
సైన్స్ ఫిక్షన్ మూవీలో వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాల్లో నటిస్తున్న వరుణ్, తరువాత చేయబోయే సినిమాకు కూడా కథ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం కాలు ఫ్యాక్చర్ కావటంతో రెస్ట్ తీసుకుంటున్న వరుణ్ ఈ గ్యాప్ తరువాత చేయబోయే సినిమాలకు కథలు వింటున్నాడు.
తాజాగా ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటి చెప్పిన కథ వరుణ్కు బాగా నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చెప్పాడట. ఈ సినిమా చందూ మొండేటి తొలి సినిమా కార్తీకేయ తరహాలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కనుంది. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కనున్న ఈ సినిమా వరుణ్ కెరీర్లో మరో డిఫరెంట్ మూవీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.