ఆగస్టు తొలివారంలో ఫస్ట్‌లుక్‌ | Sri Tirumala Tirupati Venkateswara Films Next Film Title | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 21 2018 3:42 PM | Last Updated on Sat, Jul 21 2018 3:42 PM

Sri Tirumala Tirupati Venkateswara Films Next Film Title - Sakshi

‘బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్’ లాంటి తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్, తమ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.9గా తెలుగు స్ట్రయిట్ సినిమా నిర్మిస్తున్నారు. ‘వీకెండ్ లవ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జర్నలిస్ట్ టర్నడ్ డైరెక్టర్ నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వసంత్ సమీర్, సెహర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. ‘మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ డబ్బింగ్ సినిమాలకంటే ఈ స్ట్రయిట్ సినిమా డిఫరెంట్‌గా ఉండబోతోంది. నాగు గవర రాసుకొన్న కథ మాకు బాగా నచ్చింది. ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసే ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్ ను ‘#KKK’ అని విడుదల చేసినప్పట్నుంచి టైటిల్  ఏంటా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలను మించే విధంగా చాలా విభిన్నమైన కథా కథనాలతో  వైవిధ్యమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాం’ అన్నారు. 

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. ‘వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, ఈ సినిమా చేస్తున్నాను . చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్‌లో ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీలుక్ కి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్ మొదటివారంలో డిఫరెంట్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను పలకరించనున్నాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement