
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తీ సౌందర్‌రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ అదే పేరుతో జూన్ 22న తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. చిత్రసమర్పకుల్లో ఒకరైన లక్ష్మణ్ మాట్లాడుతూ –‘‘అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.
ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన సినిమాలకు భిన్నంగా ‘టిక్ టిక్ టిక్’ ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్ అవడంతో పాటు ఓ కొత్త అనుభూతికి లోనవుతారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మా బ్యానర్‌లో వచ్చిన ‘బిచ్చగాడు’. ‘16’ సినిమాలని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇండియన్ సినిమాలో తొలి స్పేస్ మూవీని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment