మేకప్ లేకుండా నటిస్తోందట..! | shruthi haasan for premam remake | Sakshi
Sakshi News home page

మేకప్ లేకుండా నటిస్తోందట..!

Published Tue, Dec 1 2015 1:05 PM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

మేకప్ లేకుండా నటిస్తోందట..! - Sakshi

మేకప్ లేకుండా నటిస్తోందట..!

సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ శృతిహాసన్. గ్లామర్ రోల్స్తో పాటు ప్రయోగాత్మక పాత్రలకు కూడా సై అంటున్న ఈ బ్యూటీ, త్వరలో మరో రిస్క్ చేయనుందట. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న ఈ భామ నెక్ట్స్ సినిమాలో మేకప్ లేకుండా నటించడానికి రెడీ అవుతోంది. నాగ చైతన్య హీరోగా మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్కు రీమేక్గా రూపొందుతున్న మజ్ను సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది శృతి.

ఒకసారి ప్రేమలో విఫలమైన ఓ కుర్రాడు తన లెక్చరర్ను ప్రేమించే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు లెక్చరర్గా నటిస్తుంది శృతిహాసన్. అందుకు తగ్గట్టుగా వయసు ఎక్కువగా కనిపించేందుకు మేకప్ లేకుండా నటించడానికి ప్లాన్ చేసుకుంటోంది. శృతిహాసన్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement