
టాలీవుడ్‌లో శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, అషురెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 'సినిమా బండి' ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సూపర్ హీరోను పరిచయం చేస్తూ స్టన్నింగ్ విజువల్స్, డైలాగ్స్‌తో ఈ ప్రీ టీజర్ ఆకట్టుకుంది.
'ఏ మాస్టర్ పీస్' ప్రీ టీజర్ చూస్తే..సమాజంలో జరిగే నేరాలపై స్పందించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటాడు హీరో. అతన్ని తల్లి మందలిస్తూ ఉంటుంది. కోరుకున్నట్లే పెరిగి పెద్దయ్యాక సూపర్ హీరో అవుతాడు. చిన్నప్పుడు గొడవలు ఎందుకని చెప్పిన తల్లే...అతను సూపర్ హీరో అయ్యాక..వాడు ఎదురొస్తే డీల్ చేయగలిగే దమ్ము మీకుందా అంటూ ధైర్యంగా సవాల్ చేస్తుంది. బలమున్న వాడిని పట్టుకోవాలంటే పవర్ కావాలి. కానీ నీలా బలం ఫ్లస్ పవర్ ఉన్నవాడిని పట్టుకోవాలంటే ఎమోషన్ కావాలి..అంటూ ప్రీ టీజర్‌లో వచ్చిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి.
ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ తుది దశలో ఉన్న 'ఏ మాస్టర్ పీస్' సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్, సూపర్ విలన్ మనీష్ గిలాడ్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment