
‘పాతికేళ్ల చిన్నది చేపకళ్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే’ అంటూ ‘బలుపు’ చిత్రంలో సందడి చేశారు రవితేజ, శ్రుతీహాసన్. ఆ సినిమా విడుదలై ఐదేళ్లు కావస్తోంది. తాజాగా ఈ జంట మరోసారి జోడీ కడుతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న ‘నేల టిక్కెట్టు’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. దీంతో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేస్తున్నారు రవితేజ. ఆ తర్వాత ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేస్తారు.
ఈ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రుతీహాసన్ నటించనున్నారని సమాచారం. ‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత ఏ సినిమా ఒప్పుకోని శ్రుతి ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా తెలుగులో రవితేజ సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్‌ని ఫిక్స్ చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. మరి శ్రుతి, కాజల్ ఇద్దరూ నటిస్తారా? ఎవరో ఒక్కరేనా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment