Premam
-
నేనూ మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి: సాయిపల్లవి
నటీనటులకు ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికీ ఉంటాయి. కొందరు లోప్రొఫైల్ను మెయింటెయిన్ చేస్తే, మరొకరు హై ప్రొఫైల్‌ను మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. ఇకచాలా మంది హంగులు, ఆర్భాటాలు చేస్తుంటారు. మరి అలాంటి వారిలో నటి సాయిపల్లవి (Sai Pallavi) ఏ కోవకు చెందుతుందో చూద్దాం. ఈమె సహజత్వానికి ప్రాముఖ్యత ఇస్తారన్నది అందరికీ తెలిసిందే. అదే సాయిపల్లవి కెరీక్‌కు ప్లస్ అయ్యిందేమో. ప్రేమమ్(Premam) అనే మలయాళ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి. తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న తమిళ భామ ఈమె.ఆ చిత్రం సాయిపల్లవిని సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ను చేసిందనే చెప్పాలి. ఆ తరువాత తెలుగులో ఈమె నటించిన చిత్రాలు 90 శాతంకు పైగా సక్సెస్ అయ్యాయి. తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. కాగా తాజాగా తెలుగులో నటుడు నాగచైతన్య సరసన నటిస్తున్న తండేల్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇకపోతే తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్(Amaran) చిత్రం సంచన విజయాన్ని సాధించడంతో పాటూ సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. కాగా తాజాగా రామాయణం చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. మంచి కథ అయితేనే నటించడానికి అంగీకరిస్తున్న సాయిపల్లవి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ప్రతి వారికి నచ్చేవి, నచ్చని విషయాలు ఉండటం సహజం అని చెప్పింది. కొన్ని భయాలు కూడా మనల్ని వెంటాడుతుంటాయని అంది. తనకు ఫొటోలు తీయడం అస్సలు నచ్చదని చెప్పింది. బయటకు వెళ్లినప్పుడు కొందరు సడన్‌గా సెల్ఫోన్లో తనను ఫొటోలు తీస్తుంటారని, అలాంటివి తనకు నచ్చవని చెప్పింది. అలాంటప్పుడు తాను చెట్టునో, సుందరమైన భవనాన్నో కాదనీ, జీవం ఉన్న మనిషిని కథా అని అనిపిస్తుందన్నారు. మీమ్మల్ని ఒక్క ఫొటో తీసుకోవచ్చా? అని అడిగి తీసుకుంటే ఎంత భాగుంటుందీ అని పేర్కొంది. తన చుట్టూ చాలా మంచి ఉన్నప్పుడు లేదా అందరూ తననే చూస్తున్నప్పుడు కొంచెం భయంగానూ, కొంచెం బిడియంగానూ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా తనను అభినందించినా అలానే ఉంటుందని, వెంటనే ఒకటి, రెండు, మూడు అని అంకెలు లెక్క పెట్టుకుంటానని చెప్పింది. అంతేకాకుండా హద్దులు మీరిన ఆలోచనలు చేస్తానని అంది. ఆ అలవాటును మానకోవడానికి నిత్యం ధ్యానం చేస్తున్నాననీ, ఇకపోతే తాను చాలా తక్కువ స్థాయిలో మేకప్‌ను వేసుకుని సాంప్రదాయ బద్ధంగా ఉండాలని ఆశిస్తానని నటి సాయిపల్లవి చెప్పుకొచ్చింది. -
ఎక్కువ ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
-
మరో అమ్మకుట్టి
‘ఇదంజగత్’ సినిమాతో తెలుగు తెరకు అంజు కురియన్ రూపంలో మరో మలయాళీ భామ పరిచయమయింది. ఈ సినిమాలో ‘దూరాలే కొంచెం కొంచెం దూరాలే అవుతున్నట్లు.... దారాలేవో అల్లే్లస్తున్న స్నేహాలేవో’ అని పాట ఉంది. ఈ పాటలాగే సరిహద్దుల దూరాలను దూరం చేస్తూ మన చిత్రసీమకు వచ్చి స్నేహహస్తం చాటుతున్న అంజు కురియన్ గురించి... అప్పుడు అలా ఇప్పుడు ఇలా! తన గురించి తాను ఇలా రాసుకుంది అంజు.ఏజ్ 10: టీచర్ కావాలనుకున్నాను. ఏజ్ 15: డాక్టర్ కావాలనుకున్నాను. ఏజ్ 20: ఆర్కిటెక్ట్ కావాలనుకున్నాను. ఏజ్ 25: మళ్లీ కిడ్ కావాలనుకుంటున్నాను. కిడ్ అయితే కాలేదుగానీ హీరోయిన్ మాత్రం అయ్యింది. ‘అందం అనేది మనసులో నుంచి పుడుతుంది. కాస్మొటిక్స్ నుంచి కాదు’ అని నమ్మే అంజు సహజసౌందర్యానికే తన ఓటు అంటుంది. ప్రేమమ్‌తో... కేరళలోని కొట్టాయంలో పుట్టిన అంజు కురియన్ చెన్నైలో చదువుకుంది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసేది. ఈ సమయంలోనే డైరెక్టర్ ఆల్ఫాన్స్ మలయాళ చిత్రం ‘నేరం’తో ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. ఈ బ్లాక్‌కామెడీ థ్రిల్లర్‌లో సహాయ పాత్రే అయినప్పటికీ తగిన గుర్తింపు తెచ్చింది. ఇక ప్రేమమ్ (మలయాళం)లో కూడా చేసింది సహాయ పాత్రే అయినా భా.....రీ గుర్తింపు తెచ్చిపెట్టింది. చెన్నై టు సింగపూర్ ‘చెన్నై టు సింగపూర్’ అంజు తొలి తమిళ చిత్రం. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేసింది. ఈ సినిమాపై విమర్శల మాట ఎలా ఉన్నా అంజు కురియన్ గ్లామర్, నటనకు మంచి మార్కులే పడ్డాయి. ‘ఇదంజగత్’ అంజు తొలి తెలుగు చిత్రం. దీనికి ముందు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ భాష సమస్య వల్ల నటించలేదు. ‘ఇదంజగత్’ కథ విన్న తరువాత మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందేనని అనుకుందట. తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంది. భాష విషయంలో సుమంత్ సహకరించాడట. అంజు కోసం ఆయన తెలుగు టీచర్ అయ్యాడన్నమాట! కొత్త ప్రపంచంలోకి... రొటీన్ పాత్రలు కాకుండా భిన్నమైన అనుభూతిని ఇచ్చే పాత్రలు చేయడం తనకు ఇష్టం అని చెబుతుంది అంజు. ఇతర భాషా చిత్రాల్లో నటించడం ద్వారా తన కెరీర్ పరిధిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న అంజు ఇప్పుడు తెలుగు నేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ‘కొత్త భాష నేర్చుకోవడం ద్వారా భాష రావడం మాత్రమే కాదు.... కొత్త సాంస్కృతిక ప్రపంచంలోకి అడుగుపెడతాం’ అని చెబుతుంది అంజు కురియన్. ‘కంఫర్ట్‌జోన్ నుంచి కదలడం కష్టమే’ అనుకున్న దశ నుంచి ‘నువ్వు దృష్టి పెట్టాల్సింది లక్ష్యం మీదే...నీ భయాల మీద కాదు’ అని నమ్మే దశకు వచ్చింది. ఇక విజయాలకు అడ్డేమున్నది! -
ప్రేమమ్ నాగవల్లి
‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. ‘అ..ఆ..’ సినిమా ట్రైలర్లో వినిపించే ఈ డైలాగ్‌తో తెలుగు సినిమా అభిమానుల మనస్సుల్లోకి దూసుకొచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. నిజానికి అంతకన్నా ముందే ఒక మలయాళ సినిమాతో తెలుగు కుర్రకారుకు ఈ భామ పరిచయమైంది. ఆ సినిమాయే ‘ప్రేమమ్’. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే, అదే పాత్రలో మళ్లీ కనిపించి మెప్పించింది అనుపమ. పరిచయమైతే మలయాళ పరిశ్రమలోనే అయినా, ఇప్పుడు ఈ హీరోయిన్ స్టార్‌గా దూసుకెళ్తోంది మాత్రం తెలుగులోనే! ఈ లేటెస్ట్ స్టార్ సెన్సేషన్ గురించి కొన్ని విశేషాలు... తెలుగులోనే స్టార్‌గా... అనుపమ మలయాళ సినిమాతోనే హీరోయిన్ అయినా ప్రస్తుతానికి ఆమె కెరీర్ తెలుగులోనే సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతోంది. ‘అ..ఆ..’ విడుదలైన వెంటనే అనుపమకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘శతమానం భవతి’, ‘ప్రేమమ్’ సినిమాలతో వరుసగా సూపర్‌హిట్స్ వచ్చాయి. దీంతో మిడిల్ బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు స్టార్ అనుపమనే! ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటిస్తోన్న ‘హలో గురూ ప్రేమకోసమేరా!’ దసరా కానుకగా విడుదల కానుంది. కాలేజీకి నో చెప్పి సినిమాల్లోకి! అనుపమ పరమేశ్వరన్ పుట్టి, పెరిగిందంతా కేరళలోనే! మలయాళ భామ. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ కలలు కనేది. ఆ పిచ్చే ఆమెకు ‘ప్రేమమ్’ సినిమాలో అవకాశం తెచ్చిపెట్టింది. కొత్తవాళ్ల కోసం దర్శకుడు ఆల్ఫన్స్ పుత్రన్ వెతుకుతూ ఉంటే అనుపమ ఫొటోషూట్ ఆయన కంట్లో పడింది. వెంటనే ‘ప్రేమమ్’లోని మూడు ప్రేమకథల్లో ఒక కథకు హీరోయిన్గా ఎంపికచేశాడు. అప్పటికి అనుపమ వయసు 18 ఏళ్లు. తన డ్రీమ్ కావడంతో కాలేజీకి కూడా నో చెప్పేసింది. డబ్బింగ్ చెప్పిందంటే... ‘అ..ఆ..’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అనుపమకు తెలుగు రాదు. కానీ ఆ సినిమాలో తన పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అనుపమ స్పెషాలిటీస్‌లో ఆ వాయిస్ కూడా ఒకటి. అందుకే అప్పట్నుంచీ అన్ని సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది. అనుపమ వాయిస్‌ను తెలుగు ప్రేక్షకులు, తెలుగులో విన్నది ‘అ..ఆ..’ ట్రైలర్‌లోని ఈ డైలాగ్‌తోనే – ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. లైఫ్‌లో అదే పెద్ద మిరాకిల్! చిన్న వయసులోనే కెరీర్లో పెద్ద సక్సెస్ చూసిన అనుపమ, సినిమాల్లోకి రావడమే తన జీవితంలో జరిగిన పెద్ద మిరాకిల్ అని చెప్తుంది. ఇప్పటికీ ఇదంతా కలలా ఉంటుందని, ఒక్కోసారి ఎలాంటి సినిమాలు ఎంపికచేసుకోవాలో తెలియనప్పుడు దర్శకులు త్రివిక్రమ్, ఆల్ఫన్స్ పుత్రన్లను అడుగుతానని అంటుంది. ఈ దర్శకులే అనుపమను తెలుగు, మలయాళ సినీ పరిశ్రమలకు పరిచయం చేశారు. బ్లాక్‌బస్టర్ డెబ్యూట్ ‘ప్రేమమ్’ విడుదలవ్వడమే పెద్ద బ్లాక్‌బస్టర్. మలయాళ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసిందీ సినిమా. తెలుగు ప్రేక్షకులు సైతం ఆన్లైన్లో వెతుక్కొని మరీ చూసేలా చేసింది. అలా తెలుగులోకి రాకముందే ‘ప్రేమమ్’లో మేరీ పాత్రలో కనిపించిన అనుపమ ఇక్కడ కూడా ఫేమస్. ఆ క్రేజే ఆమెను వెంటనే తెలుగుకు తీసుకొచ్చింది. తెలుగులో ‘అ..ఆ..’లో నాగవల్లి రోల్‌తో డెబ్యూట్ ఇచ్చింది అనుపమ. ఆ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అయింది. తమిళంలో ‘కోడి’ అనే సినిమాతో డెబ్యూట్ ఇచ్చింది. ఆ సినిమా కూడా బ్లాక్‌బస్టర్. -
విజయ్‌సేతుపతితో మూడోసారి..
తమిళ సినిమా : విజయ్‌సేతుపతితో మూడోసారి జత కడుతోంది నటి మడోనా సెబాస్టియన్. కథానాయకుడిగా బిజీగా ఉన్న యువనటుల్లో విజయ్‌సేతుపతి ఒకరు. ఈయన మళ్లీ మళ్లీ సిఫార్సు చేసే హీరోయిన్లు చాలా తక్కువ మందే. వారిలో నటి గాయత్రి ఒకరైతే, రమ్యానంబీశన్ మరొకరు. తాజాగా ఈ పట్టికలో చేరిన నటి మడోనా సెబాస్టియన్. ప్రేమమ్ చిత్రంలో వెలుగు చూసిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కోలీవుడ్‌కు విజయ్‌సేతుపతికి జంటగానే కాదలుమ్ కడందు పోగుమ్ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సైలెంట్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించిన కవన్ చిత్రంలో విజయ్‌సేతుపతితో రెండోసారి జత కట్టింది. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అయినా ఎందుకనో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. ఆ మధ్య ధనుష్‌కు జంటగా పవర్‌పాండిలో రొమాన్స్ చేసింది.ఆ చిత్రం హిట్టే. ఇలా సక్సెస్ గ్రాస్ బాగానే ఉన్నా మడోనా సెబాస్టియన్ క్రేజ్‌ను పెంచుకోలేకపోయ్యిందనే చెప్పాలి. చాలా గ్యాప్ తరువాత మళ్లీ విజయ్‌సేతుపతినే ఈ అమ్మడికి అవకాశం కల్పించారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న భారీ చిత్రం జుంగాలో మడోనా సెబాస్టియన్‌ను సిఫార్సు చేశారు. ఇందులో నటి అయేషా సైగల్ ఒక హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో హీరోయిన్గా మడోనా సెబాస్టియన్ నటిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూడడం విశేషం. కాగా జుంగా చిత్రం ఈ బ్యూటీ కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఈ చిత్రంపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. ఆమెకు ఈ చిత్రం మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాతల మండలి సమ్మె కాలంలో కూడా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇదే ఇప్పుడు వివాదానికి తెరలేపుతోంది. మరి ఈ వివాదం నుంచి సినిమా ఎలా బయట పడుతుందో వేచి చూడాలి. -
‘వైద్య వృత్తిని వదులుకున్నా’
తమిళసినిమా: సినిమా కోసం కష్టపడి చదివిన వైద్య వృత్తిని వదులుకున్నానని అంటోంది సాయిపల్లవి. నటిగా మలయాళంలో సక్సెస్ అయ్యి ఆ తరువాత తెలుగు చిత్రసీమలో విజయాలను అందుకుని ఆ తరువాతే తమిళ చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ అమ్మాయి ఈ భామ. అయితే మాలీవుడ్‌లో నటించిన ప్రేమమ్ చిత్రమే ఈ అమ్మడి తొలి చిత్రం అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అది నిజం కాదన్న విషయాన్ని సాయిపల్లవి తనకు తానే బయటపెట్టింది. ఆ కథేంటో చూద్దాం. ఇంతకుముందు తమిళంలో ధామ్ ధూమ్ చిత్రంలో కంగణాకు స్నేహితురాలిగా, కస్తూరిమాన్ అనే మలయాళ చిత్రంలో మీరా జాస్మిన్‌కు స్నేహితురాలిగా నటించాను. అయితే సినిమా శాశ్వతం కాదని, హీరోయిన్ల కాలపరిమితి ఐదారేళ్లే అని తన తండ్రి చెప్పారన్నారు. చదువే మంచి భవిష్యత్తునిస్తుందని తను ఎంబీబీఎస్ చదివించేందుకు జార్జియా పంపారన్నారు. జార్జియాలో చదువుతుండగానే ప్రేమమ్ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. దీంతో చదువుకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజుల్లో నటించమని అమ్మానాన్న చెప్పారు. అలా నటించిన ప్రేమమ్ చిత్రం ఘన విజయం సాధించడంతో సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించాను. దీంతో వృత్తిని వదులుకోవలసివచ్చింది. అందుకే పూర్తిస్థాయి నటిగా మారిపోయాను. అయితే దేవుడి దయవల్ల ఈ స్థాయికి చేరుకున్నాను అని సాయిపల్లవి అంది. ఈ అమ్మడు తొలి తమిళ చిత్రం కరు త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
మళ్లీ స్టూడెంట్‌గా
సాధారణంగా స్టూడెంట్ స్థాయి నుంచి టీచర్‌గా ఎదుగుతారు. కానీ కథానాయిక సాయిపల్లవి మాత్రం మలయాళ సినిమా ‘ప్రేమమ్’లో టీచర్‌గా ఎంట్రీ ఇచ్చి కాలేజీ స్టూడెంట్‌గా అలరిస్తున్నారు. ఆల్రెడీ ‘ఫిదా, ఎమ్సీఏ’ సినిమాల్లో ఆమె కాలేజ్ స్టూడెంట్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆమె కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యారని సమాచారం. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘పడి పడి లేచె మనసు’’లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ కోల్‌కత్తాలో స్టారై్టంది. ఇందులో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తున్నారని సమాచారం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. సాయిపల్లవి రియల్ లైఫ్‌లోనూ మెడిసిన్ స్టడీస్‌ను కంప్లీట్ చేశారు. అసలే ఈ మలయాళ బ్యూటీ మంచి నటి. రియల్ లైఫ్‌లో ఎలానూ మెడిసిన్ చేశారు కాబట్టి.. ఆ అనుభవంతో ఈ పాత్రను అలవోకగా చేసేస్తారని చెప్పొచ్చు. -
అవే నా అందాన్ని పెంచాయ్: నటి
సాక్షి, చెన్నై: ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం. ఆ ప్రేమ గురించి యువ హీరోయిన్ సాయిపల్లవి ఏమంటుందో తెలుసుకుందాం! మలయాళ చిత్రం ప్రేమమ్‌తో అందర్ని ఆకర్షించింది సాయిపల్లవి. ఆ ఒక్క చిత్రమే ఈ నేచురల్ బ్యూటీ జీవితాన్ని మార్చేసింది. కోలీవుడ్, టాలీవుడ్‌లలో క్రేజీ నటిగా మారిపోయింది. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ అమ్మడి నటనకు ‘ఫిదా’ అయిపోయారు. తన అభిమాన హీరో సూర్యతో నటించే అవకాశం రావడంతో మయ ఖుసీ అయిపోతున్న సాయిపల్లవి ఒక పత్రికతో తన ఆనందాన్ని పంచుకున్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘నాకు డాన్స్ అంటే ప్రాణం. చదువుకుంటూనే డాన్స్ నేర్చుకున్నాను. సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. అయితే నాన్నకు మాత్రం నన్ను డాక్టరుగా చూడాలన్న ఆశ. దీంతో డాక్టరు విద్య కోసం నాన్న జార్జియా పంపారు. ఆ సమయంలో దర్శకుడు అల్పోన్సా ఫోన్ చేసి నేను దర్శకత్వం వహించనున్న ప్రేమమ్ చిత్రంలో నటిస్తావా అని అడిగారు. అంతే ఎగిరి గంతేసి నటించడానికి సమ్మతించాను. ఆ చిత్రం నాకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. నా ముఖానికి మొటిమలు ఎక్కువ. అయినా ఎలాంటి మేకప్ లేకుండా నటించాను. అవే నా ముఖానికి అందాన్ని రెట్టింపు చేశాయని చాలా మంది ప్రశంసించారు. సహజ సిద్ధమైన అందాలతో నటిస్తేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నా భావన. నేను కాలేజీలో చదువుతున్న చాలా మంది ప్రేమిస్తున్నామని చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు ప్రేమ అంటే ఇష్టం ఉండదు. నటన అంటేనే ఇష్టం. హీరో సూర్య అంటే చిన్నతనం నుంచి ఇష్టం. అలాంటి నటుడితో జంటగా నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’ అని సాయిపల్లవి చెప్పారు. -
లక్ అంటే సాయిపల్లవిదే!
తమిళసినిమా: నటి సాయిపల్లవి.. ఈ పేరు ఇటీవల టాలీవుడ్లో బాగా వినిపిస్తోంది. అంతకు ముందే మాలీవుడ్, కోలీవుడ్‌లలో మారుమోగింది. 2015 తెరపైకి వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్ అనూహ్య విజయాన్ని సాధించింది.అందులో మలర్‌గా టీచర్ పాత్రలో సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.అంతే కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కట్టాయి. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నుంచి గౌతమ్‌మీనన్ వరకూ పలువురు తమ చిత్రాల్లో సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు చేశారు. అయితే అలాంటి పెద్దపెద్ద అవకాశాలను కూడా నిరాకరించిన ఈ కేరళకుట్టి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తూ చివరికి టాలీవుడ్ చిత్రం ఫిదాలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందుతోంది. అదేవిధంగా కోలీవుడ్‌లో పలు అవకాశాలను వదులుకున్న సాయిపల్లవి విజయ్ దర్శకత్వంలో నటించడానికి సమ్మతించింది. ఆయన దర్శకత్వంలో నటిస్తున్న కరు అనే చిత్రం నిర్మాణంలో ఉంది. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతోనూ, తెలుగులో ఫిదా చిత్రంతోనూ విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్గా ముద్రవేసుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో కరు చిత్రం ద్వారా విజయాన్ని అందుకోవడానికి ఎదురుచూస్తోంది.ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతల కన్ను సాయిపల్లవిపై పడిందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
ప్రేమమ్ కాంబినేషన్లో మరో సినిమా
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ప్రేమమ్. మలయాళ సూపర్ హిట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కార్తీకేయ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చందూ మొండేటి ప్రేమమ్ సక్సెస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. మలయాళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచిన చందూ అక్కినేని హీరోలతో మరో ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పనులను దాదాపుగా పూర్తి చేసిన నాగచైతన్య, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించనుంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీమేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రేమమ్ కాంబినేషన్ సినిమాను నిర్మిస్తోంది. -
హీరోయిన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్
తమిళ నాట సుచీలీక్స్ సంచలనాలు మరువక ముందే దక్షిణాది సినీ రంగంలో మరో హీరోయిన్ సోషల్ మీడియా పేజ్ హ్యాక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రేమమ్ సినిమాతో మలయాళ, తెలుగు ప్రేక్షకులకు చేరువైన మడోనా సెబాస్టియన్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని మడోనా స్వయంగా ప్రకటించింది. ' నా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. నేను చెప్పేంతవరకు నా పేజ్ లో వచ్చే పోస్ట్ లను పట్టించుకోవద్దు. ఏవైనా అభ్యంతరకర పోస్ట్ లు వస్తే నా బాధ్యత కాదు' అంటూ పోస్ట్ చేసింది మడోనా. -
చైతూ హీరోగా బహుభాషా చిత్రం
కెరీర్ పరంగానే కాదు, వ్యక్తిగత జీవితం పరంగానూ అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అదే ఫాంలో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు చైతన్య. ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను అంగీకరించాడు నాగచైతన్య. తమిళ్లో 'ధృవంగల్ పదినారు' సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు కార్తీక్ నరేన్, నాగచైతన్య హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు ఓ మలయాళ యంగ్ హీరో నటించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల హీరోలు నటిస్తున్న ఈ సినిమాను మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
లోకల్ అబ్బాయి సరసన?
మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ అందుకుందని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. మలయాళ ‘ప్రేమమ్’తో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన ‘ఫిదా’లో నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి ఛాన్స్ దక్కించుకున్నారని సమాచారం. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని ఇటీవల ‘నేను లోకల్’ విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఈ లోకల్ కుర్రాడి సరసనే సాయి పల్లవి నటించనున్నారని సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో నానీకి అక్కగా అందాల భామ భూమిక నటించనున్నారనే వార్త వచ్చింది. త్వరలో ఈ చిత్రం గురించి నిర్మాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
బిజీ అవుతోన్న ప్రేమమ్ బ్యూటి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళీ బ్యూటి అనుపమా పరమేశ్వరన్. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన అనుపమ ఇప్పుడు వరుస అవకాశలతో బిజీ అవుతోంది. ఈ బ్యూటి తెలుగులో చేసిన రెండో సినిమా ప్రేమమ్ కూడా వరుస అవకాశాలను తెచ్చపెడుతోంది. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్, శర్వానంద్ కు జంటగా నటించిన శతమానంభవతి ఈ సంక్రాంతి కానుకగా శనివారం విడుదలవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లో కూడా ఈ ముద్దుగుమ్మకే చాన్స్ ఇచ్చాడు. నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాతో పాటు సుకుమార్, రామ్ చరణ్ ల సినిమా, ఎన్టీఆర్, బాబీల సినిమాలకు కూడా అనుపమ పేరు పరిశీలనలో ఉంది. -
చైతూ, ఇంద్రగంటి సినిమా ఆగిపోయిందా..?
ప్రేమమ్ సినిమా సక్సెస్‌తో నాగచైతన్య రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న చైతూ, తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాల విషయంలో కూడా పునరాలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రేమమ్ రిలీజ్‌కు ముందే, సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్ర బ్యానర్లో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయి పోయాయి. అయితే ఇంద్రగంటితో చేయాలకున్న సినిమాను ప్రస్తుతం క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నాడట చైతూ. ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేసి అదే బ్యానర్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంద్రగంటి, నాగచైతన్య సినిమా మీద ఆశలు వదులుకొని సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి ఈ సినిమాలపై అధికారిక ప్రకటన మాత్రం రాకపోయినా.. నాగచైతన్య, ఇంద్రగంటి మోహన కృష్ణల సినిమా క్యాన్సిల్ అయినట్టుగా ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. -
ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు'
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం నమోదు చేసిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాసర్క్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించటంతో ఇతర భాషల నుంచి భారీగా రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో పెళ్లి చూపులు రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. దక్షిణాదిలో ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. నివీన్ మలయాళ స్టార్ కావటంతో తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నివీన్, పెళ్లి చూపులు రీమేక్‌తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
ప్రేమ పూసెనోయ్...వాడి పోయెనోయ్!
పువ్వుచాటు ముల్లుంటే..అమ్మాయి నవ్వు చాటు మాయ ఉంటుంది. ‘‘నవ్వు చూసి ప్రేమ అనుకుని మోసపోయిన ఓ విఫల ప్రేమికుడి గీతమిది’’ అన్నారు పాటల రచయిత పూర్ణాచారి. ‘ప్రేమ పూసెనోయ్.. వాడి పోయెనోయ్..’ అంటూ ‘ప్రేమమ్’ సినిమాలో హీరో లవ్ ఫెయిల్యూర్ సాంగ్‌ను పూర్ణాచారి రాశారు. రాజేశ్ మురుగేశన్ స్వరకర్త. ఈ పాట తత్వం గురించి, ఆ పాట రచయిత పూర్ణాచారి మాటల్లోనే... ఓ టీనేజ్ కుర్రాడు (నాగచైతన్య) తన ప్రేమను వ్యక్తపరిచేలోపే... ఎవరినైతే ప్రేమిస్తున్నాడో? ఆ అమ్మాయి (అనుపమా పరమేశ్వరన్) మరొక అబ్బాయిని తీసుకొచ్చి ఇతగాడికి పరిచయం చేస్తుంది. అంతే కాకుండా.. అతణ్ణి ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాననీ చెబుతుంది. ఆశలన్నీ అడియాశలైన సందర్భం ఇది. పల్లవి: ప్రేమ పూసెనోయ్.. వాడి పోయెనోయ్.. / రెక్కలన్ని రాలిపోయెనోయ్..॥ అమ్మాయి నవ్వులే ఓ అందమైన పువ్వై అబ్బాయి మనసులో ప్రేమగా పూసింది. కానీ, ఆ ప్రేమ పువ్వు ఎంతోసేపు లేదు. వాడిపోయింది, రెక్కలన్నీ రాలిపోయాయని పల్లవిలోనే చెప్పేశాం. ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నానంటే.. ఇక అతని మనసులో ఆ అమ్మాయిపై ఆశలు ఎందుకుంటాయి? ఎప్పుడో చచ్చిపోయాయని చెప్పడం పల్లవి ఉద్దేశం. చరణం 1: పువ్వుచాటు ముల్లులా.. మెల్లంగ గుచ్చినాది/ నొప్పి కూడా చెప్పుకోని తీరు బాధపెట్టెనోయ్ / ఈ తేనె పరిమళం తీయంగ లేదురో / ఆ చేదు మాటవింటే ప్రాణమాగిపోయెరో ॥(2)॥ఎప్పుడూ పువ్వులే. అందమైన గులాబీకి ముళ్లున్నట్టు.. సుకుమారంగా కనిపించే కొందరమ్మాయిల్లో కర్కశత్వం కూడా ఉంటుంది. ‘ప్రేమమ్’లో ఈ పాట సందర్భం విషయానికి వస్తే.. హీరో మనసులో ఏముందో తెలుసుకోకుండానే తన స్వార్థం కోసం వాడుకుంటుంది. బయటకు చెప్పలేడు, లోపలే దాచుకోలేడు. పువ్వుల నుంచి తేనె వస్తుంది కనుక, అమ్మాయి మాటలను తేనెతో పోల్చానిక్కడ. మనం ప్రేమించిన అమ్మాయి మరొకర్ని ప్రేమిస్తున్నానని చెబితే.. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడా మాటలు.. అంటే తేనె చేదుగా ఉంటుంది. ఊపిరి ఆగినంత పనే. అబ్బాయిలు ప్రేమ విషయాన్ని ముందే అమ్మాయిలకు చెబితే మంచిది.చరణం2: రెక్కలెన్నొ తెచ్చి ఆకాశాన్ని ఊపినానే/ లెక్కలేని పూలచుక్కలెన్నొ తెంచినానె/ ముళ్ళు గుచ్చుతున్నా.. గుండె నొచ్చుతున్న / బాధింత అంత కాదే... / అద్దంలో నన్ను నేను చూసుకుంటే / నా గుండె బుజ్జగించినట్టు వుందె/ ఎంత చెప్పుకున్న ఓటమొప్పుకున్న / నా ఏడుపాగదాయె ఆకాశం ఓ చెట్టయితే.. ఆ చెట్టుకి పూసిన పూలు నక్షత్రాలు. ఆకాశాన్ని చెట్టుగా, పూలను చుక్కలుగా వర్ణించడమనేది ఇక్కడి ప్రయోగం. నాకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరనే ప్రతి ఒక్కరూ ఫీలవుతారు. ఇక్కడ ఈ కుర్రాడూ అంతే. ఆకాశమంత చెట్టుని ఊపి, పూలచుక్కలను తెంచాను. నేను నీ కోసం ఇంత చేస్తున్నప్పుడు.. నువ్వే ముల్లై గుచ్చుకుంటే ఆ గుండె బాధ వర్ణనాతీతమంటున్నాడు. బాధలో ఉన్నప్పుడు పక్కనున్న మనిషి ఎవరైనా ఓదార్చడం వేరు. కానీ, అద్దంలో చూసుకున్నప్పుడు అతడి గుండె అతణ్ణి ఓదారుస్తున్నట్టు ఉందంటున్నాడు. ఏకాంతంలో ఉన్నప్పుడు ఎవరికి వాళ్లు ఆలోచిస్తారు. అదే విధంగా ‘‘ప్రేమలో ఓడిపోయాను. అంతా అయిపోయింది’’ అని టీనేజ్ కుర్రాళ్లకు అర్థమవుతుంది. ఆ వయసులో పరిణతితో కూడిన ఆలోచనలు ఉండవు కదా! ఏ ఎమోషన్స్ అయినా డీప్‌గా ఉంటాయి. దాన్ని సరళమైన భాషలో, కవితాత్మకంగా చెప్పడం జరిగింది. చరణం3: చూసి చూసి నన్ను పావులా భలేగ/ వాడుతున్న తీరు చూడరా/ నా చుట్టు ఇందరున్నా.. నవ్వింది నన్ను చూసి / ఈ వింతగున్న ఆటలేంటి ఓరి దేవుడా ॥(2)॥ అమ్మాయి వెనుక చాలామంది అబ్బాయిలు ప్రేమిస్తున్నానంటూ తిరగడం సహజమే. అందులో ఎవరో ఒక్కర్ని చూసి అమ్మాయి నవ్వితే.. అతడు ఏమనుకుంటాడు? నేనంటే ఇష్టం అనే ఫీలవుతాడు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. కానీ, చివరికి ఇంకెవర్నో ప్రేమించి సహాయం చేయమంటే? మోసం చేయడమే. తానో పావుగా మారిన వైనాన్ని, మోసపోయిన తీరునీ.. ‘ఓరి దేవుడా.. ఈ వింత ఆటలేంటి?’ అని తలచుకుని ఏడుస్తున్నాడు. ఈ పాట రాసే అవకాశమే చాలా విచిత్రంగా వచ్చింది. మొదట మలయాళీ వెర్షన్‌కు నా చేత డమ్మీ లిరిక్స్ రాయించారు. ఈ కుర్రాడిలో విషయం ఉందని ‘అగరొత్తుల కురులే వలగా విసిరేశావే..’ సాంగ్ మొదట రాయించారు. దర్శక-నిర్మాతలకు నాపై నమ్మకం పెరగడంతో తర్వాత నేనే ఇంకో పాట ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. అప్పుడీ పాట ఇచ్చారు. సుమారు ముప్పై వెర్షన్లు రాశాను. సీనియర్ రచయితలు బ్రహ్మాండంగా రాస్తున్న టైమ్‌లో ఈ అవకాశం రావడం నా అదృష్టం. ఈ పాట విని రామజోగయ్య శాస్త్రిగారు ప్రత్యేకంగా ప్రశంసించారు. పాటల రచయితగా నా ప్రయాణం ‘ప్రేమమ్’ ముందు, ఆ తర్వాత అని చెప్పుకునే విధంగా సినిమాలో రెండు పాటలు నాకు పేరు తీసుకొచ్చాయి. ఇంటర్వ్యూ: సత్య పులగం -
పోలీస్ పాత్రలో కింగ్..?
ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ కింగ్ నాగార్జున. యంగ్ జనరేషన్ జోరు పెంచటంతో కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ప్రయోగాత్మక చిత్రాలతో అలరిస్తున్న నాగ్ త్వరలో ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడట. ఇటీవల ఊపిరి సినిమాతో అలరించిన మన్మథుడు, ప్రస్తుతం చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఓం నమోవేంకటేశాయ సినిమాలో పరమ భక్తుడు హాథీరాం బాబాగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కాస్త చేంజ్ కోసం ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాడు నాగ్. అందుకే చందూ మొండేటి దర్శకత్వంలో ఓ పోలీస్ కథతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కార్తీకేయ, ప్రేమమ్ సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న చందూ, తన నెక్ట్స్ సినిమాను నాగ్ లాంటి సీనియర్ హీరోతో చేస్తే తన రేంజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నాడట. మరి ప్రయోగాల మూడ్‌లో ఉన్న నాగ్, చందూ కథకు ఓకె చెప్తాడో లేదో చూడాలి. -
సైన్స్ ఫిక్షన్ మూవీలో వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాల్లో నటిస్తున్న వరుణ్, తరువాత చేయబోయే సినిమాకు కూడా కథ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం కాలు ఫ్యాక్చర్ కావటంతో రెస్ట్ తీసుకుంటున్న వరుణ్ ఈ గ్యాప్ తరువాత చేయబోయే సినిమాలకు కథలు వింటున్నాడు. తాజాగా ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటి చెప్పిన కథ వరుణ్‌కు బాగా నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చెప్పాడట. ఈ సినిమా చందూ మొండేటి తొలి సినిమా కార్తీకేయ తరహాలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కనుంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా వరుణ్ కెరీర్లో మరో డిఫరెంట్ మూవీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. -
నేను పెళ్లే చేసుకోను!
పెళ్లి చేసుకోను అనే తారల పట్టికలో మరో నటి చేరారు. ఒక పక్క పెళ్లి చేసుకున్న వారు విడిపోతూ కలకలం సృష్టిస్తుంటే మరో పక్క అసలు పెళ్లే వద్దు అని సంచలన కలిగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందనిపిస్తోంది. ఇంతకు ముందు నటి శ్రుతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ప్రకటించి పెను సంచలనానికి కేంద్రబిందువు అయ్యారన్నది గమనార్హం. తాజాగా వర్ధమాన నటి సాయిపల్లవి తాను పెళ్లే చేసుకోనంటూ వార్తల్లోకెక్కారు. మలయాళం చిత్రం ప్రేమమ్‌తో ఒక్కసారిగా భూమ్‌లోకి వచ్చిన ఈ కేరళా కుట్టి అంతకు ముందు కంగనారనౌత్ నటించిన హిందీ చిత్రం ధామ్ ధూమ్‌లో చిన్న పాత్రలో మెరిశారన్నది గమనార్హం. వైద్య విద్యనభ్యసించిన ఈ బ్యూటీలో మంచి డాన్సర్ ఉన్నారు. కొన్ని చానళ్లలో డాన్స పోటీల్లోనూ పాల్గొన్నారన్నది గమనార్హం. ప్రేమమ్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమంతటా ప్రాచుర్యం పొందిన సాయిపల్లవికి ఇంతకు ముందు కోలీవుడ్‌లో మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్‌స వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. అయితే త్వరలోనే కోలీవుడ్ ఆఫర్ ఆమె కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్య హీరోయిన్లు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి మాధ్యమాల ద్వారా ఇంట్రాక్ట్ అవడం అన్న ఒరవడి కొనసాగుతోంది. సమీపకాలంలో నటి సాయిపల్లవి తన అభిమానులతో అలాంటి చిట్‌చాట్ చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ అమ్మడు ఎలా బదులిచ్చారో చూద్దాం. ప్ర: తమిళంలో మీకు నచ్చిన చిత్రం? జ: సూర్య నటించిన కాక్క కాక్క ప్ర: నచ్చిన పాట? జ: రెమో నీ కాదలన్ పాట అంటే చాలా ఇష్టం ప్ర: మీకు చికెన్ బిరియానీ ఇష్టమా?మటన్ బిరియానీ ఇష్టమా? జ: నేను శాఖాహారిని. ప్ర: ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు నిశ్చియించిన పెళ్లి చేసుకుంటారా? జ: నేను అసలు పెళ్లే చేసుకోను. ప్ర: కారణం? జ: జీవితాంతం నా తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. -
'ప్రేమమ్' దర్శకుడితో రవితేజ..?
ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన మాస్ మహరాజ్ రవితేజ, గత ఏడాది కాలంగా ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. ఈ గ్యాప్‌లో ఒకటి రెండు సినిమాల ఎనౌన్స్మెంట్ వచ్చినా అవి సెట్స్ మీదకు రాలేదు. దీంతో మాస్ మహరాజ్ అభిమానులు కొద్ది రోజులు సినిమా ఎనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ యంగ్ డైరెక్టర్‌తో రవితేజ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల నాగచైతన్య హీరోగా ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చందూ మొండేటి దర్వకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడట. ఇప్పటికే కథ విన్న రవితేజ త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చందూ తొలి సినిమా కార్తీకేయ తరహాలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. -
ఒకే ఒక్క గెలుపుతో సరిపెట్టుకున్న దసరా
సినిమా వసూళ్లు రాబట్టుకోవడానికి దసరా మంచి సీజన్. స్కూల్ హాలిడేస్‌ని క్యాష్ చేసుకోవచ్చు. మొత్తం మీద అందరిలోనూ హాలిడే మూడ్ ఉంటుంది. ఎన్ని సినిమాలు రిలీజైనా చూసేంత టైమ్ ఉంటుంది. ఈ దసరాకి హైపర్, మన ఊరి రామాయణం, అభినేత్రి, జాగ్వర్, ప్రేమమ్, ఈడు గోల్డెహె వచ్చాయి. వీటిలో ‘హైపర్’ సేఫ్ అనిపించుకుంది. మిగతా ఐదు సినిమాల్లో ‘ప్రేమమ్’ ముందు వరుసలో నిలిచింది. పెట్టిన పెట్టుబడికి రెండింతలు ఆదాయాన్ని తెచ్చే సినిమా అనిపించుకుంది. కొనుక్కున్న బయ్యర్లకు దసరా ఆనందాన్ని చూపించింది. మిగతా చిత్రాల్లో ‘అభినేత్రి’, ‘జాగ్వర్’, ‘ఈడు గోల్డ్ ఎహె’, ‘మన ఊరి రామామయణం’ పెట్టిన పెట్టుబడిని కూడా దక్కించుకోలేకపోవడం నిర్మాతలకు బాధాకరం. హాలిడేస్ కావడం వల్లే నామమాత్రం వసూళ్లయినా రాబట్టుకోగలిగాయి. ఆరు సినిమాలూ ఒకేసారి విడుదల కావడం ఒక మైనస్ పాయింట్. -
కంట్లో నీళ్లొచ్చాయి : నాగార్జున
‘‘ ‘ప్రేమమ్’ విడుదలకు వారం ముందే చందూ నాకు సినిమా చూపించాడు. ఇప్పుడే ‘ప్రేమమ్’ చూశా బాగుంది, హ్యాపీగా ఇంటికెళుతున్నానని అదే రోజు ట్వీట్ చేశా. క్లయిమాక్స్‌లో శ్రుతీహాసన్ సన్నివేశానికి కంట్లో నీళ్లొచ్చాయి. సినిమాలో రెండు మూడు చోట్ల అదే ఫీల్ కలిగింది’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, శ్రుతీహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ సక్సెస్‌మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నాగార్జున మాట్లాడుతూ : ‘‘ప్రేమమ్’ వంటి చిత్రం చేయాలంటే గట్స్ ఉండాలి. ఈ చిత్రం డైలాగులు చూస్తుంటే చందూ నా ఫ్యాన్ అనిపించింది. తను నాతో ఒక సినిమా తీయాలి. చాలామంది నన్ను చైతన్యతో, అఖిల్‌తో ‘శివ’ సీక్వెల్ తీయొచ్చు కదా? అని అడుగుతుంటారు. అది ఇంపాజిబుల్ అంటుంటాను’’ అన్నారు. ‘ప్రేమమ్’లో చూపించినట్టు మీతో చెప్పుకోలేని సమస్యలేవైనా చైతూకి ఉంటే మేనమామ(వెంకటేష్) పరిష్కరిస్తారా? అని విలేకరులు అడగ్గా, ‘‘అది సినిమా మాత్రమే. మా ఇంట్లో అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం’’ అని నాగార్జున నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘ఓ క్లాసిక్ మూవీని రీమేక్ చేయాలంటే ధైర్యం కావాలి. మేం చేసి సక్సెస్ అయ్యాం. జనరల్‌గా దర్శకులు ఈ చిత్రం మీ కెరీర్లో బిగ్ హిట్ అవుతుందని చెబుతారు. చందూ మాత్రం చెప్పకుండా హిట్ ఇచ్చారు’’ అని నాగచైతన్య అన్నారు. చందూ మొండేటి, సమర్పకుడు పీడీవీ ప్రసాద్, నటుడు ప్రవీణ్ పాల్గొన్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ప్రేమమ్
-
హిట్ హీరోతో శ్రీనువైట్ల
ఆగడు, బ్రూస్ లీ సినిమాల రిజల్ట్ తో కష్టాల్లో పడ్డ శ్రీనువైట్ల, తిరిగి ఫాంలోకి రావడానికి అన్నిరకాలుగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు బిజీగా ఉండటంతో యంగ్ హీరోతో వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మిస్టర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీను. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. ఓ సూపర్ హిట్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు శ్రీనువైట్ల. ఇప్పటికే నాగచైతన్య, నాగార్జునలకు కథ వినిపించి ఓకె కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న చైతూ త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నాడు. -
ఆయనతో సినిమా చేయడం నాకో గొప్ప పాఠం!
‘‘మలయాళ మూవీ ‘ప్రేమమ్’ రీమేక్ కోసం దర్శకుడు చందూ మొండేటి నన్ను కలిసినప్పుడు ఆలోచించా. ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నా. అందుకని మళ్లీ రీమేక్ మూవీనా? అనిపించింది. వరుసగా రీమేక్ చిత్రాల్లో నటిస్తుండటంతో ‘రీమేక్ రాణి’ అయిపోయా (నవ్వుతూ)’’ అని కథానాయిక శ్రుతీహాసన్ అన్నారు. నాగచైతన్య, శ్రుతీహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ చెప్పిన విశేషాలు. ► మలయాళ ‘ప్రేమమ్’ మూవీ చూశా. బాగా నచ్చింది. రీమేక్ అయినా చందూ తన శైలిలో తెలుగుకి అనుగుణంగా కథ తయారు చేశారు. కథ, నా పాత్ర నచ్చడంతో ఒప్పుకున్నా. ఈ చిత్రంలో నేను సాఫ్ట్, డిగ్నిఫైడ్ టీచర్ సితార పాత్రలో కనిపిస్తా. ► రియల్ లైఫ్‌లో మాత్రం సితార పాత్రకు విరుద్ధంగా ఉంటా. అందుకే ఈ పాత్రను ఓ ఛాలెంజ్‌గా భావించి చేశా. ప్రేక్షకులకు బాగా నచ్చింది. కొందరైతే సౌందర్యలా ఉన్నావని ప్రశంసించడం మరచిపోలేని అనుభూతి. టీచర్ పాత్ర కాబట్టి మేకప్‌కి పెద్దగా చాన్స్ లేదు. వాస్తవానికి నాకు మేకప్ లేకుండా నటించడమంటేనే ఇష్టం. ► ‘ప్రేమమ్’లో నటించక ముందే నాగచైతన్య, నేను ఫ్రెండ్స్. దాంతో మేం షూటింగ్లో చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ మొత్తం ఓ పిక్నిక్లా జరిగింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని ఉంది. బలమైన కథ ఉంటే చేస్తా. ► నా వరకు నేను వంద శాతం హార్డ్‌వర్క్ చేస్తా. కష్టపడని వాళ్లంటే నాకు నచ్చదు. నా పాత్ర బాగా వచ్చేందుకు రిహార్సల్స్ చేస్తా. చెల్లి అక్షరాహాసన్‌కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ, సినిమాల ఎంపికలో సలహాలివ్వను. రచన, సింగింగ్ అంటే నాకు ఇష్టం. ప్రస్తుతానికి బిజీ కాబట్టి, వాటిపై పెద్దగా దృష్టి సారించడంలేదు. భవిష్యత్‌లో నిర్మాతగా చేయాలనుంది. ► నాన్నతో (కమల్‌హాసన్) ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటించడం నాకొక గొప్ప పాఠం. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. పవన్‌కల్యాణ్‌గారితో ‘గబ్బర్‌సింగ్’ తర్వాత ‘కాటమరాయుడు’లో నటిస్తుండడం హ్యాపీ. ‘సెవన్త్ సెన్స్’ తర్వాత సూర్యగారితో ‘సింగం 3’ లో నటించడం మంచి అనుభవం. -
పబ్‌లో చైతూ, సమంత హల్చల్
త్వరలో పెళ్లిచేసుకుంటామని ప్రకటించి.. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న సినీ జంట నాగ చైతన్య, సమంతలు ఓ పబ్ లో నృత్యాలు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రచారంలో ఉన్న సమాచారం మేరకు.. (‘ప్రేమమ్’కు రికార్డు కలెక్షన్లు!) ప్రేమమ్ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఆ సంతోషాన్ని సమంత, ఇంతర స్నేహితులతో కలిసి పంచుకున్నారు. వీరంతా ఓ పబ్‌లో చేరి ఆనందంగా చిందులేశారు. చైతూ ఆనందమే తన జీవితమని ఎప్పుడూ చెప్పే సమంత.. అందరికంటే ఎక్కువ.. అలిసిపోయేంతగా డాన్స్ చేసింది. ('ప్రేమమ్' మూవీ రివ్యూ) ఈ పార్టీలో చైతూ సోదరుడు అఖిల్, అల్లు శిరీశ్ లు కూడా హాజరయ్యారు.ఆ వైరల్ వీడియో మీకోసం.. -
‘ప్రేమమ్’కు రికార్డు కలెక్షన్లు!
-
నాగార్జునగారూ... రెండు కథలున్నాయి
‘‘మలయాళ ‘ప్రేమమ్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఫస్ట్ షో చూశా. బాగా నచ్చింది. అప్పుడీ చిత్రాన్ని నాగచైతన్యతో రీమేక్ చేసే ఆలోచన లేదు. మేమిద్దరం వేరే సినిమా చర్చల్లో ఉన్నాం. చైతూ ఓకే అంటే ‘ప్రేమమ్’ను రీమేక్ చేస్తామని వచ్చిన పదిమంది నిర్మాతల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంది. దాంతో రీమేక్ ఓకే చేశాం అని దర్శకుడు చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా స్టెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ గత శుక్రవారం విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఫస్ట్ కాపీ కంటే ముందు వచ్చే ఫస్ట్ కట్‌ను నాగార్జునగారు, త్రివిక్రమ్‌గారు చూశారు. నాగ్ సార్‌కు బాగా నచ్చడంతో కంగ్రాట్స్ చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్ మాలో నమ్మకం పెంచింది. మడోన్నా పాత్రకు సమంతను తీసుకోవాలనుకున్నాం. కానీ, శ్రుతీహాసన్ వంటి హీరోయిన్ ఉండగా మరో స్టార్ వద్దనుకున్నాం. నాగార్జునగారికి రెండు కథలు రెడీ చేశా. ఐ డ్రీమ్ ప్రొడక్షన్లో, ‘దిల్’ రాజుగారి బ్యానర్లో, సితార ఎంటర్టైన్మెంట్స్లో చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
‘ప్రేమమ్’కు రికార్డు కలెక్షన్లు!
అక్కినేని నాగాచైతన్య తాజా సినిమా ‘ప్రేమమ్’ మంచి కలెక్షన్లు రాబడుతోంది. మలయాళం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్‌టాక్ రావడం కలిసి వచ్చింది. దీంతో చైతూ సినిమాల పరంగా కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదుచేస్తున్నది. అమెరికాలో ఈ సినిమా రెండురోజుల్లోనే అర మిలియన్ డాలర్ మార్క్ (రూ. 3.32 కోట్ల) కు చేరువగా వచ్చింది. నాగార్జున, వెంకటేశ్ అతిథి పాత్రల్లో మెరిసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ స్థిరంగా వసూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక, బ్లూస్కై సినిమాస్ సంస్థ ‘ప్రేమమ్’ విదేశీ హక్కులను సొంతం చేసుకొని.. ఉత్తర అమెరికా అంతటా 120 తెరల్లో విడుదల చేసింది. ఈ సినిమా అమెరికాలో తొలిరోజు 1,34,819 డాలర్ల వసూళ్లను రాబట్టింది. నాగాచైతన్య సినిమాల్లో అమెరికాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే. గతంలో ‘దోచేయ్’ సినిమా పేరిట ఈ రికార్డు ఉండేది. మూడురోజుల్లో ‘దోచెయ్’ 1.30 లక్షల డాలర్ల కలెక్షన్లు రాబట్టగా.. తొలిరోజే ‘ప్రేమమ్’ అంతకుమించి రాబట్టింది. ఇక గురువారం ప్రీమియర్ షోల ద్వారా 74,219 డాలర్లు వసూలయ్యాయి. ప్రీమియర్ షోలు, తొలిరోజు వసూళ్ల ద్వారా ‘ప్రేమమ్’ సినిమా 2.09 లక్షల డాలర్లు (రూ. 1.39 కోట్లు) రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక రెండోరోజు శనివారం 1.57 లక్షల డాలర్లు రాబట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా 3.66 లక్షల డాలర్ల (రూ. 2.4 కోట్ల) వసూలు చేసిందని, మున్ముందు ‘ప్రేమమ్’ వసూళ్లు మరింతగా పెరగొచ్చునని అంటున్నారు. -
'ప్రేమమ్' మూవీ రివ్యూ
టైటిల్ : ప్రేమమ్ జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ సంగీతం : గోపిసుందర్ దర్శకత్వం : చందూ మొండేటి నిర్మాత : ఎస్ రాధాకృష్ణ, పిడివి ప్రసాద్, ఎస్ నాగవంశీ రొమాంటిక్ సినిమాల కేరాఫ్ అడ్రస్‌గా మారిన అక్కినేని ఫ్యామిలీ యువ కథానాయకుడు.., నాగచైతన్య హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు దర్శకుడు చందూ మొండేటి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది..? మలయాళీ ప్రేమకథలను టాలీవుడ్ జనాలకు నచ్చేలా చూపించటంలో చిత్రయూనిట్ సక్సెస్ సాధించారా? కథ : ప్రతీ వ్యక్తి జీవితంలోని మూడు దశల్లో కలిగే ప్రేమ కథలనే ప్రేమమ్‌లో సినిమాటిక్‌గా చూపించారు. 15 ఏళ్ల వయసులో పదోతరగతి చదువుతున్న విక్రమ్(నాగచైతన్య), ఆ ఊళ్లో కుర్రాళ్లంతా వెంటపడే అందమైన అమ్మాయి సుమ(అనుపమా పరమేశ్వరన్)ను ఇష్టపడతాడు. ఆ వయసులోనే కవితలతో ప్రేమలేఖలు రాస్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అన్నిరకాల కష్టాలు పడతాడు. అంతా ఓకె అయ్యిందనుకున్న సమయంలో విక్రమ్, సుమల ప్రేమకథ అర్థాంతరంగా ముగిసిపోతుంది. అలా ఆ బాధను మర్చి పోయే ప్రయత్నంలోనే ఐదేళ్లు గడిచిపోతాయి. విక్రమ్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. ఆ వయసుల్లో ఉండే దూకుడుతో కాలేజీలో గ్యాంగ్ మెయిన్టైన్ చేస్తూ గొడవలు, సస్పెన్ష్లతో హీరోయిజం చూపిస్తుంటాడు. అదే సమయంలో కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అయిన సితార వెంకటేషన్(శృతిహాసన్)తో మరోసారి ప్రేమలో పడతాడు. కానీ విధి మరోసారి విక్రమ్ జీవితంతో ఆడుకుంటుంది. విక్రమ్, సితారల ప్రేమ కథ కూడా మధ్యలోనే ముగిసిపోతుంది. అలా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. విక్రమ్ ఎస్ రెస్టో పేరుతో రెస్టారెంట్ స్టార్ చేసి లైఫ్‌లో సెటిల్ అవుతాడు. కానీ సితార జ్ఞాపకాలు మాత్రం విక్రమ్‌ను వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో మరోసారి విక్రమ్ మనుసును ప్రేమ పలకరిస్తుంది. సింధు(మడోనా సెబాస్టియన్), విక్రమ్ జీవితంలోకి వచ్చిన మరో(మూడో) ప్రియురాలు. అసలు విక్రమ్ జీవితంలోకి వచ్చిన సింధు ఎవరు..? ఈ మూడో ప్రేమకథ అయినా సుఖాంతం అయ్యిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నటన పరంగా ప్రేమమ్ సినిమాతో వంద మార్కులు సాధించాడు నాగచైతన్య. తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. స్కూల్ ఏజ్‌లో కనిపించే అమాయకత్వం, కాలేజ్ కుర్రాడిగా హీరోయిజం, లైఫ్ సెటిల్ అయిన తరువాత వచ్చే మెచ్యూరిటీ లాంటి వేరియేషన్స్‌ను చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా మూడు దశల్లోనూ లుక్, ఫిజిక్ విషయంలో నాగచైతన్య తీసుకున్న కేర్ సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోయిన్లుగా అనుపమా పరమేశ్వరన్, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అనుపమా ఓన్ డబ్బింగ్ కాస్త ఇబ్బంది పెట్టిన నటన పరంగా మాత్రం ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో ప్రవీణ్, కృష్ణచైతన్య, శ్రీనివాస్ రెడ్డి, నోయల్, 30 ఇయర్స్ పృథ్వి తమ పరిథి మేరకు మెప్పించారు. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల అతిథి పాత్రలకు థియేటర్స్‌లో విజిల్స్ పడుతున్నాయి. సాంకేతిక నిపుణులు : ఇప్పటికే సక్సెస్ ఫుల్ సినిమాగా ప్రూవ్ చేసుకున్న సినిమాను రీమేక్ చేసి, ఒరిజినల్ స్థాయిని అందుకోవటం చాలా కష్టం. కానీ ఆ రిస్క్ చేయడానికి ముందుకు వచ్చిన చందూ మొండేటి మంచి విజయం సాధించాడు. కథా కథనాలలో ఎక్కడ మలయాళ సినిమా అన్న భావన కలుగకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్రేమమ్‌కు మరో ఎసెట్ గోపిసుందర్ సంగీతం, సినిమా రిలీజ్‌కు ముందే ఆడియోతో ఆకట్టుకున్న గోపిసుందర్ నేపథ్య సంగీతంతోనూ అలరించాడు. ముఖ్యంగా ఎవరే పాట ఆడియోతో పాటు విజువల్‌గా కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య నటన కథ సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ లెంగ్త్ ఓవరాల్‌గా ప్రేమమ్.. నాగచైతన్య కెరీర్లో బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న 'అందమైన ప్రేమకథల రొమాంటిక్ జర్నీ' - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
విజయం ఎవరిని వరిస్తుందో?
విజయదశమికి నాలుగు రోజుల ముందుగానే కోలీవుడ్‌కు పండగ వచ్చేసింది. సాధారణంగా దసరా, దీపావళి, క్రిస్మ్స్, సంక్రాంతి పర్వదినాల్లో ప్రజల్లో ఎంత పండగ వాతావరణం నిండుకుంటుందో, అంతే సందడి చిత్ర పరిశ్రమలోనూ ఏర్పడుతుంది. ఆయా రోజులు సెలవు దినాలు కావడంతో జనం ముఖ్యంగా యువత సినిమాలు చూడడానికి అధిక ఆసక్తి చూపుతుంటారు. అందుకు తగ్గట్టుగానే సినీ దర్శక నిర్మాతలు తమ చిత్రాలు ఆ సమయాల్లో విడుదల చేయాలని కోరుకుంటారు.ప్రత్యేకించి దసరాకు పాఠశాలలు అధిక సెలవులు రావడంతో చదువుకునే పిల్లలు కూడా సినిమాలపై దృష్టి పెడతారు. ఇక సినిమా ప్రియులు ఉండనే ఉంటారు. దీంతో థియేటర్లు పిన్నపెద్దలతో కళకళలాడుతుంటాయి. నిర్మాతలు, బయ్యర్ల గల్లాపెట్టెలు గలగలలాడుతుండడానికి ఇన్ని కారణాలున్నాయి. అలా కలెక్షన్లను దోచుకోవడానికి ఈ దసరా పండగను పురస్కరించుకుని రెమో, రెక్క, దేవి మూడు తమిళ చిత్రాలతో పాటు ప్రేమమ్ అనే తెలుగు చిత్రం కూడా సిద్ధం అయ్యింది. ఇక వీటి వివరాలు చూస్తే.. రెమో... నటుడు శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ఇది.పలు ప్రత్యేకతలతో శుక్రవారం తెరపైకి రానుంది. శివకార్తికేయన్ అందమైన నర్సుగా కనిపించడం రెమోలోని ప్రధాన ప్రత్యేకత. ఇక రజనీమురుగన్ చిత్రం తరువాత మరో సారి చిరునవ్వుల చిన్నది కీర్తీసురేశ్ శివకార్తికేయన్‌తో జత కట్టిన చిత్రం ఇది. ఈ చిత్రానికి నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.అనిరుద్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ వంటి ప్రముఖ చాయాగ్రహకుడు ఈ చిత్రానికి పని చేయడం మరో విశేషం. రెమో చిత్రంపై ఇటు పరిశ్రమలోనూ,అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో చిత్రం రెక్క. నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించిన చిత్రం రెక్క. ఇందులో ఆయనకు జంటగా నటి లక్ష్మీమీనన్ తొలి సారిగా జత కట్టారు. రతన్‌శివ దర్శకుడు.డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. విజయ్‌సేతుపతి నటించిన పక్కా మాస్ కథా చిత్రం కనుక సహజంగానే రెక్కపై అంశనాలు భారీగానే ఉంటాయి. ఇక మూడో చిత్రం దేవి. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా సుధీర్ఘ విరామం తరువాత కథానాయకుడిగా నటించి, ఐ.గణేశ్‌తో కలిసి సొంతంగా నిర్మించిన చిత్రం దేవి. ఇందులో మిల్కీబ్యూటీ నాయకిగా నటించారు. విజయ్ దర్శకత్వం వహించిన తొలి హారర్‌తో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రం దేవి. దీంతో దేవి చిత్రం కూడా రెమో, రెక్క చిత్రాలతో పోటీ పడుతోంది. ఈ ముక్కోణపు పోటీలో ఏ చిత్రానికి ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పడతారో అన్నది మరి కొద్ది గంటల్లోనే తెలిపోనుందన్నమాట. ఇక నాలుగో చిత్రంగా తెలుగు చిత్రం ప్రేమమ్ తమిళనాట ఇదే రోజు విడుదల కానున్నదన్నది గమనార్హం. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్,అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నాయికలుగా నటించారు. ఈ చిత్రం ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. ఇది మలయాళంలో ఇదే పేరుతో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది చెన్నైలోనూ అధిక థియేటర్లలో విడుదల కానండడం విశేషం. -
'థ్రిల్లర్ సినిమా చేద్దామనుకున్నాం'
కార్తీకేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు చందూ మొండేటి తన రెండో సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో నాగచైతన్య హీరోగా రీమేక్ చేసిన చందూ మొండేటి, ఆడియోతో పాటు ట్రైలర్లతోనూ ఆకట్టుకుంటున్నాడు. అయితే కార్తికేయ సినిమా తరువాత నాగచైతన్యను కలిసిన చందూ, థ్రిల్లర్ సినిమాను చేయాలని భావించాడు. కానీ అదే సమయంలో ప్రేమమ్ సినిమా చూడటంతో ఆ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 7న రిలీజ్ అవుతున్న ప్రేమమ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం ఇచ్చిన హీరో నాగచైతన్య, నిర్మాత నాగవంశీలకు కృతజ్ఞతలు తెలిపిన చందూ మొండేటి, ప్రేమమ్ సినిమా దర్శకుడిగా తన బాధ్యతను పెంచిందన్నాడు. -
అక్కడ క్రిస్టియన్... ఇక్కడ హిందూ!
‘‘తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలయాళ ‘ప్రేమమ్’లో చిన్నపాటి మార్పులు చేశారు. భాష మాత్రమే మారింది. ప్రేమలోని భావం మారలేదు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా ‘ప్రేమమ్’. పీడీవీ ప్రసాద్ సమర్పకులు. ఈ నెల 7న విడుదల. అనుపమ మాట్లాడుతూ - ‘‘మలయాళంలో క్రిస్టియన్‌గా, తెలుగు రీమేక్‌లో హిందూ అమ్మాయిగా చేశా. చైతూ చాలా ఫ్రెండ్లీ, చందు కూల్. షూటింగ్ పిక్నిక్లా జరిగింది. నాకు మనీ ముఖ్యం కాదు. సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యం ఉండాలి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టం. త్రివిక్రమ్‌గారి గురించి వినగానే ‘అఆ’కు సంతకం చేశా. ఆయన గురువులాంటి వ్యక్తి. నటన, సినిమాల ఎంపిక పరంగా సలహాలిస్తారు. ప్రస్తుతం శర్వానంద్ ‘శతమానం భవతి’లో నటిస్తున్నా’’ అన్నారు. -
‘ప్రేమమ్’ వర్కింగ్ స్టిల్స్
-
' ప్రేమమ్' చిత్రం అడియో ఫంక్షన్
-
ఆ నవ్వుతోనే చైతూ ఓ హీరోయిన్ని పడేశాడు!
- దాసరి ‘‘చైతూ (నాగచైతన్య) ని చూస్తుంటే మనింట్లో, పక్కింట్లో ఉండే బ్రదర్‌లా తమాషాగా ఉంటాడు. మాటలతో, నవ్వుతో పడేస్తాడు. చైతూ నవ్వులో చాలా మాయ ఉంది. ఆ నవ్వుతోనే ఓ హీరోయిన్ని పడేశాడు. ‘ఏ మాయ చేసావె’తో ఆ హీరోయిన్ ఏ మాయ చేసిందో!’’ అని చమత్కారంగా అన్నారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. నాగచైతన్య హీరోగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఎస్.నాగవంశీ నిర్మించిన చిత్రం ‘ప్రేమమ్’. చందు మొండేటి దర్శకుడు. గోపీ సుందర్, రాజేశ్ మురుగేశన్ సంగీతమందించిన ఈ చిత్రం పాటలను ఏయన్నార్ జయంతి సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. దాసరి పాటల సీడీలను ఆవిష్కరించారు. హీరో అఖిల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ : ‘‘ప్రేమకథా చిత్రాలను మీరెప్పుడూ (ప్రేక్షకులు) ఆదరించారు. నాన్నగారి ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’, నా ‘గీతాంజలి’ చిత్రాలకు సరిపోయే ప్రేమకథ ఈ ‘ప్రేమమ్’. ఈ చిత్రం కోసం చైతూ గడ్డం పెంచిన ప్పుడు.. బాగుంది. నేను ‘ఓం నమో వెంకటేశాయ’కి పెంచితే బాగుంటుందని ఆలోచించా. పెంచిన తర్వాత చైతూ నా గడ్డమే బాగుందన్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రం తెలుగు లోనూ అంతే హిట్టవుతుందని నా నమ్మకం. అక్టోబర్ 7న ఈ చిత్రం రిలీజ్ చేయాలనుకుంటున్నారు’’ అన్నారు. దాసరి మాట్లాడుతూ : ‘‘ఏయన్నార్గారిది, నాది యాభై ఏళ్ల అనుబంధం. ఆయన కెరీర్లో 27 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుణ్ణి నేనే. అందులో 22 ప్రేమకథలే. ప్రేమకు, ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ అక్కినేని. ప్రేమకు అర్థం అక్కినేని కుటుంబం. అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయ్యింది. ఈ రోజున చైతూతో రిపీట్ కాబోతోంది. అఖిల్‌తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరు కుంటున్నా. ‘ఏ మాయ చేశావే’, ‘100 పర్సంట్ లవ్’లో చైతూ అక్కినేని వారసుడు అనిపించాడు. మధ్యలో యాక్షన్ సినిమాలు చేసినప్పుడు నాగార్జునతో వద్దని చెప్పా. ప్రేమకు మరణం లేదు. వందమందిని కొట్టేసే హీరోగా కాకుండా, వందమంది అమ్మాయిల హార్ట్ దోచుకునే హీరోగా చైతూ పేరు తెచ్చుకోవాలి. ఏయన్నార్‌గారి అశీస్సులతో నా ఆప్తుడు చినబాబు (ఎస్.రాధాకృష్ణ) కుమారుడు నాగవంశీ నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, తర్వాత అఖిల్ ప్రేమకథే చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సినిమాలు హిట్టైనా.. ఫ్లాపైనా.. కొన్నేళ్లుగా నన్ను సపోర్ట్ చేసింది మా అభిమానులే. బాగా ప్రేమించి చేసిన చిత్రమిది’’ అన్నారు నాగచైతన్య. ‘‘ట్రైలర్ చూస్తుంటే మా అన్నయ్య ఈ ప్రపంచంలో ప్యూరెస్ట్ లవర్ అనిపిస్తోంది. ప్రేమకథల్లో తనతో నేను పోటీపడలేను.. ఫాలో అయిపోతా’’ అన్నారు అఖిల్. చిత్ర నిర్మాతలు నాగవంశీ, ఎస్.రాధాకృష్ణ, దర్శకుడు చందు మొండేటి, సంగీత దర్శకులు రాజేశ్ మురు గేశన్, గోపీసుందర్, హీరోయిన్లు శ్రుతీ హాసన్, మడోన్నా, నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకులు మారుతి, కల్యాణ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చెర్రీ రేసు నుంచి తప్పుకున్నాడా..?
ధృవ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే దసరాకు రిలీజ్ అంటూ ప్రకటించేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట తప్పబోతున్నాడా..? ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో దసరాకు సినిమా రిలీజ్ అంటూ ప్రకటించినా.. ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ధృవ షూటింగ్‌తో పాటు చిరంజీవి 150 సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్న చెర్రీ తన సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నాడట. దసరా వరకు షూటింగ్ అయిపోయినా నిర్మాణాంతర కార్యక్రమాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. హడావిడిగా రిలీజ్ చేస్తే సినిమా రిజల్ట్ పై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే వాయిదా వేయటమే కరెక్ట్ అని భావిస్తున్నారట. అంతేకాదు ఇప్పటికే దసరా బరిలో నాలుగు సినిమాలు ప్రకటించటంతో సినిమా వాయిదా వేయటమే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నారు మెగా టీం. అయితే ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. ప్రేమమ్, వీడు గోల్డె హే, మన ఊరి రామాయణం, అభినేత్రి లాంటి సినిమాలు దసరాకే రిలీజ్ ఫిక్స్ చేసుకోవటంతో ధృవను డిసెంబర్‌కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. -
'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారు
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' విడుదల తేదీ ఖరారయ్యింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'ప్రేమమ్' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర టీం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చైతన్య సరసన శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబరు 20వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'ఎవరే' పాట యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. -
నాగ్ ఎవరు? వెంకీ ఎవరు?
మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ప్రేమమ్’ తెలుగులో నాగచైతన్య హీరోగా అదే పేరుతో రీమేక్ అయి, విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున, వెంకటేశ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ఈ ఇద్దరూ చేసిన పాత్రలు ఎలా ఉంటాయి? అనే చర్చ జరుగుతోంది. మలయాళ ‘ప్రేమమ్’ చూసినవాళ్లైతే రెంజీ పానికర్, మణియన్ పిళ్ల రాజు చేసిన పాత్రలను వెంకీ, నాగ్ చేసి ఉంటారని ఓ నిర్ణయానికి వచ్చారు. మలయాళ మాతృకలో హీరో నివిన్ పౌలి తండ్రి పాత్రను రెంజీ పానికర్, కాలేజ్ ప్రిన్సిపాల్ పాత్రను మణియన్ చేశారు. ఈ రెండు పాత్రలూ కనిపించేది కాసేపే అయినా సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ రెండు పాత్రలనే నాగ్, వెంకీ చేసి ఉంటారు. మరి.. రెంజీ పానికర్ చేసిన పాత్రను ఎవరు చేసి ఉంటారు? మణియన్ పాత్రను ఎవరు చేసి ఉంటారు? అనేది తెలియాల్సి ఉంది. నాగచైతన్య రియల్ డాడ్ నాగ్ కాబట్టి, రీల్‌పై డాడ్ పాత్రను చేసి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. అప్పుడు వెంకీ కాలేజీ ప్రిన్సిపాల్ పాత్ర చేసి ఉంటారేమో. ఎవరు ఏ పాత్రలో కనిపించినా సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ మాత్రం ఖాయం. -
చైతూ మనసుకి దగ్గరైంది!
నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమమ్’. శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సెప్టెంబర్ 20న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రం పాటలను విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు విజయదశమి కానుకగా అక్టోబర్‌లో విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. నాగచైతన్య మాట్లాడుతూ - ‘‘నా మనసుకు బాగా దగ్గరైన ప్రేమకథా చిత్రమిది. లవ్ అండ్ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. మలయాళ సినిమా రీమేక్ అయినా దర్శకుడు చందు మొండేటి తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొద్దిగా మార్పులు చేసి, తెరకెక్కించారు’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇటీవల విడుదలైన ‘ఎవరే..’ పాటకు మంచి స్పందన లభించింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆ పాట వీడియోను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ఈశ్వరీరావు, బ్రహ్మాజీ, జీవా, చైతన్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగేశన్. -
ప్రేమకథల మధ్య పోటి
సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ స్క్రీన్ మీద ఆసక్తికరమైన పోటి జరగనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కతున్న రెండు అందమైన ప్రేమకథలు వెండితెర మీద పోటి పడేందుకు రెడీ అవుతున్నాయి. ముఖాముఖి తలపడకపోయినా.. ఒక సినిమా ప్రభావం మరో సినిమా మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరి, సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ఘనవిజయం సాధించటంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక నాని హీరోగా తెరకెక్కుతున్న మజ్ను కూడా వారం గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఉయ్యాల జంపాల సినిమా తరువాత విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కటం, ప్రస్తుతం నాని వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉండటంతో ఈ సినిమా పై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల మధ్య కేవలం వారం గ్యాప్ ఉండటం, రెండు సినిమాలు దాదాపు ఒకే జానర్వి కావటంతో కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆసక్తికరంగా మారిన ఈ పోటిలో ఎవరు గెలుస్తారో చూడాలి. -
దసరా బరిలో ప్రేమమ్
రెండు సినిమాలను రిలీజ్‌కు రెడీ చేసిన యంగ్ హీరో నాగచైతన్య.. ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఏటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాను ముందు రిలీజ్ చేయాలా..? లేక గ్యారెంటీ హిట్ అన్న నమ్మకం ఉన్న ప్రేమమ్ సినిమాను ముందు రిలీజ్ చేయాలా అన్న విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఫైనల్‌గా ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో చైతూకు ఓ క్లారిటీ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడటంతో ముందుగా సాహసం శ్వాసగా సాగిపో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక అదే రోజు రిలీజ్ అవుతుందనుకున్న ప్రేమమ్‌ను ఒక నెల ఆలస్యంగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రేమమ్ సినిమాకు సంబందించిన ఓ సాంగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా మరో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు పుట్టిన రోజున ప్రేమమ్ ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. చైతన్య సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. -
క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య
ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలు విడుదల కావడం సర్వ సాధారణమే. కానీ, ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అఫ్కోర్స్ ఒకప్పుడు జరిగాయనుకోండి. ఇప్పుడు మాత్రం చాన్సే లేదు. ఈ నేపథ్యంలో పాత ఫీట్ రిపీట్ కాబోతోందా? అనే చర్చ మొదలైంది. ఈ సెప్టెంబర్ 9న అక్కినేని నాగచైతన్య కెరీర్లో అటువంటి అరుదైన సంఘటన జరగబోతుందా? అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. చందు మొండేటి దర్శకత్వంలో చైతూ హీరోగా నటించిన ‘ప్రేమమ్’ను సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటిం చారు. ఈ ప్రకటన వచ్చిన కాసేపటికి సెప్టెంబర్ 9వ తేదీనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ను విడుదల చేస్తున్నట్టు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ట్వీట్ చేశారు. దాంతో చైతూ రెండు సినిమాలు ఒకే రోజున రావడం ఖాయం అని చాలామంది అనుకున్నారు. కానీ, ఈ విషయం గురించి చైతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సెప్టెంబర్ 9న ‘ప్రేమమ్’ను విడుదల చేసి, కొన్ని వారాల తర్వాత ‘సాహసం శ్వాసగా సాగిపో’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు చైతూ చెప్పారు. ‘ప్రేమమ్’ కంటే ముందే ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రీకరణ పూర్తిచేసినా, పలు కారణాల వల్ల విడుదల ఆలస్యమైందన్నారు. సినిమా నిర్మాణంలో ఏం జరుగుతుందో? ఊహించడం కష్టమన్నారు. మేకింగ్ ఎలా జరిగినా.. ఒక హీరో రెండు సినిమాల విడుదల మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని చైతూ పేర్కొన్నారు. -
ఎవరే.. ఎవరే..!
నాలుగు కోట్లతో తీసిన సినిమా 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అది సూపర్ డూపర్ హిట్ కింద లెక్క. మలయాళ ‘ప్రేమమ్’ ఈ కోవకే వస్తుంది. తమిళనాడులో రెండొందల రోజులకు పైగా ఆడిన మొదటి మలయాళ చిత్రంగా రికార్డ్ సాధించింది. ఇక, మలయాళంలో అయితే ఇప్పటివరకూ ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండోస్థానం సంపాదించింది. ఈ చిత్రం నాగచైతన్య, శ్రుతీహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా ‘ప్రేమమ్’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది. చందూ మొండేటి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలోని తొలి పాట ‘ఎవరే..’ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ- ‘‘ఇందులో నా పాత్ర మూడు దశలుగా సాగుతుంది. నా మనసుకు బాగా దగ్గరైన పాత్ర ఇది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘ఈ నెల 24న పాటలను విడుదల చేయబోతున్నాం. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, రాజేష్ మురుగేషన్, కెమేరా: కార్తీక్ ఘట్టమనేని -
చైతూ... ఆ అమ్మాయి ఎవరు?
అక్కినేని యువ మన్మథుడు నాగచైతన్య ‘ఎవరే... ఎవరే..’ అంటూ పాట పాడుతున్నాడు. ‘చైతూ.. ఆ అమ్మాయి ఎవరు?’ అనడిగితే.. సమాధానం మాత్రం చెప్పడం లేదు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. చైతు ఎవర్ని ఊహించుకుని పాట పాడాడో? తెలియాలంటే మరి కొన్ని రోజుల వరకూ ఎదురు చూడక తప్పదు. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రేమమ్’. శ్రుతీహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 24న పాటల్ని, సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. విజయ్ ఏసుదాస్ పాడిన ‘ఎవరే ఎవరే...’ పాటను ఈ నెల 18న రేడియోలలో విడుదల చేస్తున్నారు. శ్రీమణి ఈ పాట రాశారు. మలయాళంలో మంచి హిట్టయిన ‘ప్రేమమ్’కు ఈ సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: ఆల్ఫోన్సె పుధరిన్, కళ: సాహి సురేశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగన్. -
'నేను చెప్తేనే నమ్మండి'
యువ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్థంగా ఉన్నాయి. అయితే రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం రోజుకొక కథనం వినిపిస్తోంది. దాంతో చైతూ ఓ క్లారిటీ ఇచ్చాడు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమమ్' సెప్టెంబరులో విడుదల అవుతుందని, ఆడియో ఆగస్టులోనే రిలీజ్ అవుతుందని స్ఫష్టం చేస్తూ ట్వీట్ చేశాడు. కచ్చితమైన తేదీలు ఇంకా ఖరారు కాలేదని, త్వరలో నిర్ణయిస్తారని తెలిపాడు. అలాగే తను చెప్పేవరకు రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి వార్తలు నమ్మొద్దని చెప్పాడు. ప్రేమమ్‌లో శృతిహాసన్‌తోపాటు, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం విడుదల కూడా ఈ నెలలోనే ఉండొచ్చని టాక్. ఇక ఈ విషయంపై కూడా చైతూనే క్లారిటీ ఇవ్వాలి. #Premam coming this September and audio later this month . Hope you like this one pic.twitter.com/P3RZ7mkqYe — chaitanya akkineni (@chay_akkineni) 9 August 2016 Will post the exact dates as soon as we decide .. Watch this space ! If it's not here .. It's not true :-) — chaitanya akkineni (@chay_akkineni) 9 August 2016 -
నాగచైతన్యకు డేట్ దొరకటం లేదా..?
ఇటీవల పెళ్లి వార్తలతో సందడి చేస్తున్న నాగచైతన్య తన చేస్తున్న సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం నోరుమెదపటం లేదు. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ పూర్తి కాగా.., మరో సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. అయినా ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ లేదు. ఏం మాయ చేసావే లాంటి సూపర్ హిట్ అందించిన గౌతమ్ మీనన్ కాంబినేషన్లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సినిమా సాహసం స్వాసగా సాగిపో. ఆడియో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వటం లేదు. ముందుగా జూలైలోనే రిలీజ్ చేయాలని భావించినా కబాలి ఎఫెక్ట్‌తో వాయిదా వేసుకున్నారు. తరువాత ఆగస్టు 12 రిలీజ్ అంటూ ప్రచారం జరిగినా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ సినిమా రిలీజ్ కాకముందే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మళయాల సూపర్ హిట్ రీమేక్ ప్రేమమ్ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం నార్వేలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. మరి రెండు సినిమాలను రెడీగా పెట్టిన చైతూ వాటిని ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి. -
పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో చైతూ
యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మళయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. చైతూ హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఈ నెలాఖరున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక కబాలి సినిమా రిలీజ్‌పై క్లారిటీ రాలేదు. బాబు బంగారం, జనతా గ్యారేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అందుకే ఇంత భారీ పోటీ మధ్య రిలీజ్ చేసే కన్నా కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని భావిస్తున్నారట. దీంతో ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
సెప్టెంబర్‌లో ప్రేమమ్
యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేమమ్. మళయాలంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. చైతూ హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక కబాలి సినిమా రిలీజ్ పై క్లారిటీ రాలేదు. బాబు బంగారం, జనతా గ్యారేజ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందుకే ఇంత భారీ పోటి మధ్య రిలీజ్ చేసే కన్నా కాస్త టైం తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని భావిస్తున్నారట. అందుకే ప్రేమమ్ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
'బుడ్డోడి'కి ఇంటా బయట పోటినే
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా జనతా గ్యారేజ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు మళయాల సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తుండటం, సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఆగస్టు 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా పోటి తప్పేలా లేదు. జనతా గ్యారేజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న రోజే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మళయాల సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ కలెక్షన్లపై ప్రేమమ్ ఎఫెక్ట్ కనిపిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజొదారో కూడా ఆగస్టు 12నే రిలీజ్ అవుతోంది. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటిస్తుండటంతో పాటు పీరియాడిక్ జానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. దీంతో జనతా గ్యారేజ్‌కు ఓవర్సీస్లో థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి ఎన్టీఆర్ అదే రోజు థియేటర్లలోకి వస్తాడా..? లేక సేఫ్ టైంకి సినిమాను పోస్ట్ పోన్ చేస్తాడా..? చూడాలి. -
బుడ్డోడికి ఇంటా బయట పోటినే
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా జనతా గ్యారేజ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు మళయాల సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తుండటం, సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఆగస్టు 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా పోటి తప్పేలా లేదు. జనతా గ్యారేజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న రోజే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మళయాల సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ కలెక్షన్లపై ప్రేమమ్ ఎఫెక్ట్ కనిపిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజొదారో కూడా ఆగస్టు 12నే రిలీజ్ అవుతోంది. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటిస్తుండటంతో పాటు పీరియాడిక్ జానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. దీంతో జనతా గ్యారేజ్‌కు ఓవర్సీస్లో థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి ఎన్టీఆర్ అదే రోజు థియేటర్లలోకి వస్తాడా..? లేక సేఫ్ టైంకి సినిమాను పోస్ట్ పోన్ చేస్తాడా..? చూడాలి. -
యంగ్ హీరో తండ్రిగా వెంకీ..?
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించాడన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా తన అల్లుడు నాగచైతన్య సినిమాలో కావటం మరో విశేషం. టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చేసే మల్టీ స్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో నాగ చైతన్య, వెంకటేష్‌ల కాంబినేషన్.., సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. నాగ్ చైతన్య, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూమీ ప్రేమమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. కొన్ని కీలక సన్నివేశాల్లో చైతూ తండ్రిగా వెంకీ నటించాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చే సీన్స్, షూట్ కూడా జరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. నిజ జీవితంలో మామ అల్లుళ్లు వెండితెర మీద తండ్రీ కొడుకులుగా ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి. -
తారక్ vs చైతూ
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పోటి లేకుండా సినిమా రిలీజ్ చేయటం కష్టంగా మారుతోంది. స్టార్ వారసుల తాకిడి పెరిగిపోవటంతో పాటు భారీ సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతుండటంతో ఎలాంటి పోటి లేకుండా సోలోగా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. స్టార్ హీరోలు బరిలో ఉన్న సమయంలో చిన్న హీరోలు కాస్త సైడ్ ఇచ్చినా అప్పుడప్పుడు తలపడక తప్పటం లేదు. అదే బాటలో యంగ్ హీరోస్ ఎన్టీఆర్, నాగచైతన్యలు ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. పెద్దగా సినిమా సందడి కనిపించని ఆగస్టు నెలలో ఈ ఇద్దరి సినిమాలు బరిలో దిగుతున్నాయి. జనతా గ్యారేజ్ సినిమా మొదలు పెట్టినప్పుడే ఆగస్టు 12న రిలీజ్ అంటూ ప్రకటించేశాడు తారక్. అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో నాగచైతన్య. మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చైతూ సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ రెండూ వేరు వేరు జానర్ల సినిమాలు కావటంతో ఒకేసారి రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇతర హీరోల సినిమాలేవి లేకపోవటంతో థియేటర్ల సమస్య కూడా ఉండదన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్ సభ్యులు. -
కోలీవుడ్ ను భయపెడుతున్న ప్రేమమ్
ప్రేమమ్ చిత్రం కోలీవుడ్‌ను భయపెడుతోంది. మలయాళంలో ఘనవిజయాన్ని సాధించిన చిత్రం ప్రేమమ్. ఆ చిత్ర కథానాయికలకిప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్నాయి.ఆ చిత్ర రీమేక్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ప్రేమమ్ చిత్రం తెలుగులో నాగ చైతన్య,శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా రీమేక్ అవుతోంది.అదే విధంగా తమిళంలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడినట్లు తెలిసింది. ప్రేమమ్ చిత్ర రీమేక్ హక్కులను నటుడు ధనుష్ సొంతం చేసుకున్నట్లు విజయ్‌సేతుపతి హీరోగా తమిళంలో నిర్మించడానికి ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఇక శింబు హీరోగా నటించనున్నారనే మరో వెర్షన్ కూడా కోలీవుడ్‌లో ప్రచారం హల్చల్ చేసింది.అయితే ఇప్పటి వరకూ ఆ ప్రచారంలో ఏది నిజం కాలేదు. తాజా సమాచారం ఏమిటంటే ప్రేమమ్ రీమేక్‌లో నటించడానికి కోలీవుడ్ హీరోలు భయపడుతున్నారట. ఈ చిత్రం తమిళనాట ముఖ్యంగా చెన్నైలో పిచ్చపిచ్చగా ఆడేసింది. ఒక్క ఈగ థియేటర్లోనే వంద రోజులకు పైగా ప్రదర్శింపబడింది. దీంతో ఆ చిత్రాన్ని తమిళప్రేక్షకులు చాలా వరకూ చూసేవారు. మళ్లీ రీమేక్ చేస్తే చూస్తారో లేదో నన్న భయమే ఆ చిత్రం రీమేక్‌లో నటించడానికి ఇక్కడి హీరోలు సంకోచిస్తున్నట్లు తెలిసింది. ఒక పెద్ద హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి, అందులో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ బదులిస్తూ ప్రేమమ్ చిత్రం కేరళ రాష్ట్రంలో ఎంత విజయం సాధించిందో అంతగా తమిళనాడులోనూ విశేష ప్రేక్షకాదరణను చూరగొందన్నారు. దాన్ని తమిళంలో రీమేక్ చేయాలంటే ఒక్కరి వల్లే సాధ్యం అవుతుందన్నారు. ఒరిజినల్ చిత్ర దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంతోనే దానికి న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.అంతే కానీ ఇతరులెవరూ అలాంటి ప్రయత్నం చేయకూడాదని కూడా సెల్వరాఘవన్ అంటున్నారు.ఆ విధంగా ప్రేమమ్ చిత్రం కోలీవుడ్‌ను భయపెడుతతోందన్న మాట. -
టాలీవుడ్లో రొమాంటిక్ సీజన్
సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలు వరుసగా రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎక్కువగా యాక్షన్, ప్రయోగాత్మక సినిమాలు రిలీజ్ కాగా.. ఇకపై అన్నీ రొమాంటిక్ లవ్ స్టోరీలే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. సూపర్ స్టార్ల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఈ తరహా సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మే, జూన్ నెలలో టాలీవుడ్ స్క్రీన్ మీద రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు సందడి చేయనున్నాయి. మే చివర్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. కుంటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు రాజకుమారుడు. ఇదే తరహా కథాంశంతో తెరకెక్కిన త్రివిక్రమ్, నితిన్‌ల 'అ.. ఆ..' కూడా మరో రెండు వారాల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మళయాల సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్ కూడా మరో నెలరోజుల్లో రిలీజ్‌కు రెడీ కానుంది. ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తొలిసారి మెగాఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నీహారిక తొలి సినిమా ఒక్క మనసు కూడా భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కూడా క్యూట్ లవ్ స్టోరీ అన్న టాక్ వినిపిస్తోంది. -
చైతూ సినిమాలో నాగ్?
మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ప్రేమమ్’ తెలుగులో అదే పేరుతో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎస్.రాధాకృష్ణ, ఎస్. నాగవంశి, పీడీవీ ప్రసాద్ సమష్టిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో పాత్ర మూడు దశలుగా సాగుతుంది. ఆ మూడు దశల్ని తెర వెనుక నుంచి వ్యాఖ్యాతగా చెప్పడంతో పాటు సినిమాలో అతిథి పాత్రలో నటించమని నాగార్జునను చిత్రదర్శకుడు చందు మొండేటి కోరారట. నాగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. అదే నిజమైతే ‘మనం’ తరువాత మళ్ళీ తన తండ్రితో కలసి నటించినందుకు నాగచైతన్య ఆనందపడతారని ఊహించవచ్చు. -
హిట్ కొట్టినా చాన్స్ ఇవ్వడం లేదా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ముందుగా వినిపించే పేరు శృతిహాసన్. ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి వరుస బ్లాక్ బస్టర్స్‌లో నటించిన ఈ బ్యూటి, ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుంది. సాదారణంగా టాలీవుడ్లో ఒక్క హిట్ ఇచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పరిగెడుతుంటారు. అలాంటిది శృతిని మాత్రం పట్టించుకోవట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందన్న టాక్ ఉన్నా, శృతికి మాత్రం అవకాశాలు రావటం లేదు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది శృతి. స్టార్ హీరోల సరసన భారీ బడ్జెట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటి, ప్రేమమ్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాను అంగీకరించడం కూడా విశేషమే. ప్రేమమ్‌తో పాటు హిందీలో, తమిళ్లో ఒక్కో సినిమా చేస్తున్న శృతి, కావాలనే సినిమాలను తగ్గించుకుంటుందా..? లేక ఆఫర్లే రావటం లేదా..? అన్న విషయం తెలియలేదు. -
అల్లుడి సినిమాలో అతిథిగా..!
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా తన అల్లుడు నాగచైతన్య సినిమాలో కావటం మరో విశేషం. టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చేసే మల్టీ స్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో నాగచైతన్య, వెంకటేష్‌ల కాంబినేషన్.., సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. నాగ్ చైతన్య, ప్రస్తుతం మళయాల సూపర్ హిట్ మూమీ ప్రేమమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలకమైన కాలేజ్ ప్రిన్సిపాల్ పాత్రలో నటించడానికి వెంకటేష్ ఒకే చెప్పాడు. త్వరలోనే వెంకీ , చైతూల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
వెంకీ మామ, చైతూ బాబు.. ఒకే సినిమాలో
మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. సినిమాలో కూడా చైతూకి అంకుల్గానే కనిపిస్తారట. నాగ చైతన్య తదుపరి చిత్రం 'ప్రేమమ్' లో అతిధి పాత్రలో నటించడానికి వెంకీ ఓకే అన్నారని టాక్. రానా, వెంకీలతో కలిసి నటించాలని ఉందని ఇంతకుముందే చైతూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మనువళ్లతో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కించాలనేది స్వర్గీయ డా.డి.రామానాయుడి కోరిక కూడా. అయితే సరైన స్క్రిప్ట్ కుదరక అది జరగలేదు. అనుకోకుండా ఇలా వెంకీ, చైతూలు ఒకే సినిమాలో కనిపించడం అభిమానులకు పండగే. ప్రేమమ్ తమిళ మాతృకలో ఆ పాత్రను మళయాళ ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత అయిన రెంజీ పణికర్ పోషించారు. త్వరలో వెంకీ, చైతూల మధ్య జరిగే ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ వేసవికి సినిమాను ప్రేక్షకులు ముందుకు తెచ్చే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. చైతన్య సరసన శృతి హాసన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. -
మరో తమిళ దర్శకుడితో చైతూ
అక్కినేని నట వారసుడు నాగచైతన్య ఇప్పుడు యమా స్పీడు మీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచిన చైతూ, మరో రెండు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమాతో పాటు మళయాల సూపర్ హిట్ ప్రేమమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను ఫైనల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు 7జి బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలతో టాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. -
ప్రేమమ్.... ఓ మధుర సంతకం
ప్రేమకథలకు ముగింపు ఉంటుంది గానీ, అనుభూతులకు కాదు. అందుకే ప్రేమకథల్లోని అనుభూతులు ప్రేక్షకుల మనోఫలకాలపై చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి ప్రేమకథా చిత్రమే - ‘ప్రేమమ్’. రెండు అక్షరాల ప్రేమ ఓ యువకుని హృదయంలో రేపిన అందమైన అలజడే కథాంశంగా తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో కూడా చివరకు ‘ప్రేమమ్’ అనే టైటిల్‌నే ఖరారు చేశారు. సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందూ మొండేటి మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రానికి ‘లవ్‌స్టోరీస్ ఎండ్... ఫీలింగ్స్ డోన్ట్...’ అనేది ఉపశీర్షిక. నాగచైతన్య పాత్ర ఇందులో మూడు వైవిధ్యమైన పార్శ్వాలతో సాగుతూ ఆసక్తి కలిగిస్తుంది. శ్రుతీహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా బాగా సూట్ అయ్యారు. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గోపీసుందర్, రాజేశ్ మురుగేశన్, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
చైతన్య 'ప్రేమమ్' ఫస్ట్ లుక్..
మళయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' సినిమాను నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ముందు ఈ సినిమాకు 'మజ్ను' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు కానీ.. చివరకు 'ప్రేమమ్'నే ఫైనల్ చేశారు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చైతన్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. 'ప్రేమకథలకు ముగింపు ఉంటుంది.. కానీ అనుభూతులకు ఉండదు' అనే క్యాప్షన్‌తో వస్తున్నఈ సరికొత్త ప్రేమకథా చిత్రం వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. చైతన్య సరసన శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. Premam it is for #NC12.. Love stories end but feelings dont..Here's the first look to set mood, hope u guys like it! pic.twitter.com/PfD7OT5wiu — chaitanya akkineni (@chay_akkineni) February 19, 2016 -
వరుసగా లైన్లో పెడుతున్నాడు
యంగ్ హీరో నాగచైతన్య ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే గౌతం మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. ఇలా మూడు సినిమాలతో బిజీగా ఉన్న చైతూ, ఇప్పుడు నాలుగో సినిమాను కూడా లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. గబ్బర్‌సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన హరీష్ శంకర్, ఇటీవల సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మరోసారి కమర్షియల్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో హరీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చైతు ప్లాన్ చేసుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుబ్రమణ్యం ఫర్ సేల్ తరువాత ఇంత వరకు సినిమా ఎనౌన్స్ చేయని హరీష్ శంకర్, నాగచైతన్య ఇమేజ్ తగ్గ కథ కోసం ట్రై చేస్తున్నాడు. కరెక్ట్ లైన్ దొరికితే త్వరలోనే ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేసి లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు చైతు. -
అది అఫీషియల్ టైటిల్ కాదట..!
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్‌ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ టైటిల్‌పై చిత్ర యూనిట్ పునరాలోచనలో పడ్డారు. దీంతో ఫిబ్రవరి 19న అఫీషియల్‌గా టైటిల్ ఎనౌన్స్ చేస్తామని తెలిపాడు నాగచైతన్య. నాగార్జున కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా టైటిల్‌ను తన సినిమాకు పెడితే అంచనాలు పెరిగిపోతాయని చైతన్య భయపడుతున్నాడట. దీంతో పాటు మలయాళ ఒరిజినల్ టైటిల్ ప్రేమమ్ తెలుగు కూడా పాపులర్ కావటంతో అదే టైటిల్‌ను తెలుగులో కూడా ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఫస్ట్ లుక్‌లో చైతూ ఏ టైటిల్‌ను రివీల్ చేస్తాడో చూడాలి. నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయలని భావిస్తున్నారు. -
డిక్టేటర్ డైరెక్టర్‌తో నాగచైతన్య
యంగ్ హీరో నాగచైతన్య యమ స్పీడు మీద ఉన్నాడు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి చిత్రాలను కూడా ఫైనల్ చేస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఇటీవల డిక్టేటర్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరున్న శ్రీవాస్, నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చైతన్యకు కథ వినిపించిన శ్రీవాస్, అతని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు చైతు. -
ప్రేమమ్ హీరోయిన్లు ఎవరు?
ప్రేమమ్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు ఇది. ఈ పేరుతో మలయాళంలో రూపొందించిన చిత్రం అనూహ్య విజయం సాధించింది. దీనికి సృష్టికర్త పుత్రన్. నవీన్ కథానాయకుడు. మడోనా సెబాస్టియన్, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వర్ ముగ్గురు నాయికలు. ఈ ముగ్గురే ప్రేమమ్ చిత్ర కథకు మూలం, ప్రాణం. దీన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి గట్టి పోటీనే నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్లో పునర్ నిర్మాణానికి ప్రేమమ్ చిత్రం సిద్ధమైంది. నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ఇక ఒక హీరోయిన్గా క్రేజీ నటి శ్రుతిహాసన్ ఎంపికయ్యారు. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ప్రేమమ్ చిత్రం రీమేక్ కానుందన్నది తాజా సమాచారం. దీన్ని తమిళంలో చిత్రంగా మలిచే బాధ్యతల్ని ఐశ్వర్య ధనుష్ చేపట్టనున్నారు. ఈమె ఇంతకు ముందు 3, వై రాజా వై చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. మూడవ చిత్రంగా ప్రేమమ్ రీమేక్‌కు సిద్ధమవుతున్నారు. ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటించే అవకాశం రాగా హీరోయిున్ల అన్వేషణలో చిత్ర యూనిట్ నిమగ్నమైంది. మలయాళంలో నటి సాయి పల్లవి చేసిన పాత్రను తమిళంలో నటి హన్సిక గాని, శ్రుతిహాసన్ గాని పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక జరగాల్సింది. అదే విధంగా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, బాల సుబ్రమణ్యం చాయాగ్రహణం అందించనున్నారు. -
'కార్తికేయ' సీక్వెల్ చేస్తున్నారు
గత ఏడాది నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ. సుబ్రమణ్యం స్వామి గుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. స్వామిరారా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న నిఖిల్‌కు 'కార్తికేయ' సక్సెస్ స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. అందుకే కార్తికేయ రిలీజ్ తరువాత ఆ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ప్రస్తుతం శంకరాభరణం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నిఖిల్ త్వరలోనే కార్తికేయ సీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. దర్శకుడు చందూ మొండేటి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. అయితే ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ప్రేమమ్ సినిమాను మజ్ను పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న చందూ, ఆ సినిమా పూర్తయిన తరువాత నిఖిల్ హీరోగా కార్తికేయ సీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. తొలి భాగాన్ని ఒక గుడి నేపథ్యంలోనే తెరకెక్కించిన చందూ రెండో భాగాన్ని అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే భారీ నిర్మాతలు ఈ కాంబినేషన్ లో సినిమాను నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. -
మేకప్ లేకుండా నటిస్తోందట..!
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ శృతిహాసన్. గ్లామర్ రోల్స్‌తో పాటు ప్రయోగాత్మక పాత్రలకు కూడా సై అంటున్న ఈ బ్యూటీ, త్వరలో మరో రిస్క్ చేయనుందట. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న ఈ భామ నెక్ట్స్ సినిమాలో మేకప్ లేకుండా నటించడానికి రెడీ అవుతోంది. నాగ చైతన్య హీరోగా మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది శృతి. ఒకసారి ప్రేమలో విఫలమైన ఓ కుర్రాడు తన లెక్చరర్‌ను ప్రేమించే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు లెక్చరర్‌గా నటిస్తుంది శృతిహాసన్. అందుకు తగ్గట్టుగా వయసు ఎక్కువగా కనిపించేందుకు మేకప్ లేకుండా నటించడానికి ప్లాన్ చేసుకుంటోంది. శృతిహాసన్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. -
ప్రేమేసర్వం
నాగచైతన్య ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ మాగ్జిమమ్ ప్రేమకథా చిత్రాలే. మరోసారి ప్రేమే సర్వస్వంగా భావించే ప్రేమికునిగా ఒదిగిపోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అందరితో ప్రేమ మంత్రం జపించేలా చేసి సంచలన విజయం సాధించిన మలయాళ హిట్ ‘ప్రేమమ్’. ఇప్పుడా చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య హీరోగా ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి తెరకెక్కించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రుతీ హాసన్, అనుపమా పరమేశ్వరన్ నాయికలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో అఖిల్ క్లాప్ ఇచ్చారు. ఈ లవ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 3 నుంచి వైజాగ్‌లో జరగనుంది. సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
హీరోగా.. నిర్మాతగా... అదే నా లక్ష్యం!
‘‘నా మొదటి సినిమా ‘ఏ మాయ చేశావె’ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కనబరుస్తున్న ఆదరాభిమా నాలకు ఆనందంగా ఉంది. ఓ హీరోగా వారిని మెప్పించేలా వైవిధ్యమైన చిత్రాలు చేయాలన్నది నా లక్ష్యం. ఇప్పటివరకూ చేసినవాటిలో ‘మనం’ నాకు ప్రత్యేకం. తాతగారు, నాన్నతో కలిసి నటించిన ఆ చిత్రం తీపి గుర్తుగా నిలిచిపోతుంది’’ అని నాగచైతన్య అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. భవిష్యత్ ప్రణాళికల గురించి నాగచైతన్య చెబుతూ- ‘‘నాకు మొదట్నుంచీ నిర్మాణ రంగంపై ఆసక్తి ఉంది. మా అన్నపూర్ణ స్టూడియో బేనర్లో రూపొందిన ‘ఒక లైలా కోసం’ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాను. ఓ నిర్మాతగా అందరికీ నచ్చే సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం’’ అన్నారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ పూర్తయ్యిందనీ, రోడ్ ట్రిప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇదని చెప్పారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ’ నచ్చడంతో తనతో ఓ సినిమా చేయాల నుకున్నాననీ, కథ కూడా అనుకున్న నేపథ్యంలో మలయాళ ‘ప్రేమమ్’ నచ్చడంతో ఆ సినిమా రీమేక్ చేద్దామని చందూతో చెప్పానని నాగచైతన్య తెలిపారు. -
మూడో లైలా కోసం మజ్నూ వేట
-
ప్రేమ చేసే మాయలో..!
‘ఏ మాయ చేసావె’ సినిమాతో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకున్న నాగచైతన్య మళ్లీ ఓ ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’. ఓ యువకుని జీవితంలో జరిగే అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ఇప్పుడు నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ కానుంది. ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చైతూ సరసన శ్రుతీహాసన్, అనుపమ కథానాయికలుగా నటించనున్నారు. ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ ‘ప్రేమమ్’ ఓ స్వచ్ఛమైన ప్రేమకథ. అందరి హృదయాలను హత్తుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మాతృకను మించి హిట్ అయ్యేలా చందూ మొండేటి స్క్రిప్ట్‌ను బాగా తయారు చేశాడు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేశ్ మురుగేశన్, గోపీ సుందర్, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
సాయి ధరమ్ తో శృతిహాసన్ రొమాన్స్
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోల సరసన భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన శృతిహాసన్ త్వరలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ కు రెడీ అవుతోంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. వీరి జోడి పూర్తి సినిమాలో కనపించడం లేదట. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ రీమేక్ లో ఈ జోడి కనిపించనుంది. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటిస్తున్న నాగచైతన్య ఆ సినిమా తరువాత కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో మళయాల సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. తెలుగులో మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా శృతిహాసన్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన ఈ మెగా హీరో మజ్ను సినిమాలో అతిధి పాత్రలో అలరించనున్నాడు. -
చైతూ సినిమాలో నాగ్, వెంకీ
టాలీవుడ్ స్క్రీన్ మీద మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. కథాపరంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే స్థాయి కథలు రాకపోయినా గెస్ట్ అపియరెన్స్లతో అదరగొడుతున్నారు స్టార్స్. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోలతో కలిసి నటించడానికి సీనియర్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే బ్రూస్ లీ సినిమాతో మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చేయటంతో మరో ఫ్యామిలీ నుంచి కూడా ఇలాంటి కాంబినేషన్ తెర మీద సందడి చేయనుంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమా పూర్తవ్వగానే మళయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ రీమేక్‌లో నటించనున్నాడు. తెలుగులో మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. ఇటీవల ఈ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్న చిత్రయూనిట్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తుంది. చైతూ సరసన మళయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఓ ఇంపార్టెంట్ రోల్‌ను సీనియర్ హీరో వెంకటేష్‌తో చేయించాలని భావిస్తున్నారు. వెంకీతో పాటు మరో అతిథి పాత్రలో నాగ్ కూడా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. నాగచైతన్యకు ఈ రెండు కుటుంబాల నేపథ్యం ఉండటంతో మజ్ను సినిమాలో నాగ్, వెంకీలు నటించటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి గాసిప్‌గా ఉన్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
అల్లుడి కోసం ఒప్పుకున్న వెంకీ
'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.. త్వరలోనే ఓ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకుల చెప్పిన కథలకు ఓకె చెప్పిన వెంకీ, ఎవరు ముందుగా కథ రెడీ చేస్తే వారితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ గ్యాప్‌లో నాగచైతన్య చేస్తున్న సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు వెంకీ. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న చైతూ ఆ సినిమా పూర్తవ్వగానే మళయాల సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' రీమేక్ లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి సీనియర్ స్టార్ వెంకటేష్ అంగీకరించాడు. తన మేనల్లుడు నాగచైతన్య స్వయంగా అడగటంతో ఈ క్యారెక్టర్ చేయడానికి వెంకీ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఒరిజినల్ వర్షన్లో అనంత్ నాగ్ నటించిన పాత్రలో తెలుగులో వెంకీ దర్శనమివ్వనున్నాడు. 'కార్తీకేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, దిశాపటానీ, అనుపమా పరమేశ్వరన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ తెలుగు రీమేక్‌కు మజ్ను అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
మజ్నుగా నాగచైతన్య
ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు తమ సీనియర్లు చేసిన పాటలను, సినిమాలను రీమిక్స్ చేయటం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య. ఇప్పటికే ఏఎన్నార్ నటించిన పాటల రీమిక్స్లతో ఆకట్టుకున్న చైతూ ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో కూడా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగ చైతన్య.. ఆ సినిమా తరువాత మళయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు టైటిల్‌గా నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'మజ్ను'ను ఫైనల్ చేశారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో హీరోయిన్గా నటించిన అనుపమా పరమేశ్వరన్ నాగచైతన్యతో జోడీ కడుతుంది. -
ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆడిపాడబోతున్న చైతూ
-
లవ్లీ చిక్కుముడి
మలయాళీ అమ్మాయిల జుట్టు చూస్తే ఓ చిక్కుముడుల ప్రేమకథలా అనిపిస్తుంది. అమ్మాయి జుట్టులోనే ఇన్ని చిక్కులుంటే ఆమెతో ప్రేమలో ఎన్ని ముడులుంటాయో! జుట్టుకైతే దువ్వెనకున్న పళ్లు బలి అవుతాయి. మరి ఆమె ప్రేమకు? పళ్లు ఊడేకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా అన్నది డౌటే! ‘ప్రేమమ్’ సినిమా కేరళను మాన్సూన్లా తాకింది. ఆకాశం నుంచి కాసులు ఊడిపడుతున్నాయి. రికార్డుల ఉరుములు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పట్లో ఆగే వర్షంలా లేదు. త్వరలోనే రీమేక్‌గా మనల్నీ తాకవచ్చు. రామ్ ఎడిటర్, ఫీచర్స్ జూన్ మూడోవారం... తిరువనంతపురంలోని హాలు. బుకింగ్ ఇంకా తెరవలేదు... క్రిక్కిరిసిన జనం... ఎక్కువభాగం యూత్... కాలేజీ కుర్రకారు. పదిహేను రోజుల పైగా మలయాళ సీమను ఉర్రూతలూపేస్తున్న ఆ సినిమాను ఎలాగైనా చూడాలని వాళ్ళలో ఉత్సాహం... రోజుకు అయిదాటలు వేస్తున్నా, క్రేజ్ తగ్గని ఆ సినిమాకు టికెట్లు దొరుకుతాయో లేదో అని చిన్న ఉత్కంఠ... ఇంతలో ఉన్నట్టుండి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. కారణం - ఊళ్లోని కాలేజీ స్టూడెంట్లు మూకుమ్మడిగా క్లాసులకు ఎగనామం పెట్టి, సదరు సినిమాకు వస్తున్నారని కంప్లయింట్స్! అరవైమందికి పైగా స్టూడెంట్స్‌ను పోలీసులు బలవంతాన వెనక్కి పంపాల్సి వచ్చింది. కనివినీ ఎరుగని ఈ సంఘటనకు కారణమైన ఆ మలయాళ సినిమా విడుదలై ఇవాళ్టికి నెల దాటింది. ఈ అయిదోవారంలోనూ జనం వేలంవెర్రిగా వస్తూనే ఉన్నారు. టికెట్ల కోసం పై స్థాయి నుంచి ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఒక్క కేరళలోనే కాదు... రిలీజైన ప్రతిచోటా ఇదే పరిస్థితి. ఆ లేటెస్ట్ హిట్.. ‘ప్రేమమ్’ (లవ్ అని అర్థం). బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్! రిలీజైన రెండు వారాల్లో... ఒక్క కేరళలోనే రూ. 20 కోట్లు వసూలు చేసిన ‘ప్రేమమ్’ ఇవాళ టాక్ ఆఫ్ ది సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మొదటివారంలో మలయాళ బిగ్గెస్ట్ హిట్స్ ‘దృశ్యం’, ‘బెంగుళూర్ డేస్’లను మించి, వసూలు చేసిందీ సినిమా. ఇప్పుడు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్... అన్నిచోట్లా హౌస్‌ఫుల్‌గా ఆడుతోంది. ఈ వరుస చూస్తుంటే, రాగల రోజుల్లో ‘ప్రేమమ్’ రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించి, ‘మల్లు’ ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిల్చినా ఆశ్చర్యం లేదు. మమ్మూటి, మోహన్‌లాల్ లాంటి టాప్స్టార్సెవరూ లేని ‘ప్రేమమ్’కు ఇంత క్రేజేంటి? మలయాళ సీమలో వాళ్ళే ఇప్పటికీ టాప్ స్టార్స్. కానీ, వాళ్ళ అభిమానులు పెద్దవాళ్ళయిపోతుంటే, సినిమాలకు మహారాజ పోషకులైన యూత్‌లో కొత్తతరం నటులకు క్రేజ్ పెరుగుతోంది. సమకాలీన కథలనే ఎక్కువగా కోరుకుంటున్నారు. తమ అనుభవాలనూ, తమలో ఒకడిగా అనిపించే హీరోనూ తెరపై చూడడానికి ఇష్టపడుతున్నారు. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘బెంగుళూర్ డేస్’ లాంటివి బాగా ఆడడానికీ, ఆ చిత్రాల ఫేమ్ 30 ఏళ్ల నివిన్ పౌలీ (‘ప్రేమమ్’లో హీరో కూడా ఇతనే) హాట్‌స్టార్‌గా మారడానికీ అదే కారణం. గుర్తుకొస్తున్నాయీ... గుర్తుకొస్తున్నాయీ! రోజూ సినిమాలను కళ్ళతో చూస్తాం. చెవులతో వింటాం. కానీ, ‘ప్రేమమ్’ లాంటి కొన్ని మాత్రం కళ్ళకు కాదు, మనసుకు పని చెబుతాయి. తెర మీది విజువల్సే స్టెతస్కోపై మర్చిపోయిన మన గుండె చప్పుడును మనకే వినిపిస్తాయి. నోస్టాల్జియా ఎప్పుడైనా, ఎవరికైనా మధుర జ్ఞాపకమే. చిన్నప్పటి అదుపు లేని అల్లరి... బాధ్యతలు తెలియని రోజుల్లో చేసిన చేష్టలు... టీనేజీ కాలేజీ వయసులో తిరిగిన రోడ్లు... కలిసిన స్నేహాలు... ప్రేమ కోసం పడినపాట్లు... కళ్ళ ముందే కరిగిన కలలు... అన్నీ ఎవరికి వారికే యునీక్ ఎక్స్పీరియన్స్. అదే సమయంలో ఆ దృశ్యాలన్నీ అందరిలో ఒకే తీగను సమశ్రుతిలో కదిలించే మ్యూజికల్ సింఫనీలు. ‘ప్రేమమ్’ చేసిన పని అదే. ముప్ఫై ఒక్క ఏళ్ళ క్రితం పుట్టిన ఒక కుర్రాడి జీవితం ఇది. కథలోని హీరోలానే 1984లోనే పుట్టిన 31 ఏళ్ళ డెరైక్టర్ అల్ఫోన్స్ పుతరెన్ తన అనుభవాలను ఈ సినిమాగా అందించారా అనిపిస్తుంది. మొదట టీనేజ్‌లో, తరువాత కాలేజ్‌లో, చివరకు కెరీర్లో సెటిలైన స్టేజ్‌లో కథానాయక పాత్రకు ఎదురైన మోహావేశపు ప్రేమానుభూతులు ఈ సినిమాలో కనిపిస్తాయి. అవన్నీ మనల్ని ఫ్లాష్‌బ్యాక్‌లోకి నడిపిస్తాయి. తెరపై ఉన్న పాత్రల్లో ఏదో ఒకదానితో, మరేదో ఒక సందర్భంలో మనల్ని మనం చూసుకొనేలా జీవితాన్ని గుర్తుచేస్తాయి. ఈ సినిమా ప్రధాన బలం అదే! ఫస్ట్ ఫిల్మ్‌తోనే... టాప్ హీరోయిన్స్ కథానాయక పాత్ర జార్జ్ (నివిన్ పౌలీ) జీవితంలోని వివిధ ఘట్టాల్లో ప్రేమను అనుభూతించిన ప్రతి క్షణం మన గుండె కూడా ‘లవ్... డబ్... లవ్... డబ్’ అని కొట్టుకుంటుంది. ఊహించని అడ్డంకులెదురైన ప్రతిసారీ, ఎలాగైనా అతని ప్రేమ గెలిస్తే, మనమూ గెలిచినట్లే అనుకుంటాం. ఈ సహానుభూతి ఇవాళ ప్రతిచోటా ‘ప్రేమమ్’ను స్పెషల్‌గా నిలబెడుతోంది. కలెక్షన్స్ రాబడుతోంది. ఇలాంటి కథలు గతంలో కూడా వచ్చాయి కదా! ‘ప్రేమమ్’ గొప్పేంటట? దానికి జవాబు - ఫ్రెష్‌నెస్. డిగ్రీ సెకండియర్ చదువుతున్న ‘సాదాసీదా జీన్స్, చుడీదార్ అమ్మాయి’ అనుపమా పరమేశ్వరన్‌కు ఇదే మొదటి సినిమా. అయితేనేం? టీనేజ్ హీరో ప్రేమించే స్టూడెంట్ మేరీ పాత్రలో అమాయకమైన చిరునవ్వుతో ఈ కేరళ కుట్టి అందరి హృదయాలనూ కొల్లగొట్టింది. పోస్టర్ల నిండా ఆమె ఫోటోలే. మరో ప్రేమికురాలైన లెక్చరర్ మలర్ పాత్ర పోషించిన తమిళ పొన్ను సాయి పల్లవి జార్జియాలో ఫైనలియర్ ఎమ్బీబీయస్ స్టూడెంట్. డ్యాన్స్ రియాలిటీ షోలలో కొన్నేళ్ళ క్రితం ఆమెను టీవీలో చూసిన డెరైక్టర్ ప్రత్యేకంగా ఫేస్బుక్లో, ఫోన్లో వెంటపడి మరీ ఆమెను ఎంచుకున్నారు. మొటిమలతో ఎర్రబడ్డ కుడి చెంపతో మన పక్కింటి అమ్మాయే అనిపించే సాయి పల్లవి ఈ ఫస్ట్ఫిల్మ్తోనే ఇవాళ కేరళ కుర్రకారు గుండె చప్పుడు. టెక్నికల్ ఫ్రెష్‌నెస్... మ్యూజికల్ మ్యాజిక్ కథకు కీలకమైన ఈ హీరోయిన్లతో సహా ఏకంగా 17 మంది కొత్త ముఖాలను పరిచయం చేసిన ఈ మలయాళ ఫిల్మ్‌లో సన్నివేశాలు, డైలాగ్స్ సమకాలీన మలయాళ సమాజపు మట్టిపరిమళాన్ని గుప్పుమనిపిస్తాయి. ఈ తాజాదనపు అనుభూతికి కెమేరా (ఆనంద్ సి. చంద్రన్), ఎడిటింగ్ (దర్శక - రచయిత అల్ఫోన్స్ పుతరెన్), మ్యూజిక్ (రాజేశ్ మురుగేశన్) అదనపు చేర్పు. రెగ్యులర్ ఫార్మట్‌కు భిన్నంగా లైటింగ్ నుంచి కలర్ గ్రెడేషన్ దాకా అన్నిటిలో రియలిజానికే పెద్దపీట. ఎడిటింగూ అంతే! ఏడు మలయాళం పాటలు, 2 తమిళ పాటలు... పెద్ద మ్యూజికల్ హిట్. ‘ఆళువా పుళయుడ తీరత్తు..’(ఆళువా ఏటి ఒడ్డున), విజయ్ ఏసుదాస్ పాడిన ‘మలరే...’ పాటలు ఇప్పుడు కేరళలో వినిపించని ఊరు లేదు. ఎక్స్ట్రీమ్ క్లోజప్పులతో సాగే కొన్ని దృశ్యాలలో, డైలాగుల్లేకుండా హీరో రోదించే సీన్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకం. ఇలాంటి కొత్త తరహా పనితీరు సినిమాకు మరింత కొంగ్రొత్తదనాన్ని సంతరించింది. అది ‘ప్రేమమ్’కు మరో ఎడ్వాంటేజ్. అలుపెరుగని అన్వేషణ ఈ సినిమాకూ, తమిళంలో చేరన్ తీసిన ‘ఆటోగ్రాఫ్’ (రవితేజతో రీమేకైన ‘నా ఆటోగ్రాఫ్...’)కూ పోలికలున్నాయని కొందరు తేలిగ్గా తీసిపారేయచ్చు. కానీ, ఆ పోలిక మహా అయితే కథాంశం వరకే. ఇక్కడి సీన్లు డిఫరెంట్. ఆలోచనకు అవకాశం, అవసరం ఇవ్వని రొటీన్ ఫిల్మ్స్‌కు అలవాటుపడిపోయిన కళ్ళకు ఈ రెండుమ్ముప్పావు గంటల లవ్‌స్టోరీ సుదీర్ఘంగా అనిపించవచ్చు. కానీ, ‘ప్రేమమ్’ గుర్తుకుతెచ్చే జ్ఞాపకాలతో పోలిస్తే, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయమే కాదు. తేనె కోసం పువ్వులను వెతికే సీతాకోక చిలుకలా, మనిషి ప్రేమ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆ అన్వేషణ ఫెయిల్ కావచ్చు. ఆ క్రమంలో పరిస్థితుల్లో వచ్చే అతి చిన్న మార్పులు సైతం ఫలితంపై గణనీయ ప్రభావం చూపుతాయి. ఆఖరుకు ఎక్కడో ఒకచోట అన్వేషణ సక్సెసై, సెటిలవుతాడు. స్థూలంగా... ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’. తెరపై సీతాకోక చిలుకల్ని పదే పదే చూపిన డెరైక్టర్ మాటల్లో, ‘బటర్‌ఫ్లైస్ ఆర్ మెంటల్లీ మెంటల్, సో ఈజ్ లవ్!’ మొత్తానికి, మొన్న మే నెలాఖరుకు కేరళ తీరాన్ని ఒకటి కాదు... రెండు పవనాలు తాకాయి. మొదటిది - చిరుజల్లుల నైరుతీ ఋతుపవనాలు. రెండోది - మంచి సినిమాల కోసం తపిస్తున్న ప్రేక్షకుడిని తాకిన సినీ మలయసమీరం ‘ప్రేమమ్’. రెండూ తాపాన్ని తీర్చి, పరిసరాల్ని ఆహ్లాదంగా మార్చినవే! కావాలంటే, దగ్గరలో ఉన్న మల్టీప్లెక్స్‌కు వెళ్ళండి. టికెట్లు ముందే బుక్ చేసుకొని, ప్రేమిస్తున్నవాళ్ళను వెంటపెట్టుకొని మరీ వెళ్ళండి. ‘ప్రేమ’(మ్) డిజప్పాయింట్ చేయదు! మలయాళం రాకపోయినా, ఈ సినిమా విజువల్‌గా మనకు ఒక అనుభూతిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. భావాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. విజువల్ మీడియమైన సినిమా చేయాల్సింది అదే కదా! - రెంటాల జయదేవ కేరళ... కేరాఫ్ అడ్రస్ టు...సెన్సిబుల్ కమర్షియల్ సినిమా మలయాళ సినిమా అనగానే ‘బిట్లు’ కలిపిన బూతు బొమ్మలనే దురభిప్రాయం. పాతుకుపోయిన ఈ భావాన్ని తుడిచిపెట్టేలా రిలీజవుతున్న కొత్త తరం సినిమాల్లో లేటెస్ట్ వన్ ‘ప్రేమమ్’. తెరపైన మంచి కథలు చెప్పడంతో ఆగకుండా, సినిమాటిక్ మీడియమ్‌పై గౌరవం పెంచేలా జీవితాన్ని తెరకెక్కించడంలో మలయాళ సినిమా ముందుంది. అందుకు తాజా ఉదాహరణలు - నిన్నటి ‘బెంగుళూర్ డేస్’, ఇవాళ్టి ‘ప్రేమమ్’. యాదృచ్ఛికంగా ఈ రెండు ఫీల్‌గుడ్ మూవీస్‌తో బాక్సాఫీస్ వద్ద జాక్‌పాట్ కొట్టిన నిర్మాత ఒకరే! అన్వర్ రషీద్! దర్శకుడిగా మొదలైన రషీద్‌ను భావోద్వేగాలున్న కమర్షియల్ కథలను సొంతంగా నిర్మించాలనే ఆలోచన తొలిచేసింది. అదే టైమ్‌లో అంజలీ మీనన్ తీసిన ‘హ్యాపీ జర్నీ’ చూసి, గుమ్మైయారు. ఆమె దర్శకత్వంలోనే ‘బెంగుళూర్ డేస్’తో నిర్మాత అవతారమెత్తారు. గత ఏడాది రిలీజై, అభినందనలు, ఆదాయం - రెండూ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో సహా అనేక భాషల్లో రీమేక్ అవుతోంది. ఇప్పుడీ ‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫోన్స్ పుతెరెన్కు కూడా రషీద్ అలానే ఛాన్సిచ్చారు. అల్ఫోన్స్ తొలి సినిమా తమిళ, మలయాళ ద్విభాషా చిత్రం ‘నేరమ్’ (టైమ్ అని అర్థం). రెండేళ్ళ క్రితం సరిగ్గా మే నెలలోనే వచ్చి, హిట్టయిన ఈ కామెడీ థ్రిల్లర్ రషీద్‌కు బాగా నచ్చింది. ‘ప్రేమమ్’ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాత రషీదే చెప్పినట్లు, ‘ప్రేమమ్’ ఏదో ఆర్ట్ సినిమా కాదు. సున్నితమైన విషయాలను గుర్తు చేస్తూనే, వినోదాత్మక అంశాలనూ రంగరించిన కమర్షియల్ ఫిల్మ్. ఒక్క మాటలో- సెన్సిబిలిటీ, కమర్షియాలిటీల సమరస సమ్మేళనం. రీమేక్ రైట్స్ కోట్లలో పలుకుతున్న ఇలాంటి ప్రయత్నాలు తెలుగులో మనం చేయలేమా!