Bichagadu
-
'చావు అంచుల దాకా వెళ్లా'.. బిచ్చగాడు హీరోయిన్ కామెంట్స్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు బిచ్చగాడు-2 రూపొందిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో కొనసాగుతుంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హీరోయిన్ కావ్య థాపర్ తనను రక్షించిందని విజయ్ ఆంటోనీ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై కావ్య థాపర్ స్పందించింది. ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆమె ఆనాడు ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ను గుర్తుచేసుకుంటూ.. మలేషియాలో యాక్షన్ సీన్ చేస్తుంటే అనుకోకుండా పెద్ద ప్రమాదం జరిగింది. చదవండి: అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ ఆంటోనీ సముద్రంలో పడిపోయారు. ఆయన్ని రక్షించాలని నేను కూడా సముద్రంలో దూకాను. ఈత కొడుతూ వెళ్లి ఆయన్ను పట్టుకున్నాను. ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లినట్లు అనిపించింది. వెంటనే యూనిట్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించారు అంటూ చెప్పుకొచ్చింది కావ్య థాపర్. -
విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
‘బిచ్చగాడు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు–2’ తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడులవుతున్న ఈ సినిమాకు విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. Trailer tomorrow at 11 AM🔴 Releasing Worldwide on May 19🟡#BLOCKBUSTER 🟢#Pichaikkaran2 #bichagadu2 pic.twitter.com/Xc0TjFQWzx — vijayantony (@vijayantony) April 28, 2023 -
కన్నీళ్లు తెప్పిస్తున్న 'బిచ్చగాడు-2' సాంగ్ చెల్లి వినవే..
‘బిచ్చగాడు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు–2’ తమిళ, తెలుగు భాషల్లో ఈ వేసవిలో విడుదల కానుంది. విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయిక. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లీ వినవే.. నా తల్లీ వినవే, నీ అన్నను కాను అమ్మను నేను, చిట్టీ వినవే.. నా బుజ్జీ కనవే.. నీ పుట్టుమచ్చై ఉంటా తోడు..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటను భాష్య శ్రీ రాయగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ‘‘ప్రతి ఒక్కర్నీ కదిలించేలా ఈ పాట సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సమంతతో బాక్సాఫీస్ ఫైట్‌కు దిగిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలోనే విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఏప్రిల్14న ఈ బిచ్చగాడు-2ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సరిగ్గా అదేరోజు సమంత నటించిన శాకుంతలం చిత్రం కూడా రిలీజ్ కానుండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఫైట్ కనిపించనుంది. -
‘రోషగాడు’గా బిచ్చగాడు
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ ఘనవిజయం అందుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. వైవిధ్యమైన కథా చిత్రాలకు, రియలిస్టిక్ క్యారక్టరైజేషన్స్‌తో ఆకట్టుకున్నంటున్న విజయ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ఈ హీరో త్వరలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్లో ‘తిమిరపుడిచవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న రోషగాడు సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఫాంతిమా ఆంటోని నిర్మిస్తున్నారు. -
పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో
విభిన్నమైన చిత్రాలతో ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. తమిళంలో విజయ్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా రిలీజై మంచి విజయాలు సాధిస్తున్నాయి. ‘డాక్టర్ సలీమ్, బిచ్చగాడు’ ఇందుకు నిదర్శనం. తాజాగా విజయ్ ఆంటోని హీరోగా గణేష దర్శకత్వంలో తమిళంలో ఓ సినిమా రూపొందుతోంది. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాత. ఇందులో నివేథా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్నారు. మంగళవారం విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా తమిళంలో ఈ సినిమాకు ‘తిమిరుపుడిచ్చవన్’ (అంటే పొగరున్నోడు అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. ‘‘ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోని నటిస్తున్నారు. త్వరలోనే తెలుగు టైటిల్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆగస్టు తొలివారంలో ఫస్ట్‌లుక్
‘బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్’ లాంటి తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్, తమ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.9గా తెలుగు స్ట్రయిట్ సినిమా నిర్మిస్తున్నారు. ‘వీకెండ్ లవ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జర్నలిస్ట్ టర్నడ్ డైరెక్టర్ నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వసంత్ సమీర్, సెహర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. ‘మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ డబ్బింగ్ సినిమాలకంటే ఈ స్ట్రయిట్ సినిమా డిఫరెంట్‌గా ఉండబోతోంది. నాగు గవర రాసుకొన్న కథ మాకు బాగా నచ్చింది. ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసే ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్ ను ‘#KKK’ అని విడుదల చేసినప్పట్నుంచి టైటిల్ ఏంటా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలను మించే విధంగా చాలా విభిన్నమైన కథా కథనాలతో వైవిధ్యమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాం’ అన్నారు. దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. ‘వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, ఈ సినిమా చేస్తున్నాను . చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్లో ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీలుక్ కి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్ మొదటివారంలో డిఫరెంట్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను పలకరించనున్నాం’ అన్నారు. -
బిచ్చగాడుని మించుతుంది
‘‘తెలుగు నిర్మాతలందరూ నన్ను వారి హీరోగా భావించి ప్రోత్సహిస్తున్నారు. మంచి సినిమాలనే ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తాను. త్వరలోనే తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలనుకుంటున్నా’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కాశి’. కృతిక ఉదయనిధి దర్శకురాలు. ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ సినిమాని ఈ నెల 18న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రాలతో పోల్చితే ‘కాశి’ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నా ‘బిచ్చగాడు’ని మించి హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా పాటలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఏ సినిమా పాటలైనా ‘విజయ్ ఆంటోని.కామ్’ నుంచి ఎప్పుడైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘విజయ్‌గారు ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేశారు. ‘కాశి’తో మరో హిట్ సాధిస్తారని భావిస్తున్నా’’ అన్నారు నిర్మాత కిరణ్. ‘‘సినిమా చూశా. చక్కగా ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేస్తారు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘కాశి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకురాలిగా పరిచయం అవుతున్నాను. విజయ్‌గారు కథ వినగానే నన్ను నమ్మి డైరెక్షన్ అవకాశం ఇచ్చారు’’ అన్నారు కృతిక ఉదయనిధి. నిర్మాతలు ప్రద్యుమ్న, గణేశ్, సునైన, నటుడు మధు, రచయిత భాషా శ్రీ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, అమృత తదితరులు పాల్గొన్నారు. -
నడిచేటి కోవెల అమ్మేలే...
బిచ్చగాడు’ చిత్రం కోసం రాసిన పాట ఇది. కథానాయకుడి తల్లి చావుబతుకుల మధ్య పోరాడుతున్న సందర్భానికి అనుగుణంగా ఈ పాట రాశాను. ‘వంద దేవుళ్లే కలిసొచ్చినా...అమ్మ నీలాగ చూడలేరమ్మా....’ అని పల్లవి ప్రారంభించాను. ఔను... వందమంది దేవుళ్లు కలిసి మన ఆలనపాలన చూస్తున్నా.... వాళ్లు అమ్మలా చూసిన భావన కలగదు. వాళ్లు ఎంత చూసినా ఏదో తక్కువైనట్టే ఉంటుంది. ఓ పసిబిడ్డను పది మంది ఎత్తుకుని ముద్దాడినా బిడ్డ దృష్టంతా తల్లి మీదే, తల్లి వైపే ఉంటుంది. ‘కోట్ల సంపదే అందించినా... నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా...’ మనం కోట్లు ఖర్చు పెడితే ఎదుటి వాళ్ల సేవను పొందగలమేమో గాని, వాళ్ల ప్రేమని పొందలేం. ‘నా రక్తము ఎంతిచ్చినా... నీ త్యాగాలనే మించునా... నీ రుణమే తీర్చాలంటే... ఒక జన్మైనా సరిపోదమ్మా... మన సుఖం కోసం అమ్మ తన జీవితమంతా ధారపోస్తుంది. అలాంటి అమ్మ ఋణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి... ఏం చేసినా తక్కువే. వంద జన్మలñ త్తినా తీర్చుకోలేనిది అమ్మ ఋణం. నడిచేటి కోవెల అమ్మేలే... ప్రాణం పోయగల శక్తి దైవానికుంటే, బిడ్డకు ప్రాణం పోసిన దైవం అమ్మ. అందుకే దైవం గుడిలో కాదు... అమ్మ ఒడిలోను, తనను ఎత్తుకొని లాలించే ఆమె అణువణువులో ఉందనిపిస్తుంది. పగలైనా రాత్రైనా జాగారాలు... పిల్లల సుఖమే మెడ హారాలు బిడ్డకు జ్వరం వస్తే అమ్మ నిద్రపోదు. బిడ్డలు నిదురిస్తుంటే, సుఖంగా నిద్రపోతున్నారో లేదో అని తాను నిద్రపోకుండా, చూస్తూ ఉంటుంది. దీపంలా కాలి వెలుగే పంచెను... పసి నవ్వులే చూసి బాధే మరిచెను ఒక ఒత్తి తను కాలుతూనే లోకానికి వెలుగునిస్తుంది. అలాగే అమ్మ తన కడుపు కాల్చుకొని, బిడ్డ కడుపు నింపుతుంది. అమ్మ ఎన్నో కష్టాలను దిగమింగి బిడ్డలకు సంతోషాన్ని పంచుతుంది. తను ఎంత కష్టపడినా అంతా తన బిడ్డల ఆనందం కోసమే. తన ప్రాణం పోయే క్షణంలోకూడా బిడ్డను చూస్తే అమ్మకు ప్రాణం లేచి వస్తుంది. పిల్లల సుఖం కోసం అమ్మ తన జీవితాన్నే అర్పిస్తుంది. అందుకే అమ్మను కనిపించే దైవం అంటారు. – సంభాషణ: డా. వైజయంతి -
‘బిచ్చగాడు’ కన్నా పెద్ద హిట్ అవ్వాలి: వినాయక్
‘‘మదర్ సెంటిమెం ట్‌తో వచ్చిన ‘బిచ్చ గాడు’ పెద్ద హిట్ అయింది. ఫాదర్ సెంటిమెంట్‌తో వస్తోన్న ‘యమన్’ ఆ చిత్రం కంటే పెద్ద హిట్ కావాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమన్’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. టీజర్‌ను వినాయక్ రిలీజ్ చేశారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల శివరాత్రికి రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. లైకా ప్రొడక్షన్స్ రాజా, చిత్ర సమర్పకులు మిర్యాల సత్యనారాయణరెడ్డి, పాటల రచయిత భాషశ్రీ, నిర్మాత కాశీ విశ్వనాధ్ పాల్గొన్నారు. -
బిచ్చగాడి పొలిటికల్ ఎంట్రీ
-
కోలీవుడ్ నుంచి మరో 'యముడు'..?
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. బిచ్చగాడు తరువాత వచ్చిన భేతాళుడు కూడా మంచి వసూళ్లు సాధించటంతో విజయ్ చేస్తున్న కొత్త సినిమాలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తున్న వచ్చిన విజయ్ ఆంటోని ఇప్పుడు ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. 2.0, శభాష్ నాయుడు, ఖైదీ నంబర్ 150 లాంటి భారీ చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. తమిళ్లో యెమన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో యముడు అనే టైటిల్‌తో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అదే టైటిల్‌తో సూర్య హీరోగా ఓ సినిమా రిలీజ్ అయినందున ఆ పేరుకు ముందో వెనకో మరో పదాన్ని కలిపి టైటిల్‌గా నిర్ణయించాలని భావిస్తున్నారట. సూర్య యముడు సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఎస్ 3 కూడా త్వరలో రిలీజ్ అవుతున్న నేపథ్యం విజయ్ ప్లాన్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. -
తెలుగు సినిమా చేస్తున్న 'బిచ్చగాడు'
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన బిచ్చగాడు, హీరో విజయ్ ఆంటోనికి ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. గతంలో నకిలీ, సలీం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని, బిచ్చగాడు సినిమాతో స్టార్ గా మారిపోయాడు. దీంతో విజయ్ ఆంటోని తాజా చిత్రం భేతాలుడు తెలుగు రైట్స్ ను 30 కోట్ల పెట్టి సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం బాగానే సాధించింది. తనను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను రాధిక శరత్ కుమార్ రాడన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోనిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది కూడా ఇది బ్యానర్. అందుకే తెలుగులో అదే బ్యానర్ లో పరిచయం అయితే సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు బిచ్చగాడు. -
సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు'
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా పిచ్చైక్కారన్ను తెలుగులో బిచ్చగాడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. కోటి రూపాయల లోపు బడ్జెట్‌తో తెలుగులో రిలీజ్ అయిన బిచ్చగాడు వందల రెట్లు కలెక్షన్లు సాధించి ఈ ఏడాది టాప్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా కాసుల పంట పండించాడు. ఇటీవల ఓ తెలుగు టివి ఛానల్లో ప్రసారం అయిన బిచ్చగాడు 18.75 టీఆర్పీ సాధించింది. పవన్ చివరి సినిమా సర్థార్ గబ్బర్‌సింగ్ కన్నా బిచ్చగాడు టీఆర్పీ ఎక్కువ కావడం విశేషం. ఈ సినిమా తమిళ వర్షన్ అయితే టీఆర్పీ రికార్డ్‌లలో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఓ తమిళ ఛానల్లో ప్రసారం అయిన పిచ్చైకారన్ 24.55 టీఆర్పీ సాధించి సంచలనం సృష్టించింది. రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ లాంటి టాప్ స్టార్ల సినిమాలతో పాటు, బాహుబలి టీఆర్పీలను కూడా వెనక్కి నెట్టి బిచ్చగాడు సంచలనం సృష్టించాడు. -
బిచ్చగాడు డైరెక్టర్‌తో వెంకీ
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు నాట కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమా డైరెక్టర్ శశితో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. శశి కూడా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనతో ఓ సీనియర్ హీరోతో సినిమా చేసుందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాబు బంగారం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో వెంకటేష్.. ఆ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదే సమయంలో బిచ్చగాడు దర్శకుడు శశితో కూడా సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడు వెంకీ. ఇప్పటికే వెంకీకి కథ వినిపించిన శశి, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. డబ్బింగ్ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించిన శశి, స్ట్రయిట్ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
ఆ సినిమా సునీల్ కూడా చేయనన్నాడట..!
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న హీరో సునీల్. స్టార్ కమెడియన్‌గా కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ ఇంత వరకు నిలదొక్కుకోలేకపోయాడు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న కామెడీ జానర్‌ను కాదని మాస్ ఇమేజ్ కోసం తాపత్రేయపడుతుండటంతో కెరీర్ గాడి తప్పుతుందంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ హీరో ఇటీవల సూపర్ హిట్ టాక్ తెచ్చకున్న ఓ సినిమా ఆఫర్‌ను కాదన్నాడట. తమిళ్లో ఘనవిజయం సాధించి తరువాత తెలుగు నాట కూడా కలెక్షన్ల సునామీ సృష్టించిన సూపర్ హిట్ సినిమా బిచ్చగాడు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించిన నిర్మాతలు.. రానాతో పాటు సునీల్‌కు కూడా వినిపించారట. అయితే తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కథను, ఆ పాత్రలో సునీల్‌ను చూసి ఆదరిస్తారో.. లేదో..? అన్న ఆలోచనతో సునీల్ రిజెక్ట్ చేశాడు. దీంతో రీమేక్ ఆలోచనలను పక్కన పెట్టేసిన నిర్మాతలు బిచ్చగాడు సినిమాను డబ్ చేసి రిలీజ్ చేశారు. సునీల్ వర్క్ అవుట్ కాదనుకున్న ఆ సినిమానే ఇప్పుడు సంచలనాలను నమోదు చేసింది. -
మహేష్‌కు తల్లిగా దీపా
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించి రోజుకు వార్త వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న సెట్స్ మీదకు వెళ్లనుంది. హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫైనల్ చేయగా మరో కీలక పాత్రకు కోలీవుడ్ నటిని ఎంపిక చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగుతో పాటు తమిళ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ కథలో కీలకమైన హీరో తల్లి పాత్రకు ప్రముఖ కోలీవుడ్ నటిని ఎంపిక చేశారు. ఇటీవల తెలుగు నాట కూడా సంచలన విజయాన్ని నమోదు చేసిన బిచ్చగాడు సినిమాలో హీరో తల్లిగా నటించిన దీపా రామానుజన్, మురుగదాస్ సినిమాలో మహేష్‌కు తల్లిగా కనిపించనుంది. ప్రముఖ తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. -
బిచ్చగాడిగా సుదీప్
ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయిన బిచ్చగాడు, తమిళ్‌తో పాటు తెలుగు నాట కూడా ఘనవిజయం సాధించింది. అలాంటి టైటిల్ పెట్టాడానికే సాహసించని టాలీవుడ్లో భారీ హిట్‌తో అలరించింది. దీంతో ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల నుంచి బిచ్చగాడికి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్లో సైతం ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరో అడుగు ముందుకేసిన సాండల్ వుడ్ దర్శక నిర్మాతలు.. సుదీప్ హీరోగా సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రీమేక్ సినిమాలతో మంచి విజయాలను సాధించిన సుదీప్ మరోసారి అదే ఫార్ములాతో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే రైట్స్ సొంతం చేసుకున్న కన్నడ నిర్మాతలు త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. -
ఆ సినిమా రానా చేయాల్సిందట..!
సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సమయంలో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయి తెలుగునాట సంచలన విజయం సాధించిన సినిమా బిచ్చగాడు. తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా కేవలం మౌత్ టాక్ తోనే మంచి వసూళ్లను సాధించింది. అయితే తమిళ్లో తెరకెక్కిన ఈ సినిమాను ముందు తెలుగులో రానా హీరోగా రీమేక్ చేయాలని భావించారు. అయితే సినిమా చూసిన రానా, తన ఇమేజ్‌కు, ఫిజిక్కు ఈ పాత్ర సరిపోదని భావించి నో చెప్పేశాడు. దీంతో తమిళ నిర్మాతలు అదే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమానే తెలుగు స్ట్రయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను సాధిస్తోంది. -
టైటిలే ప్లస్ అయింది
- హీరో విజయ్ ఆంటోని ‘‘మొదట ఈ చిత్రానికి ‘బిచ్చగాడు’ అని టైటిల్ పెట్టినప్పుడు నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని చాలామంది అన్నారు. కానీ, ఈ చిత్రానికి టైటిలే పెద్ద ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, అంతకుమించి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇకపై నా చిత్రాల షూటింగ్స్ యాభై శాతం తెలుగు రాష్ట్రాల్లో చేస్తా’’ అని సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ బాగుండటంతో హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.‘‘కథను నమ్మి, హ్యూమన్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశా. తెలుగులో పెద్ద హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు తెలిపారు. చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో రేపటి నుంచి థియేటర్లను పెంచుతున్నాం’’ అని చెప్పారు. సినిమా విజయవంతం కావడంపై కథానాయిక సత్న టైటస్ ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రాంతాలు వేరైనా... ప్రేక్షకుల టేస్ట్ ఒక్కటే!
‘నకిలీ’, ‘డా. సలీం’ చిత్రాల తర్వాత ‘బిచ్చగాడు’గా తెలుగు ప్రేక్షకులముందుకొచ్చారు కథానాయకుడు విజయ్ ఆంటోనీ. శశి దర్శకత్వంలో ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం గురించి చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ -‘‘ ‘బిచ్చగాడు’ చిత్రానికి తమిళంలో ఎంత ఆదరణ వచ్చిందో తెలుగులోనే అదే ఆదరణ లభిచింది. తెలుగు, తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఒక్కటే. ఇకపై నా చిత్రాలన్నీ తెలుగులో కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నా. ఈ చిత్రకథ విన్నప్పుడు ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశా. హీరోగా నటించడంతో పాటు సంగీతం, ప్రొడక్షన్ చూసుకుంటున్నా కష్టమనిపించడం లేదు. ‘సైతాన్’, ‘యముడు’ చిత్రాల్లో నటిస్తున్నా. వీటి తర్వాత ‘డా. సలీమ్’ సీక్వెల్లో నటిస్తా’’ అని తెలిపారు. ‘‘టైటిల్ చూసి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే టెన్షన్ ఉండేది. అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు’’అని నిర్మాత పద్మావతి పేర్కొన్నారు. మాటల రచయిత బాషాశ్రీ పాల్గొన్నారు.