Sci Fiction
-
సూపర్ హీరోను పరిచయం చేస్తూ 'ఏ మాస్టర్ పీస్' ప్రీ టీజర్ రిలీజ్
టాలీవుడ్లో శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, అషురెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 'సినిమా బండి' ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సూపర్ హీరోను పరిచయం చేస్తూ స్టన్నింగ్ విజువల్స్, డైలాగ్స్‌తో ఈ ప్రీ టీజర్ ఆకట్టుకుంది. 'ఏ మాస్టర్ పీస్' ప్రీ టీజర్ చూస్తే..సమాజంలో జరిగే నేరాలపై స్పందించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటాడు హీరో. అతన్ని తల్లి మందలిస్తూ ఉంటుంది. కోరుకున్నట్లే పెరిగి పెద్దయ్యాక సూపర్ హీరో అవుతాడు. చిన్నప్పుడు గొడవలు ఎందుకని చెప్పిన తల్లే...అతను సూపర్ హీరో అయ్యాక..వాడు ఎదురొస్తే డీల్ చేయగలిగే దమ్ము మీకుందా అంటూ ధైర్యంగా సవాల్ చేస్తుంది. బలమున్న వాడిని పట్టుకోవాలంటే పవర్ కావాలి. కానీ నీలా బలం ఫ్లస్ పవర్ ఉన్నవాడిని పట్టుకోవాలంటే ఎమోషన్ కావాలి..అంటూ ప్రీ టీజర్లో వచ్చిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ తుది దశలో ఉన్న 'ఏ మాస్టర్ పీస్' సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్, సూపర్ విలన్ మనీష్ గిలాడ్ ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. -
సైన్స్ ఫిక్షన్లో...
అమెరికన్ నటుడు మహర్షెల్లా అలీ ఇక ఆకాశవీధిలో విహరించనున్నారట. మార్క్ ముండెన్ దర్శకత్వంలో హాలీవుడ్లో ‘సావరిన్’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి అలీ అంగీకరించారు. 21ల్యాప్స్ ఎంటర్టైన్మెంట్, ఈ వన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. ఇందులో లీడ్ యాక్టర్‌గా ప్రతిభావంతుడైన మహర్షెలా అలీ దొరికినందుకు హ్యాపీగా ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన నిక్ మేయర్ తెలిపారు. ‘ఏ క్వైట్ ప్లేస్’ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన స్కాట్ బేక్, బ్రియాన్ వుడ్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘గ్రీన్‌బుక్’లోని నటనకు గాను మహర్షెల్లా ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 2016లో ‘మూన్లైట్’కి ఇదే విభాగంలో అవార్డు అందుకున్నారాయన. -
టిక్ టిక్ టిక్ : థ్రిల్లింగ్ ట్రైలర్
-
టిక్ టిక్ టిక్ : థ్రిల్లింగ్ ట్రైలర్
‘తనిఒరువన్’ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేథా పేతురాజ్, అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా కోలీవుడ్ లోరిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశాడు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో రూపొందించిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ఇండియన్ స్ర్కీన్ మీద గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Here we go guys the Telugu trailer of #TikTikTik @actor_jayamravi @ShaktiRajan @NPethuraj and the whole team of #TikTikTikTelugu https://t.co/KzhElYCMcf all the best guys 👍🏼👍🏼👍🏼 — Sai Dharam Tej (@IamSaiDharamTej) 18 January 2018 -
సైన్స్ ఫిక్షన్ మూవీలో వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాల్లో నటిస్తున్న వరుణ్, తరువాత చేయబోయే సినిమాకు కూడా కథ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం కాలు ఫ్యాక్చర్ కావటంతో రెస్ట్ తీసుకుంటున్న వరుణ్ ఈ గ్యాప్ తరువాత చేయబోయే సినిమాలకు కథలు వింటున్నాడు. తాజాగా ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటి చెప్పిన కథ వరుణ్‌కు బాగా నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చెప్పాడట. ఈ సినిమా చందూ మొండేటి తొలి సినిమా కార్తీకేయ తరహాలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కనుంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా వరుణ్ కెరీర్లో మరో డిఫరెంట్ మూవీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.