Shruthi Hassan
-
నాని రేంజ్ మారిపోయింది...
-
సైకాలజికల్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్!
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. తరచూ వార్తల్లో ఉండే నటి కూడా ఆమె. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తనకున్న సైకాలజికల్ ప్రాబ్లమ్స్‌ను బయటపెట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కింది శృతి. రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ‘నాకు మానసికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఉపాసన, ట్వీట్ వైరల్ ఉన్నట్టుండి ఎక్కువగా ఉద్రేకపడతాను. కొన్ని విషయాల్లో సహనాన్ని కోల్పోయి ఆవేశపడతాను. నా సమస్యల గురించి బయటకు చెప్పడానికి మొదట భయపడ్డాను. ఈ మధ్య చాలా మంది తమ సమస్యలను బయటకు చెప్పేస్తున్నారు. దీంతో నాకూ కూడా నా మానసిక రుగ్మతల గురించి చెప్పాలి అనిపింది’ అని చెప్పింది. ‘అయితే ప్రస్తుతం నా మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్నాను. మానసిక రుగ్మతలను తగ్గించడానికి సంగీతం కూడా ఉపయోగపడుతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే అది షూటింగ్ స్పాట్లో అయిన, ఇంట్లో అయిన వెంటనే కోపం వస్తుంది. చదవండి: అర్జున్ రెడ్డి ఆఫర్ వదులుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశా: హీరోయిన్ అలాంటి పరిస్థితి తీవ్రం అయితే వెంటనే థెరపీ చికిత్సకు వెళుతున్నాను. నా సమస్యలను నేను దాచాలనుకోవడం లేదు’ అని పేర్కొంది. అయితే మన సమస్యలను నిర్మోహమాటంగా బయటకు చెప్పేయాలన్నారు. దాచాలనుకుంటే ఆ సమస్యలు మరింత అధికం అవుతాయని, ఎవరేమనుకుంటారో అని భయపడుతుంటారంది. కానీ మన సమస్యల గురించి బయటకు చెప్పితే భారం తగ్గడమే కాదు సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుందని శృతి చెప్పుకొచ్చింది. కాబట్టి సమస్య ఎలాంటిదైనా మనసు విప్పి చెప్పుకోండి అంటూ ఆమె సూచించింది. -
యాక్షన్ మోడ్‌లో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’లో ఇదే కీలక సన్నివేశం
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం బాలకృష్ణ, విలన్లపై భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథలో కీలక సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షిస్తున్నారు. 2023 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, చంద్రికా రవి (స్పెషల్ నంబర్) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ. -
నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్
Shruthi Haasan About Relationship With Shanthanu Says He Is Amazing: 'గతంలో నాకు రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు. ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి దాచాల్సిన అవసరం నాకు లేదనిపించింది. ఎందుకంటే నేనొక అద్భుతమైన వ్యక్తి (శంతను)తో రిలేషన్లో ఉన్నాను.' అని తెలిపింది శ్రుతి హాసన్. డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో శ్రుతి రిలేషనల్‌లో ఉందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శంతను గురించి శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం (శంతను)తో గడపాలనుకుంటున్నాను. తనతో ఉంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇక మేం ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటారు. సో.. మేం దాచాలన్న దాగదు. అయినా ఇప్పుడు తనతో నా అనుబంధం గురించి నేను కూడా దాచాలనుకోవడం లేదు. ఎందుకంటే నా లైఫ్‌లో ఆ అనుబంధానిది చాలా పెద్ద భాగం. నేనెంతో కష్టపడి పని చేసి, ఇంటికెళతాను. ఆ తర్వాత నా జీవితంలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన ఓ అద్భుతమైన పార్ట్నర్తో ఉంటాను. అందుకే నాకు దాచాలని అనిపించడంలేదు. మా ఇద్దరి ఈక్వేషన్ నాకు చాలా ఇష్టం' అని పేర్కొంది. చదవండి: స్కూల్ డేస్‌ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్'.. -
కరోనా పాజిటివ్.. చాలా నీరసించిపోయాను: శ్రుతి హాసన్
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడటంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కరోనా బారిన పడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. శ్రుతి ట్వీట్ చేస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా పరీక్షించానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది. ఈ క్రమంతో శ్రుతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఓ పోస్ట్ షేర్ చేసింది. అయితే ఎప్పుడు స్వేచ్ఛాగా.. సరదాగా ఉండే శ్రుతి కరోనా కారణంగా ఐసోలేషన్‌కు వెళ్లడంతో ఆమె ఫాలోవర్స్ కాస్తా బాధపడుతున్నారు. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే ఇదిలా ఉంటే శ్రుతి తాజాగా ఐసోలేషన్‌లోని తన కష్టాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ‘కరోనాతో చాలా నీరసించిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు’ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు శృతీ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటికి బదులిచ్చిన శృతీ హాసన్.. మీ అందరి ఆశీస్సులతో త్వరలో పూర్తిగా కోలుకొని మీ ముందుకు వస్తాను అని సమాధానమిచ్చింది. అయితే ప్రస్తుతం శృతీ హాసన్ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ హోం ఐసోలేషన్‌లో ఉండడంతో ఒంటరిగా బోర్‌గా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే.. -
బాలయ్య సినిమాకు నో చెప్పిన యంగ్ హీరోయిన్
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ మూవీ తర్వాత వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్నాడు. అఖండ తర్వాత వెంటనే గోపించంద్ మలినేని మూవీని స్టార్ట్ చేశాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమాతో మరిన్ని ప్రాజెక్టస్ చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం మలినేని దర్శకత్వంలో ఎన్బీకే107(#NBK107) మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్ రోల్ పోష్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి కొడుకులుగా బాలయ్య రెండు పాత్రలు చేయనున్నాడట. ఇందులో ఒక హీరోయిన్ శ్రుతి హాసన్‌గా సెకండ్ హీరోయిన్ వేటలో ఉన్నాడట గోపించంద్ మిలినేని. దీంతో ఈ పాత్ర కోసం ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించగా.. దానికి ఆమె నో చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కృతి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మరో భారీ విజయాలను ఆమె ఖాతాలో వేసుకుంది. వీటితో పాటు ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తుండటంతో డేట్స్ సర్ధుపాటు కాక బాలయ్య సినిమాకు ఆమె నో చెప్పినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అలాగే ప్రస్తుతం లీడ్ హీరోయిన్ ఆఫర్స్ వస్తున్న క్రమంలో సెకండ్ హీరోయిన్ నటించడం వల్లే కెరీర్‌పై దెబ్బ పుడుతుందనే భయంతో కూడా ఈ మూవీ ఆఫర్‌ను తిరస్కరించందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బేబమ్మ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన శ్రుతి, త్వరలోనే కలుస్తానంటూ ట్వీట్
హీరోయిన్ శ్రుతి హాసన్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు శ్రుతి ట్వీట్ చేస్తూ.. ‘హాయ్.. నేను ఇస్తోన్న ఈ అప్డేట్ సరదా కోసం కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అందరినీ త్వరలోనే కలుస్తాను థ్యాంక్యూ’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. అలాగే ఇటీవల ఆమె కలిసివారంతా పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచిందింది. కాగా శ్రుతి హాసన్ ప్రస్తుతం సలార్, బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్ల తెరకెక్కుతోన్న ఎన్బీకే107లో(#NBK107) హీరోయిన్గా నటిస్తోంది. pic.twitter.com/O8ENJ3ZBp5 — shruti haasan (@shrutihaasan) February 27, 2022 -
NBK107: తండ్రికొడుకులుగా కనిపించనున్న బాలయ్య!
Balakrishna-Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్ డైరెక్షన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న(ఫిబ్రవరి 18) మొదలైంది. 'సిరిసిల్ల' జిల్లాలో మొదటి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలయ్య ద్వీపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: త్వరలో పెళ్లి పీటలెక్కబోతోన్న మరో బాలీవుడ్ లవ్‌బర్డ్స్! అక్కడి నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. ప్రతినాయకుడిగా కన్నడ హీరో దునియా విజయ్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం 'వీరసింహా రెడ్డి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. -
బ్రేకప్‌లు, విడాకులు మన స్టార్ హీరోయిన్స్‌కు కలిసోచ్చాయా?!
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా చక్రం తిప్పుతున్న మన తెలుగు హీరోయిన్స్ కొందరూ నిజ జీవితంలో చేదు అనుభవాలను చూశారు. అయినా కేరీర్ పరంగా వారు పరిశ్రమలో దూసుకుపోతున్నారు. కొందరు ప్రేమ వరకు వెళ్లి విడిపోయారు, మరికొందరు వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు, ఇంకొంత మంది నిశ్చితార్థం వరకు వెళ్లి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా ఈ బాధలో కూడా వారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కేరీర్ పరంగా ఫుల్ బిజీ అవ్వడమే కాదు అంతకు ముందున్న సక్సెస్ కంటే కూడా డబుల్ సక్సెస్‌ను అందుకుంటున్నారు. వారెవరో కాదు పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న మన స్టార్ హీరయిన్స్. మరి వారెవరో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. సమంత అక్కినేని వారసుడు నాగచైతన్యతో ‘ఏం మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత చైతో పరిచయం, ప్రేమ, పెళ్లి, విడాకులు అంతా పదేళ్లలో జరిగిపోయింది. ఈక్రమంలో ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ కమర్షియల్ హిట్లు అందుకుంది. 2017లో చైతో వివాహం అనంతరం సినిమాల పరంగా కాస్తా ఆచితూచి అడుగులేస్తూ డిసెంట్ క్యారెకర్లు మాత్రమే ఎంచుకుంది. అయినా సామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ఇటీవల చైతో విడాకులు ప్రకటించిన సామ్ సినీ కేరీర్‌కు ఇంకా బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుస ప్రాజెక్ట్స్ సంతకం చేస్తోంది. ఇటీవల శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అంతేగాక ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతుందని వినికిడి. బ్రేకప్ అనంతరం ఆమె కెరీర్ ముగిసిందని అనుకుంటుండగా సామ్ జాతీయ స్థాయిని మించి ఏకంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇవే కాక కొత్తగా ఆమె ఐటెం సాంగ్‌తో సత్తా చాటుబోతోన్న సంగతి తెలిసిందే. అంటే విడాకులు ఆనంతరం సామ్ మునుపటి కంటే మరింత బిజీగా మారిపోయింది. నయన తార నయన తార పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆడదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె తమిళ శింబు సినిమా సమయంలో ఈ మూవీ హీరో శింబుతోతో ప్రేమయాణం నడిపింది. అది బ్రేకప్ తర్వాత కాస్తా సినిమాల స్పీడ్ పెంచిన నయన్ మెగి, లక్ష్మి వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగే క్రమంలో కొరియోగ్రఫర్, నటుడు ప్రభుదేవాతో సీక్రెట్ రిలేషన్లో ఉంది. పెళ్లి వరకు వెళ్లిన వారి ఎఫైర్ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ సమయంలో నయన్‌కు పెద్దగా హిట్లు లేవు. ప్రభుదేవతో కట్ అయ్యాక పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టిన నయన్ లేడి ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వరుస హిట్ అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఈ క్రమంలో దక్షిణాన అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గా నయన్ పేరు తెచ్చుకుంది. ఇది మాత్రమే కాదు ప్రభుదేవతో బ్రేకప్ అనంతరం ఆమె లేడి సూపర్ స్టార్‌గా పిలుపించుకుంటుంది. కొంతకాలంగా తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న నయన్ త్వరలోనే అతడినే పెళ్లి చేసుకోబోతోంది. రష్మిక మందన్నా రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్గా మాత్రమే కాదు నేషనల్ క్రష్, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా రష్మిక రికార్డులను సొంతం చేసుకుంది. వరుస హిట్లతో తెలుగు స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది. పరిశ్రమలో అడుగు పెట్టిన తక్కవు కాలంలోనే రష్మిక ఎంతో పాపులారిటి తెచ్చుకుంది. అయితే కన్నడ సినిమాతో అరంగేట్రం చేసిన రష్మిక శాండల్‌వుడ్ నిర్మాత, నటుడు రక్షిత్ శెట్టిని నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నిశ్చితార్థం బ్రేక్ చేసుకుంది. అనంతరం తెలుగు హాలో మూవీతో తెలుగులో అడుగు పెట్టిన రష్మిక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్రేకప్ అనంతరం కేరీర్‌పై ఫోకస్ పెట్టిన ఆమెకు వరుస విజయాలు వరించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ హీరోయిన్గా మారింది. మెహ్రీరిన్ కౌర్ ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, కవచం, చాణక్య, ఎఫ్2 వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకుంది. వరుస ఆఫర్స్‌తో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహ్రీన్ పెళ్లి వరకు వెళ్లింది. ఏమైందో ఏమో తెలియదు కానీ తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా మెహ్రీన్.. బ్రేకప్ అనంతరం వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తోంది. అంతేగాక మునుపటి కంటే ఇప్కుడే మరింత బిజీ అయిపోయింది. అంతేగాక ఈ మధ్య సినిమా అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటు వస్తున్నాయి. చెప్పాలంటే బ్రేకప్ మెహ్రీన్‌గా కలిసోచ్చినట్లు కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం ఆమె చేతిలో ఎఫ్ 3 మూవీతో పాటు మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతుంది త్రిష. అయితే స్టాలిన్ అనంతరం తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడంతో నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఆ మధ్య వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్మణిమన్ను నిశ్చితార్థం చేసుకుంది. ఏమైందో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిన త్రిష సెకండ్ తమిళ చిత్రం 96తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో అవకాశాలు తక్కువే అయినప్పటికీ తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా మారిపోయింది. లేడి ఓరియెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. శ్రుతీ హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలికి పరిశ్రమలో అడుగు పెట్టింది. శ్రుతి. కెరీర్ ప్రారంభంలో ఆమెకు పెద్ద విజయాలు లేవు. ఒకానోక సమయంలో ఐరన్ లెగ్గ్ అనే ముద్ర కూడా ఆమెకై పడింది. అయితే గబ్బర్ సింగ్ మూవీతో తోలి హిట్ అందుకుంది. ఆ తర్వాత శ్రుతి వెనక్కి తిరిగి చూడలేదు. వరుస విజయాలు ఉన్నప్పటికి సినిమాలు మాత్రం చాలా తక్కువగా చేసేది. ఆ మధ్య మైఖెల్ కోర్సలేతో ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో కెరీర్‌ను కాస్తా పక్కన పెట్టింది. ఇక అతడితో బ్రేకప్ అనంతరం గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన శ్రుతి వరుస ప్రాజెక్ట్స్ దూసుకుపోతోంది. ప్రభాస్ సలార్ వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు బాలయ్యతో ఓ సినిమాకు సంతకం చేసింది. అంతేగాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇలా బ్రేకప్ తర్వాత శ్రుతి మరింత పుంజుకుని సినిమాల పరంగా ఫుల్ బిజీ మారింది. ప్రస్తుతం ఆమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో మునిగి తేలుతోంది. -
వినాయక చవితి బరిలో విజయ్ సేతుపతి ‘లాభం’
విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. లాయర్ శ్రీరామ్ సమర్పించిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ మూవీకి హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్‌ను పొందింది. కాగా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుదల చేస్తున్నట్లు మూవీ టీం తెలిపింది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా రూపొందిన లాభం చిత్రాన్ని సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నాం. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు అభినందించి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఓ మంచి సినిమాను మా బ్యానర్లో ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంద’ని తెలిపారు. ఈ సినిమాలో సేతుపతి డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా కమర్షియల్ హంగులతో డైరెక్టర్ ఎస్.పి.జననాథన్ ఈ సినిమాను రూపొందించినట్లు, ఢీ అంటే ఢీ అనేలా ఉన్న సేతుపతి, జగపతిబాబు పాత్రలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని మూవీ టీం తెలిపింది. -
'లాభం' ట్రైలర్ విడుదల చేసిన సేతుపతి
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం లాభం. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ... "ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సినిమాను నా సొంత బ్యానర్ లో నిర్మించాను. కథ చాలా యూనిక్ గా ఉండి... ఓ మెసేజ్ ఇచ్చేలా సినిమాను తీశాము. రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్య... వ్యవసాయ భూముల పైనా... పంటల పైనా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం... ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైనా చాలా కూలంకషంగా ఇందులో చూపించడం జరిగింది. ట్రైలర్ లో కూడా అదే చూపించాము. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు నా అభినందనలు" అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం హ్యాపీగా ఉంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు. -
విజయ్ సేతుపతి ‘లాభం’ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు హీరోహీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘లాభం’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవి, బత్తులలు ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో లాభం ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. చదవండి: ఆకట్టుకుంటున్న ‘అనబెల్..సేతుపతి’ ట్రైలర్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ మూవీ రెండు భాషల్లో విడుదల కావడం విశేషం. ఇందులో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన కీలక పాత్ర పోషించింది. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) నిర్మించారు. ఇందులో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాధించుకుంటున్నాయి. ఇటీవల తెలుగులో నేరుగా నటించిన సైరా, ఉప్పెన చిత్రాలలో ఆయన పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది. చదవండి: Varudu Kaavalenu : ‘వరుడు కావలెను’ టీజర్ వచ్చేసింది లాభం చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం ఉంది. ఇందులో అతని పాత్ర తన గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా వుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. విజయ్ సేతుపతి లుక్ చాలా యూనిక్‌గా కనిపిస్తోంది. ఇందులో రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో విజయ్ సేతుపతి ప్రేక్షకుల్ని అలరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. ఈ చిత్రం విజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది కాబట్టి దేవుడి ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి, నిర్మాతలకు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్న’ అని అన్నారు. -
బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే107 అనే వర్కింగ్ టైటిల్‌తో బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటికి నుంచి ఈ మూవీలోని హీరోయిన్, విలన్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదట బాలయ్య సరసన హీరోయిన్గా శృతీ హాసన్, త్రిష పేర్లు వినిపించగా ఆ తర్వాత మెహ్రీన్ కౌర్ పర్జాదా పేరు తెరపైకి వచ్చింది. చదవండి: బాలయ్యతో తలపడనున్న తమిళ విలక్షణ నటుడు ఆ తర్వాత విలన్ పాత్ర కోసం తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ తాజా బచ్ ప్రకారం ఈ మూవీలో విలన్‌గా నటించేందుకు విజయ్ సేతుపతి నో చెప్పినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాకు విజయ్ నో చెప్పడం ఏంటని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీనితో పాటు మరో వార్త కూడా బయటకు వచ్చింది. అయితే మొదట దర్శకుడు గోపిచంద్ హీరోయిన్గా శ్రుతి హాసన్‌ను సంప్రదించగా ఆమె సున్నితంగా ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య మీద ఉన్న అభిమానం, డైరెక్టర్ సెంటిమెంట్‌ను కాదనలేక శ్రుతి అతిథి పాత్ర ఏమైనా ఉంటే చేస్తాని ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ శ్రుతి నటించడం లేదని స్పష్టత వచ్చేసింది. బాలయ్యతో సందడి చేయనుంది మెహ్రీన్ హా లేక త్రిష అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మొత్తానికి ఎన్బీకే 107 మూవీని స్టార్ నటీనటులతో చేయాలని ప్లాన్ చేసుకున్న గోపిచంద్‌కు ఇలా చేదు అనుభవం ఎదురైందంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చదవండి: బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్! -
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు ఐకాన్ అవార్డు
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ బాక్సాఫీసుకు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ధర్మప్రొడక్షన్‌లో స్వయంగా ఎన్నో సినిమాలు నిర్మించాడు. ఆయన ఇండియన్ సినీ పరిశ్రమకు చేసిన కృషిగాను లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎల్ఐఎఫ్ఎఫ్) ఐకాన్ అవార్డుతో సత్కరించింది. లండన్ వేదికగా గతవారం ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమం చివరిలో కరణ్ జోహార్‌తో పాటు బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆసిఫ్ కపాడియా ఈ ఐకాన్ ఆవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించారు. అలాగే హీరోయిన్ శృతి హాసన్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌లకు ఎల్ఐఎఫ్ఎఫ అవుట్ స్టాడింగ్ ఎచీవ్మెంట్ అవార్డు దక్కడం విశేషం. -
పెళ్లి చేసుకుంటావా? నెటిజన్ ప్రశ్నకు శృతి దిమ్మతిరిగే ఆన్సర్
హీరోయిన్ శృతీహాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఇక శృతి లైవ్‌లోకి రాగానే.. నెటిజన్లు తమ మనసులోని ప్రశ్నలన్నింటిని ఆమె ముందు ఉంచారు. ప్రభాస్ సలార్‌లో మీ పాత్ర ఏమిటి? అందులో క్రాక్ సినిమాలో మాదిరిగా ఫైట్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ సమాధానం ఇస్తూ.. సలార్‌లో నాది మంచి పాత్ర. ఇప్పుడు వివరాలు వెల్లడించలేను. అయితే నాకు ఫైట్స్ లేవు. ప్రభాస్‌తో ఫైట్ చేయలేను అని చెప్పారు. ఇక ఓ తుంటరి నెటిజన్.. మీ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలి అంటూ అడిగితే.. అబ్బో.. నా నెంబర్ కావాలా అంటూ నవ్వుతూ నో అని చెప్పారు. అలాగే లైవ్‌లో మరో నెటిజన్ నన్ను పెళ్లి చేసుకొంటావా? అని ప్రశ్న వేస్తే.. చేసుకొను అంటూ సున్నితంగా తిరస్కరించింది. మీరు నటించిన ఓ మై ఫ్రెండ్ చిత్రం అంటే ఇష్టం. మీకు ఆ మూవీ గుర్తుందా అని మరో నెటిజన్ అడిగితే నాకు ఇష్టమైన సినిమా అది అని జవాబు ఇచ్చారు. అలాగే వైజాగ్‌కు ఎఫ్పుడు వస్తున్నారు అని అడిగితే.. చిన్నప్పటి నుంచి వైజాగ్‌తో అనుబంధం ఉంది. ఏదో సందర్భంలో వస్తూనే ఉంటాను అని శృతి చెప్పారు. చదవండి: ప్రేమలో పడిపోయా.. రష్మిక పోస్ట్ వైరల్ అకీరా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణూ దేశాయ్ -
ప్రభాస్ కోసం కేజీఎఫ్ భామను రంగంలోకి దింపిన డైరెక్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ కూడా ఒకటి. ఈ పాన్ ఇండియా సినిమాలో తొలిసారిగా ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేసింది చిత్ర బృందం. అయితే ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సలార్ సినిమాలో ప్రభాస్‌తో స్పెప్పులేసేందుకు కేజీఎఫ్ భామ శ్రీనిధీ శెట్టిని రంగంలోకి దింపుతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ భామతో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసింది చిత్ర బృందం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సలార్‌లో ఈ స్పెషల్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. నెక్స్ట్ షెడ్యూల్లోనే ఈ కన్నడ భామతో ప్రభాస్ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఉండనుందట. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ను మొదట పెట్టనున్నారని సమాచారం. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. చదవండి : ప్రభాస్ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్ 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
కమల్ ఓటమిపై శృతి హాసన్ ఎమోషనల్ రియాక్షన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా, చివరకు ఆయనకు ఓటమి తప్పలేదు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్..సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై 1,300 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. కమల్‌మాసన్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయనే ఓడిపోవడం ఆయన అభిమానులకు షాకింగ్‌కు గురి చేసింది. అంతేకాకుండా ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కమల్ తొలి ఎన్నికలోనే ఓటమిపాలవడంపై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కమల్ కూతురు, హీరోయిన్ శృతిహాసన్ స్పందించారు.‘మిమ్మల్ని చూస్తుంటే ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది నాన్న (అప్పా)’ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా తన తండ్రిని పైటర్ అంటూ అభివర్ణిస్తూ ద ఫైటర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేశారు. తండ్రిపై శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. 'గెలుపోటములు సహాజం..ప్రతి కూతురికి తన తండ్రి ఎప్పటికీ హీరోనే' అంటూ పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. చదవండి : ఐదు రాష్ట్రాల ఫలితాలు : గెలిచిన, ఓడిన నటులు వీరే అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ -
రెండు గంటల్లో పాట రాసిన కమల్
-
మే 8న రవితేజ క్రాక్
‘ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ అంటూ మొదలవుతుంది ‘క్రాక్’ టీజర్. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి.మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ‘ఒరేయ్ అప్పిగా, సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంటి రా...’ ఇలా టీజర్లో వినిపించిన డైలాగ్స్‌ని బట్టి ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘టీజర్లో చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా ఉంది. టీజర్లోలాగే సినిమాలోనూ తమన్ మ్యూజిక్ అదిరిపోతుంది. విష్ణు మంచి విజువల్స్ ఇచ్చాడు. విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి. మధు, చిత్ర సహనిర్మాత అమ్మిరాజు, ప్రొడ్యూసర్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఖమ్మంలో శృతి సందడి
-
బయటకు చెప్పడానికి భయపడ్డా
‘‘నేను చిన్నప్పుడు మానసిక ఆందోళనతో బాధపడ్డాను. మానసిక ఆరోగ్యంపై మన దేశంలో ఓ దురభిప్రాయం ఉంది. అందుకే చాలామంది బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా బాధపడుతున్నారు’’ అన్నారు శ్రుతీహాసన్. మానసిక ఆరోగ్యం, దాని చుట్టూ ఉన్న అపోహల గురించి శ్రుతీ ఇటీవల ఓ ఈవెంట్లో మాట్లాడుతూ – ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఆందోళనకు గురయ్యేదాన్ని. హీరోయిన్గా సక్సెస్ అయిన తర్వాత కూడా బయటకు కనిపించడానికి కొంచెం ఆందోళన పడేదాన్ని. బయటకు రావడానికి చాలా సమయం తీసుకునేదాన్ని. దీంతో చాలామంది ‘శ్రుతీ సినిమాలు మానేస్తోంది, పెళ్లి చేసుకుంటోంది, ఏదో ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది’ అంటూ రకరకాల పుకార్లు పుట్టించారు. కొన్ని విని నవ్వుకునేదాన్ని. మన దేశం అద్భుతమైనది, ఉత్సాహపూరితమైనది. అయినప్పటికీ డిప్రెషన్స్ ఎక్కువ గురవుతున్న దేశాల్లో మనం కూడా ఉన్నాం. మూడు సెకన్లకు ఒకరు ఆత్మాహత్యా యత్నం చేస్తున్నారు. నా మానసిక సమస్యలను బయటకు చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు పడ్డాను, వీక్‌గా ఫీల్ అయ్యాను. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలంటే బయటకు మాట్లాడాలి. పరిష్కరించుకోవాలి. ఒత్తిడి నుంచి విముక్తి పొందాలి’’ అని పేర్కొన్నారు. -
బ్యూటీఫుల్ కపుల్ : శ్రుతీహాసన్
టాలీవుడ్లో సూపర్‌స్టార్‌గా దూసుకుపోతూ.. కాసింత విరామం దొరికినా ఫ్యామిలీతో గడుపుతూ.. ఫ్యామిలీ మ్యాన్‌గానూ మంచి మార్కులు సంపాదించారు మహేష్ బాబు. ఫ్యామిలీతో సరదాగా మహేష్ గడుపుతూ ఉంటే.. ఆయన ఫ్యాన్స్‌కు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు నమత్రా శిరోద్కర్. వీరిద్దరి ప్రేమ వివాహానికి నేటితో పద్నాలుగేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు ఓ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను శ్రుతీహాసన్ షేర్ చేస్తూ.. ఫోటో బాగుంది, అందమైన జంట అంటూ ట్వీట్ చేశారు. మహేష్-శ్రుతీహాసన్కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. Such a beautiful photograph and such a beautiful couple ! — shruti haasan (@shrutihaasan) February 10, 2019 -
విరామానికి విరామం
రెండేళ్లవుతుంది తమిళంలో శ్రుతీహాసన్ స్క్రీన్‌పై కనిపించి. సూర్యతో చేసిన ‘సింగం 2’ తమిళంలో శ్రుతి లాస్ట్ సినిమా. ఆ తర్వాత సినిమాలను తగ్గించి సంగీతం మీద దృష్టి పెట్టారామె. లండన్‌లో మ్యూజికల్ షోలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా వీలున్నంత సమయాన్ని బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ సినిమాను అంగీకరించారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. లేటెస్ట్గా శ్రుతీ ఓ తమిళ చిత్రం అంగీకరించినట్టు సమాచారం. రెండేళ్ళ గ్యాప్ తర్వాత అంగీకరించిన సినిమా ఇది. విజయ్ సేతుపతి హీరోగా యస్పీ జననాథన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతీహాసన్ అయితే బావుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. శ్రుతీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శ్రుతీ రెండేళ్ల విరామానికి విరామం ఇచ్చి మళ్లీ సినిమాలను అంతే స్పీడ్‌గా చేస్తారో లేదో చూడాలి మరి. -
శృతి వీడియో.. ఇరకాటంలో కమల్ హాసన్
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు ట్విటర్లో చేదు అనుభవం ఎదురైంది. కుల వ్యవస్థ గురించి కమల్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ట్రోల్ చేస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల అభిమానులతో ట్విటర్లో జరిగిన సంభాషణలో కుల వ్యవస్థపై మీ అభిప్రాయమేమిటని ఓ అభిమాని కమల్‌ను ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘నా ఇద్దరు కూతుళ్లను స్కూళ్లో చేర్పించే సమయంలో కులం, మతం వంటి కాలమ్స్ నింపమని అడిగినపుడు నేను వ్యతిరేకించాను. ఇటువంటి దృక్పథమే నా కుటుంబంలోని భవిష్యత్ తరాలకు అలవడుతుంది. ప్రతీ ఒక్కరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత కుల వ్యవస్థ అనేది క్రమంగా నశించిపోతుంది. కేరళ కూడా ఇలాంటి పద్ధతినే అవలంబిస్తోంది’ అంటూ కమల్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్... కమల్ పెద్ద కూతురు, ప్రముఖ హీరోయిన్ శృతీ హాసన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాలూకు వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో తాను ‘అయ్యంగార్’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా శృతి చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో కమల్‌ను ట్రోల్ చేస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘కేవలం స్కూలు అప్లికేషన్లో కులానికి సంబంధించిన కాలమ్ నింపకపోవడం వల్ల కుల వ్యవస్థ నశిస్తుందన్న మీ అభిప్రాయం తప్పు సార్. సమాజాన్ని సంస్కరించే కార్యక్రమం మీ ఇంటి నుంచే ప్రారంభించండి. పిల్లల ముందు కుల ప్రస్తావన తీయకుండా, వారు ఏ కులానికి చెందిన వారో తెలియకుండా పెంచితేనైనా మీరు కోరుకునే మార్పు వచ్చే అవకాశం ఉందంటూ’ ఓ నెటిజన్ ఘాటుగా విమర్శించాడు. ‘మీరు కులానికి సంబంధించిన కాలమ్ నింపలేదేమో గానీ మీ సామాజిక గుర్తింపు ఏమిటో మీ కూతురి మాటల ద్వారా బహిరంగంగానే తెలియజేశారు కదా’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. I refused to fill in the caste&religion column in both my daughters’ school admission certificate.That’s the only way,it will pass on to the next generation.Every individual shld start contributing fr progress.Kerala started implementing the same.Those who do shld be celebrated https://t.co/DLdTubcfW1 — Kamal Haasan (@ikamalhaasan) June 30, 2018 -
జాయ్ జాయ్ ఎంజాయ్
రొటీన్‌కి బ్రేక్ కొట్టి సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడే లైఫ్‌లో కిక్ ఉంటుంది. లేకపోతే బోర్ కొడుతుంది. అలా బోర్ కొట్టకుండా ఉండేందుకు ఒక్కోసారి చిన్నపిల్ల్లల్లా మారిపోతుంటాం. శ్రుతీహాసన్ అలానే చేశారు. పిల్లలు ఆడుకునే చెక్క గుర్రపు బొమ్మపై ఎక్కి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. ఆ ఫన్నీ ఫొటోను ‘ప్యూర్ హ్యాపీనెస్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. లండన్ట్రిప్లో ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేసి, హ్యాపీ మూడ్‌తో ఇండియా ప్రయాణం అయ్యారు శ్రుతీహాసన్. లండన్ నుంచి గోవా వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో రవితేజ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మనీష్ మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమాల్ హీరోగా రూపొందనున్న సినిమాలో శ్రుతీనే హీరోయిన్. -
ఐదేళ్ల తర్వాత?
‘పాతికేళ్ల చిన్నది చేపకళ్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే’ అంటూ ‘బలుపు’ చిత్రంలో సందడి చేశారు రవితేజ, శ్రుతీహాసన్. ఆ సినిమా విడుదలై ఐదేళ్లు కావస్తోంది. తాజాగా ఈ జంట మరోసారి జోడీ కడుతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న ‘నేల టిక్కెట్టు’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. దీంతో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేస్తున్నారు రవితేజ. ఆ తర్వాత ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేస్తారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రుతీహాసన్ నటించనున్నారని సమాచారం. ‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత ఏ సినిమా ఒప్పుకోని శ్రుతి ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా తెలుగులో రవితేజ సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్‌ని ఫిక్స్ చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. మరి శ్రుతి, కాజల్ ఇద్దరూ నటిస్తారా? ఎవరో ఒక్కరేనా? వెయిట్ అండ్ సీ. -
ఫన్నీగాయ్!
మైఖేల్ కోర్స్లే, హీరోయిన్ శృతీహాసన్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఇండస్ట్రీ టాక్. రీసెంట్గా చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో కమల్‌హాసన్‌తో, మరో సందర్భంలో శృతి తల్లి సారికతో మైఖేల్ ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. దీంతో మైఖేల్, శృతి పెళ్లిపీటలెక్కబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ఈ ఏడాది బర్త్‌డే సందర్భంగా చెప్పారు శృతి. కానీ మైఖేల్‌పై మాత్రం ఫుల్ క్లారటీ ఇవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్గా మైఖేల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారామె. ‘‘ ప్రతి విషయంలో నాతో కలిసి నవ్వుతూ నవ్విస్తుంటాడు. నాకు తెలిసిన ఫన్నీగాయ్. హ్యాపీ బర్త్‌డే టు మై బెస్ట్ ఫ్రెండ్’’ అంటూ మైఖేల్‌కు పుట్టనరోజు శుభాకాంక్షలు తెలిపారు శృతి. అంతేకాదు ఈ టైమ్‌లో మైఖేల్ పక్కన తను లేకపోయినందుకు ‘ఐ యామ్ సారీ’ అని కూడా పేర్కొన్నారామె. -
శ్రుతి ఆంతర్యం ఏమిటి?
సాక్షి, చెన్నై: శ్రుతి ఆంతర్యం ఏమిటి? ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల్లో చెలరేగుతున్న ప్రధాన ప్రశ్న ఇదే. సంగీతం ఈమె ప్రధాన నేస్తం. పలు సంగీత ఆల్బమ్‌లు చేసిన శ్రుతిహాసన్ తొలుత సంగీతదర్శకురాలిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నైపోల్ఒరువన్ చిత్రం సంగీతదర్శకురాలిగా శ్రుతికి మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత లక్కీ అనే హిందీ చిత్రంలో నటిగా అవకాశం రావడంతో నటించి చూద్దాం అన్న ధోరణిలో ఆ చిత్రం చేశారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో నటిగా కొనసాగుతున్నారు. అలా కొన్ని సక్సెస్‌లతో క్రేజీ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న శ్రుతికి అనూహ్యంగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం ఆమె స్వయంకృతాపరాధమే అనే ప్రచారం జరుగుతోంది. మంచి మార్కెట్ ఉండగా సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి వివాదాల్లో చిక్కుకున్న శుత్రికి ఆ తరువాత ఒక్క నూతన చిత్రం అంగీకరించకపోవడం చర్చకు దారి తీసింది. తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడు సగంలోనే నిలిచిపోవడం ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారిం దనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం లేదు. ఇటీవల శ్రుతి తన మేను అందంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రచారం వైరల్ అవుతోం ది. ఆ మధ్య తన గ్లామర్‌పై విమర్శలు రావడంతో తన మేనుకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఒక ప్రముఖ వైద్యుడి పర్యవేక్షణలో శ్రుతి కూడా తన మేను అందాలను మెరుగు పరుచుకుంటున్నట్లు ప్రచారం. ఇదటుంచితే శ్రుతి ఈ మధ్య తన బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. తండ్రి కమలహాసన్‌కు, తల్లి సారికకు పరిచయం చేసి వారి ఆమోదముద్రను పొందిన శ్రుతి త్వరలో బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్ను వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం మీడియాలో వైరల్ అవుతోంది. వివాహనంతరం నటనకు గుడ్‌బై చెప్పి అంతర్జాతీయ సంగీత ఆల్బమ్‌ల రూపకల్పన చేయాలనే ఆలోచనతో శ్రుతిహాసన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంపై శ్రుతి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
శ్రుతికి షాక్!
తమిళసినిమా: ఒక్కోసారి నిజాలు ఆలస్యంగా వెలుగు చూస్తాయంటారు. నటి శ్రుతీహాసన్ విషయంలోనూ ఇదే జరిగిందా? తేనాండాళ్ ఫిలింస్ సంస్థ అధినేతలు అవుననే అంటున్నారు. నిజం చెప్పాలంటే సంఘమిత్ర చిత్ర వివాదం నటి శ్రుతీహాసన్‌ను వెంటాడుతూనే ఉంది. ఆ చిత్రంలో నాయకిగా నటించడానికి శ్రుతీహాసన్ అంగీకరించడంతో ప్రారంభానికి ముందే సంఘమిత్రకు బోలెడంత ఫ్రీ ప్రచారం వచ్చేసింది. శ్రుతీ కూడా కత్తిసాము లాంటి విద్యలో చాలా సీరియస్‌గా శిక్షణ పొందారు. అలాంటిది అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు వెల్ల డించడంతో పాటు. తనకు ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వలేదని, కాల్షీట్స్ డీటెయిల్స్ చెప్పలేదంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే చిత్ర వర్గాల తరఫు మాత్రం తమ చిత్రంలో శ్రుతీహాసన్ నటించడం లేదు అని మాత్రమే వెల్లడించారు. దీంతో నిజాలేమయి ఉంటాయన్న ఆసక్తి చిత్ర వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పెరిగిపోయింది. కొందరైతే నిర్మాతల వైపే తప్పు ఉందేమో అనుకున్నారు. కాగా ఈ వ్యవహారం సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో తేనాండాళ్ ఫిలింస్ సంస్థ« శ్రుతికి షాక్ ఇచ్చింది. తాజాగా ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన హేమరుక్మిణి శ్రుతీహాసన్ వివాదంలో కుండబద్దలు కొట్టారు. శ్రుతీహాసన్ సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగలేదని, ఆమెతో కలిసి పని చేయలేని పరిస్థితుల్లో తామే తొలగించామని వెల్లడించారు. ఈ విషయం తాజాగా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. మరి ఈ అంశంపై శ్రుతీహాసన్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
హీరోయిన్ అయిన తర్వాతే...
నా పర్సనల్ లైఫ్‌లోకి పబ్లిగ్గా చాలా మంది తొంగి చూడడం మొదలైందంటున్నారు శ్రుతీ హాసన్. ఫిల్మ్ స్టార్స్ లైఫ్‌లో ఇదంతా కామన్! ఈ సంగతి శ్రుతీకి తెలుసు. కానీ, కొందరు హద్దుమీరి ప్రవర్తించారట. వాళ్ల గురించి శ్రుతీ హాసన్ మాట్లాడుతూ – ‘‘నా పర్సనల్ లైఫ్ గురించి కొన్ని సందర్భాల్లో కొందరు పిచ్చి కూతలు కూసినప్పుడు అసౌకర్యంగా ఫీలయ్యా. చాలా బాధపడ్డా. కానీ, తప్పదు. స్టార్స్ లైఫ్‌లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతే’’ అన్నారు. శ్రుతి అంత అసౌకర్యంగా ఫీలైన సందర్భం ఏంటబ్బా? అని ఆలోచిస్తే... రీసెంట్ టైమ్స్‌లో లండన్ బేస్డ్ ఇటాలియన్ యాక్టర్‌తో శ్రుతి ప్రేమలో ఉందనే పుకారు బాగా షికారు చేసింది. అది నిజమా? కాదా? అని శ్రుతీ హాసన్‌ను అడిగితే... ‘‘నా పర్సనల్ లైఫ్ గురించి నేను కామెంట్ చేయను. ఎందుకంటే... నేను సింగిల్ స్టేటస్ మేంటైన్ చేయాలని ప్రయత్నిస్తున్నా. నా లైఫ్‌లో చాలా ముఖ్యమైన విషయం గనుక... లవ్‌లో పడ్డానా? లేదా? అనే మేటర్‌ను సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నా. అమ్మానాన్న దగ్గర మాత్రం అన్నీ ఓపెన్‌గా చెప్పేస్తా. వాళ్లకు అన్నీ తెలుసు’’ అని సెలవిచ్చారు. ఈ మాటలను బట్టి శ్రుతి లవ్‌లో పడ్డారని అనుకోవాలా! లేదనుకోవాలా!! ఈసారి కమల్‌హాసన్‌ను కలసినప్పుడు అడగాలి. నాన్న దగ్గర ఓపెన్‌గా అన్నీ చెబుతానని శ్రుతి చెప్పారు కదా! -
అఖిల్ తో సితార విక్రమ్
-
అబ్బాయిల నేత్రానందం నాకు ముఖ్యం కాదు!
మంచి డ్రెస్ వేసుకున్న తర్వాత పదే పదే నిలువుటద్దంలో చూసుకుని మురిసిపోతుంటారు కొంతమంది. ఈ టైప్ అమ్మాయిలు తమ ఆత్మానందం కోసం మాత్రమే డ్రెస్సులు వేసుకుంటారు. కొంతమంది అమ్మాయిలు మాత్రం ఇతరుల నేత్రానందం కోసం బట్టలు వేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా అబ్బాయిల కోసం ప్రత్యేకంగా డ్రెస్ చేసుకునే అమ్మాయిలు లేకపోలేదు. శ్రుతీహాసన్ మాత్రం ఈ టైప్ కాదు. ఆ విషయం గురించి ఈ బ్యూటీ చెబుతూ - ‘‘నాకు స్టైల్‌గా ఉండటం ఇష్టం. వెరైటీ డ్రెస్సులు ట్రై చేయడానికి ఏమాత్రం వెనకాడను. అబ్బాయిల కోసం మాత్రం డ్రెస్ చేసుకోను. అందమైన బట్టలు వేసుకుని వాళ్లను ఆకర్షించాలని అనుకోను. బయటకు వెళ్లినప్పుడు షాపింగ్ మాల్స్‌లో పెద్ద పెద్ద అద్దాలు కనిపిస్తాయి కదా.. వాటిలో నా ప్రతిబింబం చూసుకోవడానికి డ్రెస్ చేసుకుంటాను. ఇంట్లో అద్దాలుంటాయ్. కానీ, బయట కనిపించే స్టోర్ అద్దాల్లో నన్ను చూసుకోవడం నాకిష్టం. అందుకే డ్రెస్ చేసుకునేటప్పుడు అద్దాలను కూడా గుర్తు పెట్టుకుంటాను. ఆ సంగతలా ఉంచితే.. డ్రెస్సింగ్ అనేది మన అభిరుచికి తగ్గట్టుగా ఉండాలి. ఇతరులు ఏమనుకుంటారో? అని ఆలోచించకూడదు. మనకు సౌకర్యంగా అనిపించే బట్టలు ఇతరులకు చూడ్డానికి బాగాలేకపోయినా వేసుకోవాలి’’ అన్నారు. -
హిట్ కొట్టినా చాన్స్ ఇవ్వడం లేదా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ముందుగా వినిపించే పేరు శృతిహాసన్. ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి వరుస బ్లాక్ బస్టర్స్‌లో నటించిన ఈ బ్యూటి, ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుంది. సాదారణంగా టాలీవుడ్లో ఒక్క హిట్ ఇచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పరిగెడుతుంటారు. అలాంటిది శృతిని మాత్రం పట్టించుకోవట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందన్న టాక్ ఉన్నా, శృతికి మాత్రం అవకాశాలు రావటం లేదు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది శృతి. స్టార్ హీరోల సరసన భారీ బడ్జెట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటి, ప్రేమమ్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాను అంగీకరించడం కూడా విశేషమే. ప్రేమమ్‌తో పాటు హిందీలో, తమిళ్లో ఒక్కో సినిమా చేస్తున్న శృతి, కావాలనే సినిమాలను తగ్గించుకుంటుందా..? లేక ఆఫర్లే రావటం లేదా..? అన్న విషయం తెలియలేదు. -
లైట్‌గా తీసుకోండి... హాయిగా ఉండండి!
ఏ సీజన్లో ఉండాల్సిన కష్టాలు ఆ సీజన్‌కి ఉంటాయి. చలికాలం వణికించేస్తుంది. వర్షాకాలం పనులకు ఆటంకం కలగజేస్తుంది. ఎండాకాలం అయితే చెమటలు కక్కించేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ సీజన్‌ని అయినా హాయిగా గడిపేయొచ్చంటున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి, చర్మ సౌందర్య గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలనీ, ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలనీ ఆమె అన్నారు. ఇక, సమ్మర్లో శ్రుతీహాసన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందాం... ► సమ్మర్లో స్కిన్ డ్యామేజ్‌ని తప్పించలేం. అందుకే మిగతా సమయాలకన్నా రెట్టింపు కేర్ తీసుకోవాలి. బయటికు వెళ్లేటప్పుడు మొహం, మెడ, చేతులు.. ఇలా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే చోట సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. అందరు చెప్పేదే నేనూ చెబుతున్నా. ఈ సీజన్లో ఆయిలీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది. ► మా ప్రొఫెషన్‌కి మేకప్ చేసుకోకపోతే కుదరదు. ఎండలో మేకప్ అంటే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు. చర్మానికి ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది. అందుకే, ఈ సీజన్లో షూటింగ్స్ లేనప్పుడు స్కిన్‌ని ఫ్రీగా వదిలేస్తా. ► ఎండలో తిరిగినప్పుడు చర్మం కమిలిపోతుంది. అది ఒక పట్టాన తగ్గదు. స్కిన్ ట్యాన్‌ని పోగొట్టాలంటే బంగాళదుంప తొక్కుని ఉపయోగించవచ్చు. ఆ తొక్కుని గుజ్జుగా చేసి, శెనగపిండి, పాలు కలిపి ట్యాన్ అయిన చోట పట్టించాలి. ఎండిపోయిన తర్వాత కడిగేయాలి. ట్యాన్ పోయేంతవరకూ ఇలా చేయొచ్చు. ► మార్కెట్లోకి ఎన్ని సౌందర్య సాధనాలైనా రానివ్వండి. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్‌ప్యాక్‌లే బెటర్. శెనగపిండి, మీగడ కలిపి మొహానికి పట్టించుకుంటే చర్మానికి మంచిది. వేసవికి ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్. ► సమ్మర్లో నా డైట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ బాగా తాగుతాను. కొబ్బరి నీళ్లు కూడా తీసుకుంటాను. తేలికపాటి ఆహారమే తింటాను. మధ్యాహ్నం భోజనానికి పాస్తా, వెజిటబుల్ సలాడ్స్ లేకపోతే అన్నం, పప్పు తీసుకుంటాను. సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో పండ్ల ముక్కలు తింటాను. రాత్రి ఏడు గంటల లోపే డిన్నర్ ముగించేస్తాను. సూప్, కూరగాయలు, పప్పు, రోటీ తింటాను. సమ్మర్లో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. -
'అమ్మా నాన్న ఆట' ఆగిపోయింది
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'అమ్మా నాన్న ఆట' సినిమా ఆగిపోయింది. ఉత్తమ విలన్, చీకటి రాజ్యం లాంటి సినిమాల తరువాత సూపర్ ఫాంలో కనిపించిన కమల్, అదే స్పీడులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అమల హీరోయిన్గా అమ్మా నాన్న ఆట అనే సినిమాను ప్రారంభించిన కమల్, తాజాగా ఆ సినిమా ఆగిపోయినట్టుగా ప్రకటించాడు. అయితే ఎందుకు ఆగిపోయింది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. టికె రాజీవ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోవటంతో ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమాను స్టార్ చేస్తున్నాడు. కొత్త సినిమాలో రమ్యకృష్ణ, కమల్‌కు జోడిగా నటిస్తుండగా కమల్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కమల్ కూతురి పాత్రలో కనిపించనుంది. ఓ టీవి ఛానల్ ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించిన కమల్ హాసన్ త్వరలోనే నెక్ట్స్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నాడు. -
మేకప్ లేకుండా నటిస్తోందట..!
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ శృతిహాసన్. గ్లామర్ రోల్స్‌తో పాటు ప్రయోగాత్మక పాత్రలకు కూడా సై అంటున్న ఈ బ్యూటీ, త్వరలో మరో రిస్క్ చేయనుందట. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న ఈ భామ నెక్ట్స్ సినిమాలో మేకప్ లేకుండా నటించడానికి రెడీ అవుతోంది. నాగ చైతన్య హీరోగా మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది శృతి. ఒకసారి ప్రేమలో విఫలమైన ఓ కుర్రాడు తన లెక్చరర్‌ను ప్రేమించే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు లెక్చరర్‌గా నటిస్తుంది శృతిహాసన్. అందుకు తగ్గట్టుగా వయసు ఎక్కువగా కనిపించేందుకు మేకప్ లేకుండా నటించడానికి ప్లాన్ చేసుకుంటోంది. శృతిహాసన్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. -
'నా పేరు శృతిహాసన్, సరిగా పలకండి'
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేసేస్తున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ను ఓ వింత సమస్య ఇబ్బంది పెడుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ పేరును చాలా మంది సరిగ్గా పలకటం లేదట. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన శృతి.. తన పేరుకు కరెక్ట్ స్పెలింగ్ ఏంటో చెప్పింది. 'ప్రజలు నా పేరును కరెక్ట్ గా పలకాలని కోరుతున్నా, నా పేరు శృతిహాసన్' అంటూ ట్వీట్ చేసింది ఈ బ్యూటీ. చాలామంది శ్రితి, స్తృధి, సురుధి, శ్రూతీ, హస్సన్ లేదా శ్రుతి హుస్సేన్ అని కూడా అంటున్నారంటూ బుంగమూతి పెట్టి వాపోయింది. ఇటీవల అజిత్ సరసన హీరోయిన్ గా నటించిన వేదలం సినిమాతో సూపర్ హిట్ సాధించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం హిందీలో రెండు, తమిళంలో ఒకటి, తెలుగులో మూడు సినిమాలతో బిజీగా ఉంది. నటిగానే కాక సింగర్ కూడా తనసత్తా చాటుతున్న శృతీహాసన్ ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా టాప్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. Ugh I really wish people would spell my name right its SHRUTI HAASAN not shriti ,Strudhi ,surudhi,shroothy,hassan or the sruthi Hussain — shruti haasan (@shrutihaasan) November 18, 2015 -
ఆ విషయంలో దుమ్మురేపుతున్న శృతి
-
మహేష్‌ను మించిపోయిన శృతి
స్టార్ వారసురాలిగా వెండితెర మీదకు అడుగుపెట్టిన శృతిహాసన్.. అన్ని రంగాల్లో హవా చూపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా, సక్సెస్ ట్రాక్ ఎక్కిన తరువాత మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. సౌత్‌తో పాటు నార్త్ లోనూ స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతోంది. ఇప్పటికే సూపర్ హిట్స్‌తో ఫుల్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా అదే జోరు చూపిస్తోంది. సౌత్ ఇండియాలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు క్రేజ్ కాస్త తక్కువ. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేసింది శృతి హాసన్. రెమ్యూనరేషన్, కలెక్షన్ల పరంగా కాకపోయిన తన గ్లామర్‌తో సోషల్ మీడియాలో హవా చూపిస్తుంది. ట్విట్టర్ ఫాలోవర్స్‌లో టాప్ హీరోలకు కూడా షాక్ ఇస్తుంది. ట్విట్టర్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌కు 15లక్షల ఫాలోవర్స్ ఉండగా శృతి అంతకు డబుల్ ఫాలోవర్స్ ను సాధిచింది. 30 లక్షల మంది ఫాలోవర్స్ తో టాప్ ప్లేస్ కు చేరింది. ఇక ఎప్పటి నుంచో ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటున్న సౌత్ బ్యూటీ త్రిషకు కూడా షాక్ ఇచ్చింది శృతి. ప్రస్తుతం పులి సినిమాతో సౌత్‌లో సందడి చేస్తున్న శృతిహాసన్ అజిత్ సరసన వేదలం సినిమాలోనటిస్తుంది. హిందీలోనూ రెండు సినిమాలలో నటిస్తున్న శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. Today is the day ! Time for puli !!! 💃💃💃 — shruti haasan (@shrutihaasan) October 1, 2015 -
సమంతకు షాక్ ఇచ్చిన శృతి హాసన్ ?
-
నేను నాన్నలా కాదు
శ్రుతిహాసన్ రూటే సపరేటు. నటిగానే కాదు నిజ జీవితంలోను ఆమె వ్యక్తిత్వం ప్రత్యేకం. తన తండ్రి కమలహాసన్‌ను ఆమె ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంచి చూస్తారు. అంతేకాదు తన సరసన నటించే హీరోలను పొగిడేస్తారు. సమీప కాలంలో బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కంటే టాలీవుడ్ నటుడు మహేష్‌బాబు ఫర్పెక్షనిస్ట్ అంటూ కితాబిచ్చిన శ్రుతి ప్రస్తుతం హిందీలో వెల్కం బ్యాక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర హీరో జాన్ అబ్రహాం ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ తన తండ్రి కమలహాసన్ షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు తన పాత్ర గురించే కాకుండా సహ నటీనటులు, ఇతర చిత్ర యూనిట్ గురించి ఆలోచిస్తారన్నారు. ఆయన మాదిరిగానే నటుడు జాన్ అబ్రహాం అన్ని విషయాలు గ్రహిస్తారని పొగిడారు. సహ నటీనటుల నుంచి అండర్ స్టాండ్ కలిగి ఉంటారన్నారు. ఇక తన తండ్రి విషయానికొస్తే ఈ వయసులోనూ తాను ఎంచుకున్న కథా పాత్రగా మారిపోతారు. అందుకు కారణం ఆయన నిజమైన అంకిత భావమే నన్నారు. షూటింగ్లో పాజిటివ్ మూడ్‌తో పాటు కథా పాత్రకు తగ్గట్టుగా ఉండటం ముఖ్యం అన్నారు. అయితే తన తండ్రి మాదిరి తాను ఫిట్ కాదని అన్నారు. ఏది పడితే అది తింటునే ఉంటానని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. -
అజిత్ సరసన శ్రుతిహాసన్
ఎన్నై అరిందాల్ చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అజిత్ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఆయనతో ఆరంభం, ఎన్నై అరిందాల్ వంటి భారీ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీ సాయిరామ్ ఫిలింస్ అధినేత ఎ ఎం రత్నం ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుందని సమాచారం. ఈ చిత్రానికి అచ్చమిల్లై అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అజిత్ సరసన శ్రుతిహాసన్ నటించనున్న ఈ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటి లక్ష్మీమీనన్ నటించనున్నారు. ఇంతకుముందు అజిత్ హీరోగా వీరం వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఈ చిత్రం కోసం ఒక థీమ్ మ్యూజిక్‌ను సమకూర్చారట. అది చిత్ర దర్శకుడు శివకు విపరీతంగా నచ్చేసిందట. ఈ ఏడాది సూపర్సాంగ్ ఇదేనంటూ అనిరుధ్‌ను ప్రశంసలతో ముంచేస్తున్నారట. ఈ చిత్రంలో సంతానం, తంబిరామయ్య, సూరి ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. అచ్చమిల్లై అంటే భయం లేదు అని అర్థం. ఈ టైటిల్ సహా పూర్తివివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్‌కు వారసుడు పుట్టిన సంతోషం కూడా తోడవ్వడంతో శుక్రవారం తన పుట్టిన రోజు విజయోత్సాహం, పుత్రోత్సాహంతో జరుపుకుంటున్నారు. -
జోరుమీదున్న శృతిహాసన్
-
ఐటమ్ సాంగ్‌లో శ్రుతిహాసన్
ఆర్య చిత్రంలో ఐటమ్‌సాంగ్‌కు పచ్చజెండా ఊపా రు నటి శ్రతిహాసన్. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి శ్రతిహాసన్. తమిళం, తెలుగు, హిందీ అంటూ యమ బిజీగా ఉన్నారు. అయినా అవసరమైతే ఐటమ్‌సాంగ్‌కు రెడీ అంటున్నారు. ఈ విషయంలో చాలామందిలా తన ఇమేజ్‌కు డామేజ్ లాంటి సందేహాలకు తావివ్వకుండా ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధం అంటున్న శ్రుతి గట్స్‌ను మెచ్చుకోవలసిందే. ఒక ప్రముఖ నటి నాయకిగా నటిస్తున్న చిత్రంలో మరో ప్రముఖ నటి ఐట మ్ సాంగ్‌కు ఓకే అనడానికి ఆలోచిస్తారు. అయితే శ్రుతి మాత్రం వెనుకాముందు ఆలోచించకుండా నేను రెడీ అంటున్నారు. ఆ మధ్య తెలుగు చి త్రం ఆగడులో తమన్న హీ రోయిన్. అందులో శ్రతి హాసన్ ఐటమ్ సాంగ్ ఆడి దుమ్ము దులిపేశారు. అందు కు పారితోషికం కూడా అధికంగానే పుచ్చుకున్నారనే ప్రచారం జరిగిందనుకోండి. తాజాగా మరోసారి ఐటమ్‌సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆర్య, అనుష్క జంటగా ఇరండామ్ ఉలగం చిత్రం తరువాత కలసి నటిస్తున్న ద్విభాషా చిత్రం సింగపూర్ డేస్. ఇది మలయాళంలో విజయం సాధించిన బెంగళూరు డేస్ చిత్రానికి రీమేక్. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలముడి దర్శకత్వం వహిస్తున్నారు. పీవీవీ సినిమా పతాకంపై రూపొందనున్న ఈ చిత్రంలో శ్రతిహాసన్ ఐటమ్‌సాంగ్ చేయనున్నారు. -
నాది సహజ సౌందర్యం
నాది సహజ సౌందర్యం అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఐరన్‌లెగ్ నటి అన్న నోళ్లను అతి త్వరలోనే మూయించి టాప్ హీరోయిన్ అనిపించుకునే స్థాయికి ఎదిగిన నటి ఈమె. తమిళం, తెలుగు, హిందీ భాషల దర్శక నిర్మాతలు శ్రుతిహాసన్ కాల్షీట్స్ కోసం క్యూలో నిలబడుతున్నారు. తాజాగా తమిళంలో పూజై చిత్రంతో విజయాల ఖాతాను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ సరసన మారిశన్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో మహేష్‌బాబు సరసన ఒక చిత్రంతో పాటు హిందీలో ఏకంగా ఐదు చిత్రాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. విజయ్‌తో నటిస్తున్న చిత్ర షూటింగ్ నగరం శివారు ప్రాంతం వీసీఆర్ రోడ్డులో జరుగుతోంది. అయినా తన గ్లామరస్ నటనతోనే శ్రుతిహాసన్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ముద్దుగుమ్మను స్ఫూర్తిగా తీసుకునే ఇతర హీరోయిన్లు ఎదగాలని ప్రయత్నిస్తున్నారన్నది పరిశ్రమ వర్గాల మాట. అయితే తాజాగా అందరి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రుతిహాసన్ మరోసారి వార్లల్లో కెక్కారు. ఆమె ఏమన్నారంటే... సినిమా నటీమణులందరూ తెరపై అందంగానే కనిపిస్తారు. అందుకు కారణం మేకప్, ఫోకస్ లైట్స్. హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఇవే ముఖ్య కారణం. అయితే నేను మాత్రం ఎలాంటి మేకప్ లేకుండానే అందంగా ఉంటాను. నాది సహజ అందం. నా శరీరాకృతి కూడా కచ్చితమైన కొలతలతో ఉంటుంది. నా తల్లిదండ్రులు అందంగా ఉంటారు. అందువల్లే నేను అందంగా ఉన్నాను అని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. -
కొలవ‘రెడీ’!
అట్టర్ ఫ్లాప్‌లతో సొంతింట అడ్రస్ గల్లంతై దిగాలుపడ్డ శృతిహాసన్‌కు కాస్తింత కిక్ ఇచ్చాడు హీరో విశాల్. తాను చేయబోయే ‘పూజై’ సినిమాలో హీరోయిన్గా శృతిని తీసుకున్నాడు. దీనికి ఉబ్బితబ్బిబ్బయిన ఈ స్వీటీ... ఇంత లాంగ్ గ్యాప్ తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఇచ్చిన విశాల్‌కు థ్యాంక్స్ చెప్పింది. 2012లో చేసిన ‘3, 7 ఏఎం అరివు’ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. దీంతో అమ్మడికి అవకాశాలు నిల్ అయ్యాయి. ‘మళ్లీ తమిళ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన విశాల్‌కు ధన్యవాదాలు’ అంటూ చెప్పిందీ కొలవెరీ భామ. -
బిడ్డను కన్న తర్వాతే పెళ్లి!
పెళ్లికి ముందే బిడ్డను కంటానంటూ నటి శ్రుతీ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కమల్‌హాసన్‌ను అమితంగా ప్రేమిస్తూ, ఆయన బాటలోనే సినీ రంగానికి వచ్చిన శ్రుతి ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ అదే బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ అందాల తార వద్ద ఇటీవల పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు, దంపతులుగా చూస్తే తన తల్లిదండ్రులు అందమైన జోడీ అని పేర్కొన్నారు. ప్రేమానురాగాలతో నిండిన వారితో గడిపిన ఆ రోజులు ఆనందమయంగా సాగాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన తల్లిదండ్రుల లాగానే తానూ పెళ్లికిముందే బిడ్డను కనాలని ఆశిస్తున్నట్లూ, ఆ తరువాతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లూ శ్రుతహాసన్ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... బాలీవుడ్ నటి సారిక అప్పట్లో వివాహానికి ముందే గర్భం దాల్చి ఆ తరువాత తన బిడ్డకు కమల్‌హాసన్ తండ్రి అని బహిరంగంగా ప్రకటించారు. కమల్‌హాసన్ కూడా ఆమె మాటల్ని అంగీకరించారు. ఆ తరువాత కమల్‌హాసన్, సారిక వివాహం చేసుకున్నారు. శ్రుతీహాసన్, అక్షర హాసన్‌లకు జన్మనిచ్చిన ఈ దంపతుల మధ్య కొంత కాలానికి మనస్పర్ధలు వచ్చాయి. దాంతో, కమల్ హాసన్ నుంచి సారిక విడిపోయారు. ప్రస్తుతం ఆమె ముంబయిలో నివసిస్తున్నారు. చిన్న కూతురు అక్షర హాసన్ ఆమెతోనే ఉంటున్నా, శ్రుతీ హాసన్ ఒంటరిగా జీవిస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తూ ప్రముఖ హీరోయిన్గా వెలుగుతున్నారు. -
శృతి మించితే...!
-
గెలుపుగుర్రంగా డీ-డే
శ్రుతీహాసన్ బాలీవుడ్లో నటించిన ‘డి-డే’ చిత్రం ‘గెలుపుగుర్రం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. అర్జున్ రామ్‌పాల్, ఇర్ఫాన్‌ఖాన్, అనిల్ కపూర్, రిషికపూర్, నాజర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చితానికి నిఖిల్ అద్వాని దర్శకుడు. సురేశ్ దూడల ఈ అనువాద చిత్రానికి నిర్మాత. అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇందులో శ్రుతీ హాసన్ వేశ్యగా నటించారు. పాత్రోచితంగా ఆమె నటించిన హాట్ సన్నివేశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే... దర్శకుడు వాటిని కళాత్మకంగానే తీశాడు కానీ, ఎక్కడా వల్గారిటీ కనిపించదు. శంకర్-ఎహసాన్-లాయ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: సి.ఆర్.రాజన్. -
ప్రేమకు కళ్లెం వెయ్
ప్రేమ జోరుకు కాస్త కళ్లెం వేసి నటనపై దృష్టి సారించాలని కమల్‌హాసన్ మాజీ భార్య సారిక తప రెండో కూతురు అక్షరకు సూచనలు చేశారు. సారిక పెద్ద కూతురు శ్రుతిహాసన్ ముంబాయిలోనే నివశిస్తున్నా ఒంటరిగా ఉంటున్నారు. అక్షర మాత్రం తన తల్లితోనే కలిసి ఉంటున్నారు. తెర వెనుక ఎదగాలనుకున్న ఈ భామ చివరికి తన అక్క బాటలోనే పయనిస్తూ ధనుష్ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. అయితే అక్షర అప్పుడే ప్రేమలో మునిగి తేలుతున్నారట. పూర్వపు హీరోయిన్ రతి అగ్నిహోత్రి కొడుకు తనూజ్ విర్వాణితో ప్రేమ పాఠాలు వళ్లిస్తున్నారట. ఈ ప్రేమ జంట తరచూ డేటింగ్ అంటూ షికార్లు చేస్తున్నారట. ప్రతి శనివారం తప్పనిసరిగా తనూజ్‌ను తన ఇంటిలో కలుస్తూ ప్రేమ సాగరంలో తేలిపోతుండటం ఆమె తల్లి సారిక దృష్టికి వచ్చింది. దీంతో ఆమె కూతురిని ప్రేమ జోరు తగ్గించి నటనపై దృష్టి సారించాలంటూ హెచ్చరించారట. అయినా అక్షర తల్లి హెచ్చరికను పెడచెవిన పెట్టి ప్రేమికుడితో చక్కర్లు కొడుతున్నారని బాలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది. -
ఆ చింత లేదు
అలాంటి చింత తనకెప్పుడూ లేదంటున్నారు సంచలన తార శ్రుతిహాసన్. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ల జాబితాలో ఈ బ్యూటీ ఒకరు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ వీర విహారం చేస్తున్న శ్రుతి హాసన్ గ్లామర్ విషయంలోనూ రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా వృత్తిలో భాగమే. పాత్రకు న్యాయం చేయడం నటిగా నా ధర్మం అంటూ తనదైన స్టైల్లో బదులిస్తున్నారు. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించిన 7ఆమ్ అరివు, 3 చిత్రాలు రెండూ ఆశించిన విజయాల్ని సాధించలేదు. అయితే తెలుగు హిందీ చిత్రాలు ఈమెకు ఫేమ్ నిచ్చాయి. దీంతో ఆయా భాషా చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న శ్రుతి తాజాగా తమిళంలో మరో చిత్రాన్ని అంగీకరించారు. నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి పూజై అనే టైటిల్‌ను నిర్ణయించారు. దాదాపు రెండేళ్ల తరువాత శ్రుతి హాసన్ ఈ చిత్రం ద్వారా మళ్లీ తమిళ ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు. ఈ మధ్యలో మాతృ భాషలో చిత్రాలు చేసే అవకాశం పోయిందనే చింత లేదా? అన్న ప్రశ్నకు శ్రుతి బదులిస్తూ అలాంటి చింత ఏమీ లేదన్నారు. ఎందుకంటే భారతీయ సినిమాను తన సొత్తుగా భావిస్తానన్నారు. తాను పలు భాషల్లో నటి స్తూ, భారతీయ నటిగా గుర్తింపు పొందానన్నారు. విశాల్ సరసన నటిచనుండడంపై మాట్లాడుతూ ఇప్పటికే తెలుగు కమర్షియల్ సినిమాలు చేసి ఎంజాయ్ చేశానని చెప్పారు. ఇప్పుడు తమిళంలో తొలిసారిగా మంచి మాస్ ఎంటర్ టెయినర్ చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో విశాల్ సరసన నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర కథ గురించి దర్శకుడు హరి చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనిపించిందన్నారు. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మణిరత్నం దర్శకత్వంలో మహేశ్ బాబు, నాగార్జున హీరోలుగా నటించే చిత్రంలో హీరోయిన్ అవకాశం వచ్చిందా అంటే, దాని గురించి మాట్లాడడం అప్రస్తుతం అవుతుందన్నారు. ప్రస్తుతానికి తన కాల్షీట్స్ డైరీ విశాల్ చిత్రంతోపాటు ఇతర భాషా చిత్రాలతో ఫుల్ అయ్యిందన్నారు. అయితే మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతి నటి కోరుకుంటుందని శ్రుతి వ్యాఖ్యానించారు. -
నాన్నే స్ఫూర్తి ప్రదాత
నాకు నాన్న సహకారం సదా ఉంటుంది. నాకు గొప్ప స్ఫూర్తి ప్రదాత కూడా ఆయనే. నేను నాన్నతో కలిసి నటించకపోయినా సంగీతపరంగా ఆయనతో అనుభూతిని ఎప్పుడూ పంచుకుంటాను. చక్కని ఆత్మీయతానుబంధాన్ని తెలిపే ఈ వ్యాఖ్యలు చేసింది కమల్ హాసన్ ప్రథమ పుత్రిక, ప్రముఖ కథానాయకి నటి శ్రుతి హాసన్. ఎలాంటి సందర్భంలో ఈమె ఈ వ్యాఖ్యలు చేశారంటే, శ్రుతి హాసన్ ముందు సంగీత కళాకారిణి. ఆ తరువాతే నటీమణి అన్న విషయం తెలిసిందే. ఈమెలో మంచి సంగీత దర్శకులు, గాయని ఉన్నారు. తొలుత పలు సంగీత ఆల్బమ్స్ రూపొందించారు. ఆ తరువాత తన తండ్రి నటించిన ఉన్నైపోల్ ఒరువన్ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా సినీ రంగానికి పరిచయం అయ్యారు. అసలు విషయం ఏమిటంటే శ్రుతి హాసన్ అస్సామి సంగీత కళాకారుడు జాయ్ బరువాతో కలిసి ప్రతిబి గురే అనే పాటను 2012లో రూపొందించారు. దీనికి తమిళ సాహిత్యాన్ని కమల్ హాసన్ రాయడం విశేషం. ఈ సాంగ్‌తో కూడిన వీడియో ఆల్బమ్ ఇటీవలే తయారయ్యింది. వైవిద్యభరితమయిన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఆల్బమ్ సంగీత ప్రియుల నుంచి చాలా మంచి ఆదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. శృతి హాసన్ మాట్లాడుతూ విభిన్న సంగీత కళాకారులతో కలిసి పని చేయడం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. అది స్వతంత్ర సంగీత కళాకారులయినా, సిని సంగీత కళాకారులయినా కావచ్చన్నారు. భిన్న సంస్కృతుల మన దేశాన్ని కొత్తగా చూపాలన్న ఆలోచనే ఈ ఆల్బమ్ రూపకల్పనకు కారణం అని పేర్కొన్నారు. ఇందులో సంగీతం, సాహిత్యం చాలా ప్రయోగాత్మకంగా ఉంటాయన్నారు. దీనికి తన తండ్రి కమల్ హాసన్ తమిళ సాహిత్యాన్ని అందించారని తెలిపారు. తెర్కే ఒరు దురువం అనే పల్లవితో సాగే ఈ పాటను తన తండ్రి సాహిత్యం మరింత వన్నె తెచ్చిందని పేర్కొన్నారు. ఈ పాటను పూర్తిగా విన్న తర్వాత కమల్ స్పందనేమిటన్న ప్రశ్నకు కాన్సెప్ట్ బాగుంది పాట జాయ్‌ఫుల్‌గా ఉందని ప్రశంసించారని తెలిపారు. నాన్నతో కలిసి నటించకపోయినా సంగీత పరంగా నాన్న తనకు గొప్ప స్ఫూర్తి ప్రదాత అన్నారు. సంగీత సాహిత్యంలో ఆయన సహకారం తనకెప్పుడూ ఉం టుందని శ్రుతి అంటున్నారు. -
విశాల్కూ హ్యాండిచ్చిన శృతి
నటి శృతి హాసన్ కోలీవుడ్‌ను పక్కన పెడుతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తెలుగు, హిందీ చిత్రాలపై అధిక శ్రద్ధ చూపుతున్న ఈ భామ త్వరలో తమిళ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అది కాస్త ఎండమావిగానే మారింది. ఇంతకు ముందు ఆర్యతో శృతి జతకట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ చిత్రాన్ని శృతి కాదనేశారు. ఆ తరువాత విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని కూడా శృతి నిరాకరించడం టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది. ఆర్య హీరోగా మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో మిగామాన్ చిత్రంలో శృతి నటించాల్సి ఉంది. అయితే హిందీలో రెండు చిత్రాలు, తెలుగులో రెండు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆర్య చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేనని చెప్పేశారు. ఆ తర్వాత ఆర్య స్నేహితుడు విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కనున్న నూతన చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ అన్నారు. అయితే ఆమె కాల్షీట్స్ అడిగిన ఈ చిత్ర దర్శక నిర్మాతలకు సరైన సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ వచ్చిన శృతిహాసన్ చివరికి ఆర్యకు చెప్పిన సమాధానమే చెప్పి చల్లగా జారుకున్నారట.