకౌంట్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేసిన నివేదా.. వాటిని నమ్మవద్దని కోరారు. దయచేసిన ఫేక్ అకౌంట్లను ఎంకరేజ్ చేయవద్దని చెప్పారు. ‘ట్విటర్లో పెద్ద సంఖ్యలో నా పేరు మీద ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. @Nivetha_Tweets అనేది నాకున్న ఏకైక ట్విటర్ ఐడీ. ఫేక్ అకౌంట్లను ఎంకరేజ్ చేయండి. నా ఖాతాకు వెరిఫై చేయించడానికి ప్రయత్నిస్తున్నాను’ అని నివేదా తెలిపారు. కాగా, చెన్నైలో పుట్టిన నివేదా.. తన బాల్యం అంతా దుబాయ్‌లో గడిపారు. తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న ఆమె.. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన అల.. వైకుంఠపురములో.. చిత్రంలో ఆమె సుశాంత్‌కు జోడిగా కనిపించారు. తెలుగులో ప్రస్తుతం ఆమె కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి : నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా.. కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్ -
ఆటా పాటా
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్రంలో కథానాయికలుగా నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమాను కృష్ణా పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ–‘‘నేను... శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాల తర్వాత రామ్–కిషోర్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. సంగీత దర్శకుడు మణిశర్మ తొలిసారి మా సంస్థలో పని చేస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, గోవా లొకేషన్స్‌లో జరిపిన షూటింగ్స్‌తో టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఇటలీలోని టస్క్, ప్లారెన్స్, డోలోమైట్స్ లాంటి ప్రాంతాల్లో రెండు పాటలను చిత్రీకరించే పనిలో ఉన్నాం. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నెల 20వరకు ఇటలీ షెడ్యూల్ జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మరో పాటను చిత్రీకరిస్తే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుంది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. రామ్ కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్’ చిత్రం తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్. -
కరోనాను ఇలా నిరోధించవచ్చు ; నటి
సినిమా: కరోనా వైరస్‌ను ఇలా నిరోధించవచ్చు అంటోంది నటి నివేదా పేతురాజ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయం పట్టుకుంది. చైనా నుంచి ఈ వ్యాధి అన్ని దేశాలకు వ్యాపిస్తుండడంతో జనం భయకంపితులవుతున్నారు. చైనా నుంచి ఆస్ట్రేలియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కరోనా వ్యాధి ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇక ఇది ఇప్పటికే ఇండియాకూ సోకిందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. కేరళలో ఒక యువతి కరోనా వ్యాధి బారినపడినట్లు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అందుకోసం ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ప్రముఖ వైద్యులే కరోనా వ్యాధికి వైద్యం లేదని చెబుతున్న పరిస్థితి. అలాంటిది నటి నివేదా పేతురాజ్ కరోనా వ్యాధిని నిరోధించడానికి ఒక టిప్‌ను తెలిపింది. ఒక గుర్తింపు పొందిన నటుడు గానీ నటి గానీ ఏ విషయం గురించి అయినా చెప్పారంటే అది సగటు ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. అలానే నటి నివేదా పేతురాజ్ కరోనా వైరస్‌ను ఇలా నిరోధించవచ్చు ఒక చిట్కాను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ పేర్కొంటూ పసుపు, తులసి, అల్లం కలిపిన కషాయాన్ని తాగుతున్న ఫొటోను పోస్ట్ చేసి ఫైట్ కరోనా వైరస్ అనే ట్యాగ్‌ను పొందుపరిచింది. ఈ కషాయంతో కరోనా వ్యాధిని నిరోధించవచ్చునని నటి నివేదా పేర్కొంది. అంతా బాగానే ఉంది కానీ ఈ అమ్మడు చెప్పిన నాటు వైద్యం నిజంగానే కరోనా వైరస్‌ను నిరోధిస్తుందా, ఎలాంటి ఆధారాలతో ఆమె ఈ చిట్కాను చెప్పింది. దీని గురించి మన అలోపతి వైద్యులు ఏమంటారు లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి. -
చెప్పలేని చోట ఏర్పడే బాధలాంటిది..
సినిమా: ప్రేమకు నిర్వచనం నటి నివేదాపేతురాజ్ ఏం చెప్పిందో తెలుసా? తమిళం పూర్వీకం కలిగిన ఈ చిన్నది చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌కి మకాం మార్చేసింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన నివేదాపేతురాజ్ నటి కాక ముందు మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. అక్కడ పాపులర్ అయిన తరువాత నటిగా పిలుపు వచ్చింది. అలా తమిళంలో ఒరు నాళ్ కూత్తు చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం విజయంతో నటిగా స్థిరపడిపోయింది. 2016లో తెలుగు సినీరంగానికీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది నాయకిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా తమిళంలో టిక్ టిక్ టిక్, తిమిరుపుడిచ్చవన్ చిత్రాలతో పాపులర్ అయ్యింది. ఇటీవల విజయ్‌సేతుపతితో జత కట్టిన సంఘతమిళన్ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. త్వరలో ప్రభుదేవాతో జత కట్టిన పొన్ మాణిక్యవేల్ చిత్రం తెరపైకి రానుంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. కాగా ఇప్పటి వరకూ ఈ జాణకు పక్కింటి అమ్మాయి ఇమేజ్ ఉంది. దాని నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు గ్లామర్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో నానుతోంది. అంతే కాదు ఈ మధ్య తరచూ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటిస్తోంది. వారి ప్రశ్నలకు తనదైన స్టైల్లో బదులిస్తూ వారిని ఆనందపరుస్తోంది. అలా ఇటీవల ఒక అభిమాని ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు చెప్పలేని చోట ఏర్పడే బాధలాంటిది ప్రేమ అని బదులిచ్చింది. నివేదాపేతురాజ్ ప్రేమ గురించి చెప్పిన నిర్వచనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
‘కరెంటు పోయినప్పుడు అలాంటి ఆటలు ఆడేదాన్ని’
తానూ దొంగతనానికి పాల్పడినట్లు నివేదాపేతురాజ్ చెబుతోంది. పుట్టింది చెన్నైలోనేనైనా, బాల్యం అంతా దుబాయ్‌లో గడిపిన ఈ భామ మొదట మోడలింగ్ రంగాన్ని ఎంచుకుని ఆ తరువాత సినీ నటిగా రంగప్రవేశం చేసింది. అలా ఒరునాళ్ కూత్తు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అయిన నివేదా పేతురాజ్ ఈ తరువాత పొదువాగ ఎన్ మనసు తంగం, టిక్ టిక్ టిక్, తిమిరు పిడిచ్చవన్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. ఇటీవల విజయ్‌సేతుపతితో నటించిన సంఘ తిమిళన్ చిత్రంలో కనిపించింది తక్కువే అయినా నటనతో తనదైన ముద్ర వేసుకుంది. కాగా ఈ చిన్నది వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ, ప్రభుదేవాకు జంటగా నటించిన పొన్ మాణిక్యం చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. జగజాల కిల్లాడీ చిత్రంలో నటిస్తున్న నివేదాపేతురాజ్ టాలీవుడ్‌లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. కాగా ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా జరిగిన సంభాషణల్లో తన భావాలు వెల్లడించారు. అభిమానులు తమ బాల్యంలో జరిగిన సంఘటనలను ఆమెతో పంచుకుని సంతోష పడ్డారు. వారిలో కొందరి ముచ్చట్లను నివేదా పేతురాజ్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఒక అభిమాని పాఠశాలలో చదువుకునేటప్పుడు చాక్‌పీస్‌లను దొంగిలించేవాడినని చెప్పాడు. అందుకు స్పందించిన నివేదా చిన్నతనంలో తనకూ అలాంటి అలవాటు ఉండేదనిచెప్పింది. చాక్‌పీస్‌లను దొంగిలించి అమ్మకు ఇచ్చి ముగ్గులు వేయమనేదాన్ని అని అంది. మరో అభిమాని చిన్నతనంలో రాత్రి వేళ కరెంట్ పోయినప్పుడు చుట్టు పక్కన ఉండే పిల్లలతో కలిసి కథలు చెప్పుకోవడం, ఆటలాడుకోవడం వంటివి చేసే వాడినని చెప్పాడు. అందుకు నివేదాపేతురాజ్ కూడా తానూ అలాంటి ఆటలు ఆడేదాన్నని వెల్లడించింది. కరెంట్ పోయినప్పుడు ఇతర పిల్లల ముఖాలపై టార్చిలైట్ వేసి భయపెట్టేదాన్ని అని చెప్పింది. అలా చిన్న నాటి ముచ్చటలను తన అభిమానులతో పంచుకుని వారిని ఆనందంలో ముంచెత్తిన నివేదాపేతురాజ్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులతో చక్కగా ముచ్చటించే నివేదా పేతురాజ్ శభాష్ అంటూ పొగిడేస్తున్నారు. -
సింహస్వప్నం
కృష్ణమనోహర్ ఐపీఎస్ అనగానే ప్రేక్షకులకు తెలుగు సూపర్‌హిట్ ‘పోకిరి’ సినిమాలో మహేశ్‌బాబు చేసిన పాత్ర ఇట్టే గుర్తుకు వస్తుంది. ఈ పాత్ర పేరే టైటిల్‌గా ఇప్పుడు ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రభుదేవా హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘పొన్ మాణిక్యవేల్’ని ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించారు. ముఖిల్ చెల్లప్పన్ దర్శకుడు. పవన్‌పుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్‌నాయుడు సమర్పణలో ఆర్. సీతారామరాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘సంఘవిద్రోహుల పాలిట సింహస్వప్నంలా వీరవిహారం చేసే ఓ పోలీసాఫీసర్ కథ ఇది. ప్రభుదేవా, నివేదా నటన హైలైట్. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘బాహుబలి’ ప్రభాకర్, సురేష్ మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు డి. ఇమ్మాన్ స్వరకర్త. -
నవంబర్‌లో ఇస్టార్ట్
‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌తో ఇస్మార్ట్ ఎనర్జీతో ఉన్నారు రామ్. అదే ఎనర్జీతో నెక్ట్స్ సినిమా షురూ చేయడానికి రెడీ అయ్యారు. నవంబర్ నుంచి కొత్త సినిమా సెట్లో అడుగుపెడతారట రామ్. ‘నేను.. శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలను రామ్‌తో తెరకెక్కించిన కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూడో సినిమాకు ఓ వెరైటీ కథ అనుకున్నారని సమాచారం. నవంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళ చిత్రం ‘తడమ్’కి ఇది రీమేక్ అట. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించనున్నారని సమాచారం. -
సంక్రాంతికి సై
సంక్రాంతి బరిలో తాను ఉన్నానంటున్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు బుధవారం చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు పీడీవీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. టబు, సుశాంత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) సినిమాల తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. -
జూన్ 28న ‘బ్రోచేవారెవరురా’
శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఈ చిత్రం జూన్ 28న విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రమిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వస్తోన్న రెండో చిత్రం ఇది. ‘చలనమే చిత్రము... చిత్రమే చలనము’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. సత్యదేవ్, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు.‘బ్రోచేవారెవరురా’ ట్రైలర్, ఆడియో విడుదల గురించి త్వరలోనే నిర్మాత ప్రకటించనున్నారు. -
స్టైలిష్ స్టార్‌తో నివేదా!
మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ నివేదా పేతురాజ్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా, కోలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పారు. ఇప్పటి వరకు తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే నటించిన ఈ భామ త్వరలో ఓ స్టార్ హీరో సినిమాలో నటించనున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో నివేదా హీరోయిన్గా నటిస్తున్నారా? లేక స్పెషల్ రోలా? అన్న విషయం తెలియాల్సి ఉంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
బిజీ బిజీగా నివేదా
ఇప్పుడు చేతినిండా చిత్రాలున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో నటి నివేదాపేతురాజ్ ఒకరు. ఒరునాళ్ కూత్తు చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన దుబాయ్ వాసి అయిన ఈ తమిళ అమ్మాయి.. ఆ తరువాత జయంరవికి జంటగా నటించిన టిక్ టిక్ టిక్ వంటి కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది 2019 నివేదా కేరీర్లో గుర్తుండిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందని చెప్పవచ్చు. కారణం ఈ ఏడాదిలో అరడజనుకు పైగా చిత్రాల్లో నాయకిగా నటిస్తూ బిజీ బిజీగా ఉండటమే. తెలుగులోనూ వరుససినిమాలతో బిజీ అవుతున్నారు నివేదా. తమిళ్లో ఈ బ్యూటీ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇప్పుడు ప్రభుదేవాతో పొన్ మాణిక్యవేల్, విష్టు విశాల్ సరసన జగజాల కిల్లాడి, విజయ్‌సేతుపతికి జంటగా సంఘతమిళన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటితో పాటు వాన్ అనే మరో చిత్రం నివేదా చేతిలో ఉంది. తాజాగా మాఫియా అనే చిత్రంలో నటుడు అరుణ్ విజయ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకుముందు ధృవంగళ్ 16 చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు నరేన్ తదుపరి అరవిందస్వామి, సందీప్‌కిషన్, శ్రియలతో నరకాసురన్ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా ఇంకా విడుదల కాలేదు. తదుపరి నటుడు పార్తీపన్ హీరోగా నాటక మేడై అనే చిత్రాన్ని రూపొందించాలని ప్రకటన కూడా విడుదల చేసిన నరేన్ దాని నిర్మాణాన్ని పక్కన పెట్టి తాజాగా మరో చిత్రానికి సిద్ధం అయ్యారు. అరుణ్ విజయ్ హీరోగా మాఫియా అనే టైటిల్‌తో గ్యాంగ్‌స్టర్ చిత్రం చేయనున్నారు. ఇందులో నటి నివేదా పేతురాజ్‌ను హీరోయిన్గా ఎంచుకున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. -
అరుణ్ విజయ్‌కు జంటగా..
తమిళసినిమా: యువ నటుడు అరుణ్ విజయ్‌కు జోడీగా నివేదాపేతురాజ్ జత కట్టబోతున్నారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం చిత్రంతో విజయాన్ని అందుకున్న అరుణ్ విజయ్, తడం చిత్రంతో హీరోగా మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నడు. ప్రస్తుతం మూడర్ కూట్టం చిత్రం ఫేమ్ నవీన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనితో కలిసి అగ్ని సిరగుగల్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సాహో చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. వీటితో పాటు తాజాగా మరో చిత్రానికి అరుణ్ విజయ్ పచ్చజెండా ఊపారు. దీనికి యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు దృవంగళ్ పదునారు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తరువాత అరవిందస్వామి, శ్రియ నటించిన నరకాసురన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయినా విడుదలలో జాప్యం జరుగుతోంది. తాజాగా కార్తీక్ నరేన్ నటుడు అరుణ్ విజయ్ కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నటి నివేదాపేతురాజ్ను నాయకిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళం, తెలుగు చిత్రాలతో బిజిగా ఉంది. ఇటీవల తెలుగులో నటించిన చిత్రలహరి మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. బ్రోచేవారెవరురా అనే మరో చిత్రం సైతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తమిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ప్రభుదేవాకు జంటగా పొన్ మాణిక్యవేల్, విజయ్‌సేతుపతితో సంఘ తమిళన్, దుల్కర్ సల్మాన్ సరసన వాన్ చిత్రాలతో పాటు విష్ణు విశాల్‌కు జంటగా జగజాల కిల్లాడి చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా అరుణ్ విజయ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెలువడనున్నాయి. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక పాత్రలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా థామస్ లతో పాటు సత్యదేవ్, నివేదా పేతురాజ్‌లను టీజర్లో పరిచయం చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
‘చిత్రలహరి’ మూవీ రివ్యూ
టైటిల్ : చిత్రలహరి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : సాయి ధరమ్ తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : కిషోర్ తిరుమల నిర్మాత : రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తాజాగా చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని తన పేరును కూడా సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రలహరి సాయి ధరమ్‌కు హిట్ ఇచ్చిందా..? పేరు మార్చుకోవటం కలిసొచ్చిందా..? కథ : విజయ్ కృష్ణ (సాయి ధరమ్ తేజ్) జీవితంలో సక్సెస్ అంటే తెలియని కుర్రాడు. ఈ పోటీ ప్రపంచంలో తాను గెలవలేకపోతున్నా అని విజయ్ నిరుత్సాహపడినా.. తండ్రి (పోసాని కృష్ణమురళి) మాత్రం తన కొడుకు ఎప్పటికైన సక్సెస్ అవుతాడన్న నమ్మకంతో ఉంటాడు. యాక్సిడెంట్లో సరైన సమయానికి సహాయం అందక చనిపోతున్న వారిని కాపాడేందుకు విజయ్ ఓ డివైజ్‌ను తయారు చేస్తాడు. దాని స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే లహరి(కల్యాణీ ప్రియదర్శన్) పరిచయం అవుతుంది. తన అలవాట్లు, ఉద్యోగం గురించి అబద్దాలు చెప్పి లహరిని ప్రేమిస్తాడు విజయ్. కానీ ఓ రోజు లహరికి నిజం తెలిసిపోతుంది. విజయ్‌ని వదిలేసి దూరంగా వెళ్లిపోతుంది. తనకు ప్రేమలోనూ సక్సెస్ దక్కలేదని మరింత కుంగిపోతాడు విజయ్. అలాంటి విజయ్ తిరిగి ఎలా సక్సెస్ సాధించాడు..?ఈ కథలో స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) పాత్ర ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి తాను గతంలో చేయని ఓ కొత్త తరహా పాత్రను ఎంచుకున్నాడు. నేటి యూత్ ను ప్రతిబింభించే చేసే క్యారెక్టర్లో తనవంతుగా బాగానే నటించాడు. తన రేంజ్లో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, డాన్స్‌లు చేసే సాయికి చాన్స్ దక్కలేదు. కానీ మెచ్యుర్డ్ పర్ఫామెన్స్తో విజయ్ కృష్ణ పాత్రలో జీవించాడు. హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్ పరవాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపించినా తరువాత ఓకె అనిపించేలా ఉంది. మరో హీరోయిన్గా నటించిన నివేదా పేతురాజ్‌కు పెద్దగా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కలేదు. కార్పోరేట్ ఉమెన్‌గా నివేదా లుక్ ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, సునీల్, వెన్నెల కిశోర్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సెన్సిబుల్ పాయింట్స్‌తో సినిమాలను తెరకెక్కించే కిషోర్ తిరుమల చిత్రలహరి కోసం మరో ఇంట్రస్టింగ్ లైన్ తీసుకున్నాడు. నేటి యూత్ సక్సెస్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు. సక్సెస్ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారు అన్న విషయాలను తెరమీద చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో కిషోర్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కథా కథనాలు నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి. కథలోని పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్థాయి సీన్స్ లేకపోవటం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకుడిగా తడబడినా రచయితగా మాత్రం సక్సెస్ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ గుర్తిండి పోయేలా ఉన్నాయి. ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్న సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాతో పరవాలేదనిపించాడు. రెండు పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సాయి ధరమ్ తేజ్ కొన్ని డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ క్యారెక్టరైజేషన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘చిత్రలహరి’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
తప్పుగా అర్థం చేసుకుంటారేమో..!
సినిమా: తనను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారేమో నటి నివేదా పేతురాజ్ వాపోతోంది. దుబాయ్‌లో పెరిగిన ఈ తమిళ అమ్మాయి నటిగా కోలీవుడ్‌లో రాణిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన నివేదా తమిళంలో ఒరునాళ్ కూత్తు చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ తరువాత జయంరవితో టిక్ టిక్ టిక్, విజయ్ ఆంటోనికి జంటగా తిమిరుపుడిచ్చవన్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ప్రభుదేవాకు జంటగా పొన్ మాణిక్యవేల్, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ చిత్రాలతో పాటు జగజాల్ కిల్లాడి, విజయ్‌సేతుపతితో ఒక చిత్రం, దుల్కర్ సల్మాన్ సరసన మరో చిత్రం చేస్తోంది. అయితే గ్లామర్ విషయంలో తనకంటూ హద్దులు విధించుకున్న ఈ బ్యూటీ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే సొంతం చేసుకుంది. అలాంటిది ఇటీవల కాస్త గ్లామర్‌తో కూడిన ఫోటోలను సామాజిక మాద్యమాలకు విడుదల చేసి చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఒక భేటీలో నివేదా మాట్లాడుతూ.. తాను చెప్పేది తప్పుగా అర్థం చేసుకుంటారని మౌనంగా ఉంటున్నాననీ, తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నటినని పేర్కొంది. అందుకే తనకు దైవభక్తి కాస్త ఎక్కువేనని చెప్పింది. తాను కళాశాలలో చదువుతున్నప్పుడు తన తల్లిదండ్రులు మధురై సమీపంలోని మడప్పురం కాళీ దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలకు తీసుకెళ్లారని చెప్పింది. అప్పుడు తనకు పూనకం వచ్చిందని తెలిపింది. అప్పటి నుంచే తనలో భక్తి భావం మరింత పెరిగిందనీ, ఇప్పటికి అప్పుడప్పుడూ తనకు పూనకం వస్తుందని చెప్పింది. ఇకపోతే తనను చిత్ర పరిశ్రమలో తదుపరి నయనతారతో పోల్చడం సరి కాదని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో జరుగున్న చర్చలపై నివేదా పేతురాజ్ వివరణ ఇచ్చుకున్నారు. -
చీకటికి చిరునామా నేను.. చిత్రలహరి
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సక్సెస్ కోసం సెంటిమెంట్లను కూడా ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో తన పేరును సాయి తేజ్ అని వేసుకుంటున్నాడు ఈ మెగా హీరో. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. కెరీర్లో సక్సెస్అన్నదే లేని ఓ యువకుడి కథ చిత్రలహరి. సాయి ధరమ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో సునీల్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ వేడుక
-
నాలుగు విభిన్న పాత్రల కథ ‘చిత్రలహరి’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు చిత్రయూనిట్. సినిమాలోని ప్రధాన పాత్రల స్వభావాలను టీజర్లోనే చెప్పేశారు. ఆపాత్ర మధ్య జరిగే సరదా సంఘటనలే ఈ సినిమా కథ అంటూ హింట్ ఇచ్చేశారు. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ మరో కీలక పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
‘చిత్రలహరి’లోని పాత్రలు మిమ్మల్ని కలుస్తారు!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికే టైటిల్ లోగోను రిలీజ్ చేసిన చిత్రలహరి టీం, ఈ బుధవారం టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ‘‘చిత్రలహరి’లోని పాత్రలో 13వ తారీఖున 9 గంటలకు మిమ్మల్ని కలుస్తారు’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు. -
విజయ్‌సేతుపతి సినిమా షురూ
నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్కెచ్’ చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌సేతుపతికి జంటగా హీరోయిన్లు రాశీఖన్నా, నివేదాపేతురాజ్ నటించనున్నారు. హాస్య నటుడు సూరి, నాజర్, అసుతోష్ రాణా, రవి కిశాన్, మొట్టైరాజేంద్రన్, మారిముత్తు, జాన్ విజయ్, శ్రీమాన్ ముఖ్యపాత్రలను పోషించనున్నారు. చిత్రానికి సంగీత ద్వయం వివేక్ మెర్విన్ సంగీతబాణీలు కడుతున్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
ఆయనకు ఇద్దరు!
తమిళసినిమా: విజయాలు ఇష్టపడుతున్న నటుడు విజయ్‌సేతుపతి అనడంలో అతిశయోక్తి ఉండదేమో. ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా నటనకు ఆస్కారం ఉందనుకుంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న ఈయన హీరో ఇమేజ్‌కు మాత్రం ఎలాంటి డ్యామేజ్ కలగకపోవడం విశేషం. మణిరత్నం తెరకెక్కించిన సెక్క సివంద వానం చిత్రంలో చాలా ఇన్నోసెంట్ యువకుడిగా నటించి చివరలో తనే హీరో అనిపించుకోవడంలో విజయం సాధించాడు. ఇటీవల రజనీకాంత్‌నే ఢీకొనే పాత్రను పేట చిత్రంలో నటించి తన సత్తా చాటుకున్నాడు. అయినా విజయ్‌సేతుపతి చేతిలో కథానాయకుడిగా పలు చిత్రాలు ఉన్నాయి. మరికొన్ని ఆయన కనుసైగ కోసం ఎదురుచూస్తున్నాయి. మక్కల్ సెల్వన్ అని అభిమానులిచ్చిన బిరుదుకు న్యాయం చేసేలా తన సినీ పయనాన్ని సాగిస్తున్న విజయ్‌సేతుపతి నటించిన సూపర్‌డీలక్స్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో అందాలభామ సమంత నాయకి. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఇందులో విజయ్‌సేతుపతి హిజ్రాగా కొన్ని సన్నివేశాల్లో కనిపించనుండడం విశేషం. ఇక ఇటీవలే సింధుబాద్ అనే చిత్రం ప్రారంభమైంది. ఇందులో అంజలి నాయకి. ఎస్.అరుణ్‌కుమార్ దర్శకుడు. ఇక తను గురువుగా భావించే సీనూరామస్వామి దర్శకత్వంలో మామనిదన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో ఆయనతో నటి గాయత్రి రొమాన్స్ చేస్తోంది. ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయాప్రొడక్షన్లో నటించే అవకాశం విజయ్‌సేతుపతిని వరించింది. ఈ ఎంజీఆర్, రజనీకాంత్, కమలహాసన్, విజయ్, విశాల్ వంటి స్టార్స్ నటించిన బ్యానర్ ఇది. మరో విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ సింగిల్ హీరోయిన్‌తోనే సరిపెట్టుకున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో ఒకరు నటి రాశీఖన్నా, మరొకరు నివేదాపేతురాజ్ అని సమాచారం. ఇకపోతే హాస్యనటుడు సూరి మరోసారి విజయ్‌సేతుపతితో కలిసి హాస్యాన్ని పండించబోతున్నాడు. ఈ చిత్రాన్ని విజయ్‌చందర్ తెరకెక్కించనున్నారు. ఈయన ఇంతకు ముందు శింబు హీరోగా వాలు, విక్రమ్ హీరోగా స్కెచ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఇద్దరు భామలతో శ్రీ విష్ణు..!
అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో లాంటి వైవిధ్యమైన సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్రోచేవారెవరురా..! అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా నివేదా ధామస్‌తో పాటు నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు పెళ్లి చూపులు, సమ్మోహనం లాంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నాడు. -
‘రొమాన్స్‌లో శిక్షణ పొందాలి’
రొమాన్స్ చేయడంలో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నానని సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని చెప్పారు. తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఈయన కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి నిర్మించిన చిత్రం ‘తిమిరు పుడిచ్చవన్’(తెలుగులో రోషగాడు). నటి నివేదా పేతురాజ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గణేశా తెరకెక్కించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తిమిరు పుడిచ్చవన్ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 6న తెరపైకి రానుంది. శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించిన హిజ్రా సింధుజా మాట్లాడుతూ తమిళ సినిమాలో ఒక హిజ్రాకు ముఖ్య పాత్రలో నటించే అవకాశం కల్పించిన విజయ్‌ఆంటోనికి, దర్శకుడు గణేశాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రంలో తాను తొలి హిజ్రా ఎస్ఐ ప్రీతిక పాత్రను పోషించానని చెప్పింది. అందరూ భయపడి టచ్ చేయని ఒక విషయాన్ని ఎలాంటి సంకోచం, భయం లేకుండా ఈ చిత్రంలో చూపించారన్నారు. హిజ్రాల జీవితంలోనే తిమిరు పుడిచ్చవన్ ముఖ్యమైన చిత్రంగా ఉంటుందని సింధుజా పేర్కొంది. చిత్ర కథానాయకి నివేదా పేతురాజ్ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడే భయపెట్టారన్నారు. మోటార్‌బైక్ నడపాలి, చేపల బండి తొక్కాలి అంటూ భయపెట్టారని చెప్పారు. ఆయన చెప్పినట్లే మోటార్‌బైక్ నడపడం నేర్చుకుని.. చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకున్నానని తెలిపారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు దర్శకుడు తనతో చాలా విషయాలు చేయించినట్లు తెలిసిందన్నారు. నటిగా తన కేరీర్‌లోనే తిమిరు పుడిచ్చవన్ ప్రత్యేకంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని నివేదా పేతురాజ్ వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత, కథానాయకుడు విజయ్‌ఆంటోని మాట్లాడుతూ ఏక వృక్షం.. తోట అవ్వదు అన్నట్లు ఈ చిత్రంలో తన భాగం చాలా తక్కువేనని చెప్పారు. ఈ చిత్రం కోసం దర్శకుడు గణేశా ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఏ చిత్రానికైనా హీరో దర్శకుడేనని అన్నారు. తన గత రెండు చిత్రాలు వ్యాపార పరంగా బాగా రాలేదన్నారు. ఆర్థిక సమస్యల మధ్య ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలు ఉండవని, అందువల్ల హీరోయిన్ నివేదా పేతురాజ్‌తో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని చెప్పలేనని అన్నారు. ఈ చిత్రం తరువాత రొమాన్స్ చేయడంలో శిక్షణ తీసుకుని అలాంటి సన్నివేశాల్లో నటిస్తానని అన్నారు. ఇకపోతే చిత్ర నిర్మాణం పూర్తి కావడంతో దర్శకుడు కోరిక మేరకు దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు విజయ్‌ఆంటోని తెలిపారు. -
ఇంకా బాయ్‌ఫ్రెండ్ దొరకలేదు!
తమిళసినిమా: నాకింకా బాయ్‌ఫ్రెండ్ దొరకలేదు అంటోంది నటి నివేదాపేతురాజ్. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న యువ నటీమణుల్లో నివేదా పేతురాజ్ ఒకరు.. చిత్రాల ఎంపిక విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నానంటున్న నివేదాపేతురాజ్ను జయం రవితో జత కట్టిన టిక్ టిక్ టిక్ చిత్రం నటిగా తన స్థాయి పెంచింది. ఆ ఉత్సాహంతో ప్రస్తుతం దర్శకుడు ఎళిల్ దర్శకత్వంలో విష్ణువిశాల్ సరసన జగజాల కిల్లాడి చిత్రం, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ చిత్రం, విజయ్‌ఆంటోనీకి జంటగా తిమిర్పిడిచవన్, ప్రభుదేవాతో ఒక చిత్రం అంటూ బిజీగా నటించేస్తోంది. వీటితో పాటు తెలుగులోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. సెలెక్టెడ్ అంటూ చాలా చిత్రాలే చేస్తునట్లున్నారే అన్న ప్రశ్నకు అన్నీ నచ్చిన కథాపాత్రలతో కూడిన చిత్రాలే చేస్తున్నాను అని తెలివిగా బదులిచ్చింది. సరే రెండు భాషల్లో నటిస్తున్నావు కదా ప్రేమలో పడ్డారా, బాయ్‌ఫ్రెండ్ దొరికాడా అని అడిగితే బాయ్‌ఫ్రెండే ఇంకా దొరకలేదు .అలాంటిది ప్రేమకు ఆస్కారం ఎక్కుడుంటుంది? అని కూల్‌గా బదులిచ్చింది. అయినా బాలీవుడ్ హీరోయిన్లను అడిగినట్లు తనను అలాంటి ప్రశ్న వేస్తున్నారేమిటీ? అంటూ మన పరిస్థితులు వేరు కదా అని అంది. నిజం చెప్పాలంటే తనకు బాయ్‌ఫ్రెండ్ గురించి ఆలోచించేంత సమయం, అలాంటి ఆలోచన లేదు అని చెప్పింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తుండడంతో ఆ భాషను నేర్చుకుంటున్నానని, త్వరలోనే తెలుగులో మాట్లాడతాననే విశ్వాసాన్ని వ్వక్తం చేసింది. ఇకపై తమిళం, తెలుగు రెండు భాషలకు తగిన ప్రాధాన్యతనిస్తూ నటిస్తానని నటి నివేదాపేతురాజ్ అంటోంది. బహుభాషా నటి ప్రయోజనాలను అవగతం చేసుకున్నట్లుంది భామ. అన్నట్లు తాను గ్లామర్‌కు దూరం అని చెప్పుకొచ్చిన నివేదాపేతురాజ్ మోడ్రన్ దుస్తుల్లో అందాలారబోస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. -
సీక్వెల్ చాన్స్
‘మెంటల్ మదిలో, టిక్ టిక్ టిక్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ కథానాయిక నివేథా పేతురాజ్. చక్కటి హావభావాలతో పాటు గ్లామర్‌పరంగా మార్కులు కొట్టేశారు. దాంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టేశాయి. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో ఒక సినిమాతో బిజీగా ఉన్నారీ భామ. దానికి తోడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేశారట. 2012లో తమిళ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభుని పరిచయం చేస్తూ దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కుమ్కి’. తెలుగులో ‘గజరాజు’ పేరుతో రిలీజైంది. ఇప్పుడు ‘కుమ్కి’ సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారట దర్శకుడు. ఈ సీక్వెల్లో హీరోయిన్గా నివేథా పేరును పరిశీలిస్తున్నారట. ఫస్ట్ పార్ట్‌లో యాక్ట్ చేసిన విక్రమ్ ప్రభునే ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారు. ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనుంది. -
‘రోషగాడు’ మూవీ స్టిల్స్
-
అవకాశాలు లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను..
తమిళసినిమా: నటి నివేదా పేతురాజ్ బిజీ కథానాయకిగా మారిపోయింది. మదురైలో పుట్టి, దుబాయ్‌లో పెరిగిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో హీరోయిన్ అయ్యింది. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తుతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న నివేదాకు ఆ తరువాత అవకాశం రావడానికి కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. అవకాశాలు లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను గానీ, వాటి కోసం ఎవరినీ అడగనని తెగేసి చెప్పిన నివేదా పేతురాజ్‌కు ఆ అవసరం రాలేదు. అంతే ఆ తరువాత ఉదయనిధికి జంటగా నటించిన పొదువాగ ఎన్ మనసు తంగం ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయినా సక్సెస్ఫుల్ నటుడు జయంరవికి జంటగా నటించే భారీ అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. అంతే లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. మధ్యలో మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విజయ్‌ఆంటోని సరసన తిమిరు పుడిచ్చవన్, ప్రభుదేవాతో పొన్ మాణిక్యవేల్ చిత్రాలతో పాటు తెలుగులో బ్రోచేవారెవరురా చిత్రంలోనూ నటించేస్తోంది. తాజాగా మరో లక్కీచాన్స్‌ను కొట్టేసింది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. మైనా, కుంకీ, తొడరి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రభుసాల్మన్ తాజాగా కుంకీ–2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కుంకీ చిత్రంలో విక్కమ్‌ప్రభుతో పాటు నటి లక్ష్మీమీనన్‌కు సినీ లైఫ్‌ను ఇచ్చిన ప్రభుసాల్మన్ ఇప్పుడు కుంకీ–2లో నవ నటుడు మదిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జంటగా నటి అతిథిమీనన్ నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా నటి నివేదాపేతురాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అమ్మడు రెండో నాయకిగా నటిస్తోందా లేక అతిథిమీనన్‌ను తొలగించి నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. కుంకీ–2 చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే థాయిల్యాండ్‌లోని ఏనుగులు నివసించే దట్టమైన అడవుల్లో జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం నివేదా పేతురాజ్ ఏకంగా 70 రోజులు కాల్షీట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బెన్ ఇండియా అనే బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. -
‘రోషగాడు’గా బిచ్చగాడు
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ ఘనవిజయం అందుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. వైవిధ్యమైన కథా చిత్రాలకు, రియలిస్టిక్ క్యారక్టరైజేషన్స్‌తో ఆకట్టుకున్నంటున్న విజయ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ఈ హీరో త్వరలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్లో ‘తిమిరపుడిచవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న రోషగాడు సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఫాంతిమా ఆంటోని నిర్మిస్తున్నారు. -
నాకు అందులో ఆసక్తి అధికం..
తమిళసినిమా: ప్రస్తుతం కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న నటీమణుల్లో నివేదాపేతురాజ్ ఒకరు. ఒరు నాళ్‌కూత్తు చిత్రంతో రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు తొలి చిత్రంతోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా నివేదాపేతురాజ్కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. తాజాగా జయంరవితో అంతరిక్షంలో సాహసోపేతంగా రొమాన్స్ చేసిన టిక్ టిక్ టిక్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపై నివేదాపేతురాజ్ చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సందర్భంగా నివేదాపేతురాజ్ చెబుతున్న సంగతులేంటో చూద్దాం. ప్ర: మీ సినీ పయనం గురించి? జ: నేను పుట్టింది మదురైలోనే. అయితే పెరిగింది దుబాయ్‌లో. అక్కడ నా అనుభవం 14 ఏళ్లు. అందాల పోటీల్లో పాల్గొన్నాను. అవే తనను కోలీవుడ్‌లో కథానాయకిని చేశాయి. వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అలా ఇప్పుడు 8వ చిత్రంలో నటిస్తున్నాను. ప్ర: తెలుగులోనూ కాలిడినట్లున్నారే? జ: పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం చూసి తెలుగులో నటించే అవకాశం కల్పించారు. అక్కడ కొన్ని చిత్రాలు చేస్తున్నాను. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. ప్ర: సరే నటిగా మీ ప్రణాళిక ఏమిటి? జ: నిజం చెప్పాలంటే నటిగా నాకు ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. వచ్చిన అవకాశాల్లో నచ్చిన చిత్రాలను చేసుకుంటూపోతున్నాను. యోగాపై ఆసక్తి ఉంది. దర్శకత్వం చేయాలన్న ఆశ ఉంది. అందుకోసమే చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ప్ర: టిక్ టిక్ టిక్ చిత్రం గురించి? జ: ఇందులో స్వాతి అనే పాత్రలో నటించాను. షూటింగ్‌కు సెట్లోకి వెళుతున్నప్పుడే హాలీవుడ్ సెట్లోకి వెళుతున్న భావన కలిగేది. చాలా వినూత్న అనుభవం. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.ఈ చిత్రంలో నేను పోరాటాలు కూడా చేశాను. ప్ర: సినిమా రంగంలో గట్టి పోటీ నెలకొంటుందిగా? జ: నేను అవకాశాల కోసం అంటూ నేనెవరి వద్దకూ వెళ్లి అడిగిందిలేదు. దీన్ని ఘనతగానే భావిస్తాను. ఇక్కడ పని లేకపోతే దుబాయ్ వెళ్లిపోతాను. నా పని నేను చేసుకుపోతున్నాను. అందుకే వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్ర: మీలో ఇతర ప్రత్యేకతలు? జ: పెయింటింగ్స్ బాగా వేస్తాను. అందులో ఆసక్తి అధికం. పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని స్నేహితులు అంటున్నారు. అయితే అందుకు ఇంకా చాలా శ్రమించాల్సి ఉంది. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కార్ రేస్‌లో పాల్గొని గెలుపోటములు పొందిన అనుభవం ఉంది. ఇలాంటి సాహసాలు చేయపోతే జీవితంలో మజా ఏం ఉంటుంది. ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం. అదే సమయంలో భయం ఉంది. -
డ్యూటీకి వేళాయె
పోలీస్‌గా చార్జ్ తీసుకోవడానికి టైమ్ అయ్యింది హీరో ప్రభుదేవాకు. ఏసీ ముగిల్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో నివేథా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్నారు. నేమిచంద్ ఝబాగ్ నిర్మిస్తున్నారు. సురేశ్ మీనన్, మహేందర్ కీలక పాత్రలు చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కెరీర్లో తొలిసారి ప్రభుదేవా పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. సో.. పోలీస్‌గా ప్రభుదేవాకు డ్యూటీకి వేళ అయిందన్న మాట. ఇది వరకు ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన ‘పోకిరి, విల్లు’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఏసీ ముగిల్ ఇప్పుడు ప్రభుదేవాను డైరెక్ట్ చేయడం విశేషం. -
ఆ సంఘటనలు నాకు ఎదురవలేదు
తమిళసినిమా: తనకిప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎదురవలేదని అంటోంది నటి నివేదా పేతురాజ్. మదురైకి చెందిన అచ్చ తమిళమ్మాయి అయినా దుబాయిలో 13 ఏళ్లు పెరిగిన నివేదా పేతురాజ్ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అందాల పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అనంతరం మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అలా కోలీవుడ్‌కు ఒరు నాళ్ కూత్తు చిత్రంతో కథానాయకిగా పరిచయమైంది. ఆ తరువాత పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు జయంరవికి జంటగా నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. అయితే ప్రస్తుతం పార్టీ, తిమిరుపిడిచవన్, జగజాల కిల్లాడి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. టిక్ టిక్ టిక్ చిత్రం వచ్చే నెల తొలి వారంలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఈ అమ్మడిచ్చిన భేటీలో తమిళ సినిమాలో హీరోయిన్లు ఇప్పుడు బాగా మారిపోయారనిపిస్తోందని పేర్కొంది. చిత్రాలను ఎంపిక చేసుకునే ముందు పాత్ర నచ్చిందా అన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అంది. పారితోషికాన్ని మాత్రమే ప్రధానంగా చూడడం లేదని, స్క్రిప్ట్ పూర్తిగా చదివి తమ కథా పాత్ర నచ్చితేనే నటించడానికి ఒప్పుకుంటున్నారని చెప్పింది. ఇకపోతే కాస్టింగ్ కౌచ్ సమస్య సోషల్ మీడియాల్లో బాగా వైరల్ అవుతోందని, అయితే తనకు సంబంధించినంత వరకూ అలాంటి ఘటనలు ఇంతవరకు తనకు ఎదురవలేదని చెప్పింది. తనకు ఆత్మరక్షణ విద్యలు తెలుసని చెప్పింది. బాక్సింగ్ లాంటి ఆత్మరక్షణ విద్యలను థాయ్‌ల్యాండ్‌లో రెండేళ్ల పాటు నేర్చుకున్నానని పేర్కొంది. ఆ విద్యలిప్పుడు టిక్ టిక్ టిక్ చిత్రంలో నటించడానికి బాగా ఉపయోగపడినట్లు చెప్పింది. ఇది అంతరిక్ష కథాంశంతో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా నమోదవుతుందని, ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని నివేదా పేతురాజ్ పేర్కొంది. -
అంతరిక్షంలో థ్రిల్
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తీ సౌందర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ అదే పేరుతో జూన్ 22న తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. చిత్రసమర్పకుల్లో ఒకరైన లక్ష్మణ్ మాట్లాడుతూ –‘‘అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన సినిమాలకు భిన్నంగా ‘టిక్ టిక్ టిక్’ ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్ అవడంతో పాటు ఓ కొత్త అనుభూతికి లోనవుతారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మా బ్యానర్లో వచ్చిన ‘బిచ్చగాడు’. ‘16’ సినిమాలని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
బికినీ ఫోటోలపై హీరోయిన్ ఆగ్రహం
సాక్షి, చెన్నై: హీరోయిన్ నివేథా పెతురాజ్(26) లీగల్ చర్యలకు సిద్ధమైపోయారు. కొన్ని ఛానెళ్లు, వెబ్సైట్లు ఈ మధ్య ఆమె బికినీ ఫోటోలంటూ కొన్నింటిని వైరల్ చేశాయి. అయితే ఫేక్ ఫోటోలని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. అవి నావి కావు... ‘నిజానికి ఆ ఫోటోలు నావి కావు. అయినప్పటికీ కొన్ని వెబ్ సంస్థలు అతితో వాటిని నా పేరు మీద ప్రచురించాయి. నా పరువుకు భంగం కలిగించిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నా. ఇప్పటికే లీగల్ నోటీసులు సిద్ధం చేశా’ అని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆ ఫోటోలు వర్షిణి పాకల్ అనే మోడల్‌వి అని ఫోటోగ్రాఫర్ ప్రసూన్ ప్రశాంత్ ప్రకటించారు. కాగా, నివేథా పెతురాజ్ మెంటల్ మదిలో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్థురాలే. జయం రవితో ఆమె నటించిన స్పేస్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ రిలీజ్‌కు రెడీగా ఉండగా, విజయ్ ఆంటోనీతో ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. -
జూన్ 22న ‘టిక్ టిక్ టిక్’
‘తనీఒరువన్’ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కిన సినిమా టిక్ టిక్ టిక్. ఈ సినిమా జూన్ 22న రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. ఈ సినిమాలో జయం రవి సరసన నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తుండగా అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. టిక్ టిక్ టిక్‌ను ముందుగా 2018 జనవరిలోనే రిలీజ్ చేయాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల విడుదల సాధ్యం కాలేదు. తాజాగా ఈ సినిమాను జూన్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను హీరో జయం రవి తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. అయితే తెలుగు వర్షన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
నలుగురు ముద్దుగుమ్మలతో..
తమిళసినిమా: నటుడు దుల్కర్ సల్మాన్ కోలీవుడ్‌పై మక్కువ చూపిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే. ఈయన మాతృభాషలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా, వాయై మూడి పేసవుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. బాలాజీమోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పర్వాలేదనిపించుకున్నా, ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీఛాన్స్ వరించింది. అలా ఒరు కాదల్ కణ్మణి చిత్రంతో తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఆ తరువాత మరోసారి మణిరత్నం చిత్రంలో అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేదు. ఇటీవల సోలో అనే చిత్రంలో నటించారు. మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ బహు భాషా నటుడిగా రాణిస్తున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా మరో తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపారు. కొత్త దర్శకుడు కార్తీక్ పరిచయం అవుతున్న ఈ చిత్రంలోనే దుల్కర్‌సల్మాన్‌తో నలుగురు కథానాయికలు రొమాన్స్ చేయనున్నారని సమాచారం. ఇందులో తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి ఫేమ్ శాలిని పాండే, నటి నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో ఇద్దరి ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు మలయాళంలోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. -
మగాళ్లదే మొదటి బాధ్యత
ఈ సెక్సువల్ హెరాస్మెంట్స్ అన్నీ ఎక్కడో బయట వారి నుంచి ఎదురవ్వవు. మన బంధువుల్లో నుంచే ఎదురవుతాయి. ‘‘మన దేశం ప్రస్తుతం చాలా సమస్యలతో సతమతమౌతోంది. కొన్ని సమస్యలను మనం పరిష్కరించలేం. కొన్నింటిని మనం పరిష్కరించుకోగలం. అందులో ఫస్ట్‌ది ఉమెన్ సేఫ్టీ. సెక్సువల్ హెరాస్మెంట్కి గురైనవారు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను’’ అన్నారు నివేథా పెతురాజ్. ఈ మలయాళ బ్యూటీ ‘మెంటల్ మదిలో’ చిత్రంలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ మధ్య దాదాపు రోజుకో లైంగిక దాడికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నివేథా పైవిధంగా పేర్కొన్నారు. తన మనోభావాలను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో నివేథా ఏం మాట్లాడారంటే.. ‘‘చిన్నప్పుడు నా మీద లైంగిక దాడి జరిగింది. ఆ విషయాన్ని నా తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఆ వయసులో నాకు అర్థం కాలేదు. ఈ సెక్సువల్ హెరాస్మెంట్స్ అన్నీ ఎక్కడో బయట వారి నుంచి ఎదురవ్వవు. మన బంధువుల్లో నుంచే ఎదురవుతాయి. పేరెంట్స్ అందరూ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ పిల్లలతో కూర్చోండి, అడిగి తెలుసుకోండి. ఈ విషయాలపై అవగాహన కల్పించండి. స్కూల్లో, ట్యూషన్లో ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఈ సందర్భంగా మా మేల్ ఫ్రెండ్స్ అందరికీ ఓ విషయం చెప్పదలిచాను. మీరు మాకోసం చాలా చేస్తారు. మీ అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నా. మన వీధుల్లో ఏం జరుగుతుందో కనుక్కోండి. ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి. మీరు ఏవిధంగా హెల్ప్ చేయాలనుకున్నారో అలా చేయండి. ప్రతీదానికి పోలీసుల మీద డిపెండ్ అవ్వలేం కదా. వాళ్లు హెల్ప్ చేయరని కాదు, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారి సహాయం అవసరం అవుతుంది. బయటకు వెళ్లగానే చూసిన ప్రతీవాళ్లను అనుమానించాలంటే భయంగానూ, బాధగానూ ఉంటుంది. ఆ పరిస్థితి మారాలి. మారాలంటే లైంగిక దాడులు జరగకూడదు. మీరు (మగవాళ్లు) తలుచుకుంటే దీన్ని అంతం చేయగలరు. మా హంబుల్ రిక్వెస్ట్, మమ్మల్ని కాపాడండి’’ అన్నారు. -
నేనూ బాధితురాలినే..! నటి
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సమాజంలో స్త్రీలకు భద్రత కరువైంది. కామాంధుల పసివాళ్లను కూడా వదలడం లేదు. జమ్మూ కశ్మీర్‌లోని కథువా అనే ప్రాంతంలో చిన్నారిపై జరిగిన అత్యాచార దుర్ఘటన దేశంలో సంచలనం రేపింది. ఈ దురాఘాతాన్ని చాలా మంది ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అదే విధంగా అత్యాచారాలపై పలువురు సినీతారలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌లో హీరోయిన్గా ఎదుగుతున్న నివేథా పేతురాజ్ నేనూ అత్యాచార బాధితురాలినే అని పేర్కొంది. ఆమె ఏమన్నారంటే..‘తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అందులో కొన్ని సమస్యలు జాగ్రత్త వహిస్తే మనం అడ్డుకోవచ్చు. అలాంటి వాటిలో స్త్రీల రక్షణ. చిన్నతనంలోనే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ బాధింపుకు నేను ఐదేళ్ల వయసులోనే గురయ్యాను. ఆ విషయాన్ని అప్పుడు అమ్మానాన్నలకు ఎలా చెప్పగలను. అసలు ఎం జరిగిందో తెలియని వయసు’ అని చెప్పారు. ‘తల్లిదండ్రులకు నేను చెప్పెదేమిటంటే.. మీ పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అనే విషయంపై శ్రద్ధ చూపండి. పిల్లల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. మనం పోలీసులను నమ్మి ఉండలేం. మీ వీధిలో యువకులు చర్యలపైనా ఒక కన్నేసి ఉండాలి. ఏమైనా తప్పు జరుగుతుంటే అడ్డుకోవాలి. ఇప్పుడు కూడా నాకు బయటకు వెళ్లాలంటే భయం. అత్యాచార చర్యలు బాలా బాధాకరం. ఇలాంటి వాటిని అణచివేస్తేనే ప్రశాంతంగా జీవించగలం’ అని నటి నివేథా పేతురాజ్ పేర్కొన్నారు.