tik tik tik
-
అంతకంటే గర్వంగా భావించే విషయం ఏముంటుంది?
సమాజానికి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదని తమిళ హీరో జయంరవి వ్యాఖ్యానించారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన ఇటీవల టిక్ టిక్ టిక్ చిత్రంతో అలరించారు. తాజాగా అడంగమరు చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధం అయ్యారు. ఇది జయంరవి మామ సొంతంగా నిర్మిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీక్ తంగవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా నాయకిగా నటించింది. ఈ నెల 21న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు జయంరవితో సాక్షి చిట్‌చాట్. అడంగమరు ఏ తరహా చిత్రంగా ఉంటుంది? ఇది విభిన్నంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుంది. చిత్రంలో మీ పాత్ర గురించి? ఇందులో మరోసారి పోలీస్ అధికారిగా కనిపించనున్నాను. ఇందులో సమాజానికి మంచి చేయాలనే ఒక సిన్సియర్ సీఐగా నటించాను. ఇది పూర్తి కమర్శియల్ కథా చిత్రం అంటున్నారు. మరి దీని ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు? ఇప్పుడు దేశంలో జరుగుతున్న దారుణాల గురించి చూపిస్తున్నాం. అలాంటి సంఘటనలను ఎలా అరికట్టాలనే అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించాం. నిజజీవితంలో అలాంటి సంఘటనలను అరికట్టడం సాధ్యమంటారా? ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే దారుణాలను అరికట్టగలం. అందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు రాజకీయాల్లోకి వచ్చే అలోచన ఉందా? అసలు లేదు. అయినా మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదు. రజనీకాంత్, కమలహాసన్ వంటి వారు రాజకీయాల్లోకి వస్తున్నారుగా? అని మీరు అడగవచ్చు. వారు రాజకీయాల ద్వారానే ప్రజలకు మంచి చేయవచ్చునని భావిస్తున్నారేమో. నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం. అడంగమరు చిత్రంలో హీరోయిన్ రాశీఖన్నా పాత్ర గురించి? ఆమెది చాలా మంచి పాత్ర. ఇంటీరియర్ డిజైనర్‌గా నటించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి డాక్యుమెంటరీని ఇటీవల ఒక చానల్లో ప్రసారమైంది. అందులో జయలలిత నాకు నచ్చిన చిత్రం దీపావళి అని, ఈతరం యువ నటుల్లో జయంరవి అంటే ఇష్టం అని పేర్కొన్నారు. దీనిపై మీ స్పందన? అంతకంటే గర్వంగా భావించే విషయం ఏముంటుంది? చాలా సంతోషం. జయలలితను ఎప్పుడైనా స్వయంగా కలిశారా? ఒకసారి కుటుంబసభ్యులతో కలిసి జయలలిత ఇంటికి వెళ్లాను. నాకు అప్పుడు చిన్న వయసు. మేడమ్ మీ ఇల్లు చాలా బాగుంది అని అనేశాను. అందుకామె థ్యాంక్స్ అని అన్నారు. ఆ తరువాత సంతోష్ సుబ్రమణియం చిత్ర విజయోత్సవ వేడుకలో జయలలిత చేతుల మీదగా జ్ఞాపికను అందుకున్న క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. జయలలిత బయోపిక్ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో నటించే అవకాశం మీకు వస్తే ఎంజీఆర్‌గా నటిస్తారా? అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. మీ అబ్బాయి ఆరవ్ టిక్ టిక్ టిక్ చిత్రంలో బాల నటుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నాడు. తదుపరి మరే చిత్రంలోనూ నటించలేదే? నిజం చెబుతున్నా. టిక్ టిక్ టిక్ చిత్రం తరువాత ఆరవ్‌కు 25 చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే తన వయసు 9 ఏళ్లే. ఇప్పటి నుంచే నటిస్తూ పోతే చదువుకు అంతరాయం కలుగుతుంది.అందుకే 18,19 ఏళ్ల వరకూ పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాం. ఆ తరువాత ఆరవ్ ఇష్టపడితే నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. -
ఇంకా బాయ్‌ఫ్రెండ్ దొరకలేదు!
తమిళసినిమా: నాకింకా బాయ్‌ఫ్రెండ్ దొరకలేదు అంటోంది నటి నివేదాపేతురాజ్. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న యువ నటీమణుల్లో నివేదా పేతురాజ్ ఒకరు.. చిత్రాల ఎంపిక విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నానంటున్న నివేదాపేతురాజ్ను జయం రవితో జత కట్టిన టిక్ టిక్ టిక్ చిత్రం నటిగా తన స్థాయి పెంచింది. ఆ ఉత్సాహంతో ప్రస్తుతం దర్శకుడు ఎళిల్ దర్శకత్వంలో విష్ణువిశాల్ సరసన జగజాల కిల్లాడి చిత్రం, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ చిత్రం, విజయ్‌ఆంటోనీకి జంటగా తిమిర్పిడిచవన్, ప్రభుదేవాతో ఒక చిత్రం అంటూ బిజీగా నటించేస్తోంది. వీటితో పాటు తెలుగులోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. సెలెక్టెడ్ అంటూ చాలా చిత్రాలే చేస్తునట్లున్నారే అన్న ప్రశ్నకు అన్నీ నచ్చిన కథాపాత్రలతో కూడిన చిత్రాలే చేస్తున్నాను అని తెలివిగా బదులిచ్చింది. సరే రెండు భాషల్లో నటిస్తున్నావు కదా ప్రేమలో పడ్డారా, బాయ్‌ఫ్రెండ్ దొరికాడా అని అడిగితే బాయ్‌ఫ్రెండే ఇంకా దొరకలేదు .అలాంటిది ప్రేమకు ఆస్కారం ఎక్కుడుంటుంది? అని కూల్‌గా బదులిచ్చింది. అయినా బాలీవుడ్ హీరోయిన్లను అడిగినట్లు తనను అలాంటి ప్రశ్న వేస్తున్నారేమిటీ? అంటూ మన పరిస్థితులు వేరు కదా అని అంది. నిజం చెప్పాలంటే తనకు బాయ్‌ఫ్రెండ్ గురించి ఆలోచించేంత సమయం, అలాంటి ఆలోచన లేదు అని చెప్పింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తుండడంతో ఆ భాషను నేర్చుకుంటున్నానని, త్వరలోనే తెలుగులో మాట్లాడతాననే విశ్వాసాన్ని వ్వక్తం చేసింది. ఇకపై తమిళం, తెలుగు రెండు భాషలకు తగిన ప్రాధాన్యతనిస్తూ నటిస్తానని నటి నివేదాపేతురాజ్ అంటోంది. బహుభాషా నటి ప్రయోజనాలను అవగతం చేసుకున్నట్లుంది భామ. అన్నట్లు తాను గ్లామర్‌కు దూరం అని చెప్పుకొచ్చిన నివేదాపేతురాజ్ మోడ్రన్ దుస్తుల్లో అందాలారబోస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. -
ఆగస్టు తొలివారంలో ఫస్ట్‌లుక్
‘బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్’ లాంటి తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్, తమ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.9గా తెలుగు స్ట్రయిట్ సినిమా నిర్మిస్తున్నారు. ‘వీకెండ్ లవ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జర్నలిస్ట్ టర్నడ్ డైరెక్టర్ నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వసంత్ సమీర్, సెహర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. ‘మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ డబ్బింగ్ సినిమాలకంటే ఈ స్ట్రయిట్ సినిమా డిఫరెంట్‌గా ఉండబోతోంది. నాగు గవర రాసుకొన్న కథ మాకు బాగా నచ్చింది. ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసే ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్ ను ‘#KKK’ అని విడుదల చేసినప్పట్నుంచి టైటిల్ ఏంటా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలను మించే విధంగా చాలా విభిన్నమైన కథా కథనాలతో వైవిధ్యమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాం’ అన్నారు. దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. ‘వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, ఈ సినిమా చేస్తున్నాను . చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్లో ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీలుక్ కి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్ మొదటివారంలో డిఫరెంట్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను పలకరించనున్నాం’ అన్నారు. -
రాకెట్ కాదు టికెట్‌తో.. స్పేస్‌లోకి!
ఇన్ని రోజులు మన సినిమాల్లో పురాణాలు చూశాం. జానపద కథలను వీక్షించాం. ఫ్యామిలీ డ్రామాలు ఎంజాయ్ చేశాం.ఫ్యాక్షన్ సినిమాలకు జై కొట్టాం. బయోపిక్‌లు ఓకే చేశాం. అన్నీ అయ్యాయి. ఇంకేం మిగిలింది? రోదసి! రాకెట్ వేసుకొని స్పేస్‌లోకి వెళ్లాలంటే చాలా ఖర్చు. కానీ టికెట్టు ఖరీదు మీదే అక్కడకు తీసుకెళ్లగలిగితే? అందుకే మనచేత అంతరిక్ష ప్రయాణం చేయించడానికి కొందరు దర్శకులు సిద్ధం అయ్యారు. పెద్ద హీరోలు అందుకు తోడయ్యారు. నక్షత్రాల మధ్య సినీ స్టార్స్ కలెక్షన్లతో వార్ చేయనున్నారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969లో చందమామ మీద అడుగుపెట్టక ముందే సైన్స్ ఫిక్షన్ జానర్లో ‘2001 స్పేస్ ఒడిస్సీ’ (1968) స్పేస్ మూవీ రూపొందించాడు హాలీవుడ్ దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్స్. అలా మొదలైంది సిల్వర్ స్క్రీన్ స్పేస్ ట్రావెల్. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇంటర్స్టెల్లార్, గ్రావిటీ, మార్టియన్, అవతార్ లాంటివి చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు హాలీవుడ్ నుంచి ఈ రోదసి యాత్ర ఇండియాకి వచ్చింది. మన దగ్గర స్పేస్ జానర్ కొత్త. ఈ జానర్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నాం అంటున్నారు మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీగా వచ్చిన తమిళ చిత్రం ‘టిక్ టిక్ టిక్’ విజయం సాధించింది. ఆ ఊపులో ఆన్ సెట్స్‌లో మరికొన్ని స్పేస్ మూవీస్ వేగంగా చిత్రీకరణ పొందుతున్నాయి. స్పేస్‌కి ఫస్ట్ టిక్ దర్శకుడు సౌందర్‌రాజన్, హీరో ‘జయం’ రవి కలిసి మొదట ‘మిరుతన్’ పేరుతో ఒక సినిమా తీశారు. ఇది తమిళంలో మొదటి ‘జాంబీ’ (చనిపోయి తిరిగి ప్రాణం పొందిన వారు) ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. ఈ ఉత్సాహంతో వారిద్దరూ కలిసి మొదటి భారతీయ స్పేస్ ఫిల్మ్‌గా ‘టిక్ టిక్ టిక్’ ను రూపొందించారు. కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. చెన్నై సమీపంలో ఓ పెద్ద ఆస్ట్రోయిడ్ ఢీ కొంటుంది. అది జరిగిన కొన్ని రోజులకే మరో పెద్ద ఆస్త్రోయిడ్ ఢీ కొనే ప్రమాదం ఉందని తెలుసుకున్న సైంటిస్టులు ఆ ప్రమాదాన్ని తప్పించడానికి హీరో ‘జయం’ రవితో పాటు ఓ టీమ్‌ను తయారు చేస్తారు. వీళ్లు ఆ ముప్పును ఎలా తప్పించే ప్రయత్నం చేశారన్నదే చిత్రకథ. నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ‘జయం’ రవి కుమారుడు ఆరవ్ రవి సిల్వర్ స్క్రీన్కు పరిచయం అయ్యాడు. సుమారు 80 నిమిషాల గ్రాఫిక్స్‌తో నిండి ఉన్న ఈ చిత్రానికి పాజిటివ్ టాకే లభించింది. ముందు సముద్రగర్భం... తర్వాత అంతరిక్షం తొలి సినిమాతోనే సముద్ర గర్భానికి వెళ్లి, చరిత్ర తవ్వి తీసిన ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి మలి చిత్రాన్ని అంతరిక్షంలో సెట్ చేశారు. ఇందులో వరుణ్ తేజ్, అదితీ రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఫిదా, తొలిప్రే మ’తో లవర్‌బాయ్‌గా వరుస సక్సెస్‌లు సాధించిన వరుణ్ తేజ్ ఈ సినిమాలో వ్యోమగామిగా (ఆస్ట్రోనాట్) కనిపిస్తారు. తనతో పాటు అంతరిక్షంలో విహారానికి అదితీ కూడా ఉన్నారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి సాయిబాబు నిర్మిస్తున్నారు. స్పేస్‌లో గ్రావిటీ ఉండనందు వల్ల గాల్లో తేలుతూనే ఉంటాం అన్నది తెలిసిన విషయమే. సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలు స్పేస్‌లో ఉండటంతో జీరో గ్రావిటీ కోసం వరుణ్ తేజ్ మరియు కొంత మంది చిత్రబృందం ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం పెద్ద స్పేస్ స్టేషన్ సెట్ కూడా రూపొందించారు. గత రెండు షెడ్యూల్స్‌లో అదితీరావ్ హైదరీ, వరుణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. జార్జియాలో ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నాం అని చిత్రబృందం ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం హీరో వరుణ్, అదితీలపై 3డీ స్కానింగ్ జరిపారు. హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు. డూప్ లేకుండా వరుణ్ తేజ్ ఇందులో స్టంట్స్ చేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. ‘రంగస్థలం’ కోసం 980ల ఊరి సెట్‌ను డిజైన్ చేసిన రామకృష్ణ, మోనిక ఈ స్పేస్ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్స్. ఈ చిత్రానికి ‘అంతరిక్షం’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. చందమామ దూర్ కే ‘చందమామ రావే జాబిల్లి రావే..’ అని గోరు ముద్దలు తినిపిస్తారు. పెద్దయ్యాక చందమామ రాదని మనకు తెలిసిపోతుంది. వెళ్లే అవకాశం రియల్‌గా సాధ్యం కాదు. రీల్‌కి ఏదైనా సాధ్యమే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ఆ చాన్స్ దక్కింది. ‘ధోని’ బయోపిక్‌లో యాక్ట్ చేసిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఓ స్పేస్ మూవీకి సిద్ధమయ్యారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, మాధవన్, నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ తెరకెక్కించనున్న హిందీ చిత్రం ‘చందమామా దూర్ కే’ ఈ సినిమా షూటింగ్ మొదలు కాకపోయినా సుశాంత్ తన పాత్ర కోసం ఇప్పటికే శిక్షణ మొదలుపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారాయన. స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్ వాడేటువంటి స్పేస్ సూట్‌నే సినిమా షూటింగ్లో వాడనున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం 11 లేయర్స్ ఉన్న స్పేస్ సూట్‌ను డిజైన్ చేశారట. అయితే బడ్జెట్ కారణాల వల్ల సినిమా తీయాలా? వద్దా? అనే పరిస్థితి ఉందట. కానీ ఈపాటికే స్పేస్ మూవీ మీద మక్కువ పెంచుకున్న సుశాంత్ ఒకవేళ ఇది ఆగినా, తప్పకుండా స్పేస్ మూవీ చేస్తానని పేర్కొన్నారు. శర్మకు సెల్యూట్ స్పేస్‌లో ట్రావెల్ చేసిన ఫస్ట్ ఇండియన్ పైలట్ రాకేశ్ శర్మ అందించిన సేవలకు సెల్యూట్ చేయకుండా ఉండలేం. ఇప్పుడు ఆయన కథనే మనందరికీ చూపించి ఆడియన్స్‌తో క్లాప్ కొట్టించడమే కాకుండా సెల్యూట్ చేయించదలిచారు నూతన దర్శకుడు మహేశ్ మతాయ్.స్పేస్‌లో ప్రయాణం చేసిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే చరిత్రను తెర మీద పునఃసృష్టించదలిచారు. సెప్టెంబర్ నుంచి రాకేశ్ శర్మ పాత్రలోకి మారనున్నారు షారుక్ ఖాన్. తన రీసెర్చ్‌లో భాగంగా స్పేస్‌లో సుమారు ఏడున్నర రోజులు ఉన్నారు రాకేశ్ శర్మ. అక్కడ జరిగిన వీడియో కాల్లో స్పేస్ నుంచి ఇండియా ఎలా కనబడుతుంది అని ఇందిరా గాంధీ అడిగిన ప్రశ్నకు ‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’ అని సమాధానమివ్వడం విశేషం. ఇలాంటి సీన్స్ కచ్చితంగా ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేయడం గ్యారెంటీ. ప్రస్తుతం ‘జీరో’ సినిమాతో బిజీగా ఉన్న షారుక్ సెప్టెంబర్ నుంచి సెల్యూట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. కల్పన కథతో... స్పేస్‌లోకి వెళ్లిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్‌గా హిస్టరీ క్రియేట్ చేశారు కల్పనా చావ్లా. నెల రోజుల పాటు స్పేస్‌లో ట్రావెల్ చేసి తిరిగి భూమి మీద ల్యాండ్ అయ్యే సమయంలో చనిపోయారు. ఇప్పుడు ఆమె కథను కూడా స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ బయోపిక్‌లో కల్పనా చావ్లా పాత్రను ప్రియాంకా చోప్రా పోషించనున్నారని టాక్. హాలీవుడ్ టీవీ సిరీస్, సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ప్రియాంక రెండేళ్ల గ్యాప్ తర్వాత హిందీలో ‘భారత్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు చిత్రబృందం. భారీ గ్రాఫిక్స్.. బోలెడు సీజీ స్పేస్ సినిమాలు తీయడానికి కచ్చితంగా స్పేస్ సెట్ వేసి తీరాల్సిందే. దానికి తోడు చాలా షాట్స్‌ను సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉండే వాతావరణం ఎలా ఉంటుందో అనే విషయాల్ని చదవడం లేదా వీడియోలో చూడటం తప్పిస్తే ఎవరికీ ఎక్కువగా తెలియదు. సో రచయిత, దర్శకుడు తమ అవగాహన మేర తెరకెక్కించుకోవడమే. కానీ ఎంత సినిమా అయినా కొన్ని గ్రౌండ్ రూల్స్ పాటించక తప్పదు. సైన్స్ ఫిక్షన్లో ఎంత ఫిక్షన్ ఉన్నప్పటికీ కొంత సైన్స్ అవగాహన మాత్రం కంపల్సరీ. ఫిక్షన్ అనే గాల్లో ఎంతలా వేలాడినా సైన్స్ అనే గ్రావిటీని అందుబాటులో పట్టుకోకపోతే ఇబ్బందే. కమర్షియల్ సినిమాల్లోలా కొన్ని లాజిక్స్‌ని పట్టించుకోకపోయినా కొన్నింటిని వదిలేస్తే మాత్రం దారి తప్పిన రాకెట్ అవుతుంది ప్రయాణం. దాని పర్యావసనం ఎంటో అప్పుడు ఎక్కడ తేలుతుందో ఎవ్వరికీ తెలియదు. మూడు గంటల సినిమాలో సగానికి పైగా స్పేస్‌లో అది కూడా సింగిల్ కాస్ట్యూమ్స్‌లో (ఎక్కువ శాతం) ఆడియన్స్‌ను ఎంత వరకు కట్టిపడేస్తారని దర్శకుడు ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. స్పేస్‌లో డ్యూయెట్లు పాడుకునే వీలు కూడా ఉండదు. అంతకు రిస్క్ చేసి పాలపుంతల్లో పాట పాడించి ఒప్పించడం దర్శకుడు మీద ఆధారపడి ఉంటుంది. స్పేస్‌లో కథ నడుస్తున్నప్పుడు దర్శకుడు కథ చెప్పడంలో దృష్టి పెట్టడం ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడానికి స్పేస్‌లో స్పేస్ ఉండకపోవచ్చు. ఏది ఏమైనా మన దర్శకులు చేస్తున్న స్పేస్ జానర్ ప్రయత్నాన్ని ఆడియన్స్ కచ్చితంగా ఆదరించి తమ హృదయాల్లో కొంచెం స్పేస్ ఇస్తారని ఆశిద్దాం. అమృతం చందమామలో 2014లోనే గుణ్ణం గంగరాజు స్పేస్ జానర్లో సినిమా తీసే ప్రయత్నం చేశారు కానీ పూర్తి స్థాయిలో కాదు. కొంత పోర్షన్ వరకే. ‘అమృతం’ సీరియల్‌తో కితకితలు పెట్టిన ఆయన స్పేస్‌లో కూడా తన అమృతం హోటల్ వంట రుచి చూపించదలిచారు. అమృతంలా అవసరాల శ్రీనివాస్, అంజి పాత్రలో హరీష్, సర్వర్‌గా వాసు ఇంటూరినే కనిపించారు. విలన్ అప్పాజి పాత్రలో సీరియల్లో కనిపించిన శివన్నారాయణ పెద్దినే చేశారు. బిజినెస్‌ను ఎక్స్టెండ్ చేసే పనిలో తమ ‘అమృత విలాస్’ స్పెషల్ బ్రాంచ్‌ను చందమామ మీద కూడా ఏర్పాటు చేయాలనుకుంటారు అమృతం, అంజి. ఈ కథాంశంతో రూపొందిన ‘అమృతం చందమామలో’ సినిమాలో కొంత పోర్షన్ మేరకు స్పేస్ సీన్స్ ఉన్నాయి. – గౌతమ్ మల్లాది -
ప్రేక్షకులకు థ్రిల్
‘బిచ్చగాడు, 16’ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతలుగా చదలవాడ బ్రదర్స్ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చదలవాడ బ్యానర్లో సినిమా అంటే సమ్‌థింగ్ స్పెషల్. తాజాగా ఈ బ్యానర్లో రాబోతోన్న చిత్రం ‘టిక్ టిక్ టిక్’. జయం రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్ ‘టిక్ టిక్ టిక్’ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘అంతరిక్ష నేపథ్యంలో రూపొందిన తొలి భారతీయ చిత్రమిది. ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మిలియన్ వ్యూస్‌ను రీచ్ అయింది. ‘బిచ్చగాడు, 16’ సినిమాలను మించేలా తెరకెక్కిన విలక్షణమైన సబ్జెక్ట్ ఇది. మా బ్యానర్లో విడుదల చేస్తుండటం గర్వంగా ఉంది’’ అన్నారు. -
అంతరిక్షంలో థ్రిల్
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తీ సౌందర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ అదే పేరుతో జూన్ 22న తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. చిత్రసమర్పకుల్లో ఒకరైన లక్ష్మణ్ మాట్లాడుతూ –‘‘అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన సినిమాలకు భిన్నంగా ‘టిక్ టిక్ టిక్’ ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్ అవడంతో పాటు ఓ కొత్త అనుభూతికి లోనవుతారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మా బ్యానర్లో వచ్చిన ‘బిచ్చగాడు’. ‘16’ సినిమాలని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
జూన్ 22న ‘టిక్ టిక్ టిక్’
‘తనీఒరువన్’ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కిన సినిమా టిక్ టిక్ టిక్. ఈ సినిమా జూన్ 22న రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. ఈ సినిమాలో జయం రవి సరసన నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తుండగా అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. టిక్ టిక్ టిక్‌ను ముందుగా 2018 జనవరిలోనే రిలీజ్ చేయాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల విడుదల సాధ్యం కాలేదు. తాజాగా ఈ సినిమాను జూన్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను హీరో జయం రవి తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. అయితే తెలుగు వర్షన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
‘టిక్ టిక్ టిక్’ మూవీ స్టిల్స్
-
టిక్ టిక్ టిక్ : థ్రిల్లింగ్ ట్రైలర్
-
టిక్ టిక్ టిక్ : థ్రిల్లింగ్ ట్రైలర్
‘తనిఒరువన్’ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేథా పేతురాజ్, అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా కోలీవుడ్ లోరిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశాడు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో రూపొందించిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ఇండియన్ స్ర్కీన్ మీద గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Here we go guys the Telugu trailer of #TikTikTik @actor_jayamravi @ShaktiRajan @NPethuraj and the whole team of #TikTikTikTelugu https://t.co/KzhElYCMcf all the best guys 👍🏼👍🏼👍🏼 — Sai Dharam Tej (@IamSaiDharamTej) 18 January 2018 -
అంతరిక్షంలో టిక్ టిక్
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా రూపొందిన తమిళ చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తీ సౌందర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ ‘టిక్ టిక్ టిక్’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘టీజర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీని తలపిస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రావడం గొప్ప విషయం. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు. సమర్పకుల్లో ఒకరైన లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో వచ్చిన ‘బిచ్చగాడు, 16’ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మరో విభిన్నమైన ‘టిక్ టిక్ టిక్’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మంచి టెక్నికల్ అంశాలతో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. తొలి ఇండియన్ స్పేస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, పాటలు: వెన్నెలకంటి, రాకేందు మౌళి, కెమెరా: వెంకటేశ్. -
టిక్ టిక్ టిక్.. ఏం జరిగింది?
వాసు ఇంద్రజాలికుడు మాత్రమే కాదు... పైలట్ కూడా. ఎటువంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోగల సత్తా ఉన్నవాడు. అలాంటి వాడు ఓ పెనుముప్పును తప్పించడానికి ఒక టీమ్‌తో అంతరిక్షంలోకి వెళ్తాడు. కానీ, అక్కడి పరిస్థితులు చేయిదాటి పోతాయి. కాలానికి వ్యతిరేకంగా పరిగెత్తాల్సి వస్తుంది. ‘రేస్ ఎగైనస్ట్ టైమ్’ అన్నమాట. అప్పుడు వాసు ఏం చేశాడు? ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? టీమ్‌లో ఉన్న అందరూ క్షేమమేనా? అన్న ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలంటున్నారు తమిళ దర్శకుడు శక్తీ సుందర్ రాజన్. ‘జయం’ రవి, నివేతా పేతురాజ్, అరోన్ అజీజ్ ముఖ్య పాత్రలుగా శక్తీ సుందర్ రాజన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టిక్. టిక్. టిక్’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ‘ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీ ఇదే’ అని కూడా అన్నారు. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా చిత్రాలను రూపొందిస్తుంటారు శక్తీ సుందర్. గత ఏడాది ‘జయం’ రవితో ఆయన తీసిన ‘ మిరుదన్’ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘టిక్. టిక్. టిక్’పై అంచనాలు పెరిగాయి. -
ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ ట్రైలర్
-
ఇండియన్ ఫస్ట్ స్పేస్ మూవీ ట్రైలర్
సాక్షి, సినిమా : దేశంలోని తొలి స్పేస్ చిత్రం టిక్ టిక్ టిక్ ట్రైలర్ వచ్చేసింది. కోలీవుడ్‌లో జయం రవి హీరోగా శక్తి సౌందర్ రాజన్ డైరెక్షన్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అంతరిక్షం నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు విజువల్స్ చూస్తే అర్థమౌతోంది. భారతదేశానికి పొంచి ఉన్న ముప్పు.. దానిని అడ్డుకునేందుకు అంతరిక్ష శాఖ అధికారులు మేజిషియన్ అయిన హీరో సాయం తీసుకోవటం.. ఓ బృందంగా అంతరిక్షంలోకి వెళ్లి శత్రువులతో పోరాటం నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కింది. గ్రాఫిక్స్ వర్క్ కూడా ఆసక్తికరంగానే ఉంది. నివేథా పెతురాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలకు ముందుండే జయం రవి నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమానే రాబోతుందని స్పష్టమౌతోంది. కాగా, టిక్ టిక్ టిక్ రిలీజ్ తేదీ ప్రకటించాల్సి ఉంది. గతంలో రవి-రాజన్ కాంబినేషన్లో మిరుథన్(తెలుగులో యమపాశం) జాంబీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. Ecstatic to present to u #TikTikTikTrailer https://t.co/04VSUYdyg0 #FirstIndianSpaceFilm #FirstAsianSpaceFilm 💥💥💥God bless the entire team! @ShaktiRajan @JabaksMovies @immancomposer @madhankarky @NPethuraj — Jayam Ravi (@actor_jayamravi) November 24, 2017 -
అంతరిక్షం నేపథ్యంలో తొలి భారతీయ చిత్రం
జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 1981లో ఇదే పేరుతో కమలహాసన్ నటించిన సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్లో జయం రవికి జంటగా నటి నివేదాపేతురాజ్ నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో జయంరవి కొడుకు మాస్టర్ ఆరవ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. నెమిచంద్ జబక్ పతాకంపై వీ.హింటేశ్జబక్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తి సౌందర్‌రాజన్ దర్శకుడు. గతంలో జయం రవి హీరోగా సౌందర్‌రాజన్ మిరుదన్ చిత్రాన్ని తెరకెక్కించారు. జోంబీస్ల ఇతివృత్తంగా తెరెక్కిన ఈ సైన్స్‌ఫిక్సన్ థ్రిల్లర్ కథా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా మళ్లీ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న టిక్ టిక్ టిక్ చిత్రం అంతరిక్షంలో జరిగే తొలి భారతీయ చిత్రంగా నమోదు కానుంది. -
ఆసక్తిని రేకెత్తిస్తున్న టిక్ టిక్ టిక్... ఫస్ట్‌లుక్
తమిళసినిమా: టిక్ టిక్ టిక్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, చిత్రంపై అంచనాలను పెంచుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. జయం రవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టిక్ టిక్ టిక్. ఇదే పేరుతో ఇంతకు ముందు నటుడు కమలహాసన్ నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్లో జయం రవికి జంటగా నటి నివేదాపేతురాజ్ నటిస్తోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో జయంరవి కొడుకు మాస్టర్ ఆరవ్ కీలక పాత్రలో పరిచయం అవుతున్నాడు. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నెమిచంద్ జబక్ పతాకంపై వీ.హింటేశ్జబక్ నిర్మిస్తున్నారు. కాగా జయంరవి, శక్తి సౌందర్‌రాజన్‌ల కాంబినేషన్లో ఇంతకు ముందు మిరుదన్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. జోంబీస్ల ఇతివృత్తంగా తెరెక్కిన ఈ సైన్స్‌ఫిక్సన్ థ్రిల్లర్ కథా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా మళ్లీ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న టిక్ టిక్ టిక్ చిత్రం అంతరిక్షంలో జరిగే తొలి తమిళ చిత్రంగా నమోదు కానుంది.డీ. ఇమాన్ సంగీత భాణిలను అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. జయంరవి అంతరిక్షకుడి గెటప్‌లో తాడు పట్టుకుని ఎగబాకుతున్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సంమ్థింగ్ స్పెషల్‌గా ఎంట్రాక్ట్ చేస్తోంది.