మరో తమిళ దర్శకుడితో చైతూ | naga chaitanya next movie with tamil director selva raghavan | Sakshi
Sakshi News home page

మరో తమిళ దర్శకుడితో చైతూ

Published Thu, Mar 10 2016 1:44 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

మరో తమిళ దర్శకుడితో చైతూ

మరో తమిళ దర్శకుడితో చైతూ

అక్కినేని నట వారసుడు నాగచైతన్య ఇప్పుడు యమా స్పీడు మీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచిన చైతూ, మరో రెండు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమాతో పాటు మళయాల సూపర్ హిట్ ప్రేమమ్ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు.

ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను ఫైనల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు 7జి బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలతో టాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement