టిక్‌ టిక్‌ టిక్‌ : థ్రిల్లింగ్ ట్రైలర్‌ | Jayam Ravi Tik Tik Tik telugu Trailer | Sakshi
Sakshi News home page

Jan 18 2018 4:28 PM | Updated on Jan 18 2018 4:48 PM

Jayam Ravi Tik Tik Tik telugu Trailer - Sakshi

‘తనిఒరువన్‌’ సినిమాతో సూపర్‌ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’‌. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేథా పేతురాజ్, అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్‌ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్‌ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు.

ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా కోలీవుడ్‌ లోరిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్‌ ట్రైలర్‌ ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశాడు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో రూపొందించిన ట్రైలర్‌ ప్రామిసింగ్‌ గా ఉంది. ఇండియన్‌ స్ర్కీన్‌ మీద గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్‌ బ్యాక్‌ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement