ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు అంటే దాదాపు థ్రిల్లర్ కథలే ఉంటాయి. ఇప్పుడు అదే జానర్‌లో వస్తున్న తెలుగు స్ట్రెయిట్ సిరీస్ 'పరువు'. రీసెంట్‌గా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగిందని ఓ వీడియో వైరల్ అయింది కదా! అది ఈ సిరీస్ కోసమే. ఇప్పుడు దీని ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.
(ఇదీ చదవండి: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?)
హీరోయిన్ నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'పరువు'. నాగబాబు కీలక పాత్ర చేశాడు. బిందుమాధవి విలన్‌గా చేసింది. సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. జూన్ 14 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ బట్టి చూస్తే.. పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి జాహ్నవి, విక్రమ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లని చంపడానికి కొందరు కిల్లర్స్ ప్రయత్నిస్తారు. వీళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రేమికులు కాస్త హంతకులుగా మారాల్సి వస్తుంది. చివరకు ఏమైంది అనేదే మెయిన్ స్టోరీ.
(ఇదీ చదవండి: ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!)
Comments
Please login to add a commentAdd a comment