‘రోషగాడు’గా బిచ్చగాడు | Vijay Antony Next Movie Title Roshagadu | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 1 2018 10:20 AM | Last Updated on Wed, Aug 1 2018 10:22 AM

Vijay Antony Next Movie Title Roshagadu - Sakshi

బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ ఘనవిజయం అందుకున్న కోలీవుడ్ హీరో విజయ్‌ ఆంటోని. వైవిధ్యమైన కథా చిత్రాలకు, రియలిస్టిక్ క్యారక్టరైజేషన్స్‌తో ఆకట్టుకున్నంటున్న విజయ్‌ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ఈ హీరో త్వరలో ఓ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.

తమిళ్‌లో ‘తిమిరపుడిచవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న  సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రోషగాడు సినిమాలో నివేథా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై ఫాంతిమా ఆంటోని నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement